Lara Dutta
-
మన విశ్వ సుందరీమణులు వీరే.. ముగ్గురు మహిళా మణులు(ఫొటోలు)
-
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
ఇద్దరితో బ్రేకప్, వివాహితుడైన టెన్నిస్ స్టార్‌తో నటి పెళ్లి!
మిస్ యూనివర్స్, మోడల్, నటిగా లారా దత్తా జగమంతా పరిచయం. టాప్ టెన్నిస్ స్టార్‌గా మహేశ్ భూపతి కూడా ప్రపంచానికి తెలుసు! ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎదురుపడే వరకూ ఒకరి గురించి ఒకరు వినే ఉన్నారు.. ముఖ పరిచయం తక్షణమే ఒకరి ప్రేమలో ఒకరు పడ్డారు! ఆ కథే ఇక్కడ ‘మొహబ్బతే’గా.. విశ్వసుందరిగా లారా దత్తా ప్రపంచానికి తెలిసేటప్పటికే ఆమె జీవితంలో ఉన్న స్నేహితుడు, సహచరుడు కెల్లీ దోర్జీ. భూటాన్ దేశస్థుడు. ముంబై బేస్డ్ మోడల్. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు వారి అనుబంధం గురించి తెలిసినవాళ్లంతా. తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత హఠాత్తుగా లారా ప్రవర్తనను విమర్శించడం మొదలుపెట్టాడు కెల్లీ. ప్రముఖ మోడల్, నటుడు డినో మోరియాతో ఆమె సన్నిహితంగా మెదులుతోందంటూ. ఆ విమర్శలు తర్వాత ఆరోపణలుగా మారి.. ఆఖరకు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. కెల్లీ ఊహించినట్టుగా డినో మోరియాతో లారా పెద్దగా కలసిలేదు. సంతోషంగానూ ఉన్నట్టు లేదు. డినో పక్కన నందితా మహంతి అనే అమ్మాయి పేరు జత కూడింది. ఆ రూమర్‌ని డినో మోరియా ఖండించలేదు. లారా హర్ట్ అయింది. అతనితోనూ తెగతెంపులు చేసుకుంది. అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే మహేశ్ భూపతితో ఆమెకు ములాఖాత్ అయింది. మహేశ్ భూపతి స్పోర్ట్స్ కంపెనీలో ఈ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం అయింది. ఆ మీటింగ్ ఏదో యాడ్‌కి సంబంధించి అని ప్రచారంలో ఉంది కానీ.. నిజానికి లారాను కలవడానికే మహేశ్ ఆ మీటింగ్‌ను ఏర్పాటు చేశాడు.. యాడ్ అనేది ఓ మిష మాత్రమే అని అంటారు మహేశ్ భూపతి సన్నిహితలు. మొత్తానికి తొలి పరిచయంలోనే మహేశ్ సింప్లిసిటీకి ముగ్ధురాలైపోయింది లారా. అప్పటికే లారా మీద మనసు పడి ఉన్నాడు కాబట్టి మహేశ్ కూడా ఆమె పట్ల మరింత ఆకర్షితుడై పోయాడు. అలా వాళ్ల ప్రేమ మొదలైంది. కొన్ని రోజుల్లోనే పరస్పరం ఆ ప్రేమను ప్రకటించుకు న్నారు. కానీ అంతా సవ్యంగా సాగడానికి అదివరకే మహేశ్ వివాహితుడవడం ఓ అడ్డంకిగా మారింది. లారా.. మహేశ్ ఊహకు అందకముందే (2002) అతనికి మోడల్ శ్వేతా జైశంకర్‌తో పెళ్లయింది. ఏడేళ్ల ఆ బంధం మహేశ్‌కు లారా మీద పుట్టిన ప్రేమతో పలచనైంది. లారాతోనే తతిమా జీవితపు ప్రయాణం అని మహేశ్ నిర్ణయించుకునేసరికి.. విడాకులతో శ్వేత అతనికి ఆ నిర్ణయాన్ని అమలుపర్చుకునే స్వేచ్ఛనిచ్చింది. కానీ లారాకు ‘హోమ్ బ్రేకర్’ అనే అపవాదు తప్పలేదు. మహేశ్ భూపతి కోసం ఆ అపవాదును మోసింది ఆమె. ‘ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నేను, మహేశ్ ఇద్దరం ఓ ఒప్పందం చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే బిడ్డను పెంచాలి. అది సాధ్యంకాని పక్షంలో మా ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరైతే బిడ్డను చూసుకోవాలని. పదేళ్లుగా ఆ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాం’ అని చెప్పింది లారా దత్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత... 2011, ఫిబ్రవరి 16న.. అంటే వాలంటైన్స్ డే అయిన రెండు రోజులకు మహేశ్ భూపతి, లారా దత్తా ఒకింటివారయ్యారు. ముంబైలో ఫిబ్రవరి పదహారున అత్యంత సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత ఫిబ్రవరి 20న గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మహేశ్ భూపతి మాజీ భార్య శ్వేత కూడా చెన్నైకి చెందిన రఘు కైలాస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మహేశ్ భూపతి, లారా దత్తా దంపతులకూ ఓ కూతురు. పేరు సైరా. - ఎస్సార్ -
డేటింగ్ యాప్‌లో లారా ప్రోఫైల్, స్పందించిన మాజీ మిస్ యూనివర్స్
మాజీ మిస్ యూనివర్స్, నటి.. టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రోఫైల్ ఓ డేటింగ్ యాప్‌లో ఉందని ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది కాస్తా లారా దృష్టికి వెళ్లడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లారా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లో లేను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై విపరీతమైన ప్రచారం జరిగుతుంది. చదవండి: ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. డేటింగ్ యాప్‌లో నా ప్రొఫైల్ ఉందని వారంటున్నారు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వస్తున్నా. చివరకు ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే డేటింగ్ యాప్స్క తాను వ్యతిరేకం కాదని... జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయని లారా వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటి వరకు తాను డేటింగ్ యాప్‌లో లేనని చెప్పారు. ఈ వార్తలను నమ్మొద్దని ఆమె ఫ్యాన్స్‌ను కోరారు. View this post on Instagram A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi) -
పాపం.. ఆ రూపం కోసం ఎంత కష్టపడ్డారో!
‘ఒక శిల్పం అందంగా ఉందంటే ఆ గొప్పదనం అంతా శిల్పానిదే కాదు.. దానిని చెక్కిన శిల్పిది కూడా’.. అన్నాడో మహాకవి. ఒక సినిమా వెనుక నటీనటుల కష్టం ఎంతున్నా.. బిహైండ్ సీన్లో కష్టపడే టెక్నీషియన్ల కష్టం కూడా అంతే ఉంటుంది కూడా. అయితే గుర్తింపు దక్కనంత వరకు వాళ్ల కష్టం తెర వెనుకే ఉండిపోతుంది కూడా. అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాలో లారా దత్తా అచ్చుగుద్దినట్లు ‘ఇందిరా గాంధీ’ లుక్‌తో మెస్మరైజ్ చేయగా.. దాని వెనుక మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ అండ్ టీం శ్రమ దాగుంది. బెల్ బాటమ్ పిరీయాడికల్ ఫిల్మ్ కావడంతో తన టీం కాస్త ఎక్కువే కష్టపడ్డట్లు చెప్తున్నాడాయన. ఆ ‘ప్రోస్తెటిక్’ కష్టాలేంటో వాళ్ల మాటల్లోనే విందాం. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టలేరని పందెం! విక్రమ్ గైక్వాడ్ మాటల్లో.. ఈ జనరేషన్‌కి ప్రోస్తెటిక్ మేకప్, మేకప్ ట్రిక్స్, గ్రాఫిక్స్ జిమ్మిక్కుల గురించి బాగా అవగాహన ఉంది. మేకప్‌లో కొంచెం తేడాలు కనిపిస్తే.. తిట్టడానికి, ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇందిరాగాంధీలాంటి ఛరిష్మా ఉన్న నేత క్యారెక్టర్ లారా దత్తాది. కానీ, ఇద్దరి ముఖాలకు కొంచెం కూడా పొలికలు లేవు. అందుకే కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అని అంటున్నాడాయన. ముక్కుతోనే.. ఇందిరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాత్రింబవలు కూర్చుని చూసింది మా టీం. ఇందిరాగాంధీ ముఖంలో కనుబొమ్మలు, ముక్కు, హెయిర్‌స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాం. లారా కోసం ప్రోస్తెటిక్ ముక్కు కోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎక్కడో ఒక అనుమానం. చివరికి లుక్ టెస్ట్ టైంలో లారా అవతారం చూసి మా కళ్లారా మేమే నమ్మలేకపోయాం. ఆపై దర్శకుడు రంజిత్ తివారీ, నిర్మాత జక్కీ భాగ్నానీ, హీరో అక్షయ్ కుమార్ ఆ లుక్ చూసి స్టన్ అయిపోయారు. అంత కష్టపడ్డాం గనుక లుక్ అవుట్‌పుట్ అంత బాగా వచ్చింది.. నెటిజన్స్ నుంచి అభినందనలు దక్కాయి అని తెలిపాడు విక్రమ్. ఇదే అసలు ఛాలెంజ్ ప్రోస్తెటిక్ మేకప్‌లో భాగంగా విడివిడి భాగాల్ని రూపొందించడం ఒక ఎత్తు అయితే.. వాటి అంచులు స్కిన్‌కు సూట్ అయ్యేలా చూసుకోవడం అసలు ఛాలెంజ్ అని చెబుతున్నాడాయన. ఈ క్రమంలో తన టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని సంబురపడుతున్నాడు. అయితే విక్రమ్ గైక్వాడ్ సామాన్యుడేం కాదు.. నాలుగు సార్లు నేషనల్ అవార్డు గ్రహీత కూడా. ‘ఓంకార, ఢిల్లీ-6, త్రీఇడియట్స్, ఇష్కియా, కమీనే, భాగ్ మిల్కా భాగ్, హంటర్, ఓకే కన్మణి, మిర్జయా, దంగల్ సినిమాలకు పని చేశాడు. అంతేకాదు తుకారాం, లోక్మాన్య ఎక్ యుగపురుష్, లపాచ్ఛపి సినిమాల్లో నటించాడు కూడా. ఫ్లైయిట్ హైజాకింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన బెల్ బాటమ్.. రిలీజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్!
Lara Dutta: తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్ మేకప్‌కు ఉంది. అందుకు తాజా ఉదాహరణ లారా దత్తా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'బెల్ బాటమ్'లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చేశారు లారా. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన లారా దత్తా లుక్కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందిరా గాంధీ గెటప్‌లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె ఒదిగిపోయారు. తను తనేనా? ఒక మనిషిని మేకప్ ఇంతలా మార్చేయగలదా? ఈవిడ ఎవరో గుర్తుపట్టలేరని పందెం కడుతున్నాం అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫొటో చూశారుగా.. నిజంగానే లారా.. లారాలా లేరు కదూ. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ మూవీకి రంజిత్ ఎం.తివారీ దర్శకుడు. -
మిషన్ ముగిసింది
లాక్డౌన్ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న స్టార్ అక్షయ్ కుమార్. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్’ అనే పీరియాడికల్ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
గూఢచారి అక్షయ్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
చలో స్కాట్‌ల్యాండ్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వదేశంలో షూటింగ్ అంటేనే రిస్క్.. ఇక విదేశాల్లో షూటింగ్ ఎలా? అని సినిమా ఇండస్ట్రీ ఆలోచిస్తోంది. కానీ విదేశాల్లో షూటింగ్ కి సంబంధించిన ప్లానింగ్ మాత్రమే కాదు.. ప్రయాణం కూడా మొదలెట్టారు అక్షయ్ అండ్ టీమ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘బెల్ బాటమ్’. రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణీకపూర్ కథానాయిక. లారా దత్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 120 మంది స్కాట్ ల్యాండ్ ప్రయాణమయ్యారు. లాక్ డౌన్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్న చిత్రమిదే. ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరిస్తూ చిత్రీకరణ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ రిస్ట్ బ్యాండ్లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్.. అన్నీ తెలుసుకోవచ్చు. స్కాట్ ల్యాండ్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలు పెడతారట. ‘‘మళ్ళీ షూటింగ్ తో బిజీ అయ్యే టైమ్ రావడం చాలా బావుంది’’ అన్నారు అక్షయ్ కుమార్. -
అందగత్తెలంతా ఒక్కచోట చేరారు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టైం పాస్ కోసం ఎక్కువ సమయం ఇంటర్నెట్లోనే గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ నడుస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో వర్తమానం గందరగోళం అయ్యింది.. భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది. మరి గతం.. చేదు,తీపి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. అందుకే ఈ థ్రోబ్యాక్ చాలెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది. గతించిన కాలానికి చెందిన ఎన్నో అద్భుతమైన, అందమైన, విలువైన జ్ఞాపకాలు మరో సారి తెర మీదకు వస్తున్నాయి.(రెండు నెలల తర్వాత బయటకు..) ఈ క్రమంలో ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అందానికి ప్రతికలుగా నిలిచిన అందాల రాణులంతా ఓ చోట చేరిన ఈ చిత్రం నెటిజనుల మనసు దోచుకుంది. ఈ ఫోటోలో సుస్మితా సేన్(మిస్ యూనివర్స్ 1994), ఐశ్వర్య రాయ్(మిస్ వరల్డ్ 1994), డయానా హేడెన్(మిస్ వరల్డ్ 1997 ), యుక్తా ముఖి(మిస్ వరల్డ్ 1999), లారా దత్తా(మిస్ యూనివర్స్ 2000), ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్ 2000), దియా మీర్జా(మిస్ ఆసియా పసిఫిక్ 2000) ఈ ఫోటోలో ఉన్నారు. చరిత్ర సృష్టించిన మహిళల చిత్రాన్ని మరో సారి తెర మీదకు తెచ్చినందుకు నెటిజనులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.(‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’) View this post on Instagram 👑 A bevy of beauties! From left to right: Sushmita Sen - Miss Universe 1994 Priyanka Chopra - Miss World 2000 Lara Dutta - Miss Universe 2000 Yukta Mookey - Miss World 1999 Dia Mirza - Miss Asia Pacific 2000 Diana Hayden - Miss World 1997 Aishwarya Rai - Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994 A post shared by @ retrobollywood on May 13, 2020 at 12:00am PDT -
‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’
‘నా జీవితంలో చోటుచేసుకున్న ఆ అద్భుతమైన ఘట్టానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. విశ్వం ఇచ్చిన ఈ బహుమతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు మిస్ యూనివర్స్, నటి లారా దత్తా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే మే 12, 2000న లారా దత్తా మిస్ యూనివర్స్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు లారా దత్తా. ‘నేటికి 20 ఏళ్లు.. మే 12,2000,నికొసియా, సిప్రస్. విశ్వం నుంచి లభించిన అద్భుతమైన బహుమతి.. సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు లారా దత్తా. ఆ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆఖరి రౌండ్లో లారా దత్తా 9.99 స్కోర్ సాధించి చరిత్ర సృష్టించింది. అదే సంవత్సరం ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం.. దియా మీర్జా మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ కిరీటం పొందిన రెండవ భారతీయ మహిళ లారా దత్తా. ఆమె కంటే ముందు సుస్మితా సేన్ 1994 లో ఈ టైటిల్ గెలుచుకున్నారు. -
భార్యను కోపడ్డ మహేష్ భూపతి, ఎందుకు ?
సాక్షి, ముంబై: భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్తం అయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య రాజధాని స్తంభించిన విషయం విదితమే. ముంబై వరదలు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల జీవితాలని ప్రభావితం చేశాయి. వాటినుంచి భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా తప్పించుకోలేక పోయారు. లారా దత్తా ఇంట్లోకి వరద నీరు రావడాన్ని అడ్డకోవడానికి ఓ విచిత్రమైన పని చేసింది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వాడిన తువ్వాలను మహేష్ జ్ఞాపకాలుగా ఉంచుకున్నాడు. అయితే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో.... ఆ నీటిని అడ్డుకోవడానికి మహేష్ ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ టవల్స్‌ను అడ్డంగా పెట్టింది. ఆ ఫోటోను లారా దత్ తన ట్వట్టర్లో పోస్టు చేసింది. అంతేకాదు వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ తువ్వాళ్లు ఇలా ఉపయోగపడ్డాయంటూ పోస్టు చేసింది. వర్షంలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించింది. అయితే భార్య చేసిన పనిపై మహేష్ భూపతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'నువ్వేమైనా నన్ను ఆట పట్టిస్తున్నావా!!!! అవి కొన్నేళ్ల నా శ్రమకు ప్రతిఫలం' అంటూ బదులిచ్చాడు. ముంబయి, థానే, పల్ఘర్, రాయఘడ్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాతాంల్లో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. Putting our Wimbledon,US Open, Aus Open &French Open towels to good use!😄@Maheshbhupathi #MumbaiRain.Stay safe & indoors if possible folks!🙏 pic.twitter.com/uEV30SPfT5 — Lara Dutta Bhupathi (@LaraDutta) August 29, 2017 -
'ఆ ఫేస్బుక్ అకౌంట్ నాది కాదు'
ముంబయి: తన పేరు మీద ఫేస్బుక్లో నకిలీ ఖాతా ఎవరో తెరిచారని బాలీవుడ్ హీరోయిన్ లారాదత్తా చెప్పింది. ఈ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలు, పోస్టింగ్స్, తదితర విషయాల పట్ట చాలా జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులను హెచ్చిరిస్తూ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. తనకు కేవలం ట్విట్టర్ ఖాతా మాత్రమే ఉన్నట్లు తెలిపింది. తన పేరు మీద ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వస్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయవద్దంటూ ఈ మాజీ విశ్వసుందరి అభిమానులను కోరుతోంది. తన లేటెస్ట్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' లో నటనకు గానూ తనకు పాసిటివ్ రెస్పాన్స్ రావడంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్, అమి జాక్సన్ కూడా నటించిన ఈ మూవీ ఇటీవలే విడుదలైన విషయం విదితమే. రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన లారాదత్తా, ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని అభిమానులు, మిత్రులు ఈ విషయాన్ని గుర్తించాలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ ఈ వివరాలు పోస్ట్ చేసింది. I AM NOT on Facebook. Please do not accept any requests from accounts claiming to be me. All are fake. — Lara Dutta Bhupathi (@LaraDutta) October 4, 2015 -
వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!
ప్రీతి జింటాతో డిష్యుం డిష్యుం అన్నట్లున్న నెస్ వాడియా.. ఇప్పటికీ ఆమె తనకు మంచి స్నేహితురాలే అని చెబుతున్నా, ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో మాత్రం అందరికీ తెలుసు. మాజీ ప్రియుడు తనను కొట్టాడని, వేధిస్తున్నాడని ప్రీతిజింటా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ప్రీతి - వాడియా స్నేహబంధం కొనసాగింది. దానికి ముందు, ఆ తర్వాత, మధ్యలో కూడా నెస్ వాడియా మరికొందరు బాలీవుడ్ భామలతో చెట్టపట్టాలు వేసుకునే తిరిగాడని ముంబై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రాక్‌స్టార్ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీ.. నెస్ వాడియాతో రాసుకు పూసుకుని తిరిగి, వార్తల్లో నిలిచింది. రాక్‌స్టార్ సినిమా ప్రీమియర్ షో ముగియగానే, కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీలో నర్గీస్ ఫక్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరో రణ్‌బీర్ కపూర్ రాకపోయినా.. నెస్ వాడియా రూపంలో ఆమెకు ఆ పార్టీలో మంచి కంపెనీయే దొరికింది. వాళ్లిద్దరూ దాదాపు గంట పాటు ఆ పార్టీలో ఒకరినొకరు అతుక్కుపోయి కనిపించారట. ప్రీతిజింటా కూడా ఆ పార్టీలో ఉన్నా, ఫక్రీ స్థాయిలో ఆమె వార్తల్లో నిలవలేకపోయింది. ఒకప్పుడు లారా దత్తాతోను, అంతకంటే ముందు మనీషా కొయిరాలాతో కూడా నెస్ వాడియా కాస్త సన్నిహితంగానే మెలిగాడట. అంతేనా, అమీషా పటేల్ అన్నా కూడా వాడియా చెవి కోసుకునేవాడని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడు వాళ్లంతా దూరంగా జరగడంతో.. తాజాగా బిజినెస్ టైకూన్ ఆయేషా థాపర్‌తో వాడియా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వినిస్తోంది. -
త్వరలో మళ్లీ వెండితెరపై కనిపిస్తా: లారాదత్తా
ముంబై: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి లారాదత్తా మళ్లీ సినిమాలపై దృష్టిసారించనుంది. 2010లో టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతితో వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2012లో ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా నటనకు ఫుల్స్టాప్ పెట్టింది. అయితే బాలీవుడ్‌తో అనుబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా నిర్మాతగా కొనసాగింది. అయితే ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు రావాలని తాపత్రయపడుతోంది. అందుకోసం జోరుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై లారా మాట్లాడుతూ... ‘పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమయ్యాను. పాప జన్మించిన తర్వాత నటనకు దాదాపుగా దూరమయ్యాను. నిర్మాతగా కొనసాగినా నటనకు దూరమవడంతో ఏదో కోల్పోయినట్లు అనిపించింది. అందుకే మళ్లీ నటించాలనుకుంటున్నా. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కుటుంబసభ్యుల నుంచి కూడా నటించే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే ఈ ఏడాదే కెమెరా ముందుకు వెళ్లబోతున్నా. అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను' అంటూ లారా తెలిపింది. -
షటప్ అండ్ ట్రైన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన షారుక్