ఇసుక తుపానుకు 17 మంది బలి | Rajasthan dust storm claims 17 lives, over 60 injured | Sakshi
Sakshi News home page

ఇసుక తుపానుకు 17 మంది బలి

Published Wed, May 20 2015 6:30 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

ఇసుక తుపానుకు 17 మంది బలి

ఇసుక తుపానుకు 17 మంది బలి

ఇసుక తుపాను కారణంగా రాజస్థాన్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు.

జైపూర్: ఇసుక తుపాను కారణంగా రాజస్థాన్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు. బికనీర్ లో మంగళవారం సంభవించిన ఇసుక తుపాను నాగౌర్, జోధ్ పూర్, జైపూర్, అల్వార్, భరత్ పూర్, సావైమదోపూర్ ప్రాంతాలకు వ్యాపించింది. ఇసుక తుపాను ధాటికి చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రకటించారు. ఇసుక తుపాను ధాటికి భరత్ పూర్ ప్రాంతం బాగా దెబ్బతింది.ఈ ఒక్క ప్రాంతంలోనే ఐదుగురు మృతి చెందగా, 50 మందిపైగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement