lahari
-
బుల్లితెర నటి లహరి కుమారుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
కాస్ట్ లీ కారు కొన్న సీరియల్ బ్యూటీ లహరి (ఫొటోలు)
-
ఖరీదైన లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ బ్యూటీ.. రేటు ఎంతంటే?
సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ కూడా ఈ మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో నటి లహరి కూడా చేరింది.(ఇదీ చదవండి: 'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం)'మొగలిరేకులు', గృహలక్ష్మి తదితర సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లహరి.. ప్రస్తుతం ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ కారు ధర మార్కెట్లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.కోటికి పైనే ఉండొచ్చు. తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!) View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
హీరోగా యూట్యూబర్ నిఖిల్.. సంగీత్ సినిమా లాంఛ్ (ఫోటోలు)
-
Actress Lahari Son Cradle Ceremon: బుల్లితెర నటి లహరి తనయుడి బారసాల ఫంక్షన్ (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..వీడియో వైరల్!
సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. గతంలోనే గర్భం దాల్చినట్లు సోషల్ ద్వారా పంచుకుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే తొమ్మిదినెలలో సీమంతం జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్) తాజాగా మరో క్రేజీ వార్తను అభిమానులతో పంచుకుంది. తనకు మగబిడ్డ జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను ప్రసవించిన ఆస్పత్రిలో కేక్ కట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
Lahari Baby Shower Photos : బుల్లితెర నటి లహరి సీమంతం.. ఫోటోలు వైరల్
-
తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్
సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే ఇటీవల నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. తను గర్భం దాల్చడం వల్లే యాక్టింగ్‌కు విరామం పలికింది. గత నెలలో లహరి సీమంతం వేడుకను ఇంటిసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతానికి బుల్లితెర తారలు హాజరై కాబోయే తల్లిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం లహరికి తొమ్మిదవ నెల కావడంతో స్నేహితులంతా కలిసి మరోసారి సీమంతం ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయింది. దీనిపై రెడ్ కోట్ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్ అయ్యేలా రెడ్ జాకెట్ ఉన్న బ్లూ డ్రెస్ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను లహరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దుస్తులు, బ్యాగులు, బెడ్.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను సైతం తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. మరికొద్ది రోజుల్లో డెలివరీ ఉండటంతో లహరికి అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S W A T (@glamsoulwidbeauty) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి, పెళ్లయిపోయిందా? -
లహరి హత్యలో వల్లభ్‌రెడ్డి అరెస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వల్లభ్‌రెడ్డి భార్య లహరిని హత్య చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, లహరి మృతి కేసు దర్యాప్తు సంచలనంగా మారింది. లహరి మృతిని వల్లభ్‌రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు గుర్తించారు. వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన లహరి మృతి వివాదాస్పదంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లహరిని హత్య చేసిన వల్లభ్‌రెడ్డి ఆమె మృతిని గుండెపోటుగా చిత్రీకరించినట్టు తెలిసింది. అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. దినకర్మకు 10వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు వల్లభ్ రెడ్డి. కాగా, తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో హత్యా కోణం బయటపడింది. ఈ సందర్భంగా లహరికి ఇంటర్నల్ గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. పొట్టలో రెండు లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగినట్టు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, కొద్ది రోజులుగా లహరి, వల్లభ్‌రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో లహరితో వాగ్వాదం సందర్భంగా వల్లభ్.. ఆమె తలను గోడకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇక, వల్లభ్‌రెడ్డిని రిమాండ్‌లోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు నారాయణగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, హత్య కేసు స్థానికంగా, రాజకీయాంగా కలకలం సృష్టిస్తోంది. ఇక, లహరి పేరెంట్స్‌పై కూడా వల్లభ్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: సత్తెనపల్లి: తీవ్ర విషాదం నింపిన గోవా ట్రిప్ -
గుండెపోటుతో కాదు..గాయాల వల్లే.. భర్త వల్లభ్‌రెడ్డి అరెస్టు
హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన వివాహిత లహరి మృతి వివాదాస్పదంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆమె గుండెపోటుతో మృతిచెందిందని లహరి తండ్రి జైపాల్‌రెడ్డికి సమాచారం అందింది. తాజాగా ఆమె గుండెపోటుతో కాదని.. తలపై, శరీరంపై గాయాలవ్వడం వల్లే మృతి చెందిందంటూ వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంలో మొదట నుంచి అనుమానంగా ఉన్న ఆమె భర్త వల్లభ్‌రెడ్డిని నారాయణగూడ పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...హిమాయత్‌నగర్‌కు చెందిన జైపాల్‌రెడ్డి పెద్ద కుమార్తె లహరికి గత ఏడాది నల్లగొండ జిల్లాకు చెందిన వల్లభ్రెడ్డితో వివాహం జరిగింది. ఈ నెల 15వ తేదీన లహరి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు జైపాల్‌రెడ్డికి సమాచారం అందింది. దీనిపై అదేరోజు తన కుమార్తె మరణంపై అనుమానం లేదంటూనే..తన కుమార్తె మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జైపాల్‌రెడ్డి నారాయణగూడ పోలీసులకు రెండు విధాలుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లహరి తలకు బలమైన గాయాలయ్యాయని, అందువల్లే మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో లహరి భర్త వల్లభ్‌రెడ్డిని పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు -
పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి
నల్గొండ: నిడమనూరు మండలం తుమ్మడము గ్రామానికి చెందిన యడవెల్లి లహరి (28) గుండె పోటుతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందింది. తుమ్మ డం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం అందరూ టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన కొద్ది సేపటికి వేరే రూమ్ కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరి కు యడవెల్లి వల్లభ్ రెడ్డి తో గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జర్పించారు. వివాహం జరిగి 15 నెలలకే లహరి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. లహరి అంత్యక్రియలు నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం ఉదయం 10-12 గంటల మధ్య నిర్వహించనున్నారు. -
బేబీ బంప్‌తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా లహరి షేర్ చేసిన పిక్స్ తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, కొడుకు సమక్షంలోనే.. ) అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే సీమంతం వేడుక జరుపుకుంది బుల్లితెర భామ. తాజాగా బేబీబంప్‌తో ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి తెలుగువారి సుపరిచితమే. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్న సీమంతానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. లహరి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) -
రోడ్డెక్కిన ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ బస్సులు.. స్పెషల్ ఫీచర్స్ ఇవే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అత్యాధునిక హంగులతో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి లహరి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇటీవల 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే గొప్ప నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాటపట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలను చేస్తోందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌కు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్ లైన్' పేరుతో లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని కోరారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులనూ సమకూర్చుకుంటుందన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువచేయడంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ చేస్తోన్న కృషిని అభినందించారు. అలాగే, పేదల కనీస ప్రయాణ అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. చదవండి: డబుల్ ఇంజన్ అంటే మోదీ-అదానీ: మంత్రి కేటీఆర్ ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023 టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. తొలిసారిగా అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించి సంస్థను ఆదరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా రవాణా వ్యవస్థ ఉందనే విషయం మరచి పోవద్దన్నారు. సంస్థ ఎండీ వీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానం కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభించింది తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
సకల చరాచర జగత్తుకు లయకారుడు పరమేశ్వరుడు
-
ప్రాణం తీసిన చలిమంట.. సోషల్ మీడియాలో పోస్ట్‌తో..
సాక్షి, నెల్లూరు(వెంకటాచలం): చలి కాచుకునేందుకు వేసిన మంట ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అంటుకుని ఇద్దరు చిన్నపిల్లలు, కాపాడేందుకు వెళ్లిన తల్లి గాయపడ్డారు. రెండేళ్ల వయసున్న చిన్నకుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయట పడింది. అయితే పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన మానికల రవికృష్ణ పెయింట్ పని చేస్తుంటాడు. అతడికి భార్య నాగభూషణమ్మ, కుమార్తెలు లహరిశ్రీ, శ్రీవర్ష (2) ఉన్నారు. ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున నాగభూషణమ్మ థిన్నర్ వాడి ఇంటి ముందు చలిమంట వేసింది. కుమార్తెలు చలి కాచుకుంటుండగా ఆమె సమీపంలో ముగ్గు వేస్తోంది. రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. కాగా మంట ఆరిపోతుండడంతో లహరిశ్రీ థిన్నర్ పోసింది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగి లహరిశ్రీ, శ్రీవర్ష శరీరానికి అంటుకున్నాయి. తల్లి చూసి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రవికృష్ణ, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ముగ్గురిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవర్ష మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కొందరు వ్యక్తులు బాధిత గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా వైరలైంది. కాగా ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలు, మీడియాకు తెలియజేసి ఉంటే బాధితులకు సాయం అందేదని చెబుతున్నారు. చలి కాచుకునేందుకు వేసిన మంట చిన్నారిని బలి తీసుకోవడం, మరో బాలిక, తల్లి గాయాలపాలవడంతో కంటేపల్లి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. -
TSRTC: ఏపీకి స్పెషల్ స్లీపర్ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులను హైదరాబాద్ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మొదలైన సంక్రాంతి పండుగ
-
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
Bigg Boss 5 Telugu: అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది?
అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్‌బాస్ 5’లో కంటెస్టెంట్లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది? ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్‌గా పని చేస్తున్న ‘బిగ్‌బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్లో కంటెస్టెంట్లు రవి, కాజల్‌లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్‌ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా. (చదవండి: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) బిగ్‌బాస్ హౌస్‌లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్లు హౌస్‌కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్‌బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి. ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్‌తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్‌లోని అందరూ హతాశులయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు. -
బిగ్‌బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. లహరిని నామినేట్ చేసిన ప్రియ.. రవి, లహరి అర్థరాత్రి సమయంలో రెస్ట్ రూమ్‌లో హగ్ చేసుకున్నారని, ఆమె ఎక్కువగా మగాళ్లతోనే తిరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అది నార్మల్ హగ్గేనని, రవిని నేను బ్రో అని పిలుస్తానని , మా మధ్య వేరే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది లహరి. రవి కూడా అలాంటి రాంగ్ స్టెట్మెంట్స్ ఎలా ఇస్తావంటూ ప్రియపై ఫైర్ అయ్యాడు. (చదవండి: రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్) తన కూతురికి ఈ విషయం అర్థమయితే ఎలా ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇక లహరి కూడా ఒక నేషనల్ మీడియాలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రియ మాత్రం తాను చూసిందే చెప్పానంటూనే రవి, లహరిలకు సారీ చెప్పింది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రియ ఎందుకు ఆ కామెంట్ చెప్పిందో వివరించింది. గొడవ జరగడానికి ముందు రవి తనకు ఎం చెప్పాడో ఆ విషయాన్ని లహరితో షేర్ చేసుకుంది ప్రియ. లహరి బిగ్ బాస్ తరువాత యాంకర్‌గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుందని.. అందుకే నా వెంట పడుతుందనే అనుమానం ఉందని ప్రియతో అన్నాడు రవి. అంతేకాదు హౌస్‌లో అంతమంది పెళ్లి కాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని.. ఎక్కడికి వెళ్లినా తనతో వస్తుందని.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ రవి తనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా లహరికి వివరించింది ప్రియ. దీంతో లహరి డైరెక్ట్‌గా వచ్చి రవిని నిలదీసింది. దీంతో షాకైన రవి.. ‘అక్కా నేను అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.. నేను నీతో అలా చెప్పలేదు’ అని ప్రియతో వాదనకు దిగాడు. అయితే ప్రియ మాత్రం నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ తరువాత తనని బ్యాడ్ చేయడానికే ప్రియ ఇలా అంటుందంటూ లహరికి చెప్పాడు రవి. Lol 😂😂😂#BiggBossTelugu5 https://t.co/vAyUID78MD pic.twitter.com/TB0edqWllg — S. (@sahithi_123) September 21, 2021 అయితే లహరి గురించి ప్రియతో రవి చెప్పిన మాటలు నిజమేనని నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరి అర్థమవుతంది. తాజాగా లహరి గురించి రవి మాట్లాడిని మాటలకు తాలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందో రవి నిజంగా లహరిపై బ్యాడ్ కామెంట్స్ చేశాడు. అయితే అతని ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ప్రియతో అలా చెప్పడం, ప్రియ అదే విషయానికి కొంచెం మసాలా దట్టించి నామినేషన్ ప్రక్రియలో అందరి ముందు నోరు విప్పడం.. వివాదానికి దారి తీసింది. అయితే నిన్నటి వరకు ప్రియని తిట్టుకున్న వాళ్లంతా తాజా వీడియో చూసి రవిని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మిడ్నైట్ హగ్ గొడవ ఎక్కడి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్
బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న రాత్రి ప్రియ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి రవి, ఆమె హగ్ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్ విషయాలను వెల్లడించిది.ఆమె వ్యాఖ్యలపై లహరి, రవితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా ఓ రేంజ్లో మండిపడ్డారు. లహరి అయితే నేషనల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై సీరియస్ అయింది. తన కూతురుకు ఈ వ్యాఖ్యలు అర్థం అయితే ఎలా ఉంటుందంటూ రవి ఫైర్ అయ్యాడు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు సన్నీ. ఇలా బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతి ఒక్కరు ప్రియ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ గొడవ ఇంకా పెద్దదైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఇది హాట్ టాపిగ్గా మారింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై రవి భార్య సోషల్ మీడియా వేదికగా స్పందించింది. (చదవండి: ఆమె బిగ్‌బాస్ షోకు పనికి రాదు: ఉమా దేవి) చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్.నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. అంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే నిత్య పోస్ట్‌పై రవి అభిమానులు స్పందిస్తూ.. ఖచ్చితంగా అన్నయ్య టైటిల్ గెలుస్తాడు.. భార్య అంటే మీలా ఉండాలి.. నిజమైన ప్రేమ అంటే మీదే. ప్రియని ఈ వారం ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nitya Saxena (@nitya.saxena1186) -
‘జాంబీ రెడ్డి’లో అలరించనున్న లహరి షరీ
ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాంబీ రెడ్డి. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాంబీరెడ్డి సినిమాలో లహరి షరీ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుల్లితెర ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లహరికి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టనుందనడంలో సందేహం లేదు. టీవీ ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించిన లహరి పలు ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తరువాత తన టాలెంట్‌తో అనేక సినిమాల్లో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయమయ్యారు లహరి. అందులో అమాయక నర్సుగా నటించి అందరి మన్ననలు పొందారు. చదవండి: కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి తరువాత మళ్లీ రావా (2017 ), పటేల్ సార్ (2017), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), అజ్ఞాతవాసి(2018) తిప్పర మీసం (2019) సినిమాల్లో ఆకట్టుకున్న లహరి ఇప్పుడు జాంబీ రెడ్డి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో లహరి షరీ పాత్ర కీలకం కావడంతో ఇది ఆమె కెరీర్లో పెద్ద హిట్‌గా నిలవబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. కాగా జాంబీ రెడ్డి ట్రైలర్‌ను ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఆనందీ, దక్ష నగర్కర్, గెటప్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, అన్న పూర్ణమ్మ, కిరీటి, హరితేజ, మహేష్ విట్ట ఇతర పాత్రల్లో నటించారు. కరోనా వైరస్ చుట్టూ తిరిగే ఈ కథను కర్నూలులో తీశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో కర్నూలు ప్రజలు ఎలా బయటపడ్డారనేది చిత్రం. లాహరి షరీ ప్రస్తుతం కన్నడ సినిమా ‘గ్రామ’లో నటిస్తున్నారు. హేమంత్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుందని లాహరి షరీ నమ్మకంగా ఉన్నారు. మున్ముందు మరింత బిజీ అవుతానని ఆమె ఆశిస్తున్నారు. -
సంజయ్ వర్మ.. కథ మొదలైంది
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథ మొదలైంది’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సంజయ్ వర్మ హీరోగా, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టి. రమేష్ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తమటం కుమార్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు సురేష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సంజయ్‌కి కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి’’ అన్నారు. ‘‘ఒక చిన్న విరామం, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రాల్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు తమటం కుమార్ రెడ్డి. ‘‘సమాజంలో జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది చేస్తున్న కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు సాయికృష్ణ కేవీ.