సాహసం సేయరా డింభకా సినిమాతో ప్రేక్షకులను అలరించింది హమీదా. అందచందాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదీ ముద్దుగుమ్మకీ. అయితే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌తో కావాల్సినంత పాపులారిటీ అందుకుంది హమీదా. సింగర్ శ్రీరామ్‌తో లవ్ ట్రాక్ నడిపి బాగా ఫేమస్ అయింది. తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ సందడి చేసింది.
ఇదిలా ఉంటే హమీదా ఈ దీపావళికి కొత్త కారు కొనుక్కుంది. మెర్సిడిస్ బెంజ్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన కుటుంబంతో పాటు యాంకర్ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. అలాగే యాంకర్ రవితో కొత్త కారులో డ్రైవ్‌కు వెళ్లిన వీడియోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్... కొత్త కారు కొన్న హమీదాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి శ్రీరామ్‌తో ఎప్పుడు డ్రైవ్‌కు వెళ్తావ్? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆదిరెడ్డికి సర్‌ప్రైజ్.. కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్
Comments
Please login to add a commentAdd a comment