
ముంబైని బుధవారం భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై నగరం సముద్రం పక్కన మరో సహా సముద్రాన్ని తలపించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలో జలమయమైన ముంబైలోని ఓ రోడ్డులో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. వరదనీటిలో ముందుకుపోలేక విలాసవంతమైన జాగ్వార్ సెడాన్ కారు రోడ్డు మధ్యలో ఆగిపోగా.. దాని వెనుక వచ్చిన మహేంద్ర బోలెరో ఎస్‌యూవీ.. వరదనీటిలోనూ జూమ్‌జూమ్మంటూ ముందుకు దూసుకుపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మోహన్ చంద్రాని అనే నెటిజన్ ఈ వీడియోను ట్వీట్‌చేసి.. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రకు ట్యాగ్ చేశారు. అయితే, జాగ్వర్ వర్సెస్ బొలెరో అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోపై ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ.. దీనిపై తాను గొప్పలు చెప్పుకోబోనని, సముద్రాన్ని తలపించే పరిస్థితుల నడుమ కార్ల మధ్య పోటీ అనడం సరికాదని పేర్కొన్నారు. అయితే, వరదల్లోనూ రాజాలా దూసుకుపోయే బొలెరో కారు తన ఫెవరెట్ వెహికిల్ అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment