భార్యను కోపడ్డ మహేష్‌ భూపతి, ఎందుకు ? | Mahesh Bhupathi angry on his wife Lara Dutta. why ? | Sakshi

భార్యను కోపడ్డ మహేష్‌ భూపతి, ఎందుకు ?

Aug 30 2017 9:38 AM | Updated on Sep 17 2017 6:09 PM

భార్యను కోపడ్డ మహేష్‌ భూపతి, ఎందుకు ?

భార్యను కోపడ్డ మహేష్‌ భూపతి, ఎందుకు ?

భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్థం అయింది.

సాక్షి, ముంబై: భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్తం అయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య రాజధాని స్తంభించిన విషయం విదితమే. ముంబై వరదలు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల జీవితాలని ప్రభావితం చేశాయి. వాటినుంచి భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా తప్పించుకోలేక పోయారు.

లారా దత్తా ఇంట్లోకి వరద నీరు రావడాన్ని అడ్డకోవడానికి ఓ విచిత్రమైన పని చేసింది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వాడిన తువ్వాలను మహేష్‌ జ్ఞాపకాలుగా ఉంచుకున్నాడు. అయితే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో.... ఆ నీటిని అడ్డుకోవడానికి మహేష్‌ ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ టవల్స్‌ను అడ్డంగా పెట్టింది. ఆ  ఫోటోను లారా దత్ తన  ట్వట్టర్‌లో పోస్టు చేసింది. అంతేకాదు వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ తువ్వాళ్లు ఇలా ఉపయోగపడ్డాయంటూ పోస్టు చేసింది. వర్షంలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించింది.

అయితే భార్య చేసిన పనిపై మహేష్‌ భూపతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'నువ్వేమైనా నన్ను ఆట పట్టిస్తున్నావా!!!! అవి కొన్నేళ్ల నా శ్రమకు ప్రతిఫలం' అంటూ బదులిచ్చాడు.

ముంబయి, థానే, పల్‌ఘర్, రాయఘడ్‌లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాతాంల్లో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు.  పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement