
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : అన్యమత యువతిని ప్రేమించడమే అతడి పాలిట శాపమైంది. ఆ ప్రేమే అతడి ప్రాణాలు బలిగొంది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్ పట్టణానికి చెందిన సైఫ్ అలీఖాన్(22) అనే యువకుడు ఓ హిందూ యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియడంతో ఆమెకు వివాహం నిశ్చయించారు. అయినప్పటికీ అలీఖాన్‌తో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో యువతి తండ్రి, సోదరులు అతడిపై కక్ష పెంచుకున్నారు. అన్యమతానికి చెందిన యువకుడు తమ అమ్మాయిని ప్రేమించడంతో ఆమె తండ్రి మరో ఆరుగురితో కలిసి అలీఖాన్‌ను దారుణంగా కొట్టి మురికి కాలువలో పడేశారు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో వారు అలీఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతి తండ్రి శివకుమార్ మాలితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అయితే హత్యపై పలు అనుమానాలు నెలకొనడంతో మతపరమైన అల్లర్ల కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు ఎస్సై భజన్‌లాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment