
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం భీకరమైన దుమ్ముతుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 11 మంది గాయపడ్డారు. చెట్లు ఇళ్లు కుప్పకూలిపోవడంతోనే ఎక్కువమంది చనిపోయారని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. దుమ్ము తుపానుతో మొరాదాబాద్‌లో అత్యధికంగా ఏడుగురు, సంభాల్‌లో ముగ్గురు, ముజఫర్‌నగర్, మీరట్‌లో ఇద్దరు, అమ్రోహాలో ఒకరు దుర్మరణం చెందారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షం కారణంగా శుక్రవారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీలో గత నెలలో సంభవించిన మూడు దుమ్ము తుపాన్లతో 130 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment