Bikaner
-
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్‌లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగాలు చేయ్యొచ్చు. లేదా ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచెయ్యొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే తండ్రికి పై అధికారిగా కొడుకులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్‌పై కొడుకు సంతకం చేసే అవకాశం ఎవ్వరికో గానీ దక్కదు. ఇది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం దక్కుతుందో అనిపిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది.బాంద్రాలోని నోఖా, బికనేర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్‌కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్‌సుందర్ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్‌కి 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు. ఆ రిటైర్మ్ంట్ ఆర్డర్‌పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్ 12న విధుల్లో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్ సుందర్ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్‌పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్ సుందర్ 2011 అక్టోబరు 13న తనకు టీచర్‌న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్ కెరీర్ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు. కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.(చదవండి: ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!) -
‘మూల్‌చంద్’ పాన్ షాప్.. పాన్ ప్రియులకు ఫుల్ క్రేజ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ పట్టణం సట్టాబజార్‌లో ఉన్న ముల్సా-పుల్సా పాన్ షాపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈపాన్షాపు ఓనర్ పూల్‌చంద్ కట్టే రుచికరమైన పాన్ల కోసమే కాకుండా ఆయన ధరించే బంగారు ఆభరణాలు చూడడానికి కూడా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారు.పూల్‌చంద్ కట్టే వివిధ రకాల పాన్లు రుచిచూసేందుకు బికనీర్ వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి పాన్‌ప్రియులు విచ్చేస్తారు. పూల్‌చంద్ స్వయంగా పాన్లు కట్టడమే కాకుండా కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తుండటం షాపుకు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పాన్లు కట్టడంలో పూల్‌చంద్‌కు ఆయన కుమారుడు కూడా సాయం చేస్తున్నాడు. షాపు ఉదయాన్నే 5 గంటలకు మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ముల్సాపుల్సా పాన్‌షాపులో పాన్లు రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.200 వరకు దొరుకుతాయి. VIDEO | Bikaner is home to a unique 'Paan' seller. His shop in the Satta Bazar area of the city has been attracting customers not just for the Paan but also for the gold ornaments he adorns with grace. Phoolchand owns the Mulsa-Phulsa paan shop, which sells various flavours of… pic.twitter.com/Ou3U6zsvDZ— Press Trust of India (@PTI_News) June 2, 2024 -
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కి మరోసారి జాక్‌పాట్!
రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానానికి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత బికనీర్ చేరుకున్న మేఘ్వాల్కు పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. మేఘ్వాల్ 2009లో తొలిసారిగా బికనీర్ నియోజకవర్గం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు . 2019 లోక్‌సభ ఎన్నికల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన బంధువు, కాంగ్రెస్ నాయకుడు మదన్ గోపాల్ మేఘ్వాల్ను ఓడించి బికనీర్ స్థానాన్ని గెలుచుకున్నారు . తనపై నమ్మకం ఉంచి నాలుగోసారి సీట్ ఇచ్చినందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు, ఒక పారాలింపియన్ ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మహేంద్రజిత్ మాల్వియా, జ్యోతి మిర్ధాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు కూడా పార్టీ ఝలావర్ బరన్ నుంచి మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. -
3 గిగావాట్ల సామర్థ్యానికి ఎన్టీపీసీ
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగంలో 3 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నట్టు ఎన్టీపీసీ వెల్లడించింది. రాజస్తాన్‌లోని బికనీర్ వద్ద నోఖ్రా సోలార్ పీవీ ప్రాజెక్టులో 100 మెగావాట్లు తోడవడంతో డిసెంబర్ 20న ఈ ఘనతను సాధించామని ప్రకటించింది. 2022 జూన్ 24న ఎన్టీపీసీ గ్రూప్ 2 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. 12 రాష్ట్రాల్లో సంస్థ ఖాతాలో 36 ప్రాజెక్టులకుగాను 3,094 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కొత్తగా 4.8 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియలో మరో 7.3 గిగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది ఎన్టీపీసీ లక్ష్యం. -
తొలిరేయి నుంచే ఆమెకు నరకం
క్రైమ్: పెద్దల తొందరపాటు నిర్ణయంతో ఓ నవ వధువు(22) నరకం చవిచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. వరుసగా ఒక్కో షాక్ తగులుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలిసివాడని, మంచోడని భావించిన భర్త.. మొదటి రాత్రి నుంచే ఆమెపై శాడిజం ప్రదర్శిస్తూ వచ్చాడు. పైగా పరాయి పురుషులకు పడక సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో మాట వినని ఆమెకు దారుణాతి దారుణంగా హింసించాడు. రాజస్థాన్ బికనీర్ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన నవ వధువు వేధింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి.. తన భార్యను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. శారీకంగా, మానసికంగా దెబ్బ తిన్న ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నెలల సమయమే పట్టింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ భర్త కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ భోపాల్ ఖోహేఫిజా ప్రాంతంలో ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్లు కావడంతో పెద్దలు, వాళ్ల పిల్లలకు ఈ ఏడాది జూన్‌లో వివాహం చేశారు. అయితే నవ వధువును తీసుకుని రాజస్థాన్ బికనీర్‌లో ఉన్న తమ ఇంటికి కాపురం వెళ్తానని అందరినీ నమ్మించాడు ఆ భర్త. తీరా అక్కడికి వెళ్లాక తాను పని చేసే ఫైవ్ స్టార్ హోటల్గదిలో ఆమెను బంధించాడు. తొలి రాత్రి నుంచే తన శాడిజంతో ఆమెకు చుక్కలు చూపించాడు. తమకు అసలు సొంతిల్లే లేదని.. ఇక్కడే ఉండాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆపై ఆమె ఫోన్ లాక్కుని.. ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడు. చివరకు.. వైఫ్ స్వాపింగ్ గేమ్(ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొనే క్రీడ)లో పాల్గొనాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె మాట వినకపోవడంతో దారుణంగా హింసించాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యుల్ని రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు పదిహేను రోజుల పాటు హోటల్ గదిలోనే బంధించి.. ఆమె ముందు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి డ్రగ్స్ సేవించి.. ఆమె ఎదురుగానే అమ్మాయిలతో పాటు మగవాళ్లతోనూ శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొని నరకం చూపించాడు. ఈ తరుణంలో ఆమె ఆత్మహత్యయత్నం చేయగా.. హోటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఎలాగోలా పుట్టింటికి ఫోన్ చేసి సమాచారం అందించిన ఆమె.. మేనమామ సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది. ఈలోపు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఇన్నాళ్లపాటు చికిత్స అందించారు. చివరకు స్వస్థలం చేరుకుని భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో.. బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమైంది. ఇదీ చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. షాకింగ్ ట్విస్ట్ -
Sakshi Cartoon: భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం
భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం -
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఆరు బోగీలు
-
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Bikaner Guwahati ExpressTrain Accident:పశ్చిమబెంగాల్లో బికనీర్–గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు. జల్పాయ్గురి జిల్లాలోని దోమోహని సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారీగా మంచు కురుస్తున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
కరెంట్ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా స్టోరీ తిప్పేసి కట్టుకథ
జైపూర్: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. రోజూ ఏదో ఒక విషయంపై వివాదం. దీంతో ఆ భార్యాభర్తలు ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పడుతుండేవాడు. భర్త తీరుపై విసుగు చెందిన ఆమె ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే భోజనంలో మత్తు మందు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె శాడిజాన్ని చూపించింది. మత్తులో ఉన్న భర్త కాళ్లు కట్టేసి వరుసగా కరెంట్ షాక్ పెడుతూ వేధించింది. మత్తులో ఉన్న భర్త మెలకువ రాగానే మళ్లీ షాకిచ్చి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసింది. ఇదంతా అయిపోయాక భర్త కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కరెంట్ షాక్‌తో పడిపోయాడని చెప్పి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. సర్దార్‌షహర్ ఎస్ఐ మణక్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్‌కు చెందిన మహేంద్ర ధన్ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగొచ్చి తనను వేధిస్తున్నాడనే నెపంతో ఈనెల 17వ తేదీన మంగళవారం ఓ ప్లాన్ వేసింది. విధులు ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు ఆమె భోజనం వడ్డించింది. తిన్న తర్వాత భర్త అపస్మారక స్థితికి వెళ్లాడు. భోజనంలో మత్తుమందు కలపడంతో అపస్మారక స్థితిలోకి చేరిన భర్తను ఒకచోటకు జరిపింది. కొద్దిసేపటికి తేరుకున్న భర్త లేచేందుకు ప్రయత్నించగా భార్య చేతులకు గ్లౌస్లు కట్టుకుని నిల్చుని ఉండగా అతడి కాళ్లకు విద్యుత్ తీగలు కట్టేసింది. అనంతరం భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. వేధింపులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుసార్లు కరెంట్ షాక్ ఇవ్వడంతో భర్త మరోసారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈసారి భర్త తేరుకుని చూడగా ఆస్పత్రి బెడ్‌పై ఉంది. అయితే భర్త కుటుంబసభ్యులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడని చెప్పి వారితో కలిసి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్చింది. మేలుకున్న తర్వాత భర్త జరిగిన ఘోరాన్ని తన కుటుంబసభ్యులకు వివరించాడు. అర్ధరాత్రి 2గంటలకు లేచి కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురి చేసిందని వాపోయాడు. భార్య చేసిన పనికి కాళ్లు కోల్పోయాడు. ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్దార్ షహర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: బ్రేకింగ్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం -
విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు
జైపూర్: రాజస్తాన్ బికనీర్‌కు చెందిన ఏడు నెలల చిన్నపాప నూర్ ఫాతిమా స్పైనల్ మస్కులర్ అట్రోపీ(ఎస్ఎమ్ఏ) వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంగళవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారం.సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది.ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అయితే పాప తండ్రి జిసాన్ అహ్మద్ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అయాన్ష్ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్ ఫండింగ్ పేరిట ఏడాది పాటు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిసాన్ అహ్మద్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్‌కు విరాళాలు సేకరించేందుకు తన మిత్రులు, సోషల్ మీడియా గ్రూఫ్లను సంప్రదించాడు. అలా ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ పేరిట రూ. 40 లక్షలు పోగయ్యాయి. కానీ దురదృష్టంకొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై.. పాప తండ్రి జిసాన్ అహ్మద్ స్పందించాడు. '' ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉంది. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చాం. కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించాం. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. పాప ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ పేరిట విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇంజెక్షన్‌కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40లక్షలు సేకరించాం. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం.'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. చదవండి: 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
వైరల్ పిక్: ట్రీ హట్
బికనేర్: పర్యావరణాన్ని కాపాడటం, ప్రకృతితో మమేకం అవడం అంటే కొందరికి ఎంతో ఇష్టం. దాని కోసం ఏం చేసేందుకైనా వారు వెనుకాడరు. వారి ప్రయత్నాలు ఇతరులను అబ్బుర పరుస్తాయి, ఆకట్టుకుంటాయి, స్ఫూర్తిని నింపుతాయి. రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి యువకుడు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్టుపైనే తన కోసం ప్రత్యేకంగా గదిని కట్టుకున్నాడు. రాజస్థాన్‌లో మండే ఎండల నుంచి ఈ చెట్టు గది ఎంతో ఉపశమనం అందిస్తోంది అంటున్నాడు. ఈ ట్రీ హట్‌కి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. -
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
కలకలం: బెలూన్లపై పాకిస్తాన్ నినాదం
జైపూర్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఓ ఇంటిపై ‘ఐ లవ్ పాకిస్తాన్’ అని రాసివున్న బెలూన్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వీటిని గమనించిన స్థానికులు రాయ్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన శ్రీ గంగానగర్ జిల్లాలోని 19బీబీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉర్దూ, ఇంగ్లీషుల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాసి ఉన్న రెండు బెలూన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ మాజిద్ ఖాన్ వెల్లడించారు. 19బీబీ గ్రామం పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండడం గమనార్హం. బెలూన్లపై ఉర్దూలో పాకిస్తాన్‌లోని బహవల్పూర్ చిరునామాతో పాటు..‘ఆజాదీ ముబారక్’అని కూడా రాసి ఉంది. నిఘా వర్గాల దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. -
రాజస్థాన్‌లో భారీ ఇసుక తుఫాన్
-
రాజస్థాన్‌లో మళ్లీ ఇసుక తుఫాన్ బీభత్సం
జైపూర్: రాజస్థాన్‌ను భారీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతోంది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. బికనీర్ జిల్లాలో ఇసుక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బీకనీర్ జిల్లా ఖజువాలా ప్రాంతంలో భారీ ఇసుకు తుఫాన్ చెలరేగుతుండటంతో అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది. ప్రకృతి బీభత్సంగా ఉండటం.. ఆకాశం అంత ఎత్తు నుంచి ఇసుక విరుచుకుపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇసుక తుఫాన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయపెట్టేలా ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్, భరత్ పూర్ ప్రాంతాల్లో పెనువేగంతో వీచిన గాలులు, ఇసుక తుఫాన్.. పెనువిధ్వంసం మిగిల్చింది. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. మళ్లీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతుండటంతో రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరిక 13 ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. -
దారుణంగా కొట్టి యువకుడి హత్య
జైపూర్ : అన్యమత యువతిని ప్రేమించడమే అతడి పాలిట శాపమైంది. ఆ ప్రేమే అతడి ప్రాణాలు బలిగొంది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్ పట్టణానికి చెందిన సైఫ్ అలీఖాన్(22) అనే యువకుడు ఓ హిందూ యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియడంతో ఆమెకు వివాహం నిశ్చయించారు. అయినప్పటికీ అలీఖాన్‌తో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో యువతి తండ్రి, సోదరులు అతడిపై కక్ష పెంచుకున్నారు. అన్యమతానికి చెందిన యువకుడు తమ అమ్మాయిని ప్రేమించడంతో ఆమె తండ్రి మరో ఆరుగురితో కలిసి అలీఖాన్‌ను దారుణంగా కొట్టి మురికి కాలువలో పడేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో వారు అలీఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతి తండ్రి శివకుమార్ మాలితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అయితే హత్యపై పలు అనుమానాలు నెలకొనడంతో మతపరమైన అల్లర్ల కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు ఎస్సై భజన్‌లాల్ తెలిపారు. -
హోంగార్డుల వీడియో కలకలం
-
హోంగార్డుల వీడియో కలకలం
బికనీర్: లంచమిస్తేనే డ్యూటీ కేటాయిస్తామని ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారని కొందరు హోంగార్డులు విడుదల చేసిన వీడియో సంచలనమైంది. రాజస్తాన్‌లోని బికనీర్, శ్రీగంగానగర్, హనుమాన్‌ఘర్, చురు ప్రాంతాలకు చెందిన జవాన్లు వీడియోలో ఉన్నారు. పొకర్ రామ్ అనే జవాన్ వీడియోలో మాట్లాడుతూ ఉన్నతాధికారులు, వారి ఏజెంట్లు మాలాంటి వాళ్లకు డ్యూటీ కేటాయించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మార్చి 31 లోగా ప్రధాని మోదీ ఈ సమస్యను పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మరో హోంగార్డు సుభాష్ బిష్ణోయ్ మాట్లాడుతూ, తమకు డ్యూటీలు కేటాయించడానికి అధికారుల ఏజెంట్లు రూ.5–6 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తాను విధుల్లో చేరినప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉందన్నారు. కమాండర్ వీర్ సింగ్‌ను రాజస్తాన్ ఏసీబీ ఇటీవల రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నట్లు చాలామంది జవాన్లు తమకు ఫిర్యాదు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ రాజేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. -
ట్విస్టు: ఆనందంతో రైతు గుండె ఆగింది!
బికనీర్ (రాజస్థాన్): రెవెన్యూ రికార్డుల్లో తన పేరు తప్పుగా నమోదుకావడంతో దానిని సరిచేసుకోవడానికి ఆ బక్క రైతు దాదాపు 50 ఏళ్లు పోరాడాడు. ఎట్టకేలకు అధికారులు అతని పేరును సరిగ్గా నమోదుచేసి.. పట్టాలు జారీచేశారని కొడుకులు ఆయనకు చెప్పగానే.. ఒకింత ఆనందం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతలోనే ఆయన గుండె ఆగింది. ఆనందంలోనూ విషాదం వెంటాడిన ఈ ఘటన 75 ఏళ్ల మంగిదాస్కు ఎదురైంది. జైమాల్సర్ గ్రామానికి చెందిన మంగిదాస్ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆయన తండ్రి నర్సింగ్‌దాస్ చనిపోయాడు. దీంతో తండ్రి పేరిట ఉన్న నోఖా దైయాలోని 10 బైఘాస్ (రెండున్నర ఎకరాల) భూమి, జైమాల్సర్లోని 40బైఘాస్ (20 ఎకరాల) భూమి అతని పేరిట మార్చారు. ఇలా మారుస్తున్న క్రమంలో రికార్డుల్లో అతని పేరు మంగిదాస్కు బదులు మాంగ్నిదాస్ అని నమోదుచేశారు. ఈ చిన్న తప్పును సరిచేసుకోవడానికి మంగిదాస్కు 50 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. రెడ్ టేపిజంతో కునారిల్లుతున్న అధికార వ్యవస్థ వల్ల అతను ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా రాజస్థాన్ సర్కార్ చేపట్టిన న్యాయ్ ఆప్కే ద్వార్ (న్యాయం మీ చెంతనే) కార్యక్రమంలో రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పుల్ని అధికారులు తప్పుచేశారు. ఇందుకు మంగిదాస్ వేలుముద్ర కూడా తీసుకున్నారు. ఇలా సరిచేసిన పత్రాలతో కొడుకులు ఆనందంగా ఇంటికి చేరి మంగిదాస్కు చూపించారు. దీంతో ఆనందోద్రేకానికి గురయిన మంగిదాస్ కొంతసేపటి తర్వాత ప్రాణం విడిచాడని కొడుకులు చెప్పారు. -
ఫిర్యాదు చేసిన మరునాడే రేప్ చేసి..
బికనీర్: రోజులు గడుస్తున్న కొద్ది విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల తీరు ఏవగింపు తెచ్చేలా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి తనంతవారిగా తీర్చిదిద్దాల్సినవారు కామాంధుల్లా తయారవుతున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కామంతో పది హేడేళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి చేసి అనంతరం చంపేశాడు. హాస్టల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహాన్ని పడేశాడు. కానీ, అతడు మాత్రం అలా చేయలేదని చెప్తున్నాడు. కాలేజీ యాజమాన్యం కూడా ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల కిందటే ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు తనపై కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారు స్పందించేలోగానే అతడు శుక్రవారం మరోసారి ఆ బాలిక లైంగిక దాడిజరిపి అనంతరం హత్య చేసి హాస్టల్ దగ్గర నీటి ట్యాంకులో పడేశాడు. పూర్తి వివరాల కోసం బాలిక మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. -
వయసు 82 .. రెండు స్పూన్ల నీరే ఆహారం
బికనీర్: సాధారణంగా యుక్త వయసులో ఉన్నా.. తగిన సమయానికి ఏదో ఒకటి తినకపోతే ఏమాత్రం భరించలేము. ఎందుకంటే ఏ బాధనైనా భరిస్తాం కానీ క్షుద్భాదను భరించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ, ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధురాలు దాదాపు రెండు నెలలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండానే జీవిస్తుందంటే ఆశ్యర్య పోక తప్పదేమో.. అవును జైపూర్‌కు సరిగ్గా 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న బికనీర్‌కు చెందిన బదానీ దేవీ(82) గత రెండు నెలలుగా కఠిక ఉపవాసం ఉంటుంది. రోజుకు కేవలం ఓ రెండు మూడు చెంచాల నీళ్లతో సరిపెట్టుకొని ఆరోగ్య పరమైన సమస్యలు లేకుండా జీవిస్తోంది. చాలాకాలంగా భోజనం మానేసిన కారణంగా ప్రస్తుతం ఆమె సరిగా మాట్లాడలేక మంచానికే పరిమితమైంది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు సరేసరి. పోని ఆస్తిపాస్తులు లేవా అంటే గొప్పగా ఉన్నాయి. కానీ బామ్మకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితి ఎందుకని అనుకుంటున్నారా. మరేంలేదు. ఈ కుటుంబం జైన మతానికి చెందిన కుటుంబం. ప్రస్తుతానికి ఆమెనే వాళ్లింట్లో పెద్దావిడ. జైనుల పురాతన సాంప్రదాయం ప్రకారం సంతారా(కాలం చెల్లేవరకు ఉపవాసం) ఆచారాన్ని ఆమె ప్రస్తుతం పాటిస్తోంది. గత జూలై నెలల నుంచి పూర్తి ఉపవాస దీక్షలోకి వెళ్లిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా పరమపదించడంతో మోక్షం పొందవచ్చని జైన మతస్తులు నమ్మకం. దీంతో ఆమె రెండు స్పూన్ల నీటిని మాత్రమే తీసుకుంటుంది. ఓ చేతి వేలును ఉపయోగించడం ద్వారా తనకు నీటి అవసరం ఉందా లేదా అనే విషయం బామ్మ తెలుపుతుంటుంది. ఇక ఆ ఇంట్లో వారంతా ఆమె చుట్టూ కూర్చుని భజన చేస్తుంటారు. అంతకుముందు ఇలాంటి దీక్షలకు కిందికోర్టు అనుమతించపోయినా సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. -
ఇసుక తుపానుకు 17 మంది బలి
జైపూర్: ఇసుక తుపాను కారణంగా రాజస్థాన్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు. బికనీర్ లో మంగళవారం సంభవించిన ఇసుక తుపాను నాగౌర్, జోధ్ పూర్, జైపూర్, అల్వార్, భరత్ పూర్, సావైమదోపూర్ ప్రాంతాలకు వ్యాపించింది. ఇసుక తుపాను ధాటికి చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రకటించారు. ఇసుక తుపాను ధాటికి భరత్ పూర్ ప్రాంతం బాగా దెబ్బతింది.ఈ ఒక్క ప్రాంతంలోనే ఐదుగురు మృతి చెందగా, 50 మందిపైగా గాయపడ్డారు. -
పాక్ జానపద గాయనీ రేష్మా మృతి
పాకిస్థానీ ప్రముఖ జానపద గాయనీ రేష్మా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం లాహోర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొద్ది కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతు నెలరోజులు క్రితం కోమాలో వెళ్లారని జియో టీవీ ఆదివారం వెళ్లడించింది. భారతదేశంలోని బికనీర్‌లోని బంజారా కుటుంబంలో రేష్మా జన్మించారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యానంతరం రేష్మా కుటుంబం పాక్ వలస వెళ్లి, కరాచీ నగరంలో స్థిరపడింది. జానపద గాయనీగా రేష్మా పాకిస్థానీయుల మనసులను చోరగున్నారు.