Dust storm
-
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
ఉరుములు, మెరుపులతో కురిసిన ముంబై నగరవాసులకు ఊరటనిచ్చింది. ఈ సీజన్లో ముంబైలో తొలి వర్షాలు వేసవి వేడి నుంచి కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం మధ్యాహ్నం ముంబై, థానే , పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ దుమ్ము తుఫాను సంభవించింది. దీంతో పాలు ప్రాంతాల్లో చీకటి ఆవరించింది. వాతావరణ శాఖ ప్రకారం, ముంబైలో తేలికపాటి వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురువనున్నాయి.Mumbai currently looks like a Hollywood movie shot in Mexico pic.twitter.com/CeJRqEDEdL— Sagar (@sagarcasm) May 13, 2024ముంబైలోని ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి.Mumbai is on Strom alert ⚠This is so beautiful 😍#mumbairainspic.twitter.com/ES7uiEqIbW— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) May 13, 2024 ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, షోలాపూర్, లాతూర్, బీడ్, నాగ్‌పూర్, రత్నగిరి , సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.పూణే, సతారా, సాంగ్లీ, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. రాగల రెండు గంటల్లోల థానే ,పాల్ఘర్, కళ్యాణ్, బద్లాపూర్ , ఇంటీరియర్లలో రాబోయే 2 గంటలలో భారీ వర్షం కురుస్తుంది. నివాసితులు ఇళ్లలోనే ఉండటం మంచిది. గంటకు 40-50 కిమీ వేగంతోగాలులు వీచే అవకాశం ఉంది.📌Mod to intense thunderstorms over Red marked areas; District of Thane, Palghar, Raigad, Nagar & eastern suburbs of Mumbai during next 2 hrs. Mulund, Tiltwala, Kalyaan📌Mod to severe thunderstorms over yellow areas covering South ghat areas of Pune, Satara next 2,3 hrsWatch pl pic.twitter.com/WF7qd7LWsE— K S Hosalikar (@Hosalikar_KS) May 13, 2024 -
అమెరికాలో దుమ్ము బీభత్సం
హర్డిన్: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్ సమీపంలో మోంటానా ఇంటర్ స్టేట్ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి. దారి కనిపించక ట్రాక్టర్ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు. -
ఢిల్లీలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం ఉన్నట్టుండి చల్లబడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే బలమైన ఈదురు గాలులు వీస్తూ వర్షం మొదలైంది. నగరంలోని కొన్ని చోట్ల ఓ మోస్తరుగా మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఘజియాబాద్, నౌయిడాలలో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి, నగరవాసులను ఎండ వేడిమి నుంచి సేద దీర్చింది. అనేకమంది ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ వాతావరణ వీడియోలను షేర్ చేశారు. What a stormy weather . It’s Unbelievable that we are in mid May . Whatever, the weather is really awesome.#Rain #hailstorm pic.twitter.com/isizAX9S47 — Mehak Prabhakar (@MehakPrabhakar2) May 14, 2020 heavy hailstorm♥️♥️Delhi like kashmir♥️ #delhirains pic.twitter.com/wDZYKgTg26 — MOHAMAD KAIF (@mr_kaifu10) May 14, 2020 Hail storm in Delhi NCR pic.twitter.com/Lsv5AMMppj — Ajeet Singh (@Ajit5666Singh) May 14, 2020 -
ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో పగటిపూటే చీకట్లు అలుముకున్నాయి. ముఖ్యంగా ఘాజీపూర్ ప్రాంతంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిమేర తగ్గిపోయాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరోవైపు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. కాగా, ఢిల్లీలో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే రానున్న రెండు రోజులు ఆకాశం మేఘావృతంగా ఉండనుందని వెల్లడించింది. కాగా, కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడుతున్న ఢిల్లీ వాసులకు.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు చల్లబడటం కొద్దిమేర ఉపశమనం కలిగించింది. -
అక్కడ మరోసారి భయానక వాతావరణం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో మొన్నటిదాకా ప్రజలు కార్చిచ్చుతో అతలాకుతులం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజల్లో వరుస తుఫాన్లు, సుడిగాలులు మరోసారి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో సుడిగాల్పులు బీభత్సంతో తీవ్ర కలకలం రేగింది. గంటకు 107 మైళ్ల వేగంతో వీచిన గాలులకు ప్రజా భవనాలు, గృహాలు, కార్లు ద్వంసమవడంతో పాటు వేలాది చెట్లు నేలకొరిగాయి. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్ ప్రాంతాలలో శనివారం వడగళ్ల వాన చుట్టముట్టడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాలో ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రెండు నెలల క్రితం న్యూసౌత్ వేల్స్ అడవుల్లో మొదలైన కార్చిచ్చును చల్లార్చాడానికి ఈ అకాల వర్షాలు మంచివే అయినా ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన నగరాల్లోని ప్రజలకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించిందనే చెప్పుకోవాలి. అయితే కార్చిచ్చు దాటికి 28 మంది మరణించగా, వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. కార్చిచ్చు దాటికి 10.4 మిలియన్ హెక్టార్లు కాలిపోయింది. కార్చిచ్చుకు హరించుకుపోయిన ఈ మొత్తం యూఎస్ఏలోని ఇండియానా రాష్ట్రంతో సమానం కావడం విశేషం. Narromine dust storm - Jan 19th pic.twitter.com/GeFSqby8NY — Mick Harris (@mickharris85) January 19, 2020 Fires, hottest day on record, floods, dust storm, hail storm. All in a month. Climate apocalypse starts in Australia. Are we gonna let this be the new normal?#ClimateCrisis pic.twitter.com/rPGg20JsV2 — Veronica Koman (@VeronicaKoman) January 20, 2020 -
పొల్యూషన్.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్.. లండన్.. సింగపూర్ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్‌లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్‌సిగ్నల్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్‌కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య ఇలా.. వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్‌సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్‌లైట్లు ఆన్ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్‌లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్(ఫ్రాన్స్)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే.. ► టికెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు. ► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి. ► స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ► ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ► పార్కింగ్ లాట్ వద్ద బైక్‌లకు నెలవారీ పాస్ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్లకు దూరంగా ఉంటున్నారు. ► మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ► మెట్రో గమనంలో సడెన్బ్రేక్లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
యూపీలో ధూళి తుపాను బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారని విపత్తు కమిషనర్ తెలిపారు. అలాగే మైన్‌పురి జిల్లాలో 41 మంది గాయపడ్డారని, చెట్లు కూకటి వేళ్లతో సహా రహదారికి అడ్డంగా పడటంతో చాలా సేపటి వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు. ఆ సమయంలో ప్రజలు వారి ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, దీంతో ఇంటి గోడలు కూలి చాలావరకు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ‘ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం దుమ్ము తుపాను కారణంగా మైన్‌పురిలో ఆరుగురు, ఎటా, కాస్గంజ్ల్లో ముగ్గురు, ఫరూఖాబాద్, బారాబంకిల్లో ఇద్దరు, మొరాదాబాద్, బదౌన్, పిలిభిత్, మధుర, కనౌజ్, సంభాల్, ఘజియాబాద్, అమ్రోహ, బదౌన్, మహోబాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు’అని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
బీభత్సం సృష్టించిన దుమ్ము తుపాను
-
వైరల్ వీడియో : ప్రళయం వచ్చేసిందా?
జైపూర్ : ఈ వీడియో చూసిన వారికి ప్రళయం రాబోతుందా.. లేక వచ్చేసిందా అనే అనుమానం కలగక మానదు. అసలే ఫేక్ న్యూస్ ప్రచారం బాగా పెరిగిపోయింది కదా.. ఇది కూడా అలాంటి గ్రాఫిక్స్ జిమ్మిక్కే అన్పిస్తుంది. కానీ వాస్తవంగా జరిగిన సంఘటనకు దృశ్యరూపం ఇది. అది కూడా మన దేశంలో జరిగింది. వివరాలు.. మన దేశంలో రాజస్తాన్ రాష్ట్రం దుమ్ము, ఇసుక తుపానులకు పెట్టింది పేరు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఎడారి రాష్ట్రాన్ని ఓ భారీ దుమ్ము తుపాను చుట్టిముట్టింది. ఆ సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ వీడియో తెగ వైరలవుతోంది. చురు పట్టణం మీద దాడి చేయడానికి ఇంచుల మందంతో.. అంతెత్తున మేఘాలను తాకుతుందా అనిపించే భారీ దుమ్ము తుపాను వడివడిగా పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన జనాలు.. ఆ వెంటనే తెరుకుని తన తమ సెల్ఫోన్లకు పని చెప్పారు. ఈ భయంకర దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. అయితే ఈ తుపాను బీభత్సంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. పంట నష్టం మాత్రం జరిగిందని అధికారులు తెలిపారు. -
ఢిల్లీ చుట్టూ ట్రీవాల్
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, గాలి దుమారాల కట్టడికి ఢిల్లీ హరిత బాట పట్టింది. నగరం చుట్టూ రెండేళ్లలో 31 లక్షల మొక్కలు నాటేందుకు శనివారం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అధికారి తెలిపారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల వెంట ఆరావళి, యమునా అటవీ ప్రాంతాల చుట్టూ మొక్కలతో హరిత వలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న ధూళి రేణువులను మొక్కలతో అడ్డుకుని, ఏటా రాజస్తాన్ నుంచి వస్తున్న గాలి దుమారాల నుంచి ఢిల్లీని కాపాడటమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తగిన పరిశోధనలు చేసి, పొడవైన, దట్టమైన ఆకులతో కూడిన మొక్కలను ఎంచుకున్నారు. ధూళి రేణువులు గాల్లోకి లేవకుండా నిరోధించే వేప, మర్రి, ఉసిరి, రావి, జామ తదితర మొక్కలను నాటనున్నారు. 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే రావి మొక్కలకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 21 లక్షలు, అటవీ శాఖ 4 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లు 4 లక్షలు, ఎడీఎంసీ 3 లక్షల చొప్పున మొక్కలు నాటనున్నాయి. -
తీవ్రమైన దుమ్ము.. విమానాలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: దుమ్ము, ఇసుక తుపాన్లతో దేశ రాజధాని, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణంలో దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా, వెలుతురు లేని కారణంగా ఛండీగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు. అటు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకొని ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాన్లతో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని దుమ్ము కొట్టుకు పోతోంది. మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకర రీతిలో పీఎం (నలుసు పదార్థం) స్థాయులు ఉన్నాయనీ, ఇటువంటి గాలిని పీల్చితే శ్వాసకోస వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దనీ ప్రజలకు సూచించింది. ఎండలు మండిపోతుండడంతో మరో వారంపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దుమ్ము, ధూళితో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజధాని ప్రజలు 33 నుంచి 42 డిగ్రీల ఎండవేడితో చెమటలు కక్కుతున్నారు. కాగా, అక్కడ సాధారణం కన్నా 5 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఢిల్లీలో భారీ వర్షాలు
-
ఢిల్లీలో చిమ్మచీకట్లు : భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో పట్టపగలు చిమ్మచీకట్లు కమ్మేశాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు, ఇసుక తుపాను కలసి రాజధానిపై దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజధానిలో వాతావరణం చల్లబడింది. కాగా, శనివారం ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ హెచ్చరించింది. పెనుగాలుల ధాటికి నగరంలో పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ద్వారక, అక్బర్ రోడ్, ఛత్తర్పూర్లలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇసుక తుపాన్ కారణంగా విమానసర్వీసులు సైతం నిలిచిపోయాయి. -
యూపీని వణికించిన దుమ్ము తుపాను
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం భీకరమైన దుమ్ముతుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 11 మంది గాయపడ్డారు. చెట్లు ఇళ్లు కుప్పకూలిపోవడంతోనే ఎక్కువమంది చనిపోయారని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. దుమ్ము తుపానుతో మొరాదాబాద్‌లో అత్యధికంగా ఏడుగురు, సంభాల్‌లో ముగ్గురు, ముజఫర్‌నగర్, మీరట్‌లో ఇద్దరు, అమ్రోహాలో ఒకరు దుర్మరణం చెందారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షం కారణంగా శుక్రవారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీలో గత నెలలో సంభవించిన మూడు దుమ్ము తుపాన్లతో 130 మంది చనిపోయారు. -
ఈదురుగాలుల బీభత్సం.. ఎగిరిపోయిన స్టాళ్లు
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. గత నెలరోజులుగా వరదలు, ఇసుక తుఫాను, దుమ్ము, ధూళితో కూడిన తుఫానులు ఉత్తర భారతదేశాన్ని కమ్మేస్తున్నాయి. ఇదంతా సద్దుమణిగింది అనుకునేలోపు మళ్లీ అకస్మాత్తుగా దుమ్ముతో కూడిన తుఫాను చెలరేగింది. పాక్షికంగా మేఘాలు కమ్ముకుని, గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్కసారిగా దుమ్ము, ధూళితో కూడిన తుఫానులు సంభవించాయి. నోయిడా ప్రాంతంలో సంభవించిన ఈ అకస్మాత్తు పరిణామానికి ప్రజలు ఆశ్చర్యపోయారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈదురుగాలులకు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎగిరిపోయ్యాయి. ఉత్తరాఖండ్‌లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
‘దుమ్ము’.. ప్రాణాలను దులిపేస్తోంది!
వరద ముంచెత్తితే ప్రాణాలు పోవడం తెలుసు.. పిడుగు పాటుకు గురై మరణించడమూ తెలుసు..కానీ దుమ్ము, ధూళి కూడా ప్రాణాలు తీసుకుంటుంటే.. ఒక్కసారిగా తుపానులా.. పిడుగులు కురిపిస్తూ విరుచుకుపడితే.. మనిషి మీద ప్రకృతి పగబట్టిందా అనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో ఈ నెల మొదట్లో ‘ధూళి’ తుపాన్లు వందలాది మందిని బలిగొన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పదుల ప్రాణాలు తీశాయి. మరి ఈ ఘటనలు దేనికి సూచిక? కారణాలేమిటి? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఏటికేడాదీ వేసవి తాపం పెరిగిపోతోంది. 2015 నుంచి ఏటా ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి. మరి దీనికి.. ధూళి తుపానులు, పిడుగుల వర్షానికి సంబంధమేంటి? అనుకుంటున్నారా.. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ గాలిలో, భూ ఉపరితలంపై ఉండే మట్టిలో తేమ తగ్గిపోతుంది. దాంతో చిన్నగాలికి కూడా ఎక్కువ దుమ్ము, ధూళి పైకి లేస్తుంది. అదే బలమైన గాలులు వీస్తే.. ధూళి తుపానులే చెలరేగుతాయి. భూతాపం పెరిగిపోతూనే ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూళి తుపాన్ల పరిస్థితినే గమనిస్తే... ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్లలో వీటి తీవ్రత, విస్తృతి, ప్రభావం మూడూ భారీగా పెరిగాయని అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల వడగాడ్పులు, ధూళి తుపాన్లు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈసారి తీవ్రత ఎక్కువే.. ఎండా కాలంలో ధూళి తుపానులు చెలరేగడం మామూలుగానే జరుగుతుందని.. కానీ ఈ ఏడాది ఘటనలు మాత్రం చాలా తీవ్రమైనవని భారత వాతావరణ పరిశోధన సంస్థ కూడా అంగీకరిస్తోంది. ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు మరిన్ని పరిశోధనల అవసరముందని చెబుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. గాలిలో తేమ తగ్గి, వేడి పెరిగి వాతావరణంలో పైపైకి చేరుతుంది. ఆ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పీడనం తగ్గిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక పీడనం ఉండటంతో.. ఆయా ప్రాంతాల నుంచి గాలి వేగంగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతంవైపు వీస్తుంది. వేడి మరీ ఎక్కువగా ఉండి, పీడనం బాగా తగ్గిపోతే... ఇలా చుట్టూరా ఉన్న ప్రాంతాల నుంచి వీచే గాలి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఇది తుపానుకు దారితీస్తుంది. కొంత తేమ ఉంటే.. పిడుగులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా పిడుగులు పడటాన్ని ప్రస్తావిస్తూ.. ధూళి తుపాన్లకు, వీటికి పెద్దగా తేడా లేదని భారత వాతావరణ శాస్త్రవేత్త ఒకరు విశ్లేషించారు. గాలిలో కొద్దోగొప్పో తేమ ఉన్న ప్రాంతాల్లో పిడుగులు పడితే.. లేని చోట్ల ధూళి తుపాన్లు ఏర్పడుతూంటాయని వివరించారు. ఈ నెల రెండో తేదీన రాజస్తాన్‌లోని అధిక ఉష్ణోగ్రతలకు, పశ్చిమ గాలులు తోడవడంతో ధూళి తుపాన్లు చెలరేగాయని చెప్పారు. ఇక బంగాళాఖాతం మీదుగా తేమను మోసుకొస్తున్న గాలులు ఉరుములు, పిడుగులకు కారణమయ్యాయని వివరించారు. గత కొద్ది రోజుల్లో తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ధూళి తుపాన్లు, పిడుగుల కారణంగా 124 మందికిపైగా మరణించడం, 300 మందికిపైగా గాయపడటం తెలిసిందే. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటివి ఈ అసాధారణ పరిస్థితులకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ♦ భూమ్మీద 1880 నుంచి ఉష్ణోగ్రతల వివరాలు నమోదు చేస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో 2017 రెండోస్థానంలో ఉండగా.. 2018 ఐదో స్థానంలో ఉంది. ♦ మన దేశంలో వరదలు, తుపాన్లు, వడగాడ్పుల కంటే పిడుగుల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ♦ 2015లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 10,510. ఇందులో పిడుగుపాటుకు మరణించినవారే 2,600 మంది వరకు ఉండటం గమనార్హం. దేశంలో పిడుగుల వల్ల సగటున ఏటా సుమారు రెండువేల మందికిపైగా మరణిస్తున్నారు. -
కొనసాగనున్న తుపాను బీభత్సం..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష బీభత్సం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు వాయువ్య భారత దేశాన్ని ముంచెత్తనున్నట్లు తెలిపింది. గత రెండు వారాలుగా ఇసుక తుపానుకు తోడు ఈదురు గాలులలతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ధాటికి ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం కూడా సంభవించింది. దేశమంతటా కలిపి సుమారు 41 మంది మృతి చెందినట్లు సమాచారం. దక్షిణాదిపైనా ప్రభావం.. ఆదివారం కురిసిన వర్షాల ధాటికి ఉత్తర ప్రదేశ్‌లో అధికంగా 18 మంది మృతి చెందగా, సుమారు 100 ఇళ్లు పిడుగుపాటుకు దగ్థమైనట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మంది, తెలంగాణలో ముగ్గురు రైతుల మృతి చెందినట్లు అధికారిక సమాచారం. దేశ రాజధాని ప్రాంతంలో ఐదుగురు, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది మంది మృతి చెందగా వీరిలో నలుగురు చిన్నారులున్నారు. విమానాల మళ్లింపు.. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈదురుగాలులు 70 విమానాలను దారి మళ్లించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. తుపాను తాకిడి పెరగడంతో ద్వారక నుంచి నోయిడా, వైశాలికి వెళ్లే మెట్రో రైలు సుమారు 45 నిమిషాల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే వర్షంతో పాటు ఈదురు గాలులతో పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
ఐఎండీ వార్నింగ్: మళ్లీ ఇసుక తుపానులు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఉత్తర భారతదేశాన్ని మరో ఉపద్రవం ముంచెత్తనుందని వాతావరణ విభాగం శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెనుగాలులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని ప్రకటించింది. అదేవిధంగా రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుపాన్ సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమతీరంలోని మధ్యదరా సముద్రంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల కారణంగా వాయువ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో.. తూర్పు ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు.. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దక్షిణాదిలో కూడా.. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, చండీఘఢ్, పంజాబ్, హర్యానాలతో పాటు.. దక్షిణాదిలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. విదర్బ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అయితే రాజస్థాన్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎమ్‌డీ అధికారి తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో, తుపానులు, భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోద్పూర్, బికనీర్‌లో దుమ్ము తుపానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. -
వణికిస్తున్న ఐఎండీ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు, పిడుగులు, ఇసుక తుపానులతో వణికిపోతుండగా, వాతావరణ విభాగం తాజా హెచ్చరికలను జారీ చేసింది రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములతో కూడిన గాలివానలు, దుమ్ము ముంచెత్తనుందని ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండి) తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు, దుమ్ముతుఫాను సంభవించవచ్చని అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కోస్తా, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఉరుములతో కూడిన తుఫానులు, భారీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారత వాతావరణ విభాగం(ఐఎండి) తాజా హెచ్చరికల ప్రకారం, మే 10 (నేడు) ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, సిక్కింలను తీవ్రమైన వడగాలులు వణికించనున్నాయి. ఉరుములతో కూడిన తుఫాను రావచ్చు. 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తర కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వీటితోపాటు విదర్భ, ఒడిశాలో కూడా అక్కడక్కడ అధిగ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి , కేరళ దక్షిణ ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయి. మే 11, 12 తేదీల్లో ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తీరప్రాంత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్నాటక, కేరళ రాష్ట్రాలలో వేడి గాలులతో పాటు ఉరుములతో కూడిన గాలి తుఫాను సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 13న జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వేడిగాలులు, మే 14, సోమవారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని ఐఎండీ నివేదిక తెలిపింది. ఇటీవల కాలంలో, తుఫానులు, భారీ వర్షాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోధ్‌పూర్, బికనీర్‌లో దుమ్ము తుఫానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. దుమ్ము, తుఫాను ప్రభావాన్ని తగ్గించే అనేక జాగ్రత్తలపై దృష్టిట్టారు. -
భయం గుప్పిట్లో వాయువ్య,ఉత్తర భారతదేశం
-
అలర్ట్.. సాయంత్రం బయటికి రావొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేటి సాయంత్రం(మంగళవారం) అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర భారతదేశాలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఐఎండీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రచండగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను కోరింది. రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుఫాన్ వచ్చే అవకాశాలున్నాయని చెప్పటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హెచ్చరికల నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. బలమైన గాలులు... దక్షిణ భారతదేశంలో కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని ఐఎండీ ఆ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, తెలుగురాష్ట్రాల్లో గంటకు 70 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో 2 నుంచి 7 సెం.మీల మేర వర్షం పడే అవకాశం ఉందని, ఉరుములు-మెరుపులోతో కూడిన వర్షం పడొచ్చని ప్రకటలో వివరించింది. గత వారం గాలిదుమారం వానలతో దేశవ్యాప్తంగా 124 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
20 రాష్ట్రాల్లో హై అలర్ట్
-
చనిపోయిన వాళ్లను తేలేం కదా!
లక్నో : ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ఉత్తర ప్రదేశ్‌లో 50 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం నుంచి హడావుడిగా సొంత రాష్ట్రానికి వచ్చారు. అయితే బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘తుఫాను ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. మీకు సానుభూతిని తెలియజేయడానికి వచ్చాను. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించాల్సిందిగా అధికారులు, మంత్రులను ఆదేశించాను. కానీ, చనిపోయిన వాళ్లను మాత్రం తిరిగి తీసుకురాలేం కదా!’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధిత కుటుంబాలకు యోగి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రజల సంక్షేమం పట్ల తన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని యోగి చెబుతున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపింది. 8 వేల మందిని కాపాడాం.. తుఫాను బారి నుంచి 8 వేల మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా స్తంభించి పోయిందని.. త్వరలోనే లైన్లను పునరుద్ధరిస్తామని వారు చెప్పారు. కాగా ఉత్తర భారతదేశంలో ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సానికి 124 మంది మరణించగా సుమారు 300 మంది గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. తుఫాను కారణంగా ఐదు రాష్ట్రాల్లో నష్టం వాటిల్లిందని కేంద్రం పేర్కొంది. -
యూపీ,రాజస్థాన్‌లలో మళ్లీ ఇసుక తుఫాన్ వచ్చే అవకాశాలు
-
ఎందుకీ దుమ్ము తుపాన్లు ?
దుమ్ము, ధూళితో కూడిన బలమైన ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష బీభత్సానికి ఉత్తర భారతంలో పలు రాష్ట్రాలు గజగజ వణికిపోయాయి. వందమందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ అరుదైన వాతావరణ పరిస్థితులకు చాలా కారణాలున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమాన నెలకొన్న వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన తుపాను ప్రభావం, తూర్పు నుంచి వీస్తున్న తేమతో కూడిన గాలులతో పాటుగా ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతల వల్ల దుమ్ము తుపాన్లు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ అధికారి కులదీప్ శ్రీవాస్తవ తెలిపారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆకస్మికంగా ధూళి మేఘాలు ఆవృతమై, అవి ఢిల్లీ వరకు విస్తరించాయి. ఆ తర్వాత కొన్ని గంటల సేపు నానా బీభత్సం సృష్టించాయి. ఈ స్థాయిలో కొన్ని రాష్ట్రాల మీదుగా దుమ్ము, ధూళితో కూడిన మేఘాలు విస్తరించడం చాలా అరుదుగా జరిగే విషయమని స్కైమెట్ వెదర్ చీఫ్ మహేశ్ పాలవట్ అభిప్రాయపడ్డారు. దుమ్ముతో కూడిన ఈదురుగాలులతోపాటుగా పశ్చిమ హర్యానా, ఉత్తర రాజస్థాన్‌లలో ఏర్పడిన తుపాన్ మేఘాల కారణంగా కురిసిన వర్షాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయని మహేష్ తెలిపారు. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఎడారి ప్రాంతంలో ఉపరితలంపై తేమ శాతం తగ్గి దుమ్ము, ధూళిపైకి ఎగిరి మేఘాలుగా విస్తరించడం వల్ల ఈదురుగాలులు వీయడం, వర్షాలు కురవడం జరిగింది. ఈ రకమైన దుమ్ము తుపాన్లు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తరచుగా సంభవిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో అత్యంత అరుదుగా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎండలు మండిపోతూ ఉండడంతో కొన్ని రాష్ట్రాల్లో క్యుమలోనింబస్ మేఘాలు ఏర్పడి వర్ష బీభత్సాన్ని సృష్టించాయి. రుతుపవనాలు రావడానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సర్వసాధారణంగా ప్రతీ ఏడాది కురుస్తూనే ఉంటాయి. అయితే దుమ్ముతో కూడిన తుపాన్లు మాత్రం ఏడాది ఏడాదికి వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులకు ఒక సంకేతంలా ఉన్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.