అక్షయ్‌కుమార్ పాత్రలోవిక్రమ్...
అక్షయ్‌కుమార్ పాత్రలోవిక్రమ్...
Published Sat, Apr 12 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యం ఉన్న పాత్రల్లో ఒదిగిపోవడం చాలా కష్టం. కానీ, విక్రమ్‌లాంటి నటులు సునాయాసంగా చేసేస్తారు. తమిళ ‘కాశి’ సినిమాలో గుడ్డివాడిగా, ‘సేతు’లో మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా, ‘అపరిచితుడు’లో మూడు రకాల పాత్రల్లో.. ఇలా విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పలు రకాల లుక్స్‌లో కనిపిస్తారట విక్రమ్. ఓ గెటప్ కోసం అయితే బాగా సన్నబడ్డారు కూడా.
ఈ సినిమా పూర్తి కావచ్చిన నేపథ్యంలో విక్రమ్ తదుపరి చిత్రాలు అంగీకరించే పని మీద ఉన్నారట. వాటిలో హిందీ చిత్రం ‘స్పెషల్ 26’ కూడా ఉంది. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను తిరుపతి బ్రదర్స్ పొందారు. ముందుగా ఈ సినిమాని కమల్‌హాసన్‌తో చేయాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అది నిజం కాలేదు. ప్రస్తుతం విక్రమ్‌తో చేయాలనుకుంటున్నారట. హిందీలో ఈ పాత్రను అక్షయ్‌కుమార్ చేశారు. అలాగే, అనుపమ్ ఖేర్ పోషించిన పాత్రకు సత్యరాజ్‌ని తీసుకున్నారని సమాచారం.
Advertisement
Advertisement