ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది.
దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది.
Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU
— Richa Pinto (@richapintoi) July 19, 2023
ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు
Comments
Please login to add a commentAdd a comment