Bigg Boss 5 Telugu: Ravi Request Dont Troll Siri Hanmanth Comments Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: సిరి జోలికెళ్లొద్దు, మంచిగా చెప్తున్నా: రవి కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Jan 3 2022 10:41 AM | Last Updated on Mon, Jan 3 2022 11:19 AM

Anchor Ravi Request Dont Troll Siri Hanmanth - Sakshi

వరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు...

Deepthi Sunaina & Shanmukh 'Breakup': ప్రేమ జంట షణ్ముఖ్‌ జశ్వంత్‌, దీప్తి సునయన విడిపోవడానికి సిరి హన్మంత్‌ కారణమంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. తన వల్లే దీప్తి షణ్నును వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించిన సిరి.. 'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్‌ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్‌ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

అంటే ఎవరెంత ట్రోల్స్‌ చేసినా తానింకా స్ట్రాంగ్‌ అవుతూనే ఉంటానని చెప్పకనే చెప్పింది సిరి. అయితే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లపై జరిగే ఈ ట్రోల్స్‌ను ఆపాలంటూ యాంకర్‌ రవి ఆ మధ్య మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో రవి మాట్లాడుతూ.. 'ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.. దయచేసి నెగెటివ్‌ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నాడు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement