Top Pakistan Snooker Player Majid Ali Commits Suicide - Sakshi
Sakshi News home page

#MajidAli: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్‌ స్నూకర్‌

Published Fri, Jun 30 2023 3:49 PM | Last Updated on Fri, Jun 30 2023 6:09 PM

Top Pakistan Snooker Player Majid Ali Commits Suicide - Sakshi

పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ‌ స్నూకర్‌ స్టార్‌ , అండర్‌-21 మెడలిస్ట్‌ మాజిద్‌ అలీ ఆత్యహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి పంజాబ్‌(పాకిస్తాన్‌)లోని ఫైసలాబాద్‌లో తన ఇంట్లోనే రంపం మెషిన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కొంతకాలంగా మాజిద్‌ అలీ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్థారించారు. అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని.. నిరాశ నిసృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా పాకిస్తాన్‌ తరపున చిన్న వయసులోనే స్నూకర్‌ గేమ్‌(బిలియర్డ్స్‌)లో సంచలనాలు సృష్టించిన మాజిద్‌ అలీ జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. పాకిస్తాన్‌లో అంతర్జాతీయ స్నూకర్‌ పోటీలకు బాగా క్రేజ్‌ ఉంది. మాజీలు మహ్మద్‌ యూసఫ్‌, ముహ్మద్‌ ఆసిఫ్‌లు వరల్డ్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నారు.

వారి తర్వాత స్నూకర్‌లో మంచి పేరు తెచ్చుకున్న 28 ఏళ్ల మాజిద్‌ అలీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ నెల ఆరంభంలో మరో అంతర్జాతీయ స్నూకర్‌ ముహమ్మద్‌ బిలాల్‌ గుండెపోటుతో మరణించాడు. తాజాగా నెల వ్యవధిలోనే పాకిస్తాన్‌ స్నూకర్‌ స్టార్‌ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

మాజిద్‌ అలీ సోదరుడు ఉమర్‌ మాజిద్ మాట్లాడుతూ.. ''టీనేజీ వయసు నుంచే వాడు(మాజిద్‌ అలీ) మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అయితే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదు. వాడి మరణం మాకు తీరని లోటు'' అని పేర్కొన్నాడు.

పాకిస్తాన్‌ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ చైర్మన్‌ అలమ్‌గిర్‌ షేక్‌ స్పందిస్తూ.. ''మాజిద్‌ మరణం ఎంతో బాధాకరం. ఎంతో టాలెంట్‌ కలిగిన అతను బిలియర్డ్స్‌ గేమ్‌లో పాకిస్తాన్‌ను ఉన్నత స్థానంలో నిలిపాడు. అతనికిదే మా అశ్రు నివాలి'' అంటూ తెలిపాడు.

చదవండి: అభిమానుల డిమాండ్‌; అశ్లీల వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయిన ఫుట్‌బాలర్‌

FIFA Rankings: టైటిల్‌ సాధించి.. టాప్‌- 100లో..  .. 1996లో అత్యుత్తమంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement