తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు | Massive Dust Storm, Rain In Mumbai, Airport Ops Suspended For 30 Minutes | Sakshi
Sakshi News home page

తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు

Published Mon, May 13 2024 5:01 PM | Last Updated on Mon, May 13 2024 5:26 PM

Massive Dust Storm, Rain In Mumbai, Airport Ops Suspended For 30 Minutes

ఉరుములు, మెరుపులతో కురిసిన ముంబై నగరవాసులకు ఊరటనిచ్చింది.  ఈ సీజన్‌లో ముంబైలో తొలి వర్షాలు వేసవి వేడి నుంచి కాస్త ఊరటనిచ్చాయి.  సోమవారం మధ్యాహ్నం  ముంబై, థానే , పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.  భారీ దుమ్ము తుఫాను  సంభవించింది. దీంతో పాలు ప్రాంతాల్లో చీకటి ఆవరించింది.  వాతావరణ శాఖ ప్రకారం, ముంబైలో తేలికపాటి వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురువనున్నాయి.

ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి.

 ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, షోలాపూర్, లాతూర్, బీడ్, నాగ్‌పూర్, రత్నగిరి , సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.పూణే, సతారా, సాంగ్లీ, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.  దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలో సోషల్‌ మీడియాలో  తెగ షేర్‌ అవుతున్నాయి.

 

రాగల రెండు గంటల్లోల థానే ,పాల్ఘర్, కళ్యాణ్, బద్లాపూర్ , ఇంటీరియర్‌లలో రాబోయే 2 గంటలలో భారీ వర్షం కురుస్తుంది. నివాసితులు ఇళ్లలోనే ఉండటం మంచిది. గంటకు 40-50 కిమీ వేగంతోగాలులు వీచే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement