
యస్తిక ఆచార్య (PC: X)
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్‌లిఫ్టర్‌గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.
270 కేజీల బరువును ఎత్తే క్రమంలో
తన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది.
వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
యస్తిక దుర్మరణంపై
ఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది.
చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్