జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఐ. లహరి సత్తా చాటింది.
జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఐ. లహరి సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో రెండు పతకాలను సాధించింది. జూనియర్ బాలికల స్నూకర్ ఈవెంట్‌లో రజతం సాధించిన లహరి... బిలియర్డ్స్ ఈవెంట్‌లో కాంస్యాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన స్నూకర్ ఫైనల్లో కీరత్ భండాల్ (ఢిల్లీ) (2-1) 28-50, 52-36, 48-45తో లహరి (తెలంగాణ)పై గెలుపొందింది. బిలియర్డ్స్ ఈవెంట్‌లో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో లహరి 113- 73తో కీర్తన (కర్ణాటక)ను ఓడించి పతకాన్ని గెలుచుకుంది.