mumbai rains
-
ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు
ముంబయిలో కురిసిన భారీ వర్షానికి విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసందానంగా ఉన్న రైలు రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నీరు చేరడంతో సర్వీసులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుమొత్తం 14 విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇండిగోకు చెందిన తొమ్మిది విమానాలు, విస్తారా-రెండు, ఎయిరిండియా, ఆకాసా ఎయిర్, గల్ఫ్ ఎయిర్ ఒక్కోటి చొప్పున ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఆయా విమానాలను హైదరాబాద్‌కు ఏడు, అహ్మదాబాద్‌కు నాలుగు, గోవాకు రెండు, ఉదయపూర్(1)కు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
వీడియో: జడివాన ఎఫెక్ట్.. ముంబై అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024 -
ముంబైని ముంచెత్తుతున్న వాన.. విద్యాసంస్థలకు సెలవు
ముంబై: మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్, వడోదరలో భారీ వర్షాలు కురుసున్నాయి.Mithi River is also closing danger mark now. High tide at 2:30 pm⚠️It will hardly take time to switch from "What Lovely to Vaat Laavli"#MumbaiRainspic.twitter.com/ILVkhdsIrw— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 2024పుణెను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. కడ్క్ వాస్లా డ్యామ్‌కు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో అధికారులు నీటిని కిందికి వదిలారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.This is Heading straight towards kalyan from Karjat. Stay Alert⚠️⚠️No respite in Rains for Kalyan-Karjat Belt will make things worse. Will minutely track this personally and will issue alert if there is major threat to Kalyan. #MumbaiRainspic.twitter.com/GryW9gHuu2— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 202पुणे मे लगातार 8 घंटो से बारिश हो रही है। है इंद्रदेव थोड़ा राजस्थान मे भी मेहरबान हो जाओ।#PuneRains #MumbaiRains pic.twitter.com/XCla1cpqcd— Hitesh Arya (@HiteshA09736243) July 25, 2024బుధవారం థానే, పాల్ఘర్లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షాలకు భారత వాతావరణ శాఖ గురువారం థానే, రాయ్‌ఘడ్, పాల్ఘర్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో గురువారం మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. సెంట్రల్ మహారాష్ట్రలో అత్యంత భారీ విర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. Very heavy - intense rain in the Lower Parel, South Mumbai. Please try to avoid getting out. If possible try tondo WFH.#MumbaiRains #StaySafe #Mumbai @rushikesh_agre_ @s_r_khandelwal pic.twitter.com/eJE4lY0f1c— Yogesh Gawde (@yoges2951) July 25, 2024 ముంబైలో గడిచిన 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం థానే, కళ్యాణ్, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. కళ్యాణ్, థానే, ములుంద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.Critical Day for Ulhasnagar & Kalyan! Expecting Massive floods by 2-3PM⚠️⚠️#MumbaiRainspic.twitter.com/BLsWcq6sZr— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 2024 -
Mumbai Rains: ముంబైను వీడని వర్షాలు.. రెడ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైను వర్ష భయం వీడటం లేదు. రెండు రోజుల నుంచి నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఆర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసన వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువులను తలపించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.కాగా ముంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ముంబైకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది.ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు . అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇదిలా ఉండగా సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ రైలు సేవలు, బస్సు సర్వీసులు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు సైతం విడిచింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముగిసిన ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
భారీ వర్షాలు.. ముంబై వాసులకు సీఎం షిండే విజ్ఞప్తి
ఒక పూట కురిసిన భారీ వర్షం మహారాష్ట్ర రాజధాని ముంబైలను అతలాకుతలం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి చిక్కుకుంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటపై తేలాడుతున్నాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే రాష్ట్ర ప్రజలనుద్ధేశించి సూచన చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీచ్‌ల దగ్గరకు ఎవరినీ అనుమతించవద్దని పోలీసు కమిషనర్‌ను కూడా ఆదేశించినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. రెస్క్యూ బృందాలు తీసుకున్న చర్యలను వివరించారు. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు నీటమునిగిపోయాయని, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ అధికారులు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అనేక రైళ్లు రీషెడ్యూల్ అయ్యాయని చెప్పారు.వర్షం నీటిని తోడేందుకు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 461 మోటార్ పంపులు, రైల్వేశాఖకు చెందిన 200 పంపులు పని చేస్తున్నాయని తెలిపారు. ఉదయం నుంచి అన్ని శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.. సెంట్రల్, హార్బర్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. చదవండి: ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షంమునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 461 మోటార్ పంపులు, రైల్వేశాఖకు చెందిన 200 పంపులు తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ఉందని,తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా నగరంలో ఏడు పంపింగ్ స్టేషన్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు.కాగా ముంబైలో కురిసిన వర్ష బీభత్సానికి స్కూళ్లు, కళాశాలలు సెలవులు ప్రకటించారు, బస్సు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేగాక దాదాపు 50 విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. -
ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లలో పలువురు ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబై,, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ము, న్సిపల్ పాఠశాలలతోపాటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO— ANI (@ANI) July 8, 2024 భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. డోంబివిలీ స్టేషన్లో ప్రజలు నీట మునిగిన ట్రాక్‌లపై రైళ్ల కోసం వేచి ఉన్నారు. వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్, విద్యావిహార్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. కాగా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తుంటారు.'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.ఒక్క రోజు వర్షానికే ముంబై వణికిపోగా.. వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
ఉరుములు, మెరుపులతో కురిసిన ముంబై నగరవాసులకు ఊరటనిచ్చింది. ఈ సీజన్లో ముంబైలో తొలి వర్షాలు వేసవి వేడి నుంచి కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం మధ్యాహ్నం ముంబై, థానే , పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ దుమ్ము తుఫాను సంభవించింది. దీంతో పాలు ప్రాంతాల్లో చీకటి ఆవరించింది. వాతావరణ శాఖ ప్రకారం, ముంబైలో తేలికపాటి వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురువనున్నాయి.Mumbai currently looks like a Hollywood movie shot in Mexico pic.twitter.com/CeJRqEDEdL— Sagar (@sagarcasm) May 13, 2024ముంబైలోని ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి.Mumbai is on Strom alert ⚠This is so beautiful 😍#mumbairainspic.twitter.com/ES7uiEqIbW— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) May 13, 2024 ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, షోలాపూర్, లాతూర్, బీడ్, నాగ్‌పూర్, రత్నగిరి , సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.పూణే, సతారా, సాంగ్లీ, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. రాగల రెండు గంటల్లోల థానే ,పాల్ఘర్, కళ్యాణ్, బద్లాపూర్ , ఇంటీరియర్లలో రాబోయే 2 గంటలలో భారీ వర్షం కురుస్తుంది. నివాసితులు ఇళ్లలోనే ఉండటం మంచిది. గంటకు 40-50 కిమీ వేగంతోగాలులు వీచే అవకాశం ఉంది.📌Mod to intense thunderstorms over Red marked areas; District of Thane, Palghar, Raigad, Nagar & eastern suburbs of Mumbai during next 2 hrs. Mulund, Tiltwala, Kalyaan📌Mod to severe thunderstorms over yellow areas covering South ghat areas of Pune, Satara next 2,3 hrsWatch pl pic.twitter.com/WF7qd7LWsE— K S Hosalikar (@Hosalikar_KS) May 13, 2024 -
భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది. Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU — Richa Pinto (@richapintoi) July 19, 2023 ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు -
ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్!
నైరుతి రుతుపవనాల రాకతో దేశ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహాలు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పలుచోట్ల మరణాలు సైతం వెలుగుచూశాయి. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.5 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీకి అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత #WATCH | Waterlogging witnessed in several parts of Delhi after the rainfall (Visuals from Sarai Kale Khan area) pic.twitter.com/gfa7h0ytb3 — ANI (@ANI) June 29, 2023 హర్యానా కాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. దాదాపు 25కు పైగా ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పంపుల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాలతో ఇద్దరు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లోనూ పలు నగరాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. #WATCH | | Rain lashes parts of Mumbai According to BMC, there is a possibility of heavy to very heavy rains in Mumbai in the next 4-5 days. pic.twitter.com/4DleXs1Zh1 — ANI (@ANI) June 28, 2023 ముంబై మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. బుధవారం ముంబయిలోని మలాద్ ప్రాంతంలో వర్షాలతో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కౌశల్ దోషి (38)గా గుర్తించామని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని థానే , పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, దీంతొ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలినట్లు చెప్పారు. మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. Moderate rainfall continues to occur over Mumbai since forenoon of yesterday as shown in the attached Mumbai Radar Image. It is likely to continue during next 3 hours. Extremely Heavy rainfall has occurred at isolated stations and very heavy at some stations during last 21 hours pic.twitter.com/YUVkAOKaPy — India Meteorological Department (@Indiametdept) June 29, 2023 హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా రోడ్లు మూసేశారు. బుధవారం భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలోపడిపోవడంతో నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. #WATCH | Waterlogging witnessed in several parts of Navsari, Gujarat due to heavy rainfall in the region. As per IMD, heavy rain is very likely at isolated places over Bharuch, Surat, Navsari, Valsad, Daman, Dadra Nagar Haveli districts of the Gujarat region today. pic.twitter.com/EfuxkWp39n — ANI (@ANI) June 29, 2023 గుజరాత్ అటు గుజరాత్ రాష్ట్రాన్నీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్ జాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన గుజరాత్లో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షం దంచికొట్టింది. నవ్సారి, వల్సాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మరియు దాని పరిసర ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి, సాధారణ జనజీవనం ప్రభావితమైంది మరియు ఉదయం కార్యాలయ వేళల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంగా నది దక్షిణ మరియు ఉప-హిమాలయన్ నార్త్ బెంగాల్లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాఖండ్ ఇక ఉత్తరాఖండ్ నూ గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జులై 5వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్‌తోపాటు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గోవా గోవాలోని కొన్ని ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిశాయి, వాతావరణ శాఖ గురువారం వరకు కోస్తా రాష్ట్రానికి 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది. సూచన నిర్దిష్ట ప్రదేశాలలో తీవ్రమైన జల్లులను అంచనా వేస్తుంది. రాబోయే రోజులలో రుతుపవనాల ప్రభావంపై సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రుతుపవనాలు దాని అధునాతన దశలో ఉన్నాయని, ఇవి చురుకుగా పనిచేస్తున్నాయని అన్నారు.మధ్యప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాన్నారు. దక్షిణ గుజరాత్, కొంకణ్ గోవాలోని కొన్ని ప్రాంతాలలో గురువారం అత్యంత భారీ వర్షాలు (20 సెం.మీ కంటే ఎక్కువ) కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తూర్పు, ఈశాన్య భారతదేశంలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ
సాక్షి, బెంగళూరు, ముంబై: నైరుతి రుతుపవనాల ప్రారంభంతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైతో సహా కర్ణాటకలోని కొన్నిజిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలోనూ శని, ఆది వారాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు గుజరాత్, ఢిల్లీని కూడా తాకనున్నాయని అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, మధ్యప్రదేశ్‌లో శనివారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి భారీ వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 11 వరకు రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాలు కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: సిటీలో రోజంతా వర్షం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు రెడ్ అలెర్ట్ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ తీరప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరావళి(కోస్తా), మలెనాడు, దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ జిల్లాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏడు జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో 91 ఇళ్లకు హాని జరిగింది. కుమటా, హొన్నావర తాలూకాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో నోడల్ అధికారిని నియమించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ మంత్రి కోటా శ్రీనివాసపూజారి తెలిపారు. #Karnataka: Visuals of a hillock slide at Jasoor in Sullia taluk of Dakshina Kannada district.#KarnatakaRains pic.twitter.com/dSZ87i6Fll — TOI Bengaluru (@TOIBengaluru) July 8, 2022 ఉడుపి జిల్లా వ్యాప్తంగా వానలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. సౌపర్ణిక నది నిండుగా పారుతోంది. బైందూరు తాలూకాలో అధికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మరవంతె తీర ప్రాంతంలో సముద్రం కోసుకుపోతోంది. పొలాల్లో ఉన్న టెంకాయ చెట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. బ్రహ్మావర తాలూకా మడిసాలు హొళె నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పూరు, బెళ్మారులోకి నీరు చేరింది. నీలావర, బావలికుద్రు, కోరాడి, చాక్రోరు ప్రాంతాలలో సీతానది పొంగి ప్రవహిస్తోంది. Effort made by Delivery boys under BPCL Mangalore LPG Territory to deliver LPG cylinders at door step of flood effected area Byndoor Udupi District. #Karnatakarains #Udupi #Mangaluru #HeavyRains #Monsoon2022 pic.twitter.com/A3KRsqQ5Ne — Karnataka Rains⛈️ (@Karnatakarains) July 8, 2022 ఉత్తర కర్ణాటక వాసుల్లో భయం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. కృష్ణ, భద్రా, కావేరి, నేత్రావతి, తుంగ, వేదగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ నదీతీర ప్రాంతాల ప్రజల్లో వరద భీతి నెలకొంది. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 200 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం కార్వార, అంకోలా, హొన్నావర, కుమటా, భట్కళ, శిరసి, సిద్ధాపుర, జోయ్యా తాలూకాల పరిధిలో అంగనవాడీ, పాఠశాల, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వచ్చే ఐదు రోజుల్లో 200 సెంటీమీటర్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు కర్ణాటక నైసర్గిక వికోప కేంద్రం విశ్రాంత విశేష డైరెక్టర్ వీఎస్ ప్రకాశ్ తెలిపారు. మలెనాడు భాగంలో 150 సెంటీమీటర్లకు పైగా వానలు పడ్డాయని తెలిపారు. కల్యాణ కర్ణాటక భాగంలో ఐదు రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన కారు బెళగావి జిల్లాలో భారీగా పడుతున్న వానలతో అథణి తాలూకా రెడ్డికట్టి గ్రామం వద్ద ప్రవాహిస్తున్న కాలువలో కారు పడింది. కారులోని ఇద్దరు మహదేవ చిగరి (26), సురేశ్ బడచ (27) మృతి చెందగా, శ్రీకాంత్ అనేవ్యక్తి గాయపడి బయటపడ్డారు. అదనంగా రూ.55 కోట్ల విడుదల:మంత్రి అశోక్ వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ మంత్రి, విపత్తు నిర్వహణా ప్రాధికార ఉపాధ్యక్షుడు ఆర్.అశోక్ తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం, పునరావాసం తదితర పనులకు అదనంగా రూ.55 కోట్లు విడుదల చేశామన్నారు. మడికేరి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఆయన పర్యటించి వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాలను, భూకంపం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టండి∙: సీఎం బొమ్మై వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం బొమ్మై అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణా నుంచి ఆయన కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలన్నారు. మంత్రులు వారి వారి జిల్లాల్లో మకాం వేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు. -
Photo Feature: సరికొత్త ప్రయోగం.. పచ్చ తివాచీ
రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలమైంది. తొలకరి వర్షానికే వరంగల్ మహా నగరం వణికిపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన పల్లెవెలుగు బస్సులను లాజిస్టిక్ వ్యాన్లుగా మార్చుతోంది. ఏటా లక్షల టన్నుల బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణాన్ని సమతూకం చేసేందుకు దీక్షతో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా సాగిస్తోంది. -
2020లో ఏదైనా సాధ్యమే ..!
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, వేడి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా ఈ నెల 13 వరకు ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇలా డిసెంబర్లో అకాలవర్షం కురవడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో వాన కురిసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆకాశం మేఘావృతమైన, వర్షంతో తడిసిన వీధులను ఉద్దేశించి నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ, జోకులు పేలుస్తున్నారు. ఉదయం వర్షం పడటంతో, ఆ శబ్దం ఏంటో అర్ధం కాలేదని కొంతమంది చమత్కరించగా... మరికొంత మంది.. ‘‘ఇది శీతాకాలం. ఇది డిసెంబర్ అయినా వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇది 2020. కాబట్టి ఏదైనా సాధ్యం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది.. ‘‘వర్షం , చలి, వేడి, కరోనా , తుఫాన్ ఇవన్నీ కలిపి డిసెంబర్ నెలగా దేవుడు నిర్ణయించాడు’’ అని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఫొటోలు షేర్ చేస్తున్నారు. ట్విటర్లో వైరల్ అవుతున్న మీమ్స్ : Mumbaikars expecting Winter season but #MumbaiRains pic.twitter.com/gwILL52zNn — Ȑ̫̰͍ͭa̤̩͊̌̑h͎̳̲̒ͫû̑͋̐́l̯̾ͩͣͭ (@Rahulismm) December 11, 2020 It's Winter Its December Its Raining But its 2020 So...#rains #MumbaiRains pic.twitter.com/EOVjxst6H3 — Prathamesh Dinis (@pwdesque) December 11, 2020 *God deciding december* barish, thand, garmi, corona, light strom. #MumbaiRains pic.twitter.com/ItZYWL67s2 — prayag sonar (@prayag_sonar) December 11, 2020 Bin Mausam Barsaat🌧🌧☔☔ #MumbaiRains 😶😶 pic.twitter.com/N1emmmrqz8 — Anand Kayralath (@kayralath) December 11, 2020 -
వరదలో రేసు.. విన్నర్ ఎవరు?
-
బొలెరో Vs జాగ్వర్: వరదలో రేసు.. విన్నర్ ఎవరు?
ముంబైని బుధవారం భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై నగరం సముద్రం పక్కన మరో సహా సముద్రాన్ని తలపించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలో జలమయమైన ముంబైలోని ఓ రోడ్డులో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. వరదనీటిలో ముందుకుపోలేక విలాసవంతమైన జాగ్వార్ సెడాన్ కారు రోడ్డు మధ్యలో ఆగిపోగా.. దాని వెనుక వచ్చిన మహేంద్ర బోలెరో ఎస్యూవీ.. వరదనీటిలోనూ జూమ్జూమ్మంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మోహన్ చంద్రాని అనే నెటిజన్ ఈ వీడియోను ట్వీట్‌చేసి.. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రకు ట్యాగ్ చేశారు. అయితే, జాగ్వర్ వర్సెస్ బొలెరో అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోపై ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ.. దీనిపై తాను గొప్పలు చెప్పుకోబోనని, సముద్రాన్ని తలపించే పరిస్థితుల నడుమ కార్ల మధ్య పోటీ అనడం సరికాదని పేర్కొన్నారు. అయితే, వరదల్లోనూ రాజాలా దూసుకుపోయే బొలెరో కారు తన ఫెవరెట్ వెహికిల్ అని అభిప్రాయపడ్డారు. -
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై : భారీ వర్షాల కారణంగా ముంబై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపిపోవడంతో పనులకు వేళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో రైలు ప్రయాణానికి కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని సియాన్ రైల్వే స్టేషన్లో ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. భారీ వర్షం కారణంగా కుర్లా, సియాన్ ప్రాంతాలకు మధ్య ప్రయాణించే రైలు 15 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తాయని రైల్వే సిబ్బంది పేర్కొంది. విమానయాన సేవలు యథాతదంగా కొనసాగుతున్నాయి. 8మందికి తీవ్రగాయాలు భారీ వర్షాల కారణంగా రహదారి కనిపించకపోవడంతో ముంబైలో బుధవారం ఉదయం మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ముంబై, రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి ముంబైకి సమీపంలో తుపాను ఏర్పాటు అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా ముంబైలు వర్షాలు కురవలేదు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్న నగర వాసులు.. బుధవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఉలిక్కి పడ్డారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు మలాడ్‌లో ఓ గోడ కూలి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం
దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా, జనాభారీత్యా అతి పెద్ద మహా నగరంగా పేరు ప్రఖ్యాతులున్న ముంబై వానాకాలం వచ్చేసరికి చిగురుటాకులా వణుకుతుంది. భారీ వర్షాలతో వరద నీరు చేరి సాధారణ జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ఇంచుమించు ఇదే సమయంలో కాలం చెల్లిన భవనాలు కూలుతున్న ఘటనలు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో వందేళ్లనాటి నాలుగంతస్తుల భవంతి కూలి 13మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయ్యారు. ఈ నెల మొదట్లో వచ్చిన వర్షాలవల్ల వివిధ ప్రాంతాల్లో గోడలు కూలి 27మంది చనిపోయారు. ఇలా కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలు ఎక్కడెక్కడున్నాయో లెక్కేసే తనిఖీలు ఇంకా పూర్తికాలేదు. ఈలోగా ఈ భవనం కూలిపోయింది. మన దేశంలో నగరాలు విస్తరిస్తున్నాయి. భారీ భవంతులు నిర్మాణమవుతున్నాయి. విశాలమైన రోడ్లు వేస్తున్నారు. ఫ్లైఓవర్లు వస్తున్నాయి. మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ ఇవన్నీ ప్రధాన మార్గాలకే పరిమితమవుతున్నాయి. ఏ నగరం లోపలికెళ్లి చూసినా ఇరుకు సందులు, మురికి కూపాలు, ఒక పద్ధతి లేకుండా ఉన్న రోడ్లు, ప్రమాదకరంగా వేలాడే కరెంటు తీగలు దర్శనమిస్తాయి. వీటి మధ్య నుంచే వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సారాంశంలో మౌలిక సదుపాయాలన్నీ పరమ అధ్వాన్నంగా, అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. ఇవన్నీ శతాబ్దం క్రితమో, అంతకన్నా ముందో జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. వీటితోపాటే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలుంటాయి. వాటిల్లో పలు కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ దుస్థితి ఒక్క ముంబై నగరానికి మాత్రమే పరిమితమైనది కాదు. దేశంలో ప్రధాన నగరాలన్నిటి స్థితీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జరిగిన విషాద ఘటన వంటిదే 2017లో కూడా జరిగింది. అప్పుడు 33మంది మరణించారు. ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిల్లో నివాసముండేవారిని ఖాళీ చేయించి కూల్చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకోసం పురాతన భవంతుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. పూర్తి ప్రమాదకరమైనవి, పాక్షికంగా ప్రమాదకరమైనవి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టవలసినవి, చిన్న చిన్న మరమ్మతులు సరిపోతాయనుకున్నవి అంటూ ఒక జాబితా రూపొందించారు. ఆ జాబితాలో ఇప్పుడు కూలిన భవనం ప్రమాదకరమైన కేటగిరీలో ఉంది. కానీ ఏమైంది? మళ్లీ అదే విషాదఘటన పునరావృతమైంది. ఉదయం పూట భవనం కూలితే రాత్రికి కూడా శిథిలాల తొలగింపు పూర్తికాలేదు. ఈ వ్యవధిలో కొన ఊపిరితో ఉన్న పలువురిని రక్షించారు. అసలు ఆ ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీ ఆర్ఎఫ్) వాహనాలు చేరుకోవడానికి కూడా వీలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు కూలిన భవనం లాంటివి ఆ నగరంలో 499 ఉన్నాయని ఒక సర్వే వెల్లడించింది. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవంతులున్నాయని, వాటిల్లో చాలా భాగం ఇరుకిరుకు సందుల్లో ఉన్నాయని ప్రభుత్వానికి, బీఎంసీకి తెలుసు. ఏటా పడే భారీ వర్షాల వల్ల ఆ భవంతుల పునాదులు దెబ్బతింటున్నాయని తెలుసు. కానీ చర్యలు మాత్రం ఉండవు. కనీసం భవనాలు కూలినప్పుడు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక దళాన్ని సంసిద్ధంగా ఉంచడానికి అవసరమైన నిధులైనా అందుబాటులో ఉంచాలన్న స్పృహ ఎవరికీ లేదు. ఆ విభాగానికి గత మూడు నాలుగేళ్లుగా కేటాయింపులు 38 శాతం మేర తగ్గాయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) గణాంకాలు చెబుతు న్నాయి. అలాగని ఆ సంస్థకు డబ్బుకేమీ లోటులేదు. ఆదాయంలో అది దేశంలోనే అగ్రగామి. ఎనిమిది లేన్ల రహదారి నిర్మాణానికి, నగరం చుట్టూ 32 కిలోమీటర్ల తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఆ సంస్థ భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. మన పాలకుల తీరు ఇలా ఉంటున్నది. ఆ మహానగరాన్ని ఏలడానికి బీఎంసీ ఉంటే, దాని పర్యవేక్షణలో వేర్వేరు సంస్థలు పని చేస్తున్నాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంద’న్న చందంగా ఈ సంస్థల పరిధులు, అధికారాలు ఒక్కోసారి కలగలిసి గందరగోళంగా మారుతున్నాయి. ఈ సంస్థల బిల్డింగ్ కోడ్లు, నియమనిబంధనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఏ ఒక్క సంస్థకూ దేనిపైనా సంపూర్ణాధికారాలు లేకపోవడంతో ఎవరికి వారు పట్టనట్టు ఉంటున్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే బాధ్యతను ఎదుటివారిపైకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు కూలిన భవంతి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) పరిధిలోనిదని బీఎంసీ చెబుతోంది. ఎంహెచ్ఏడీఏకు అనుబంధంగా ఉన్న ముంబై భవన మరమ్మతులు, పునర్నిర్మాణ బోర్డు(ఎంబీఆర్ఆర్)కు ఈ భవనం గురించి 2017 జూలైలో లేఖ రాశామంటున్నది. కానీ అందులో ఉన్నవారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత మా సంస్థదా, బీఎంసీదా అని ఎంహెచ్ఏడీఏ ఎదురు ప్రశ్నిస్తోంది. దాన్ని ఖాళీ చేయించి అప్పగిస్తే కూల్చివేసేవారమంటున్నది. దారుణమైన విషయమేమంటే ఈ భవనం 1986 వరకూ గ్రౌండ్ ఫ్లోర్తోనే ఉండేది. కానీ ఆ తర్వాత దానిపై మరో మూడంతస్తులు లేచాయి. పర్య వేక్షించాల్సిన సంస్థలన్నీ గాఢనిద్రపోవడం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టంగానే అర్ధమవుతుంది. మనకు జాతీయ భవన నిబంధనలు(ఎన్బీసీ) ఉన్నాయి. వాటి ప్రకారం పాత భవంతుల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి. భద్రతను ధ్రువీకరించాలి. నివాసానికి అనువుగా లేనివాటి నుంచి కుటుంబాలను ఖాళీ చేయించాలి. కానీ ఆ నిబంధనలు కూడా ఎవరికీ పట్టడం లేదు. ముంబై ఘటనతో అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు నిపుణుల కమిటీలు ఏర్పా టుచేసి ప్రమాదకర స్థితిలో ఉన్న భవంతుల ఆరా తీయాలి. ఎన్బీసీ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. చూసీచూడనట్టు వదిలేసే అధికారుల పనిబట్టాలి. లేనట్టయితే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. -
రాత్రి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే రకుల్
ముంబైలో కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈప్రభావం సెలబ్రిటీ పై కూడా గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ తారలు షూటింగ్‌లు, ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగుతున్నాయా అంటూ ముంబై మున్సిపాలిటీ, ముంబై పోలీస్, ఎయిర్పోర్ట్ వర్గాలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పదించిన రకుల్ ప్రీత్ సింగ్ ‘గత రాత్రి నుంచి ఒక్క ఫ్లైట్ కూడా కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగు మన్మథుడు 2తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తున్నారు. No flights have taken off since last night .. m stuck at the airport — Rakul Preet Singh (@Rakulpreet) 2 July 2019 -
ముంబైకి పొంచివున్న ముప్పు
సాక్షి, ముంబై: వరుసగా రెండో రోజూ ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రైళ్లు, విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. దాదర్, వాదాలా, వర్లీ, చెంబూర్, బాంద్రా, అంధేరీ, కంజూర్‌మార్గ్, పాస్కల్వాడి, వర్సోవా, యారీ రోడ్, మడ్‌జెట్టీ తదితర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిలబడిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో ముంబైతో పాటు కొంకణ్‌లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంబై వాసులు వణుకుతున్నారు. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఘట్కోపర్ ప్రాంతంలో భవనం, చెంబూరులో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సియన్ కోలివాడలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. థానేలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముంబై తూర్పు సబర్బన్‌లో గత 24 గంటల్లో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు బీఎంసీ వెల్లడించింది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్ మానుకోవాలని ప్రజలకు సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో మ్యాన్‌హోల్స్‌ను తెరవద్దంటూ బీఎంసీ నగరవాసులను కోరింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది. శనివారం తెల్లవారుజామున పుణెలోని కొంద్వా ప్రాంతంలో ఉన్న తలాబ్ మసీదు వద్ద గోడ కూలిన దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు మృతి... శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో నలుగురు మృతిచెందారు. ముంబైలో ముగ్గురు షార్ట్‌సర్క్యూట్ కారణఃగా మరణించగా ముంబైకీ సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో పిడుగు పడి ఒకరు మరణించారు. ముంబైతోపాటు ఉప నగరాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 9 ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో పశ్చిమ గోరేగావ్‌లోని ఇరవానీ ఇస్టేట్లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్లో నలుగురికి గాయలయ్యాయి. అయితే వీరిని ఆసుపత్రికి తరలించగా రాజేంద్ర యాదవ్ (60), సంజయ్ యాదవ్ (24)లు ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. అయిదేళ్ల ఆశాదేవి దీపూ యాదవ్ (24)లు చికిత్స పొందుతున్నారు. పశ్చిమ అంధేరీ ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉదయం 7.48 గంటలకు వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో కాశీమా యుడియార్ అనే 60 ఏళ్ల వృద్ధ మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. పాల్ఘర్ జిల్లాలో.. పాల్ఘర్ జిల్లాలో పిడుగు పడి ఓ ఎనిమిదేళ్ల మహేంద్ర బడగా అనే బాలుడు మరణించాడు. విక్రమగడ్ తాలూకాలోని సాతాకోర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలతో ఇంటి బయట ఆడుకుంటుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్రను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. -
నీటమునిగి నగరం ఏడుస్తుంటే వీళ్లేమో..!
ముంబై: రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. నిత్యం వేలాది మంది సేదతీరే మెరైన్ డ్రైవ్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం.. నలుగురి మృతి: శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ముంబై మహానగరం, శివారులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నాటికి వర్షపాతం సరాసరి 100 మిల్లీమీటర్లుగా నమోదయింది. దాదర్, పరేల్ టీటీ, ధారావి, కింగ్స్ సర్కిల్, కోలాబా, సియోన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వర్షాభావ పరిస్థితిని చక్కదిద్దేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ), నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 3000పైచిలుకు మంది సిబ్బంది పాల్గొంటున్నారని బీఎంసీ కమిషనర్ అజొయ్ మెహతా తెలిపారు. నడిరోడ్డుపై బరితెగింపు: ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. (కింద వీడియో) ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ మొబైల్ వ్యాన్ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.. కొనసాగుతోన్న వేట: పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్ అడిక్ట్ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించిన పోలీసులు.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. మెరైన్ డ్రైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదుచేయలేదు. -
పట్టపగలు నడిరోడ్డుపై బరితెగింపు..
-
భారీ వర్షాలు : శని, ఆదివారాలు సెలవులు రద్దు
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణేలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ఈ హెచ్చరికతో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్ర ఇచ్చే వెదర్ అప్డేట్లను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోవైపు కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్ విమానాన్ని కూడా అహ్మదాబాద్ విమానశ్రయానికి తరలించారు. ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్, రాయ్‌ఘడ్, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. -
హీరో మేనేజర్ బెదిరించారు: కమెడియన్
సాక్షి, ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో వణుకుతోండగా... సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలతో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. బాలీవుడ్ కమెడియన్ డానియెల్ ఫెర్నాండేజ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నటుడు సంజయ్ దత్ మేనేజర్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే హాస్యనటుడు ఫెర్నాండేజ్ ఉంటున్నారు. భారీ వర్షాల కారణంగా తన అపార్ట్ మెంట్లో కారు పార్కింగ్ కు అవకాశం లేకపోవడంతో సంజయ్ దత్ మేనేజర్ కు చెందిన స్థలంలో వాహనాన్ని ఉంచాలనుకున్నారు. ఆ విషయం చెప్పగానే హీరో మేనేజర్ ఆగ్రహంతో ఊగిపోయారని, కొట్టడానికి కూడా వెనుకాడనంటూ తనను హెచ్చరించారని కమెడియన్ ఫెర్నాండేజ్ వరుస ట్వీట్లు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉండగా అందుకోసం చాలా మొత్తంలో స్థలాన్ని హీరో మేనేజర్ వాడుకుంటున్నారని, కనీసం ఒక్కకారు పార్కింగ్ కు అనుమతించకపోగా తనపై దాడికి దిగారని ఆరోపించారు. తన బాధను ట్విట్టర్ ద్వారా ఫాలోయర్లతో కమెడియన్ షేర్ చేసుకున్నారు. దీంతో పలువురు హీరో మేనేజర్ చర్యను వ్యతిరేకిస్తున్నారు. -
వర్షాలు ఆపండి, తర్వాత అడగండి
విలేకరులపై ఉద్ధవ్ థాక్రే చిర్రుబుర్రు ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు కోపం వచ్చింది. ముంబై వర్షాలపై ప్రశ్నలు అడిగిన విలేకరులపై చిర్రుబుర్రులాడారు. తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఎంసీజీఎం(మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై)లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకుండా విలేకరులపై ఎదురుదాడికి దిగారు. 'ముందు మీరు వర్షాలు రాకుండా ఆపండి. తర్వాత ఏం చేయాలో నన్ను అడగండి. ముంబై నగరంపై మీకు ఒక్కరికే గుత్తాధిపత్యం ఉందని భావించకండి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. అందుకే ఎన్నికల్లో మాకు ఓటు తిరిగి అధికారంలోకి తెచ్చార'ని థాక్రే అన్నారు. చాలా ఏళ్లుగా ఎంసీజీఎం శివసేన పాలనలో ఉందని, వర్షాలకు ప్రతి సంవత్సరం నగరం ఎందుకు మునిగిపోతోందని విలేకరులు ప్రశ్నించారు. వరదల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎంసీజీఎం చెబుతోందని, కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని ఆక్షేపించారు. దీనిపై థాక్రే స్పందిస్తూ.. 'మీడియా కంటే ప్రజలతోనే మేము మమేకమవుతున్నాం. మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సహాయం చేస్తున్నారు. కానీ మీరు ఏమీ చేయడం లేద'ని జవాబిచ్చారు. ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తప్పుబట్టారు. థాక్రే అహంకారంతో మాట్లాడారని, వరద బాధిత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు సరిదిద్దుకోవాలని హితవు పలికారు. -
భార్యను కోపడ్డ మహేష్ భూపతి, ఎందుకు ?
సాక్షి, ముంబై: భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్తం అయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య రాజధాని స్తంభించిన విషయం విదితమే. ముంబై వరదలు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల జీవితాలని ప్రభావితం చేశాయి. వాటినుంచి భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా తప్పించుకోలేక పోయారు. లారా దత్తా ఇంట్లోకి వరద నీరు రావడాన్ని అడ్డకోవడానికి ఓ విచిత్రమైన పని చేసింది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వాడిన తువ్వాలను మహేష్ జ్ఞాపకాలుగా ఉంచుకున్నాడు. అయితే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో.... ఆ నీటిని అడ్డుకోవడానికి మహేష్ ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ టవల్స్‌ను అడ్డంగా పెట్టింది. ఆ ఫోటోను లారా దత్ తన ట్వట్టర్లో పోస్టు చేసింది. అంతేకాదు వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ తువ్వాళ్లు ఇలా ఉపయోగపడ్డాయంటూ పోస్టు చేసింది. వర్షంలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించింది. అయితే భార్య చేసిన పనిపై మహేష్ భూపతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'నువ్వేమైనా నన్ను ఆట పట్టిస్తున్నావా!!!! అవి కొన్నేళ్ల నా శ్రమకు ప్రతిఫలం' అంటూ బదులిచ్చాడు. ముంబయి, థానే, పల్ఘర్, రాయఘడ్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాతాంల్లో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. Putting our Wimbledon,US Open, Aus Open &French Open towels to good use!😄@Maheshbhupathi #MumbaiRain.Stay safe & indoors if possible folks!🙏 pic.twitter.com/uEV30SPfT5 — Lara Dutta Bhupathi (@LaraDutta) August 29, 2017 -
వర్షాల్లో చిక్కుకుపోయిన హీరో!
సాక్షి, ముంబై: భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు సామాన్య ముంబైకర్లే కాదు.. నగరంలో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అష్టకష్టాలు పడ్డారు. రోడ్ల మీద, వీధుల్లో నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో తమ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం వల్ల ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో వరదనీటిలో తన కారు చిక్కుకుపోయిందని, దీంతో గత్యంతరం లేక బాంద్రాలోని తన స్నేహితునికి ఫోన్ చేస్తే.. అతను, అతని కూతురు తనను రక్షించడానికి ముందుకొచ్చారని, అతని ఇంట్లో అత్యవసరంగా ఆశ్రయం పొందానని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆపత్కాలంలో ఆదుకోవడం, మానవ సంబంధాలను చాటడంలో ముంబై లాంటి నగరం ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా తాను గమ్యస్థానం చేరలేకపోయానని ఆయన తెలిపారు. ఇక, మరో బాలీవుడ్ హీరో మాధవన్ సైతం ఇదేవిధంగా వర్షాల్లో కష్టాలు ఎదుర్కొన్నారు. కారులో ఆయన ఇంటికి వెళుతుండగా.. ఇంటికి సమీపంలో కారు చెడిపోయింది. దీంతో మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ ఘటన ఉత్సుకతతోపాటు చిరాకు కలిగించిందని మాధవన్ ట్వీట్ చేశారు. కారు చుట్టూ భారీగా నిలిచిన వరదనీటి వీడియోను ఆయన షేర్ చేసుకున్నారు. హీరోయిన్ హ్యుమా ఖురేషీ కూడా వర్షాల వల్ల రోడ్డు మీద మూడుగంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుపోయినట్టు ట్వీట్ చేశారు. సోమవారం ముంబై మహానగరాన్ని మహాకుంభవృష్టి ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఐదుగురు మరణించారు. ఎంతోమంది ముంబైవాసులు అష్టకష్టాలు పడ్డారు. ఈ రోజు వర్షాలు కాస్తా తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించడంతో పరిస్థితి మెరుగుపడొచ్చునని ముంబై వాసులు ఆశిస్తున్నారు. My car got stuck in heavy rains. Called a friend. He & his daughter came to my rescue. Now I am in his house.