snooker
-
36వసారి జాతీయ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
ఇండోర్: భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్‌ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. ‘అంతర్జాతీయ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఇచ్చే ఈవెంట్ ఇదొక్కటే కావడంతో... తీవ్ర పోటీ ఎదురైంది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన అనంతరం తిరిగి పుంజుకొని స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
స్నూకర్ దిగ్గజం కన్నుమూత.. బస్ట్ కండక్టర్‌గా, పోస్ట్‌మాన్‌గా పనిచేసి.. ఆఖరికి
వేల్స్: బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ చాంపియన్, దిగ్గజం టెర్రీ గ్రిఫిత్(Terry Griffiths) కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య కారణాలతో 77 ఏళ్ల గ్రిఫిత్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కుమారుడు వేన్ తన తండ్రి మరణ వార్తను ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఓ క్వాలిఫయర్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టి విజేతగా ఆవిర్భవించిన ఘనత గ్రిఫిత్ సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. 1970 దశకం చివర్లో, 80 దశకంలో మేటి స్నూకర్ చాంపియన్‌గా ఎదిగాడు. 1979లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ‘ట్రిపుల్ క్రౌన్’ గెలిచిన 11 మందిలో గ్రిఫిత్ ఒకడిగా నిలిచాడు. స్నూకర్ క్రీడలో మాస్టర్స్, యూకే చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈ మూడు గెలిస్తే ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా అభివర్ణిస్తారు. గ్రిఫిత్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన మరుసటి ఏడాది 1980లో మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.బస్ కండక్టగా.. పోస్ట్మాన్గారెండేళ్ల తర్వాత 1982లో యూకే చాంపియన్‌షిప్ నెగ్గాడు. సాధారణంగా బిలియర్డ్స్, స్నూకర్ ఆడేవాళ్లంతా సంపన్నులే ఉంటారు. కానీ గ్రిఫిత్ మాత్రం సాధారణ వ్యక్తి. 15 ఏళ్ల వయసులో గనుల్లో పనిచేశాడు. తదనంతరం బస్ కండక్టర్, ఇన్సురెన్స్ ఏజెంట్, పోస్ట్మన్గానూ బతుకుబండి లాగించాడు. 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతో గ్రిఫిత్ రాత మారిపోయింది. -
రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్
పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ స్నూకర్ స్టార్ , అండర్-21 మెడలిస్ట్ మాజిద్ అలీ ఆత్యహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి పంజాబ్(పాకిస్తాన్)లోని ఫైసలాబాద్‌లో తన ఇంట్లోనే రంపం మెషిన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కొంతకాలంగా మాజిద్ అలీ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్థారించారు. అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని.. నిరాశ నిసృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తరపున చిన్న వయసులోనే స్నూకర్ గేమ్(బిలియర్డ్స్)లో సంచలనాలు సృష్టించిన మాజిద్ అలీ జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. పాకిస్తాన్లో అంతర్జాతీయ స్నూకర్ పోటీలకు బాగా క్రేజ్ ఉంది. మాజీలు మహ్మద్ యూసఫ్, ముహ్మద్ ఆసిఫ్‌లు వరల్డ్, ఆసియా చాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నారు. వారి తర్వాత స్నూకర్‌లో మంచి పేరు తెచ్చుకున్న 28 ఏళ్ల మాజిద్ అలీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ నెల ఆరంభంలో మరో అంతర్జాతీయ స్నూకర్ ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. తాజాగా నెల వ్యవధిలోనే పాకిస్తాన్ స్నూకర్ స్టార్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. మాజిద్ అలీ సోదరుడు ఉమర్ మాజిద్ మాట్లాడుతూ.. ''టీనేజీ వయసు నుంచే వాడు(మాజిద్ అలీ) మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అయితే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదు. వాడి మరణం మాకు తీరని లోటు'' అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చైర్మన్ అలమ్‌గిర్ షేక్ స్పందిస్తూ.. ''మాజిద్ మరణం ఎంతో బాధాకరం. ఎంతో టాలెంట్ కలిగిన అతను బిలియర్డ్స్ గేమ్‌లో పాకిస్తాన్‌ను ఉన్నత స్థానంలో నిలిపాడు. అతనికిదే మా అశ్రు నివాలి'' అంటూ తెలిపాడు. చదవండి: అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. .. 1996లో అత్యుత్తమంగా.. -
World Snooker Championship 2022: నాకౌట్ దశకు పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్‌లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
స్నూకర్ కోచ్
సంజయ్ దత్ స్నూకర్ నేర్పించడానికి రెడీ అవుతున్నారు. నేర్చుకునేది ఎవరంటే దలీప్ తాహిల్. ఈ ఆటను తెరకెక్కించేది మృదు. ‘తులసీదాస్ జూనియర్’ పేరుతో ఈ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. తండ్రి స్నూకర్ కోచ్. కొడుకు స్నూకర్ ఆటగాడు. పలు అవార్డులు, రివార్డులు పొందిన స్పోర్ట్స్ మూవీ ‘లగాన్’కి దర్శకత్వం వహించిన ఆశుతోష్ గోవారీకర్ ఈ చిత్రానికి ఒక నిర్మాత. టీ సిరీస్‌తో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సంజయ్ దత్‌ది అతిథి పాత్ర. దలీప్ తాహిల్, వరుణ్ బుద్ధదేవ్, రాజీవ్ కపూర్ తదితరులు నటించనున్నారు. -
చాంపియన్ హిమాన్షు జైన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్నూకర్ అండ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్ సత్తా చాటాడు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్ స్నూకర్ విభాగంలో హిమాన్షు చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో లక్కీ వత్నానీ రన్నరప్ టైటిల్‌ను అందుకోగా... నబిల్ లక్డావాలా, మొహమ్మద్ గౌస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్స్ విభాగంలో ముస్తాక్ విజేతగా నిలిచాడు. విభాస్ రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ స్పోర్ట్స్ చైర్మన్ చాముండేశ్వరీనాథ్, కార్యదర్శి కేఎస్ రామారావు, వైస్ చైర్మన్ బంగార్రాజు, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం సంయుక్త కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు. -
అద్వానీ అదరహో
యాంగన్ (మయన్మార్): అంతర్జాతీయ వేదికపై భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ పాయింట్ల ఫార్మాట్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్ 6–2 (150–21, 0–151, 151–0, 4–151, 151–11, 150–81, 151–109, 151–0) ఫ్రేమ్‌ల తేడాతో నే థ్వె ఓ (మయన్మార్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో తన ప్రత్యర్థులకు ఒక్క ఫ్రేమ్ కోల్పోకుండా గ్రూప్ టాపర్‌గా నిలిచిన పంకజ్ అదే జోరును నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నాడు. పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి వరుసగా మూడో ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 2016లో బెంగళూరులో, 2017లో దోహాలో జరిగిన మెగా ఈవెంట్స్‌లోనూ అతను టైటిల్స్ గెలిచాడు. -
‘వాటర్’తో రెక్కీ... ‘బిస్కెట్’తో దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: ఆ ఇద్దరూ స్నూకర్ పార్లర్లో పరిచయమైన స్నేహితులు... విలాసాలకు అలవాటుపడటంతో డబ్బు కోసం నేరాలు చేయాలని భావించారు... ఇంటర్నెట్ ద్వారా నేరం ఎలా చేయాలన్నది తెలుసుకున్నారు... పంజగుట్ట పరిధిలో దోపిడీకి పాల్పడిన వీరు సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక బృందానికి దొరికారు... నిందితుల్లో ఒకరు బీటెక్ గ్రాడ్యుయేట్ కావడం గమనార్హం. అదనపు డీసీపీ జె.రంజన్ రతన్‌కు మార్ సోమవారం వివరాలు వెల్లడించారు. స్నూకర్ పార్లర్లో పరిచయం నాంపల్లిలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షంషుద్దీన్ మొయినాబాద్‌లోని కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అతను తన తండ్రి రఫీఖుద్దీన్ ప్రింటింగ్ వ్యాపారంలో కంప్యూటర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచి జల్సాలకు అలవాటుడిన అతను మత్తు పదార్థాల వినియోగంతో పాటు తరచూ స్నూకర్ పార్లర్స్‌కు వెళ్ళడం, స్నేహితురాళ్ళతో కలిసి షికార్లు చేసేవాడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనిలో వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలో అతడికి ఓ స్నూకర్ పార్లర్లో మురాద్‌నగర్‌కు చెందిన ముస్తాఫా ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్న వీరు పోలీసులు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావించారు. ఇందుకుగాను యూట్యూబ్‌లో ఉన్న ‘క్రైమ్ పెట్రోల్’ అనే కార్యక్రమానికి సంబంధించిన అనేక ఎపిసోడ్స్ చూసేవారు. ఇందులో చూపిన విధంగా ముందుజాగ్రత్త చర్యగా షంషుద్దీన్ తన ఎర్ర రంగు యమహాకు నల్లరంగు స్టిక్కరింగ్ చేయించాడు. నేరం చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలో చిక్కినా బైక్ రంగు మార్పిడితో పోలీసులను తప్పుదోవపట్టించేందుకు పథకం పన్నాడు. ఈ నెల 12 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీలోని కిరాణ దుకాణానికి వెళ్లిన వారు నిర్వాహకురాలు అనిత వద్ద వాటర్ బాటిల్ ఖరీదు చేస్తున్నట్లు నటిస్తూ రెక్కీ చేశారు. కొద్దిసేపటికి మళ్ళీ అక్కడికే వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొంటున్న నెపంతో ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అనేక సీసీ కెమెరాల అధ్యయనం... బాధితురాలితో పెనుగులాటలో రెండు పేటలుగా ఉన్న ఆ గొలుసులో సగం అక్కడే పడిపోగా... మిగిలింది నిందితులకు చిక్కింది. దీనిని ముస్తాఫా తన తల్లికి ఇచ్చి తాకట్టు పెట్టమన్నాడు. తన స్నేహితురాలిదని, నగదు అత్యవసరమంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి దారుస్సలాం బ్యాంక్‌లో రూ.20 వేలకు తాకట్టు పెట్టింది. ఆ సమయంలో బ్యాంకు అధికారులు గొలుసు తెగి ఉండటంపై అనుమానం వ్యక్తం చేయగా, పిల్లలు ఆడుకుంటూ తెంపారంటూ వారిని ఏమార్చింది. ఈ దోపిడీపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు కావడంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు తన బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా పరిశీలించి సదరు వాహనం నెంబర్ గుర్తించారు. అక్కడ నుంచి వివిధ మార్గాల్లో ఉన్న అనేక కెమెరాలు అధ్యయనం చేసి అనుమానిత వాహనం రెడ్‌హిల్స్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. స్టిక్కరింగ్ తీసేసి... దోపిడీ చేసిన వెంటనే షంషుద్ధీన్ తన బైక్ స్టిక్క ర్లు తీసేసి ఎరుపు రంగులోకి మార్చేశాడు. అయినా ఓ కెమెరాలో చిక్కిన అనుమానితుడి ఫొటో ఆధారంగా పోలీసులు రెడ్‌హిల్స్ ప్రాంతంలో గాలించారు. ఆ ప్రాంతంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించి తొలుత షంషుద్దీన్ సోదరుడి ని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో షంషుద్దీన్, ముస్తఫాలను అరెస్టు చేశారు. వీరి వద్ద లభించిన రసీదుల ఆధారంగా దారుస్సలాం బ్యాంకు నుంచి తాకట్టు పెట్టిన బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి వాహనం, రెండు సెల్ఫోన్లు సైతం రికవరీ చేశారు. ఈ నిందితులు మరికొన్ని నేరాలు సైతం చేసి ఉండచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముస్తఫా తల్లికి ఆ గొలుసు చోరీ సొత్తుని తెలుసా? లేదా? అనేది ఆరా తీస్తున్నామని అదనపు డీసీపీ పేర్కొన్నారు. -
పాతబస్తీలో భగ్గుమన్న పాతకక్షలు
-
పాతబస్తీలో దారుణం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. డబీర్‌పురలోని గ్రాండ్ స్కూకర్ పార్లర్లో ఓ యువకుడిపై కొందరు దుండగులు కత్తులు, బేస్‌బాల్ స్టిక్స్‌తో దాడి చేశారు. స్నూకర్ పార్లర్లో పని చేస్తున్న షబ్బీర్ హుస్సేన్(27)పై బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు స్నూకర్పాయింట్ను సీజ్ చేయడంతో పాటు ముగ్గురు ప్రధాన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారు హమీద్, మొహియినుద్దీన్, తఫ్సీల్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రాజీవ్ ఇనుగంటి, ఇ. పాండురంగయ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాజీవ్ 5–4 (62–24, 29–57, 09–89, 16–14, 59–56, 31–60, 72–35, 41–70, 58–24)తో అజయ్ భూషణ్‌పై గెలుపొందగా, పాండురంగయ్య 5–2 (76–39, 49–73, 73–33, 59–68, 73–17, 66–23, 47–23)తో బాలకృష్ణను ఓడించాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విశాల్ అగర్వాల్ 4–1 (69–38, 89–09, 42–52, 66–55, 59–38)తో కె. వెంకటేశంపై, లక్కీ వత్నాని 4–3 (65–13, 21–66, 61–41, 44–60, 51–58, 51–49, 57–23)తో నరేశ్ కుమార్‌పై, హిమాన్షు జైన్ 4–2 (54–16, 24–56, 67–32, 71–34, 46–61, 62–52)తో అబిద్ అలీపై, దుర్గా ప్రసాద్ 4–0 (67–37, 72–18, 71–41, 54–05)తో తరుణ్ గుప్తాపై గెలుపొంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. -
సయ్యద్ పర్వేజ్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో సయ్యద్ పర్వేజ్ ముందంజ వేశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ 3–0 ఫ్రేమ్‌ల తేడాతో నితిన్ సరీన్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎం. శ్రీనివాస రావు 3–0తో శరత్ చంద్రారెడ్డిపై, రమీజుద్దీన్ 3–0తో నాగభూషణంపై, వరుణ్ 3–2తో వినాయక్‌పై, గోపాల్ 3–1తో యూసుఫ్‌పై, ఎంవీ రమణ 3–0తో కల్యాణ్ శ్రీనివాస్‌పై, రషీద్ ఖురేషి 3–1తో వంశీకృష్ణపై, బాబీ 3–0తో రియాజ్‌పై, ఎం. కల్యాణ్ శర్మ 3–1తో ఎ. కల్యాణ్‌పై, దిలీప్ సూర్య 3–2తో ఇమ్రాన్ ఖాన్‌పై, జాన్ వలీ 3–2తో వంశీకృష్ణారెడ్డిపై, సాయి కిరణ్ 3–0తో ఫహాద్‌పై, తరుణ్ 3–0తో సయ్యద్ నదీమ్‌పై, శరత్ 3–0తో వేదవ్యాస్‌పై, పి. గంగాధర్ 3–0తో సాయిరామ్‌పై, జాన్ బా స్కో 3–0తో యశ్వంత్ విజయం సాధించారు. -
లహరికి రజతం
జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఐ. లహరి సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో రెండు పతకాలను సాధించింది. జూనియర్ బాలికల స్నూకర్ ఈవెంట్లో రజతం సాధించిన లహరి... బిలియర్డ్స్ ఈవెంట్లో కాంస్యాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన స్నూకర్ ఫైనల్లో కీరత్ భండాల్ (ఢిల్లీ) (2-1) 28-50, 52-36, 48-45తో లహరి (తెలంగాణ)పై గెలుపొందింది. బిలియర్డ్స్ ఈవెంట్లో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో లహరి 113- 73తో కీర్తన (కర్ణాటక)ను ఓడించి పతకాన్ని గెలుచుకుంది. -
పంకజ్ అద్వానీకి 6–రెడ్ స్నూకర్ టైటిల్
ముంబై: ఇప్పటికే పలు ఫార్మాట్లలో 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. స్నూకర్‌లో పొట్టి ఫార్మాట్‌గా భావించే 6–రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను ఈ బెంగళూరు ప్లేయర్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో పంకజ్ అద్వానీ 7–4 (40–7, 0–36, 55–1, 23–37, 45–13, 40–54, 49–6, 41–8, 6–38, 53–14, 38–17) ఫ్రేమ్‌ల తేడాతో కర్ణాటకకే చెందిన ఇష్ప్రీత్ చద్దాపై గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయస్థాయిలో, ఆసియా స్థాయిలో, ప్రపంచ స్థాయిలో 6–రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా పంకజ్ గుర్తింపు పొందాడు. -
అద్వానీ కాంస్యంతో సరి
దోహా: ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు.మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7తేడాతో అండ్రూ పాగెట్(వేల్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో పంకజ్ కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. సెమీ ఫైనల్లో పోరులో ఒత్తిడికి లోనైన పంకజ్ 14-74, 8-71-0-87, 78-64, 0-81, 70-37, 7-80, 37-68 ఫ్రేమ్‌ల తేడాతో పరాజయం చెందాడు. -
తల్లి ఒడి లా.. మంచం
బోస్టన్: ఏడుస్తూ చికాకు పెట్టే పిల్లలున్న తల్లిదండ్రులకు ఇది శుభ వార్త. తల్లి గర్భంలో శిశువు అనుభవించే స్పందనలను పోలిన ఫీచర్స్‌తో కూడిన అత్యంత అధునాతన చిన్న పిల్లల పడకను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘స్నూ’గా పిలిచే ఈ మంచంలోని 3 మైక్రోఫోన్లు చిన్నారులు ఎప్పుడు ఏడ్చినా పసిగట్టిసంగీతాన్ని వినిపిస్తాయి. బిడ్డను నిద్రపుచ్చడానికిమంచం అటూఇటూ కదులుతుంది. దీని వల్ల పిల్లలు కొద్దిరోజుల్లోనే క్రమబద్ధ, సరైన నిద్ర కు అలవాటు పడతారట. స్విస్ ఇండస్ట్రియల్ ఇంజినీర్ వేస్ బెహార్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీర్లుతో కలసి బ్రిటిట్ వైద్యుడు హార్వే కార్ప్ స్నూను రూపొందించారు. -
నేటి నుంచి స్నూకర్, బిలియర్డ్స్ టోర్నమెంట్
బోట్‌క్లబ్(కాకినాడ): రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ స్నూకర్, బిలియర్డ్స్ ర్యాంకింగ్–2016 పోటీలు స్థానిక టౌన్హాల్లో ఈ నెల 7నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని టోర్నమెంట్ కమిటీ ప్రతినిధి పీవీ రాజీవ్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను టౌన్‌హాలు అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు, కార్యదర్శి జ్యోతుల రాము, వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రాజు, బిలియర్డ్స్ సెక్రటరీ వి.తరుణ్‌కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని, వీరికి వసతి సదుపాయాలు టోర్నమెంట్ కమిటీ సమకూరుస్తుందని తెలిపారు. -
ముగిసిన స్నూకర్స్ పోటీలు
తెనాలి (మారీసుపేట) : కోగంటి శివప్రసాద్ మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిశాయి. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణమండపంలో గురువారం నుంచి పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీలలో విజయవాడకు చెందిన వలీ, హరి, పరమేశ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు కోగంటి రోహిత్ తెలిపారు. వీరికి శనివారం రాత్రి మిర్చి హోటల్లో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీపీ కె.రాంబాబు, టీడీపీ నాయకులు వి.మురళి, కె.మురళి, కౌన్సిలర్లు తెనాలి సుధాకర్,పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ స్నూకర్ టోర్నమెంట్
మారీసుపేట(తెనాలి): కోగంటి శివప్రసాద్‌రావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం కొనసాగింది. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణ మండపంలో జరుగుతున్న టోర్నమెంట్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రౌండ్లో ప్రతాప్‌పై రమాకాంత్ 0–3, నానిపై గంగాధర్ 0–3 మార్కుల తేడాతో ఉన్నారని నిర్వాహకులు కొగంటి రోహిత్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్‌కు నలుగురు క్రీడాకారులు చేరుకున్నారని చెప్పారు. శనివారం ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. కోగంటి రోహిత్, ఎస్ నరేంద్ర, భార్గవ్, శ్రీధర్ తదితరులు పర్యవేక్షించారు. -
స్నే‘కింగ్’ ఆనంద్
పేరు : ఆనంద్ ఉంటున్నందిః సింధియాలోని న్యూకాలనీ వత్తిః చిరు వ్యాపారి ( తోపుడు బండిపై ఇడ్లీ అమ్ముతాడు) ప్రవత్తి పాములు పట్టడం సెల్ నంబర్ 98490 23527 పాములను చూస్తే అందరూ భయపడతారు. ఎక్కడ కాటు వేస్తుందోనని పరుగులు తీస్తారు. ఆనంద్ మాత్రం వాటితో ఆడుకుంటాడు. చాకచక్యంగా పట్టుకుంటాడు. పట్నాల ఆనంద్ సింధియా,న్యూకాలనీలో ఉంటున్నాడు. అందరిలాగే ఆనంద్‌కు సర్పాలంటే చిన్నతనంలో భయమే.అయితే 15 సంవత్సారల క్రితం న్యూకాలనీలో బుజ్జి అనే పదేళ్ల బాలుడ్ని కొండచిలువ చుట్టేసి కలవరం సష్టించింది. అక్కడ వారంతా భయంతో దూరంగా జరిగారే తప్పా బాలుడ్ని రక్షించే సాహసం చేయలేదు. ఆ సమయంలో ఆనంద్ ధైర్యం చేసి ఆ కొండచిలువను బలంగా లాగి దూరంగా విసిరేసి ఆ బాలుని రక్షించాడు. అదేlమాదిరిగా స్నేహితులతో యారాడ వెళ్లినప్పుడు ఓ విషసర్పం వీరిపై దూసుకు వస్తుంటే ఆనంద్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ సర్పాన్ని బంధించి కొండపై విడిచిపెట్టాడు. అప్పట్నించీ ఆనంద్ పాముల ఆనంద్‌గా మారిపోయాడు. ఇంతవరకూ రెండు వేల వరకూ వివిధ రకాల పాములను పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఆనంద్ ధైర్యాన్ని చూసి ఇండియన్ నేవి,షిప్‌యార్డ్ తదితర పరిశ్రమల వారు ఆయా ప్రాంతాల్లో సర్పాలు సంచరిస్తే ఫోన్ చేస్తారు. నెలకు కొంతమొత్తాన్ని ఇస్తారు. చిన్న టిఫిన్దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నాడు. ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణం స్పందించి పాములు పడతాడు. –మల్కాపురం -
స్నూకర్స్ టోర్నమెంట్ ప్రారంభం
తెనాలి (మారీసుపేట): నేటి సమాజంలో క్రీడల ప్రాధాన్యం తగ్గిందని, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెనాలి 1వ అదనపు న్యాయమూర్తి జి.ప్రభాకర్ సూచించారు. కోగంటి శివప్రసాదరావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్‌ను కొత్తపేటలోని కనికిచర్ల కల్యాణ మండపంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఈ క్రీడను తెనాలిలో నిర్వహించడం ముదావాహం అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు రావడం ఆనందకరమన్నారు. నిర్వాహకులు కోగంటి రోహిత్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, శాఖమూరి సురేంద్ర, చలసాని బాబు, కోగంటి నవీన్, ఎ.భార్గవ్, వి.మురళీ పాల్గొన్నారు. -
సికిందరాబాద్‌లో ఏపి-టీఎస్ స్నూకర్ పోటీలు
-
'కరాచీ నగరం ముంబయి లాంటిదే'
కరాచీ: పాకిస్తాన్, భారత్‌కు చాలా వ్యత్యాసం లేదని, కరాచీ నగరం ముంబయి లాంటిదేదనని భారత సూకర్ స్టార్ పంకజ్ వ్యాఖ్యానించాడు. పాక్ టూర్ కు వెళ్లేముందు జూనియర్ ఆటగాళ్లకు తాను ఈ విధంగా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఆసియాలోనే మేజర్ స్నూకర్ కేంద్రంగా పాక్ మారనుందని అన్నాడు. స్నూకర్ చాంపియన్‌షిప్ నిర్వహించిన పాక్ ను అద్వానీ ప్రశంసించాడు. క్రికెట్‌కు ఉన్నట్లే బిలియర్డ్స్, స్నూకర్ గేమ్స్‌కూ ఐపీఎల్ లీగ్ వంటివి ఉంటే తమకు బాగా కలిసొస్తుందని అద్వానీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగిన ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ సాధించిన తర్వాత ఈ విధంగా తన ఉద్దేశాన్ని తెలిపాడు. కెరీర్లో 13 స్నూకర్ టైటిల్స్ సాధించిన అనంతరం అద్వానీ మాట్లాడుతూ.. ఐపీఎల్ లీగ్ వంటివి బిలయర్డ్స్, స్నూకర్ గేమ్స్లకూ నిర్వహిస్తే అది తమకు ఆర్థికంగా ప్రయోజనకరమని అన్నాడు. ఈ ఆటలకు చాలా తక్కువ సమయం కేటాయించి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్నాడు. టోర్నీలో తొలి గేమ్ ఓటమికి అక్కడికి ఆలస్యంగా చేరుకోవడమే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. -
జోసెఫ్ శుభారంభం
తెలంగాణ-ఏపీ స్నూకర్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఏపీ స్నూకర్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో జోసెఫ్ శుభారంభం చేశాడు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ క్లబ్లో గురువారం తొలిరౌండ్ పోటీలను బెస్టాఫ్ ఫైవ్ ఫ్రేమ్స్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో క్యూ క్లబ్‌కు చెందిన జోసెఫ్ 3-1 (59-11, 29-55, 41-32, 63-20) ఫ్రేమ్‌ల తేడాతో ఎస్డీ పార్లర్‌కు చెందిన సాయికిరణ్‌పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఫైజల్ 3-0 (59-35, 43-11, 58-31) ఫ్రేమ్‌ల తేడాతో సమీర్‌ను ఓడించగా, నరేశ్ కుమార్ 3-1 (81-6, 34-57, 59-30, 68-20)తో శంకర్‌పై గెలిచాడు. అస్లామ్ 3-0 (49-38, 53-24, 54, 2)తో భరత్‌పై, శ్రవణ్ కుమార్ 3-0 (40-5, 44-23, 53-22)తో విక్రమ్‌పై నెగ్గారు. అఖిల్ 3-0 (50-26, 61-53, 52-45)తో ప్రదీప్‌ను కంగుతినిపించగా, సినాప్ర 3-1 (57-22, 45-22, 27-53, 56-55)తో కృష్ణపై, రాజీవ్ 3-1 (55-31, 25-59, 60-39, 59-24)తో ఫైజల్‌పై విజయం సాధించారు. సుదర్శన్ రెడ్డి 3-2 (50-28, 42-51, 19-66, 74-22, 53-44)తో ఉదయ్‌పై గెలుపొందగా, శ్రీధర్ 1-3 (43-21, 29-42, 40-59, 44-59)తో ధ్రువ్ సింగ్ చేతిలో, సుహాస్ రాజ్ 1-3 (64-54, 27-61, 38-45, 20-47)తో సన్నీ చేతిలో పరాజయం చవిచూశారు. -
అవార్డుల కోసం అత్యాశ పడొదు
భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కోల్‌కతా: ఏ క్రీడాకారుడైనా తమ ప్రదర్శన ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలి కానీ అవార్డుల కోసం అత్యాశ పడకూడదని స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ అభిప్రాయపడ్డాడు. ‘నేనెన్నటికీ అవార్డులు ఇవ్వాలని బయటికెళ్లి నిరసన వ్యక్తం చేయను. వాటిని సాధించాలి కానీ వెంపర్లాడకూడదు. నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. అయితే నేను అర్హుడిని కాదని ప్రభుత్వం అనుకుంటే నాకేమీ దిగులు లేదు. గుర్తింపును మనం డిమాండ్ చేయకూడదు. ఇక్కడ మనముంది దేశం తరఫున పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు. ఏ ఆటలోనైనా ప్రతిభ చాటుకుంటే ఏదో ఒక రోజు గుర్తింపు దానంతటదే వస్తుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పద్మ అవార్డు విశ్వసనీయత ఏమీ తగ్గలేదు. కొద్ది మంది బహిరంగంగా తమ ఆక్రోషాన్ని వెల్లడించినంత మాత్రాన వీటి గుర్తింపుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఇక సైనా ప్రతిఘటనపై కామెంట్ చేయలేను కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి చేష్టలకు మాత్రం దిగను’ అని అద్వానీ స్పష్టం చేశాడు. -
అద్వానీ... అత్యధిక బ్రేక్
షెఫీల్డ్ (యూకే): వారం రోజుల వ్యవధిలో రెండు బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్స్‌ను సాధించిన భారత స్టార్ పంకజ్ అద్వానీ... స్నూకర్లోనూ సత్తా చాటాడు. కియోగన్ (ఇంగ్లండ్)తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ అత్యధికంగా 147 పాయింట్లు స్కోరు చేశాడు. స్నూకర్‌లో సాధారణంగా 147 పాయింట్లనే అత్యధిక బ్రేక్‌గా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఈ తరహా బ్రేక్‌ను అధికారికంగా 107 మంది చేయగా... భారత్ నుంచి ఆదిత్య మెహతా మాత్రమే చేశాడు. -
పంకజ్ అద్వానీ ఓటమి
బీజింగ్: ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సన్నాహక టోర్నీ అయిన చైనా ఓపెన్ స్నూకర్‌లో భారత క్రీడాకారులు పంకజ్ అద్వానీ, ఆదిత్య మెహతా నిరాశపరిచారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో అద్వానీ 1-5 (8-81, 74-0, 25-83, 8-73, 10-72-10, 42-62)తో రికీ వాల్డెన్ (ఇంగ్లండ్) చేతిలో... ఆదిత్య మెహతా 4-5 (52-60, 57-52, 1-69, 79-49, 0-81, 62-48, 22-73, 62-40, 36-71)తో మార్క్ కింగ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ ఇంగ్లండ్‌లోని షెఫ్ఫీల్డ్లో ఈ నెల 16న మొదలు కానుంది. -
పంకజ్ ఖాతాలో 24వ టైటిల్
జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ లక్నో: ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఆరోసారి జాతీయ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-3తో కమల్ చావ్లా (రైల్వేస్)పై విజయం సాధించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కు ఇది 24వ జాతీయ టైటిల్. పంకజ్ ధాటికి మ్యాచ్‌లో ఎక్కువ భాగం చావ్లా కుర్చికే పరిమితమయ్యాడు. తొమ్మిదో ప్రేమ్‌లో 139 పాయింట్లను సాధించడం పీఎస్‌పీబీ ఆటగాడికి టైటిల్‌ను తెచ్చిపెట్టింది. ఓ దశలో చావ్లా కూడా పోరాడినా స్వల్ప తేడాతో పాయింట్లు చేజార్చుకున్నాడు. అంతకుముందు జరిగిన పోటీల్లో పంకజ్ 84, 69, 61, 64 పాయింట్లు సాధించాడు. ఈ టైటిల్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అంకితమిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన అద్వానీ చెప్పాడు. ‘జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ఎప్పటికీ గర్వకారణమే. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజాన్ని నిజంగా తీర్చిదిద్దుతున్నది మహిళలే కాబట్టి వారికే ఈ టైటిల్ అంకితం’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. -
3 బంతులు... బిలియర్డ్స్ 21 బంతులు... స్నూకర్
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని పట్టణాలన్నింటిలోనూ భారీ సంఖ్యలో ‘పూల్స్’ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సంపన్నుల ఆటగా పరిమితమైన బిలియర్డ్స్ ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు గ్రూప్‌లుగా పూల్స్‌కు వెళ్లి గంటలు గంటలు ‘టైమ్‌పాస్’ చేస్తున్నారు. ఆడేవాళ్లకు సరే... ఆడని వాళ్లకు మాత్రం అదో ‘మిస్టరీ’. చాలామందికి బిలియర్డ్స్కు, స్నూకర్‌కు తేడా ఏంటనే సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆటల గురించి తెలుసుకుందాం. - ఐవీ రాజీవ్ (భారత బిలియర్డ్స్ ఆటగాడు) బిలియర్డ్స్ బిలియర్డ్స్‌లో రెడ్, వైట్, ఎల్లో రంగుల్లో 3 బంతులు ఉంటాయి. రెడ్ను ఆబ్జెక్ట్ బాల్‌గా వ్యవహరిస్తారు. మిగతా రెండు బంతులను ఒక్కో ఆటగాడు ఎంచుకుంటాడు. వీటిని క్యూ బాల్స్ అంటారు. నిర్ణీత స్థానం (బ్లాక్ స్పాట్)లో రెడ్ బాల్‌ను ఉంచుతారు. మొదటి ఆటగాడు తన వైట్ లేదా ఎల్లో బాల్‌తో (క్యూ బాల్‌తో) రెడ్ బాల్‌ను, మరో బాల్‌ను ఒకే షాట్లో కొట్టాల్సి ఉంటుంది. ఇది బోర్డుపై ఉండే డి సర్కిల్నుంచే ఆడాలి. ఈ తరహాలో షాట్ ఆడటాన్ని బిలియర్డ్స్ భాషలో కెనాన్గా వ్యవహరిస్తారు. దీనికి 2 పాయింట్లు లభిస్తాయి. ఆ తర్వాత పాటింగ్ (పాకెట్లో వేయడం) ద్వారా పాయింట్లు లభిస్తాయి. మొదటి ఆటగాడు తన క్యూ బాల్‌తో రెడ్ బాల్‌ను పాకెట్లో వేయాలి. అప్పుడు 3 పాయింట్లు లభిస్తాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌ను పాకెట్లో వేస్తే 2 పాయింట్లు దక్కుతాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌కు తగులుతూ సదరు ఆటగాడి క్యూ బాల్ పాకెట్లో పడితే దానిని ఇన్ ఆఫ్ అంటారు. దీనికి 3 పాయింట్లు లభిస్తాయి. పాకెట్లో రెడ్ బాల్ పడిన ప్రతీ సారి దానిని టేబుల్‌పై యథాస్థానంలో ఉంచుతారు. ఒక మ్యాచ్‌లో ఆధిక్యాన్ని తేల్చేందుకు పాయింట్ల పద్ధతిని లేదా సమయం పద్ధతిని ఉపయోగిస్తారు. గంట, 2 గంటలు...లేదా 100 పాయింట్లు, 200 పాయింట్ల పద్ధతిలో ఆట సాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిని ఒక గేమ్‌గా వ్యవహరిస్తారు. బెస్ట్ ఆఫ్ పద్ధతిలో గేమ్‌ల ద్వారా విజేతను తేలుస్తారు. స్నూకర్ సాధారణంగా ఇంట్లో ఆడే క్యారమ్తో ఎక్కువ పోలికలు ఉండటంతో ఈ ఆటపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. స్నూకర్‌లో మొత్తం 21 బాల్స్ ఉంటాయి. ఇందులో 15 రెడ్ బంతులు కాగా మరో 6 ఇతర రంగులు ఉంటాయి. వాటిలో ఒక్కో బంతికి నిర్ణీత పాయింట్లు ఉంటాయి. ఎల్లో (2 పాయింట్లు), గ్రీన్ (3), బ్రౌన్ (4), బ్లూ (5), పింక్ (6), బ్లాక్ (7) పాయింట్లు ఉంటాయి. ఇందులో కూడా వైట్‌బాల్‌ను క్యూ బాల్‌గా వ్యవహరిస్తారు. దీనినీ డి బాక్స్నుంచే ఆడాల్సి ఉంటుంది. స్నూకర్‌లో కేవలం పాటింగ్ మాత్రమే ఉంటుంది. బిలియర్డ్స్ తరహాలో ప్రత్యర్థి బాల్‌ను ఆడే ప్రయత్నం చేస్తే (ఇన్ ఆఫ్) దానిని ఇక్కడ ఫౌల్‌గా పరిగణిస్తారు. ఆరంభంలో 15 రెడ్ బాల్స్‌ను పింక్‌తో కలిపి ఫ్రేమ్‌లో ఉంచుతారు. దానిని బ్రేక్ చేశాక ఆట మొదలవుతుంది. ఆటగాడు రెడ్ బాల్‌ను పాటింగ్ చేస్తే 1 పాయింట్ లభిస్తుంది. రెడ్ బాల్ వేసిన ప్రతీ సారి తాను ఏ కలర్ బాల్ ఆడాలనుకుంటున్నాడో రిఫరీకి చెప్పి అదే బాల్‌ను పాకెట్లో వేయాలి. పాకెట్లో వేసిన బంతికి కేటాయించిన పాయింట్లు ఆటగాడికి లభిస్తాయి. పాటింగ్ కాగానే ఆ బంతి మళ్లీ బోర్డుపైకి వస్తుంది. రెడ్ బాల్ వేసి మళ్లీ ఫాలోగా మరో బాల్...ఈ తరహాలో బోర్డుపై ఉన్న 15 రెడ్ బాల్స్ పూర్తయ్యే వరకు ఆట సాగుతుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఫ్రేమ్‌గా వ్యవహరిస్తారు. బిలియర్డ్స్ బోర్డును సాధారణంగా టేబుల్ బెడ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 6 పాకెట్లు ఉంటాయి. ఇది 6 ్ఠ 12 అడుగులు ఉంటుంది. ఆట సాగేటప్పుడు స్టాన్స్ చాలా కీలకం. దానిని బట్టే ఆడే తీరు మారుతుంది. టేబుల్‌పై చేతిని ఉంచి దానిపైనుంచి క్యూ స్టిక్‌తో షాట్ ఆడతారు. దీనిని బ్రిడ్జ్‌గా వ్యవహరిస్తారు. క్యూ స్టిక్ చివరను టిప్‌గా వ్యవహరిస్తారు. ఆడేటప్పుడు టిప్ స్లిప్ కాకుండా తరచూ చాక్‌తో దానిని రుద్దుతూ ఉంటారు. ఒక ప్లేయర్ తన ఆట ఆడి పక్కకు వచ్చాక, మరో ఆటగాడు ఆడేందుకు సిద్ధమవుతాడు. ఈ వ్యవధిని విజిట్ అంటారు. -
స్నూకర్లోనూ ఫిక్సింగ్
లండన్: ఫిక్సింగ్... క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలనూ కుదిపేస్తోన్న ఈ జాడ్యం ఇప్పుడు స్నూకర్లోనూ బయటపడింది. ప్రపంచ మాజీ ఐదో ర్యాంకర్ స్టీఫెన్ లీ (ఇంగ్లండ్)... ఏడు మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ (డబ్ల్యూపీబీఎస్ఏ) ప్రకటించింది. ఈ మ్యాచ్‌లన్నింటిలో కలిపి అతను లక్షా 11 వేల పౌండ్లు బెట్టింగ్ చేశాడని సమాచారం. విచారణలో దోషిగా తేలితే లీపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలున్నాయి.