రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూ.. యాంకర్‌ భార్య షాకింగ్‌ కామెంట్‌ | Bigg Boss 5 Telugu:Nitya Reacts Over Lahari And Her Husband Ravi Romance | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూ.. యాంకర్‌ భార్య షాకింగ్‌ కామెంట్‌

Sep 21 2021 4:40 PM | Updated on Sep 21 2021 9:32 PM

Bigg Boss 5 Telugu:Nitya Reacts Over Lahari And Her Husband Ravi Romance - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్న రాత్రి ప్రియ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి రవి, ఆమె హగ్‌ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్‌ విషయాలను వెల్లడించిది.ఆమె వ్యాఖ్యలపై లహరి, రవితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా ఓ రేంజ్‌లో మండిపడ్డారు. లహరి అయితే నేషనల్‌ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై సీరియస్‌ అయింది. తన కూతురుకు ఈ వ్యాఖ్యలు అర్థం అయితే ఎలా ఉంటుందంటూ రవి ఫైర్‌ అయ్యాడు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు సన్నీ. ఇలా బిగ్‌బాస్‌ హౌస్‌లోని ప్రతి ఒక్కరు ప్రియ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ గొడవ ఇంకా పెద్దదైనట్లు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో సైతం ప్రస్తుతం ఇది హాట్‌ టాపిగ్‌గా మారింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై రవి భార్య సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. 
(చదవండి: ఆమె బిగ్‌బాస్‌ షోకు పనికి రాదు: ఉమా దేవి)

చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్.నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. అంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. అయితే నిత్య పోస్ట్‌‌పై రవి అభిమానులు స్పందిస్తూ.. ఖచ్చితంగా అన్నయ్య టైటిల్ గెలుస్తాడు.. భార్య అంటే మీలా ఉండాలి.. నిజమైన ప్రేమ అంటే మీదే. ప్రియని  ఈ వారం ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement