‘ఒక శిల్పం అందంగా ఉందంటే ఆ గొప్పదనం అంతా శిల్పానిదే కాదు.. దానిని చెక్కిన శిల్పిది కూడా’.. అన్నాడో మహాకవి. ఒక సినిమా వెనుక నటీనటుల కష్టం ఎంతున్నా.. బిహైండ్ సీన్‌లో కష్టపడే టెక్నీషియన్ల కష్టం కూడా అంతే ఉంటుంది కూడా. అయితే గుర్తింపు దక్కనంత వరకు వాళ్ల కష్టం తెర వెనుకే ఉండిపోతుంది కూడా.
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాలో లారా దత్తా అచ్చుగుద్దినట్లు ‘ఇందిరా గాంధీ’ లుక్‌తో మెస్మరైజ్ చేయగా.. దాని వెనుక మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ అండ్ టీం శ్రమ దాగుంది. బెల్ బాటమ్ పిరీయాడికల్ ఫిల్మ్ కావడంతో తన టీం కాస్త ఎక్కువే కష్టపడ్డట్లు చెప్తున్నాడాయన. ఆ ‘ప్రోస్తెటిక్’ కష్టాలేంటో వాళ్ల మాటల్లోనే విందాం.
చదవండి: ఈ హీరోను గుర్తుపట్టలేరని పందెం!
విక్రమ్ గైక్వాడ్ మాటల్లో.. ఈ జనరేషన్‌కి ప్రోస్తెటిక్ మేకప్, మేకప్ ట్రిక్స్, గ్రాఫిక్స్ జిమ్మిక్కుల గురించి బాగా అవగాహన ఉంది. మేకప్‌లో కొంచెం తేడాలు కనిపిస్తే.. తిట్టడానికి, ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇందిరాగాంధీలాంటి ఛరిష్మా ఉన్న నేత క్యారెక్టర్ లారా దత్తాది. కానీ, ఇద్దరి ముఖాలకు కొంచెం కూడా పొలికలు లేవు. అందుకే కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అని అంటున్నాడాయన.
ముక్కుతోనే..
ఇందిరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాత్రింబవలు కూర్చుని చూసింది మా టీం. ఇందిరాగాంధీ ముఖంలో కనుబొమ్మలు, ముక్కు, హెయిర్‌స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాం. లారా కోసం ప్రోస్తెటిక్ ముక్కు కోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎక్కడో ఒక అనుమానం. చివరికి లుక్ టెస్ట్ టైంలో లారా అవతారం చూసి మా కళ్లారా మేమే నమ్మలేకపోయాం. ఆపై దర్శకుడు రంజిత్ తివారీ, నిర్మాత జక్కీ భాగ్నానీ, హీరో అక్షయ్ కుమార్ ఆ లుక్ చూసి స్టన్ అయిపోయారు. అంత కష్టపడ్డాం గనుక లుక్ అవుట్‌పుట్ అంత బాగా వచ్చింది.. నెటిజన్స్ నుంచి అభినందనలు దక్కాయి అని తెలిపాడు విక్రమ్.
ఇదే అసలు ఛాలెంజ్
ప్రోస్తెటిక్ మేకప్‌లో భాగంగా విడివిడి భాగాల్ని రూపొందించడం ఒక ఎత్తు అయితే.. వాటి అంచులు స్కిన్‌కు సూట్ అయ్యేలా చూసుకోవడం అసలు ఛాలెంజ్ అని చెబుతున్నాడాయన. ఈ క్రమంలో తన టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని సంబురపడుతున్నాడు. అయితే విక్రమ్ గైక్వాడ్ సామాన్యుడేం కాదు.. నాలుగు సార్లు నేషనల్ అవార్డు గ్రహీత కూడా. ‘ఓంకార, ఢిల్లీ-6, త్రీఇడియట్స్, ఇష్కియా, కమీనే, భాగ్ మిల్కా భాగ్, హంటర్, ఓకే కన్మణి, మిర్జయా, దంగల్ సినిమాలకు పని చేశాడు. అంతేకాదు తుకారాం, లోక్‌మాన్య ఎక్ యుగపురుష్, లపాచ్ఛపి సినిమాల్లో నటించాడు కూడా. ఫ్లైయిట్ హైజాకింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన బెల్ బాటమ్.. రిలీజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment