Hamida
-
Hamida: నటి బర్త్‌డే పార్టీలో బిగ్‌బాస్ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)
-
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్నా
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. రేపోమాపో టికెట్ టు ఫినాలే ప్రారంభం కానుంది. ఆల్రెడీ హౌస్‌మేట్స్‌కు బూస్ట్ ఇచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి సర్ప్రైజ్ ఇస్తున్నాడు బిగ్‌బాస్. మరోవైపు బిగ్‌బాస్ షో గురించి నిత్యం ఎవరో ఒకరిని పిలిచి డిబేట్ పెడుతూనే ఉంది అరియానా. తాజాగా బిగ్‌బాస్ కెఫెకు మాజీ కంటెస్టెంట్ హమీదా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది' అని అభిప్రాయపడింది. తన పేరెంట్స్ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది. అది సరే కానీ శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నావా? అంటూ కౌంటరిచ్చింది అరియానా. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్, అంతలోనే సర్ప్రైజ్ ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్ -
బెంజ్ కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
సాహసం సేయరా డింభకా సినిమాతో ప్రేక్షకులను అలరించింది హమీదా. అందచందాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదీ ముద్దుగుమ్మకీ. అయితే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌తో కావాల్సినంత పాపులారిటీ అందుకుంది హమీదా. సింగర్ శ్రీరామ్‌తో లవ్ ట్రాక్ నడిపి బాగా ఫేమస్ అయింది. తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ సందడి చేసింది. ఇదిలా ఉంటే హమీదా ఈ దీపావళికి కొత్త కారు కొనుక్కుంది. మెర్సిడిస్ బెంజ్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన కుటుంబంతో పాటు యాంకర్ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. అలాగే యాంకర్ రవితో కొత్త కారులో డ్రైవ్‌కు వెళ్లిన వీడియోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్... కొత్త కారు కొన్న హమీదాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి శ్రీరామ్‌తో ఎప్పుడు డ్రైవ్‌కు వెళ్తావ్? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) చదవండి: ఆదిరెడ్డికి సర్ప్రైజ్.. కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్ -
ఒకరికి బదులుగా మరొకరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్‌తో హౌస్ ఎమోషనల్‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో అషూ, అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర శర్మ, యాంకర్ శివ, బిందుమాధవి, హమీదా, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో అషూ, అఖిల్, బిందు మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది వారాలుగా నామినేషన్స్, ఎలిమినేషన్ విషయంలో వాళ్లు చెప్పిందే నిజమవుతూ వస్తోంది. ఈ లెక్కన బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదవ వారం హమీదా బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్ చేయాలనుకున్నారని, కానీ ఏదో సమస్య వల్ల చివరి నిమిషంలో హమీదాను పంపించివేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అనిల్‌కు లక్ బాగానే ఉందంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. చదవండి: మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే, నేనూ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
అషూకు ఆదిలోనే దెబ్బ, సిగ్గు లేదంటూ రెచ్చిపోయిన మిత్ర
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు. ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు. అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు.. కాజల్ -
రీఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ
సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది హమీదా. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముందీ.. ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సింగర్ శ్రీరామ్‌ను స్నేహితుడి కన్నా ఎక్కువ ప్రేమికుడి కన్నా తక్కువగా ఊహించుకున్న ఆమె అతడికే ఎక్కువ అంకితమైంది. దీంతో హమీదా అసలు గేమ్ చూడలేమనుకున్నవాళ్లకోసం మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిందీ బూరబుగ్గల బ్యూటీ. మరి ఈసారి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గేమ్ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించనుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
హమీదాతో నా రిలేషన్ అదే; ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు: శ్రీరామ్
Bigg Boss 5 Sreeram About Relationship With Hamida And His Journey: బిగ్‌బాస్ సీజన్-5లో సింగర్ శ్రీరామచంద్ర టాప్-3 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడెల్తో బాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న శ్రీరామ్‌కు సోనూసూద్, శంకర్ మహదేవన్ సహా పలువురు హిందీ సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు. అయితే ఓటింగ్‌లో మాత్రం శ్రీరామ్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓటమికి కారణాలు ఇంకా తెలియదు.. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని తను అంగీకరిస్తాను. సన్నీ, షణ్నూ ఇద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్ కానీ టైటిల్ విన్నర్ ఒకరే కాబట్టి సన్నీ గెలవడం సంతోషంగా ఉంది. ఇండియన్ ఐడెల్ సీజన్-5లో తాను గెలిచాను, దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో కూడా గెలుస్తానని అనుకున్నాను. కానీ ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులు నేను మూడో స్థానంలో ఉండాలనుకున్నారు. వాళ్ల నిర్ణయానికి గౌరవిస్తా' అని పేర్కొన్నాడు. ఇక హమీదాతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. 'తను నాకు చాలా మంచి ఫ్రెండ్. క్లోజ్ అవుతున్న టైంలోనే బయటకు వెళ్లిపోయింది. ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలీదు. బిగ్‌బాస్‌లో కొంచెం ఉన్నా దాన్ని పెద్దగా చేసి చూపిస్తారుగా'.. అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. : -
హీరో అఫ్ బిగ్‌బాస్ ఎవరంటే?
-
అది ప్రేమో, స్నేహమో?.. కానీ బాగుంది: హమిదా
Hamida About Sreerama Chandra: బిగ్‌బాస్ ప్రతి సీజన్లో లవ్ ట్రాక్ అనేది తప్పకుండా ఉంటుంది. హౌజ్‌లోని ఈ లవ్ ట్రాక్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్లో అయితే ఏకంగా ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ నడిచింది. మోనాల్-అఖిల్- అభిజిత్ మధ్య జరిగిన లవ్‌ట్రాక్ బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సీజన్లో కూడా శ్రీరామ్, హమిద మధ్య లవ్ ట్రాక్ బాగానే నడిచింది. కానీ అనుకోకుండా హమిద గతవారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించబోయే చిత్రాలివే.. అయినప్పటికీ ఆమె శ్రీరామ్‌ని మర్చిపోలేకపోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ శ్రీరామ్, తనకు మధ్య అద్భుతమైన బంధం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘శ్రీరామ్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. ఈ బాండింగ్, జీవితంలో ప్రేమ కోసం వేతుకుతున్న నాకు బిగ్‌బాస్‌లోకి వచ్చే అవకాశం వచ్చింది. అక్కడ నాకు శ్రీరామ్ పరిచయం ఎంతో అనుభూతిని ఇచ్చింది. చదవండి: శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి అది స్నేహమా, ప్రేమ అని చెప్పలేను. కానీ మా మధ్య మంచి బాండింగ్ ఎర్పడింది. శ్రీరామ్ ఎప్పుడు నా మనసులో ఉంటాడు. అది ఏదైనా కానీ ఇది ఒక అద్భుతమైన బంధం. చాలా బాగుంది’ అంటూ మనసులోని మాటను బయటక పెట్టింది. అలాగే తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చూశానని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే తను సినీ ఇండస్ట్రీకి రావడం మొదట్లో తన తండ్రికి అసలు నచ్చలేదని, కానీ ఇప్పుడు తనని చూసి ఆయన గర్వపడుతున్నారంటూ హమిదా ఆనందం వ్యక్తం చేసింది. కాగా హమిదా కలకత్తాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె తెలుగు బాగా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. చదవండి: Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు -
ఆ ప్రేమ రామ్‌లో కనిపించింది.. హమిదా ఎమోషనల్
బిగ్‌బాస్ ప్రతి సీజన్లో లవ్ ట్రాక్ కచ్చితంగా నడుస్తుంది. గత సీజన్లో అయితే ఏకంగా ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ నడిచింది. మోనాల్-అఖిల్- అభిజిత్ మధ్య జరిగిన లవ్‌ట్రాక్ బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సీజన్లో కూడా శ్రీరామ్, హమిద మధ్య లవ్ ట్రాక్ బాగానే నడిచింది. కానీ అనుకోకుండా హమిద గతవారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ శ్రీరామ్‌ని మర్చిపోలేకపోతుంది. తను ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో నూ శ్రీరామ్ గురించి స్పెషల్‌గా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వచ్చే కంటే కూడా అక్కడ శ్రీరామ్‌ను వదిలి రావడం ఎక్కువగా బాధ అనిపించిందని చెప్పింది. రామ్‌తో ఏర్పడిన కనెక్షన్ ఆ ఇంటి వరకు మాత్రమే పరిమితం కాదని.. బయటకు వచ్చిన తర్వాత కూడా తమ బంధం కొనసాగుతుందని తెలిపింది. తాను, శ్రీరామ్ లవర్స్ కాదని, తమ మధ్య మంచి రిలేషన్ఉందని చెప్పింది. ‘ నేను ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నానో అది శ్రీరామ్ దగ్గర నుంచి నాకు లభించింది. తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మేమిద్దరం అన్ని విషయాలు షేర్ చేసుకుంటుండే వాళ్లం. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చే ముందు రోజు రాత్రి కూడా నేను తనతోనే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోయాను’ అంటూ హమీద కన్నీరు పెట్టుకున్నారు. శ్రీరామ్ తర్వాత తనకు ఇంట్లో అంత జెన్యూన్‌గా కనెక్ట్ అయిన మరో పర్సన్ యాంకర్ రవి అని చెప్పింది. అతడిని అన్నయ్య అని పిలుస్తానని.. ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేశాడు అంటుంది. ఇంట్లో మిగిలిన వాళ్ళతో తనకు జెన్యూన్‌గా కనెక్షన్ లేదని.. కేవలం శ్రీ రామచంద్రతో మాత్రమే కలిసాను అంటుంది. -
బిగ్‌బాస్: హమీదా పారితోషికం ఎన్ని లక్షలంటే?
Bigg Boss Telugu 5, Hamida Remuneration: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా కుర్రకారు మనసు దోచేసింది హమీదా. చిలిపి నవ్వుతో, చురకత్తుల్లాంటి ఆలోచనలతో, తస్సాదియ్య అనిపించే ఆటతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే ఈ భామ ఐదు వారాలకే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో సరైన ఫ్యాన్‌బేస్ లేకపోవడంతోనే ఆమె ఓటింగ్‌లో వెనకబడిపోయిందంటున్నారు నెటిజన్లు. శ్రీరామ్‌తో నడుపుతున్న లవ్ ట్రాక్‌తో ఆమెకు కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరికినప్పటికీ అందరికన్నా తక్కువ ఓట్లు పడటంతో ఎలిమినేట్ అవక తప్పలేదు. ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందర్భంగా హమీదా పారితోషికం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఒక్క వారానికిగానూ 80 వేల నుంచి లక్ష రూపాయల మేర రెమ్యునరేషన్ అందుకున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ లెక్కన ఆమె ఐదువారాలకుగానూ నాలుగున్నర లక్షల పై చిలుకే వెనకేసుకుంది. కాగా గతవారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ కూడా వారానికి లక్ష అందుకున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే! ఇక బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామర్ అద్దడానికి హమీదా ఎంతగానో ఉపయోగపడింది కాబట్టి ఆమెకు లక్షకు పైనే ఇచ్చినా తప్పు లేదంటున్నారు బుల్లితెర అభిమానులు. -
శ్రీరామ్‌పై ప్రేమను బయటపెట్టిన హమీదా!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఐదో ఎలిమినేషన్ ఊహించినట్లుగానే జరిగింది. ముందు నుంచీ అనుకున్నట్లే హమీదా హౌస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఆమె లేని లోటు అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్‌ను వెంటాడనుంది. నిరంతంరం అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అటు పనుల్లోనూ, ఇటు టాస్కుల్లోనూ శ్రీరామ్ చేయి విడవలేదు హమీదా. అలాంటిది సడన్‌గా అతడికి దూరం కావాల్సిరావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేముందు శ్రీరామ్‌ను కళ్లారా చూసుకుని మనసారా ఏడ్చేసింది. అతడి మీదున్న ప్రేమను తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో బయటపెట్టిందీ బ్యూటీ. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైన హమీదా కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. షణ్ముఖ్ హౌస్‌లో పెదరాయుడు అని చెప్పుకొచ్చింది. సిరి.. గ్రూప్‌లో ఉందని, ఆమె చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేయడానికి ఆలోచిస్తుందని పేర్కొంది. శ్రీరామ్, మానస్ రెండు కళ్లు అన్న ప్రియాంక సింగ్ రిలేషన్‌షిప్‌ను ఫేక్ చేస్తుందని ఆరోపించింది. హౌస్ నుంచి ఏం తీసుకువెళ్తున్నావ్? అన్న అరియానా ప్రశ్నకు హమీదా క్షణం ఆలోచించకుండా శ్రీరామ్ అని సమాధానమిచ్చింది. అంతేకాకుండా శ్రీరామ్ ఫొటో చూడగానే సిగ్గుతో ముడుచుకుపోతూనే ఎమోషనల్ అవుతూ లవ్ సింబల్ చూపిస్తూ మనసులోని ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్యాయంగా శ్రీరామ్-హమీదాలను విడదీసారంటూ కామెంట్లు పెడుతున్నారు. -
బిగ్‌బాస్ హౌస్‌కు నేనే హీరోయిన్: హమీదా
Bigg Boss Telugu 5: నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నాగ్ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోయాడు. అటు కంటెస్టెంట్లు కూడా పోటీపడి మరీ అలంకరించుకున్నట్లు కనిపిస్తోంది. సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్, 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు. గెలిచిన రవి టీమ్ ఇందులో భాగంగా A టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు B టీమ్‌లో ఉంటారు. మొదటగా వీరిద్దరికీ మధ్య రింగ్ ఫైట్ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి అతడికి ధైర్యం నూరిపోసిన మాటలను చూపించగా అతడు తెగ సంతోషపడ్డాడు. తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో రవి టీమ్ గెలవగా అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో కొరియోగ్రాఫర్.. ఉద్వేగానికి లోనైంది. అనంతరం హెబ్బా పటేల్.. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ.. డ్యాన్స్‌తో హుషారెత్తించింది. కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ డబ్బాలు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ రావడం గమనార్హం. కానీ రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో A టీమ్ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయారు. ఈ సందర్భంగా యాంకర్ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. స్పెషల్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న సంధ్యారాణి తర్వాత నాగార్జున రెండు టీములను చెరో 5 ప్రశ్నలు అడిగాడు. ఈ గేమ్‌లో ఎక్కువ సమాధానాలు చెప్పి ప్రియ టీమ్ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. అందులో విశ్వ భార్య మాట్లాడుతూ.. ఏదున్నా మసులో పెట్టుకోకని సూచించింది. నాట్యం సినిమా కథానాయిక సంధ్యారాణి తన స్పెషల్ పర్ఫామెన్స్తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఉర్రూతలూగించిన మంగ్లీ అనంతరం కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్ గెలిచింది. దీంతో ఆమె సభ్యురాలిగా ఉన్న B టీమ్‌కు పాలపిట్ట అవార్డు రాగా ప్రియకు ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత హౌస్మేట్స్ బతుకమ్మ పేర్చి ఆడారు. బతుకమ్మ అందంగా పేర్చి ప్రియ టీమ్ గెలిచి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో కాజల్‌కు ఆమె కూతురు మాట్లాడిన వీడియో చూపించారు. అటు మంగ్లీ మాస్ పాటలు పాడి తన గాత్రంతో అందరినీ ఓ ఊపు ఊపేసింది. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడు.. తర్వాత వచ్చిన హైపర్ ఆది కంటెస్టెంట్లు అందరినీ చెడుగుడు ఆడేశాడు. హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు అనే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్ తాకిన షర్ట్‌ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను హగ్ చేసుకున్నారు. నన్నేం చేస్తావంటూ పంచ్ వేశాడు. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు మునగాలన్న టాస్క్‌లో B టీమ్ నుంచి విశ్వ గెలిచింది. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె మాట్లాడిన వీడియో చూపించారు. ప్రియ గెలిచింది 6, రవి గెలిచింది 2 తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌లో ప్రియ టీమ్ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో ఆ టీమ్‌లోని హమీదాకు ఆమె ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. ట్రోఫీ తీసుకొచ్చేయ్ అక్కా.. అంటూ ఆమె తమ్ముడు మాట్లాడిన మాటలు విని హమీదా కంటతడి పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీమ్. హీరో అఖిల్.. తనతో పాటు తీసుకొచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్ మాత్రం సింగిల్స్ కోసం స్కిట్ వేశాడు. జెస్సీ, మానస్ డ్యాన్స్‌తో పడగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది. అయితే ఈ గేమ్‌లో మానస్ గెలిచాడని తెలిపాడు నాగ్. దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు. తర్వాత షణ్ముఖ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా... వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హౌస్‌కు తానే హీరోయిన్ అని చెప్పుకొచ్చింది హమీదా. -
త్వరలో నీ గేమ్ బెడిసికొట్టే రోజొస్తుంది: రవికి కాజల్ వార్నింగ్
Bigg Boss Telugu 5, Episode 35: ఐదు రెట్ల ఫన్, ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే ఐదు వారాలు ముగిశాయి. ఈ వారం నామినేషన్లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వీరిలో నాగార్జున ఎవరిని సేవ్ చేశారు? ఎవరికి చీవాట్లు పెట్టారు? అనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 09) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రవి అందరికీ బ్రెయిన్‌వాష్ చేస్తున్నాడు.. ఇంటిసభ్యులందరూ కలిసి తనను జైల్లో వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది కాజల్. ఈ క్రమంలో ఆమెను ఊరడించాల్సింది పోయి అగ్గిపుల్ల గీకాడు మానస్. నువ్వు సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావని యాంకర్ రవి తనతో అన్నాడంటూ కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అతడు హౌస్‌లో అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇది విన్న కాజల్ తన వెనక ఇంత కుట్ర జరుగుతోందా? అని ఓ లుక్కిచ్చింది. సిరికి క్లాస్ పీకిన నాగ్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హాయ్ చెప్పిన నాగార్జున వచ్చీరాగానే శ్రీరామ్‌కు ఇబ్బందికర ప్రశ్న విసిరాడు. బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్ బిగ్‌బాస్ టైటిల్ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని మన్మథుడిలా నవ్వేసిన నాగ్.. నీ కెప్టెన్సీ బాగుందంటూనే, ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్ పీకాడు. రోజంతా పక్కవాళ్ల గురించి మాట్లాడటమే పనా? అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం చేయమని కౌంటరిచ్చాడు. దీంతో సిరి సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. రకుల్‌ను ప్రేమించావా?: వైష్ణవ్‌కు నాగ్ సూటి ప్రశ్న తర్వాత 'కొండపొలం' సినిమా టీమ్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసింది. ఈ క్రమంలో నాగ్.. ఇంత చిన్నవయసులోనే రకుల్‌ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్‌తేజ్ తెగ సిగ్గుపడ్డాడు. తర్వాత క్రిష్.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్, రవి, మానస్, శ్రీరామ్ టాప్ 5లో ఉంటారని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించిన అనంతరం వైష్ణవ్ తేజ్, క్రిష్ బిగ్‌బాస్ స్టేజీకి వీడ్కోలు పలికారు. కావాలని వేలు చూపించలేదు: లోబో ఎవరైనా మిడిల్ ఫింగర్ చూపించారా? అని నాగ్ కాజల్‌ను ప్రశ్నించగా ఆమె అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్. అందులో లోబో మిడిల్ ఫింగర్ చూపించినట్లు స్పష్టమైంది. అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం నాగ్.. హౌస్‌మేట్స్‌తో రూలర్ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్ రూలర్, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్.. హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్ రూలర్, షణ్ముఖ్ బానిస అని పేర్కొన్నాడు. ఇన్ఫ్లూయెన్స్ చేసే రవి బానిస: కాజల్ కాజల్.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలైంది. రవి.. మానస్‌ను రాజుగా, ప్రియాంక సింగ్‌ను బానిసగా తెలిపింది. సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్.. తన బెస్ట్ ఫ్రెండ్‌కు కిరీటం ధరించాడు. శ్రీరామ్‌తో ఎక్కువ కనెక్ట్ అయి, గేమ్‌కు డిస్కనెక్ట్ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు. ఈ వారం హమీదా కనిపించనేలేదు: షణ్ను సన్నీ.. మానస్ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్‌గేమ్ ఆడిన రవి కింగ్ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు. ఇక హమీదా.. మానస్‌ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్ఫ్లూయెన్స్ చేసే కాజల్ రాణి, ఇన్ఫ్లూయెన్స్ అయ్యే మానస్ బానిస అని అభిప్రాయపడింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజు.. జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్‌ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా కీర్తించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని మెచ్చుకున్నాడు. కెప్టెన్ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. 9 మంది నామినేషన్లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్ చేయకపోవడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం హమీదా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి, -
బిగ్ ఎలిమినేషన్: జెస్సీ సేఫ్, హమీదా అవుట్!
Bigg Boss 5 Telugu, 5th Week Elimination: బిగ్‌బాస్ ఆడే ఆటలో ఏ కంటెస్టెంటు ఎన్ని రోజులు ఉంటాడనేది కచ్చితంగా చెప్పలేము. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులను బట్టి, కంటెస్టెంట్లు ఆడే గేమ్‌ను బట్టి ఏరోజుకారోజు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే ఎలిమినేషన్లోనూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ వారం యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్లో ఉన్నారు. వీరిలో హమీదా, విశ్వ, జెస్సీ డేంజర్ జోన్లో ఉండగా వీళ్లలో నుంచే ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే ఈ ముగ్గురిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఐదోవారం హమీదాపై ఎలిమినేషన్ వేటు పడినట్లు సోషల్ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటంలో హమీదా దిట్ట. కాకపోతే ఆమె హౌస్‌లో ఎక్కువగా శ్రీరామచంద్రతోనే ఉండటం, మిగతావాళ్లను లెక్కచేయకపోడంతో ఆమెపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ప్రతి చిన్న విషయానికి శ్రీరామ్ మీదే ఆధారపడుతోందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ అవ్వాలని కలలు కన్న హమీదా.. ఆ కల తీరకుండానే బయటకు వచ్చేసిందని విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే లవ్ ట్రాకులకు బాగానే ప్రాముఖ్యతనిచ్చే బిగ్‌బాస్ హమీదాను ఎలిమినేట్ చేయడం ఏంటో అర్థం కావడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు కొందరు నెటిజన్లు. మరి హమీదా నిజంగానే ఎలిమినేట్ అయిందా? లేదా? అన్నది క్లారిటీ రావాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బెడిసి కొట్టిన ప్లాను.. హమీదా త్యాగంతో కెప్టెన్‌గా ప్రియ!
Bigg Boss Telugu 5, Episode 33: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌కు జీవితంలోనే మర్చిపోలేని కానుకను అందించాడు బిగ్‌బాస్. ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని తండ్రి స్వాగతించిన వీడియోను ప్లే చేసి చూపించాడు. 'అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు. నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు' అంటూ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె తెగ ఎమోషనల్ అయింది. ఆమెను మరింత సంతోషపెడుతూ బిగ్‌బాస్ ఆమెకు చీర, పూలు, గాజులు, స్వీట్లు పంపించాడు. నాన్నను పట్టుకుని ఏడవాలనుంది: పింకీ ఈ సందర్భంగా తను పడ్డ కష్టాలను గుక్కపెట్టి చెప్పుకుంటూ ఏడ్చేసింది పింకీ. పండగకు ఇంటికి వెళ్లినా కూడా దొంగచాటుగా వెళ్లేదాన్నని, అలాంటిది మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది. ఇక తను బిగ్‌బాస్ నుంచి ఏ వారం వెళ్లిపోయినా సరే, కానీ వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. అనంతరం పింకీ అందంగా ముస్తాబవగా.. ఆమె యానీ మాస్టర్, సన్నీ, మానస్‌ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో హమీదా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడవడంతో శ్రీరామ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇక కంటెస్టెంట్లు ఏ రాజుకు సపోర్ట్ చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో బిగ్‌బాస్ ఫైనల్‌గా రాజుల దగ్గరున్న నాణాల సంఖ్యను వెల్లడించమని ఆదేశించాడు. సన్నీ దగ్గర 30, ఆయన రాజ్యంలోని మానస్ దగ్గర 240, షణ్ముఖ్ దగ్గర 220, జెస్సీ దగ్గర 209 నాణాలున్నాయి. రవి రాజు దగ్గర 50, అతడి రాజ్యంలోని యానీ మాస్టర్ దగ్గర 176, హమీదా దగ్గర 60, విశ్వ దగ్గర 10, శ్రీరామచంద్ర దగ్గర 52 నాణాలున్నాయని తెలిపారు. నాణాల లెక్కింపు తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు.. ఇప్పటికీ కంటెస్టెంట్లు వారి యువరాజుకు సపోర్ట్ ఉపసంహరించుకోవచ్చని, లేదా వేరే రాజుకు మద్దతు తెలపవచ్చని ఛాన్స్ ఇచ్చాడు. మొత్తంగా టాస్క్ ముగిసే సమయానికి రాకుమారుడు సన్నీ దగ్గర ఆరుగురు, రవి దగ్గర ఏడుగురు ప్రజలు ఉన్నట్లు కెప్టెన్ శ్రీరామ్ బిగ్‌బాస్‌కు విన్నవించాడు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున యువరాజు రవి నేరుగా కెప్టెన్సీకి పోటీపడతాడని ప్రకటించగా.. ఇంటిసభ్యులు అతడికి పట్టాభిషేకం జరిపించారు. అంతేకాకుండా ఓడిపోయిన రాకుమారుడితోపాటు అతడి ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్‌బాస్. దీంతో జెస్సీ, షణ్మఖ్, సిరి, కాజల్‌లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి. షణ్ముఖ్‌ను ప్రాధేయపడ్డ రవి.. అయినా పట్టించుకోలే అయితే షణ్ముఖ్ సరిగా మాట్లాడట్లేదని తెగ ఫీలయ్యాడు రవి. మనసులోనుంచి మాట్లాడురా అని నోరు తెరిచి అడిగినప్పటికీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజైన రవి.. ఆయన వెన్నంటే ఉండి రాజుగా గెలిపించిన ముగ్గురిని సమానంగా ధనాన్ని పంచి కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించమని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో రవి.. యానీ మాస్టర్, హమీదా, శ్వేతను పోటీదారులుగా పేర్కొన్నాడు. ఇంతలో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ప్రియ కోసం వెనక్కు తగ్గిన హమీదా ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. అంతేకాకుండా ఆమె కెప్టెన్‌గా గెలిస్తే ఈ సీజన్లో అందరిలాగే కెప్టెన్‌గా పోటీచేసే అర్హత తిరిగి లభిస్తుందని చెప్పాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్ పోటీ నుంచి వెనక్కు తగ్గిన హమీదా.. తన స్థానాన్ని ప్రియకు ఇచ్చింది. అనంతరం బిగ్‌బాస్ 'పదివేలు సరిపోవు సోదరా' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్ ట్యాంకులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయో వారే గెలిచినట్లు లెక్క! అని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ పోటీపడగా... ఫైనల్‌గా ప్రియ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అదెంతవరకు నిజమనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది! -
హమీదాను ఎత్తుకున్న శ్రీరామ్, ముఖం మాడ్చుకున్న ప్రియాంక!
Bigg Boss Telugu 5, Episode 27: హౌస్మేట్స్ రూల్స్ సరిగా పాటించనందుకు జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ కెప్టెన్‌గా అది నీ వైఫల్యమే అంటూ హౌస్మేట్స్ అతడిని చెత్త ఆటగాడిగా నిర్ణయించారు. మరోపక్క సింగర్ శ్రీరామ్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా హమీదా కోసం లవ్ సాంగ్ పాడుతూ, ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇక సన్నీ కూడా తన యాంకరింగ్‌తో దుమ్ము దులిపేశాడు. మరి నేటి (అక్టోబర్ 1) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. అర్ధరాత్రి సైగలు, గాల్లో ముద్దులు కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని, అలాంటి కెప్టెన్సీ తనకు దక్కకుండా చేసిందని కాజల్ మీద మండిపడింది శ్వేత. నువ్వు నీ మైండ్‌ను ఎక్కువగా వాడుతున్నావు, కానీ మనసును కాదని కాజల్‌ను విమర్శించింది. దీనిపై కాజల్ స్పందిస్తూ.. శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా, అంతే తప్ప నీ ఫీలింగ్స్ నాకు మ్యాటరే కాదని శ్వేత ముఖం మీదే చెప్పింది. ఇదిలా వుంటే రాత్రి అందరూ పడుకున్నాక శ్రీరామ్, హమీదా సైగలు చేసుకుంటూ గాల్లో ముద్దులు పంపుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. వయ్యారాలు ఒలకబోసిన ప్రియాంక సింగ్ తర్వాతి రోజు నటరాజ్ మాస్టర్ మరోసారి రవి మీద పడ్డాడు. రవి టాస్క్ చేస్తున్నంతసేపు నత్తలా అనిపించాడని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడని చిరాకు పడ్డాడు. అసలు తన పేరు కూడా ఎత్తొద్దని ఆయనకు చెప్పంటూ లోబోకు సూచించాడు. ఇక నల్లచీర కట్టుకుని ప్రియాంక సింగ్ వయ్యారాలు పోతుంటే శ్రీరామ్ పాటతో ఆమె వెనకాల పడ్డాడు. మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్.. అనంతరం బిగ్‌బాస్.. బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోమని ఆదేశించాడు. దీంతో శ్రీరామ్-హమీదా జంట.. లోబోను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. యానీ మాస్టర్-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్, కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్-సిరి.. మానస్ బెస్ట్, లోబో వరస్ట్ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్ మాస్టర్- లోబో... మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తెలిపారు. కాజల్-జెస్సీ.. మానస్‌ను బెస్ట్, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్, లోబో వరస్ట్ అని తెలిపారు. సన్నీ- మానస్.. లోబోను బెస్ట్ అని పేర్కొంటూ వేరేవాళ్ల నుంచి ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నావని జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తేల్చారు. మొత్తంగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు. దీంతో జెస్సీ రెండోసారి జైల్లోకి వెళ్లాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్పెషల్ షో జరిగింది. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కాజల్ మైక్ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్ టైమ్‌లో సిరి, డిన్నర్ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. మరి టిఫిన్ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్ అన్నావు, ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్ వేయగా శ్రీరామ్.. సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని కౌంటరిచ్చాడు. గుండెల్లో ఏ అమ్మాయైనా ఉందా? అన్న ప్రశ్నకు.. గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ ఓ ప్రియా.. ప్రియా.. పాటందుకుని ఊహల్లో తేలిపోయాడు. ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారన్న ప్రశ్నకు సింగర్.. హమీదా పేరు చెప్తూ పాటందుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్ చేశాడు. అయితే శ్రీరామ్ హమీదాకు క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది పింకీ. ఆమెను ఎత్తుకుని తిరగడం అవసరమా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత లోబో, సన్నీ కలిసి హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. -
కమిటెడ్ కాకపోతే సిరికి ట్రై చేసేవాడిని: శ్రీరామచంద్ర
బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేది కొట్లాటలు, టాస్క్‌లు మాత్రమే కాదు, లవ్ ట్రాకులు కూడా! హౌస్‌లో ప్రేమాయణం నడిపే కంటెస్టెంట్లు షో ముగిశాక మాత్రం అబ్బే, మా మధ్య అలాంటిదేమీ లేదంటారు. కేవలం ఫ్రెండ్షిప్ అని పుకార్లకు చెక్ పెడుతుంటారు. ఇది ప్రతి సీజన్‌కు సర్వసాధారణమైపోయింది. ఈ సారి బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాకులు అనగానే మొదటగా గుర్తొచ్చే జంట శ్రీరామ్- హమీదా. వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడమే కాక హమీదాకు మసాజ్‌లు కూడా చేశాడు శ్రీరామ్. తమ మధ్య ఉన్నది రిలేషన్‌కు ఏ పేరు పెట్టాలో అర్థం కాక సతమతమయ్యారిద్దరూ! కానీ ప్రేక్షకులు మాత్రం వీళ్లను క్యూట్ కపుల్‌గా పేర్కొంటున్నారు. అయితే శ్రీరామ్ తాజా ప్రోమోలో చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని ప్రియ ప్రశ్నించగా.. 'సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడిని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పా'నని మనసులోని మాటను బయటపెట్టాడు శ్రీరామ్. ఒక అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావని ప్రశ్నించగా అతడు హమీదాను సూటిగా చూడటంతో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇక సన్నీ తన యాంకరింగ్, ఇమిటేషన్‌తో మిగతా కంటెస్టెంట్లను కడుపుబ్బా నవ్వించాడు. -
సన్నీకి సపోర్ట్ చేయరు, హమీదాకు చేస్తారు!: శ్రీరామ్
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను వెంటాడే భయం నామినేషన్స్. దీని నుంచి తప్పించుకోవడానికి బిగ్‌బాస్ ఓ ఆయుధమిచ్చాడు. అదే కెప్టెన్సీ! కెప్టెన్ అయిన వ్యక్తి ఒక వారం పాటు నామినేషన్స్‌లోకి రాలేడు. అందుకే ప్రతి కంటెస్టెంట్ ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని కలలు కంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఈవారం కెప్టెన్సీకి పోటీపడేవారిని ఎంచుకునేందుకు బిగ్‌బాస్ నెగ్గాలంటే తగ్గాల్సిందే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో సన్నీ- మానస్, శ్రీరామ్-హమీదా, శ్వేత- యానీ మాస్టర్ జోడీలు బరువు తగ్గి ముందంజలో ఉన్నాయి. అయితే ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీ కోసం పోటీపడేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆయాజోడీలు ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదు అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎలాగో నువ్వు నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈసారి నేనే కెప్టెన్సీ కోసం పోటీ పడతాను అని హమీదాతో చెప్పుకొచ్చాడు శ్రీరామ్. హమీదా, శ్వేత, సన్నీ నిలుచుంటే.. హమీదాకు లేదా శ్వేతకు మాత్రమే సపోర్ట్ చేస్తారు, సన్నీకి చేయరు అని చెప్పాడు. అతడు చెప్పిందే కాస్త అటూఇటుగా నిజమైనట్లు తెలుస్తోంది. కాకపోతే హమీదా స్థానంలో శ్రీరామ్ బరిలో నిలిచినట్లు భోగట్టా! వీరిలో చాలామంది సన్నీకి సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేయగా శ్రీరామచంద్ర కెప్టెన్‌గా అవతరించాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి హమీదా తను కెప్టెన్ అయ్యి శ్రీరామ్‌ను రేషన్ మేనేజర్‌గా పెడతాననుకుంది. కానీ శ్రీరామ్ కెప్టెన్‌గా ఎన్నికై హమీదా రేషన్ మేనేజర్‌గా నియమించాడని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ హౌస్‌లో మటన్ బిర్యానీ, వీళ్లు ముక్క కూడా ముట్టలేదట!
Bigg Boss Telugu 5 Promo: 'తిండి కలిగితే కండ కలదోయ్' అంటారు! కానీ తిండిని కంట్రోల్లో పెట్టి బరువు తగ్గితే గెలుపు మీదేనోయ్ అంటున్నాడు బిగ్‌బాస్. ఓస్ అంతేనా అనేయకండి.. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల నోరూరించేలా టేస్టీ వంటకాలను హౌస్‌లోకి పంపిస్తూనే ఉన్నాడు. నోరు కట్టేసుకోలేక ఎవరో ఒకరు దాన్ని తింటూనే ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ అన్నం, ముద్ద పప్పు పంపించాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ విశ్వ ఆ ఫుడ్ అందుకుని ఆరగించాడు. తాజాగా నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిర్యానీని చూడగానే ఎన్నో గంటలుగా తిండీనిద్రా మాని ఉన్న కంటెస్టెంట్లలో నూతనోత్తేజం పొంగిపొర్లింది. ఇంకా కడుపు మాడ్చుకోవడం మా వల్ల కాదంటూ చాలామంది బిర్యానీని ఓ పట్టు పట్టారు. అయితే వీజే సన్నీ, శ్రీరామ్, హమీదా మాత్రం బిర్యానీని కనీసం ముట్టుకోలేదంటున్నారు లీకువీరులు. మరి ఇది నిజమేనా? కళ్ల ముందు బిర్యానీ కనిపిస్తున్నా ఆకలిని చంపుకుని నిలబడ్డారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు విశ్వ, పింకీ ఇద్దరూ కట్టెలు నరకడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. ఇందులో ఎవరు గెలిచారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్: హమిదా పంచ్‌కి నాగ్ షాక్!
బిగ్‌బాస్ హౌస్‌లో సండే అంటే ఫన్డే అన్న విషయం తెలిసిందే. నిన్న అంత హౌస్మేట్స్ అందరిపై సీరియస్ అయిన హోస్ట్ నాగ్.. ఈ రోజు వారితో చాలా సరదాగా ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఆదివారం మాదిరే ఈ వారం కూడా కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్ ఆడించాడు. (చదవండి: బిగ్‌బాస్: ప్రియ సేఫ్, లహరి ఎలిమినేట్!) అయితే ఈ రోజు కంటెస్టెంట్స్‌తో నాగ్ హోస్ట్‌గా కాకుండా ఓ ఫ్రెండ్‌లా వ్యవహరించాడు. హమిదాను చూస్తూ యూ లుకింగ్ హాట్ బేబీ అని నాగ్ అంటే.. టెల్ మి సమ్‌థింగ్ న్యూ(కొత్తది ఏదైనా ఉంటే చెప్పండి)అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది హమిదా. దీంతో నాగ్ షాకయ్యాడు. ఇక సిరి హన్మంత్ కూడా నేనేమి తక్కువ కాదనట్లుగా పంచ్‌లతో అదరగొట్టేసింది. ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ విడివిడి ఉండడం నచ్చడంలేదని నాగ్ అంటే.. మాక్కూడా ఇష్టంలేదు అంటూ సిరి సెటైర్ వేసింది. సన్నీతో పాట కూడా పాడించాడు. -
శ్రీరామ్-హమీదా రొమాన్స్, మాది ఫ్రెండ్షిప్ కాదంటూ.
Sreerama Chandra- Hamida: బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకునే సాధారణ ముచ్చట్లను కూడా లవ్ యాంగిల్లో చూపించడం బిగ్‌బాస్‌కే చెల్లుతుంది. అయితే బిగ్‌బాస్ అలా చూపించాడంటే దానికో అర్థం, పరమార్థం ఉంటుంది. త్వరలోనే ఆ ఇద్దరి మధ్య లవ్ యాంగిల్ స్టార్ట్ కాబోతుందని ముందుగానే జనాలకు హింట్ ఇస్తాడన్నమాట! తాజా సీజన్లో సింగర్ శ్రీరామచంద్ర, నటి హమీదా లవ్ బర్డ్స్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. శ్రీరామ్ ఎక్కువగా హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఆమెకు స్పెషల్‌గా మసాజ్‌లు కూడా చేశాడు. ఈ మధ్యే రొమాంటిక్ డ్యాన్స్‌తో అందరినీ అలరించిందీ జంట. లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీరామ్ గురించి హమీదా.. కాజల్‌తో చెప్పుకుంటూ సిగ్గుపడిపోయింది. 'శ్రీరామ్ రాత్రి కప్ కడుగుతున్నాడు. ఆ సమయంలో నేను నా కప్ అక్కడ పెట్టి వెళ్లాను. వచ్చేసరికి నా కప్ కూడా కడుగుతున్నాడు. ఎందుకిలా చేశావంటే పర్లేదన్నాడు. తర్వాత నన్ను హగ్ చేసుకుని భుజంపై ముద్దు పెట్టాడు. వెంటనే మరో భుజం చూపించి అక్కడ కూడా కిస్ చేయమన్నాడు' అని నవ్వేసింది. రాత్రిపూట శ్రీరామ్, హమీదా మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హమీదా మాట్లాడుతూ.. నేను సన్నీతో, మానస్‌తో, నీతో మాట్లాడే తీరులో తేడా కనిపించడం లేదా? అంతా ఒకేలాగా అనిపిస్తుందా? అని మనసులోని మాటను బయటపెట్టే ప్రయత్నం చేసింది. దానికి శ్రీరామ్.. నాకు తెలియదు, అంతలా గమనించను అని ఆన్సరివ్వడంతో హర్ట్ అయిన హమీదా కొన్నిసార్లు అర్థం అవుతావు, కొన్నిసార్లు కావు అని బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. నీకు మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియట్లేదు. మనం బ్రదర్ అండ్ సిస్టరా? ఫ్రెండ్సా? అంతకు మించా? అనేది అర్థం కావట్లేదు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందన్నాడు. కానీ వీళ్లిద్దరి వ్యవహారం చూసిన నెటిజన్లు వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందంటున్నారు. -
హమీదాకు గోరుముద్దలు: భరించలేకపోయిన ప్రియాంక సింగ్
Bigg Boss Telugu 5, Episode 20: బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నానన్నాడు షణ్ముఖ్. సిరి తనతో మాట్లాడమని ఎంత బతిమిలాడినా అతడు మాత్రం పట్టించుకోలేదు. బెడ్డు దగ్గరకొచ్చి బుజ్జగించినా అతడు చలించలేదు. తర్వాత బిగ్‌బాస్ అతికిందంటే అదృష్టమే అనే లగ్జరీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫోయిలవగా సన్నీ, రవి, శ్రీరామ్ కిందామీదా పడి పూర్తి చేశారు. కాళ్లు విరగ్గొట్టేసేవాడిని.. ఆవేశంతో ఊగిపోయిన మాస్టర్ మానస్ హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఇంటి ముచ్చట్లు మాట్లాడాడు. ఈ మధ్య లహరి పొసెసివ్‌గా ప్రవర్తిస్తోందన్నాడు. మొన్న అమ్ముకు రోటీ తినిపిస్తుండగా నువ్వు కూడా తినిపించమన్నావు.. సరే, ఇద్దరికీ కలిసి తినిపిద్దాం అని అక్కడకు వెళ్లి కూర్చుందాం అంటే కుదరదు అని చెప్పేసింది, ఇక్కడే ఇంకో రోటీ తినిపించమని అని మొండిగా ప్రవర్తించిందన్నాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ దేనికో బాగా ఉడుక్కున్నాడు. 'ఎలా ఆడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషనల్ డైలాగులు.. బయటైతే కాళ్లు విరగ్గొట్టేసేవాడిని..' అంటూ ఏవేవో మాట్లాడాడు. దీంతో అక్కడున్న సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో ఎవరి గురించి అంటున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చెప్తానన్నాడు. అయితే ఆయన అంటోంది తననే అని అటు యాంకర్ రవి, ఇటు జెస్సీ ఎవరికి వారే తెగ ఫీలయ్యారు. మాస్టర్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడని రవి అభిప్రాయపడ్డాడు. మానస్ జైలుకు వెళ్లడం కూడా స్ట్రాటజీనే! తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా అభివర్ణిస్తూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ అభిప్రాయపడింది. ఆ కోతిముఖానికి తినిపించడం అవసరమా?: పింకీ మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది. తప్పు హౌస్మేట్స్ది, శిక్ష కెప్టెన్‌కు! తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా కానీ తాను నిద్రపోలేదని బుకాయించాడు. కెప్టెన్‌గా తన మాట ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా వస్తున్నారా అని ఆతృతగా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భార్యను చూసి బోరుమని ఏడ్చిన నటరాజ్ ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని ఆయన భోరుమని ఏడ్చేశాడు. సిరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షణ్నూ మాత్రం ఆమెను దూరం పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కాజల్‌తో చెప్పుకుంటూ బాధపడింది సిరి. షణ్ముఖ్ తనతో ఫేక్‌గా ఉంటున్నాడని, మనస్ఫూర్తిగా లేడని వాపోయింది. జెస్సీతో డిస్కనెక్ట్ అయ్యానని తెలిపింది. మన మధ్య రిలేషన్ ఏంటి?: శ్రీరామ్ ఇక హమీదా, శ్రీరామ్ రాత్రిపూట కబుర్లాడారు. హమీదా ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. నీ మైండ్‌లో ఏముందో చెప్పేసెయ్ అన్నాడు శ్రీరామ్. నేను సన్నీని, మానస్‌ను, నిన్ను ఒకేలా చూడట్లేదని నొక్కి చెప్పింది. కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. హమీదాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీకు, మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మనిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా కావచ్చు అని చెప్పాడు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. మరి వీళ్ల మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి! -
జీవితాంతం సింగిల్‌గానే ఉంటా!: హమీదా బ్రేకప్ లవ్ స్టోరీ
కోరుకున్న ప్రతీది మన సొంతం కాదు, అది వస్తువు అయినా, ప్రేమ అయినా! హమీదా విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఆ ప్రేమ పొందినట్లే పొంది అంతలోనే చేజారిపోయింది. ఆ ప్రేమ ముచ్చట్లను మరోసారి గుర్తు చేసుకుంటూ కంతడి పెట్టుకుంది హమీదా. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హమీదా తన తొలి ప్రేమ కథను వెల్లడించింది. "మాది మూడేళ్ల ప్రేమనో, పదేళ్ల ప్రేమనో తెలియడం లేదు. మా మధ్య ఎప్పుడూ బ్రేకప్ అవ్వలేదు, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. నా ఫ్యామిలీ కోసం వాడిని వదులుకున్నా. వాడి పేరు తల్చుకున్నా కూడా ఏడుపొస్తుంది. వాడిని జాన్ అని పిలిచేదాన్ని, ఇప్పటికీ తను నాకు జానే. నేను వాడికి న్యాయం చేశానా? అన్యాయం చేశానా? నాకు తెలియదు." "కానీ వాడే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా. ఐదేళ్ల తర్వాత కలిసినప్పుడు వాడికి చెప్పాను.. స్టిల్ ఐ లవ్యూ అని! దానికతడు లేట్ అయిపోయిందన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే.. నువ్వు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఇలానే సోలోగా, ఫ్యామిలీతో ఉండిపోతాను అని చెప్పాను. వాడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా లవ్ యూ అని చెప్తూనే ఉంటాను. వాడు కూడా లవ్ యూ టూ అంటాడు, కానీ తనకు నా మీద నమ్మకం లేదు. మళ్లీ నేను ఫ్యామిలీ దగ్గరకు వెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తానో అనుకుంటున్నాడు. ఈ ప్రేమ విషయం నా పేరెంట్స్‌కు కూడా ఇంతవరకు చెప్పలేదు. కానీ వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. తనతో ఉన్న జ్ఞాపకాలను డిలీట్ చేశాను" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది హమీదా. -
దీప్తి సునయన ప్లేస్‌లో నా పేరు పెట్టు: షణ్ముఖ్‌కు హమీదా ఆఫర్
Bigg Boss 5 Telugu Latest Promo: షణ్ముఖ్, దీప్తి సునయన.. ఈ యూట్యూబర్లు ఇద్దరూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లే.! కాకపోతే దీప్తి రెండో సీజన్లో పాల్గొంటే షణ్నూ లేటేస్ట్‌గా ఐదో సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు. అతడిని ఎలాగైనా గెలిపించాలని తెగ ఉవ్విళ్లూరుతోంది దీప్తి. అందుకే ప్రేయసిగా తను ఏమైతే చేయగలదో అంతా చేస్తోంది. సోషల్ మీడియాలో షణ్నూకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు, అతడు టీవీలో కనిపించగానే తెగ సంబరపడుతోంది. తాజాగా షణ్ను బర్త్‌డేను పురస్కరించుకుని బిగ్‌బాస్ సెట్ ముందు సెలబ్రేషన్స్ జరిపి రచ్చరచ్చ చేసింది. ఏం కాదు, చెప్పురా: షణ్నూను ఊరడించిన హమీదా అయితే హౌస్మేట్స్ షణ్నూ మనసులో ఉన్న దీప్తి సునయన స్థానానికే ఎసరు పెడుతున్నారు. హమీదాతో లింకు పెడుతూ అతడిని ఆటపట్టిస్తున్నారు. ఈ మేరకు స్టార్ మా ఓ ప్రోమోను వదిలింది. ఇందులో కాజల్ మరోసారి ఆర్జే అవతారమెత్తింది. హమీదాలో నీకు నచ్చే మూడు క్వాలిటీస్ చెప్పమని షణ్నూను ప్రశ్నించింది. అందుకు అతడు కొంత ఇబ్బంది పడుతుండటంతో హమీదా.. ఏం కాదు, చెప్పురా! అంటూ తన చేయి పట్టుకోమని అందించింది. ఇది చూసి షాకైన లహరి.. దీప్తి సునయన ఇక్కడ కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. దీప్తి సునయన పేరు తీసేయ్, నా పేరు రాసుకో: హమీదా వీరి వ్యవహారం చూసిన యాంకర్ రవి.. షణ్ను ఎంతో ప్రేమగా చూసుకునే దిండు మీద కన్నేశాడు. ఆ దిండు మీద S(షణ్ముఖ్), D(దీప్తి సునయన) అని రాసున్నాయని, మధ్యలో H(హమీదా) అని రాస్తానని చెప్పడంతో జడుసుకున్న షణ్నూ ఆ పని మాత్రం చేయొద్దంటూ దండం పెట్టేశాడు. అయితే హమీదా మాత్రం ఏకంగా.. ఇంట్లో ఉన్నంతవరకు ఆ దిండుపై D తీసేసి H రాసుకోమని ఆఫర్ ఇచ్చింది. కావాలంటే బయటకెళ్లాక మళ్లీ D రాసుకోమని సలహా ఇవ్వడంతో షణ్నూ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ తర్వాత షణ్నూ బర్త్‌డేను పురస్కరించుకుని దీప్తి సునయన స్పెషల్ విషెస్ చెప్పిన వీడియోను బిగ్‌బాస్ హౌస్‌లో ప్లే చేశాడు. అందులో దీప్తి ఐ లవ్యూ చెప్పడంతో షణ్నూ ఎమోషనల్ అయ్యాడు. మరి హౌస్‌లో అతడి పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్లో జరిగాయో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
హమీదా.. నీ అందానికి అందరూ ఫిదా
-
హమీదాకు మసాజ్ చేసిన శ్రీరామ్, లవ్ మొదలైందా!
Bigg Boss 5 Telugu Promo: అరుపులు, కొట్లాటలు, బూతులతో బిగ్‌బాస్ హౌస్ అట్టుడికిపోతోంది. మామూలుగానే మాటలతో విరుచుకుపడే కంటెస్టెంట్లు టాస్క్‌ల్లో తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అయితే మరీ ఈ రేంజ్లో కొట్టుకోవడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. కుళాయి దగ్గర నీళ్ల కోసం మహిళలు పెట్టుకునే కొట్లాటల కంటే దారుణంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి అరాచకాన్ని చూడలేకపోతున్నాం, వాళ్లకు అప్పుడప్పుడూ కాస్త పువ్వులను చూపించండ్రా, మరీ వయొలెంట్‌గా ఉన్నారు అని సలహా ఇస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా నడుస్తోందంటూ ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఈ ప్రోమోలో ఒకే టీములో ఉన్న శ్రీరామచంద్ర, హమీదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కబుర్లాడుతూ కనిపించారు. అంతేకాదు, హమీదాకు మసాజ్ చేస్తున్నాడు శ్రీరామ్. ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనుకుంటాను అని మనసులో మాట బయట పెట్టింది. దీనికి ఏదోలా ఉందీ వేళ నాలో.. ఈ వింత ఏమిటో.. గిలిగింత ఏమిటో అని బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సాంగ్ ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. అక్కడ అంత గొడవ జరుగుతుంటే వీళ్లు ఈ గ్యాప్‌లో పులిహోర కలుపుతున్నారు అని కొందరు సెటైర్లు వేస్తుండగా అక్కడ అంత సీనేమీ ఉండదు కానీ దాన్ని ఓ పాటేసి ఓవర్‌గా చూపిస్తున్నారంతే అని తేలికగా తీసిపారేస్తున్నారు. మరి నిజంగానే వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందా? లేదా మామూలు ఫ్రెండ్సా? అన్నది తెలియాల్సిందే! -
హమీదాను కొట్టిన శ్వేత! కళ్లలో రంగు పడుతున్నా డోంట్ కేర్!
Bigg Boss Telugu 5, Episode 09: రెండో వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాలు విసిరిన ఉమాదేవి నానాబూతులు కూడా మాట్లాడింది. ఆమె మాటలకు షణ్ముఖ్ బిత్తరపోగా యానీ మాస్టర్ ఏడ్చేసింది. ఇన్నాళ్లూ ఎంతో కూల్‌గా ఉన్న శ్వేత తనలోని ఉగ్రరూపం చూపించింది. ఆమె కోపానికి కారణమేంటి? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే... శ్వేతతో ఫ్లర్ట్ చేస్తా, కానీ ఆ పిల్లకు అర్థం కావట్లే.. కాజల్ మరోసారి తన నోటికి పని చెప్పింది. సన్నీలో మన్మథుడు యాంగిల్ కనిపించట్లేదని, మానస్ ఫ్లర్టింగ్ చేస్తాడని, శ్రీరామచంద్ర అయితే అందులో నెక్స్ట్ లెవల్ అని జెస్సీతో చెప్పుకొచ్చింది. తనకు ఫ్లర్టింగ్ రాదన్న జెస్సీ తర్వాత ఓపెన్ అయిపోతూ.. శ్వేతతో ఫ్లర్ట్ చేస్తాను కానీ ఆ పిల్లకు అర్థం కావట్లేదన్నాడు. ఎలాగో కాజల్ చెవిన పడేశాడు కాబట్టి ఆమె త్వరలోనే శ్వేతకు ఈ విషయం చెప్పడం ఖాయం. నక్క వర్సెస్ గద్ద టీమ్ మండే రోజు నామినేషన్ ప్రక్రియతో మళ్లీ అగ్గి రాజేశాడు బిగ్‌బాస్. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుందన్నాడు. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక ఉన్నారు. హౌస్మేట్స్ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్ పూయాల్సి ఉంటుందన్నాడు. అయితే ఇంటిసభ్యులు వాళ్ల టీమ్ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. సిరి కెప్టెన్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. కిచెన్‌లోకి కాదు, ఆటలోకి రా..: సలహా ఇచ్చిన సన్నీ మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియ.. మీరు ముందు ఇన్ఫ్లూయెన్స్ చేయడం ఆపేయండని కౌంటరిచ్చింది. తర్వాత ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. ఉమాదేవి, కాజల్‌ను; సన్నీ.. టాస్కుల్లో ఇంకా యాక్టివ్ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడతారు: లోబో సెల్ఫ్ డబ్బా ప్రియాంక.. నటరాజ్ మాస్టర్‌ను, 'వంట చేస్తే అందరూ తృప్తిగా తింటారనే వండుతాను, అలా అని కిచెన్‌లో ఉండిపోయి గేమ్ ఆడటం లేదంటే ఒప్పుకోను' అంటూ సన్నీని నామినేట్ చేసింది. మానస్.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేకపోయిన లోబో.. LOBO నాటే నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తనకు తాను డప్పు కొట్టుకున్నాడు. సపోర్ట్ చేయాలని పోతే తనకే నామం పెడుతున్నారని అసహనానికి లోనయ్యాడు. మరి ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేదని మానస్ అడగ్గా.. 'మీరు హీరో కదా! విననీకి రెడీ లేరు, నా ముందు యాటిట్యూడ్ చూపిస్తున్నవ్, కానీ నా ముందు చిన్నపిల్లోడివి' అని ఆవేశపడ్డాడు. తర్వాత మానస్.. ప్రియకు రంగు పూసి నామినేట్ చేశాడు. ఉమాదేవి, కాజల్‌ను నామినేట్ చేసిన విశ్వ అనంతరం విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్ చేశాడు. అయితే నాగ్.. ఆ కూరను ఎవరికీ షేర్ చేయొద్దన్నాడని, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఉమ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె బూతులు కూడా మాట్లాడటంతో ప్రియాంక సింగ్ పడీపడీ నవ్వింది. అనంతరం విశ్వ కాజల్‌ను నామినేట్ చేశాడు. లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, సెట్ శ్వేత కనబడట్లేదని శ్వేతను నామినేట్ చేశారు. ఇక ఉమాదేవి తనవంతు రాగానే ఓ రేంజ్లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్ చేసింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంకసింగ్, యానీ మాస్టర్ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. నాకు రెస్పెక్ట్ అవసరం లేదు అని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ.. పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్లిద్దరూ ఫేక్: శ్వేత లోబో.. టాస్క్ ఆడగా, పని చేయగా చూడలేదంటూ శ్వేతను నామినేట్ చేశాడు. రవి తనకు టఫ్ కాంపిటీషన్ అని, అతడితో దోస్తానా వద్దని దండం పెట్టేసి యాంకర్‌కు రంగు పూశాడు. తర్వాత వచ్చిన శ్వేత ఒక్కొక్కరికీ బొమ్మ చూపించింది. అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను పడేసింది. నా లైఫ్‌లో నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్ అని తిట్టిపోసింది. ఉమాదేవి మీద ఉగ్రరూపం, చప్పట్లు కొట్టిన హౌస్మేట్స్ ఆడవాళ్లకు ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడటంతో ఇంటిసభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని సపోర్ట్ చేసిన యానీ మాస్టర్‌ను అన్ని మాటలు ఎలా అనగలిగావు? అని నిలదీయడంతో మాస్టర్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఉమా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక హమీదాను ఫేక్ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది. కళ్లలో పడుతుందని వారిస్తున్నా తనకు అనవసరం అంటూ దురుసుగా ప్రవర్తించింది. అయితే శ్వేత తను నన్ను కొట్టిందంటూ ఏడ్చేసింది హమీదా. మీ బూతులు వినలేకపోతున్నా: షణ్ముఖ్ అది అక్కడున్నవాళ్లందరికీ అర్థం కాగా.. మానవత్వం గురించి మాట్లాడిన నువ్వు చేసిందేంటి? అని శ్వేతను ప్రశ్నించింది ప్రియ. దీంతో తన తప్పు అంగీకరించిన శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదాకు సారీ చెప్పింది. అమ్మాయికి క్షమాపణలు చెప్పింది కానీ తనకు మాత్రం సారీ చెప్పలేదని హర్ట్ అయ్యాడు లోబో. అనంతరం షణ్ముఖ్.. మీరు కరెక్ట్ కావచ్చేమోగానీ హౌస్‌కు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. పైగా మీరు మాట్లాడుతున్న బూతులు వినలేకపోతున్నానంటూ ఉమాదేవిని, ఒరిజినల్ క్యారెక్టర్‌ను చూడాలనుకుంటున్నానని జెస్సీని నామినేట్ చేశాడు. నామినేషన్లో ఏడుగురు కాజల్.. యానీ మాస్టర్, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్ మాస్టర్, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్. ప్రియ.. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. రవి.. ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. -
కాజల్ బండారం బయటపెట్టిన నాగ్, ఇన్‌స్టాలో ఆ వీడియోలేంటి?
Bigg Boss Telugu5, Episode 07: నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చేశాడు కింగ్ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఉమాదేవి అందరిమీదా అరిచేస్తుంటే, కాజల్ అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అభిప్రాయపడ్డాడు. లహరి ఇరిటేట్ అవుతుంటే, జెస్సీ పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వట్లేదన్నాడు. లోబో మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ వారం హౌస్‌లో జరిగిన తప్పొప్పులను కడిగేస్తానన్నాడు నాగ్. మరి నేటి(సెప్టెంబర్ 11) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని చదివేయాల్సిందే! జెస్సీని జైల్లో చూసి ఏడ్చేసిన సిరి, కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జెలు జీవితం గడుపుతున్న జెస్సీ తనలో తానే కుమిలిపోయాడు. ఇతన్ని మిగతా కంటెస్టెంట్లు ఓదారుస్తుంటే యానీ మాస్టర్, రవి.. వీళ్ల నటనను నిజమని నమ్ముతున్నాడంటూ జెస్సీ మీద జాలిపడ్డారు. అయితే సరయూ తనను బూతులు తిడుతోందం చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు జెస్సీ. అతడని అలాంటి పరిస్థితిలో చూసిన కాజల్, సిరి కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత సరయూ అతడికి దగ్గరకు వెళ్లి అన్నీ మర్చిపో అంటూ సారీ చెప్పింది. ఇక ఒకరోజు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం జెస్సీ జైలు నుంచి విడుదలయ్యాడు. సరయూను బూతులు మాట్లాడమన్న నాగ్ వీకెండ్ అనగానే కంటెస్టెంట్లు అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారికి నాగార్జున కనిపించగానే గ్రీకువీరుడు పాటతో హోస్ట్‌ను ఫిదా చేసేందుకు ప్రయత్నించారు. ఇక నాగ్ వారి అందాలను పొగుడుతూనే సరయూ బూతులు మాట్లాడట్లేదేంటి? అని అనుమానం వ్యక్తం చేశాడు. తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానన్న సరయూను.. నువ్వు నీలా ఉండు అంటూ ఆమె నోటికి పని చెప్పమని ప్రోత్సహించాడు. ఇక షణ్నూను 'అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, వన్ వీక్ అయిపోయింది. ఆట మొదలెట్రా' అని దెప్పి పొడిచాడు. కాజల్ హౌస్‌లో మ్యాట్రీమొనీ సర్వీసెస్ నడిపిస్తున్నట్లు ఉందని నాగ్ సెటైర్ వేశాడు. ఇక జెస్సీ తనకు అక్షింతలు పడతాయేమోనని టెన్షన్‌తో వణికిపోతుంటే నాగ్ మాత్రం హౌస్‌లో బాగానే ఉంటున్నావని మెచ్చుకోవడం విశేషం. కాజల్ బండారం బయటపెట్టిన నాగ్ అనంతరం ఇంటిసభ్యులకు 'ఎవరితో సెట్? ఎవరితో కట్?' అనే టాస్క్ ఇచ్చాడు. సెట్ అనుకునేవాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి, కట్ అనుకునేవాళ్ల ఫొటోలను చింపేయాలని ఆదేశించాడు. మొదటగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్ విశ్వ.. తనకు మానస్ సెట్ అని, ఇంటి పనులు చేయనన్న కాజల్‌తో కట్ అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్.. కాజల్ తనకు వంట రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయేంటని అనడంతో కాజల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అవి యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా రావంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక తనవంతు రాగానే జెస్సీ.. సన్నీతో సెట్, సరయూతో కట్ అని; లహరి.. ప్రియతో సెట్, కాజల్‌తో కట్ అని తేల్చేశారు. నేను వన్ మ్యాన్ ఆర్మీ, నాకు ఎవరూ సెట్ కాదు: సరయూ లోబో.. షణ్ముఖ్‌లో నాన్నగారిని చూశానని ఎమోషనల్ అవుతూ అతడితో సెట్, కాజల్‌తో కట్ అని వెల్లడించాడు. సరయూ వంతు రాగా.. తను ఎవరితోనూ సెట్ కాదని, వన్ మ్యాన్ ఆర్మీని అని పేర్కొంది. 'ఇతరుల సహకారంతో ఆడటం చాలా ఈజీ, ఎవరి సహకారం లేకుండా ఆడటం కష్టం, అది ఆడి చూపించు' అంటూ సిరి ఫొటోను చించేసి ఆమెతో కట్ అని చెప్పకనే చెప్పింది. శ్వేత.. యానీ మాస్టర్‌తో సెట్, ఉమాదేవితో కట్ అని; శ్రీరామచంద్ర.. కల్మషం లేని శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అని; సన్నీ.. హమీదాతో సెట్, రవితో కట్ అని చెప్పారు. సిరి మాట్లాడుతూ.. బయట మా ఇద్దరికీ పడదు కానీ ఇక్కడ షణ్నూ సెట్ అయ్యాడు. సరయూతో మాత్రం కట్ అని ఫొటో చించి చెత్తబుట్టలో పడేసింది. ఆ తర్వాత రవి సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. తెగ నటిస్తోందంటూ కాజల్ ఫొటో చించి చెత్తకుండీలో వేసిన ఉమాదేవి నటరాజ్ మాస్టర్ తన వంతు వచ్చేసరికి లోబోతో సెట్, కాజల్‌తో కట్ అని క్లారిటీ ఇచ్చేశాడు. మానస్.. రవితో సెట్, జెస్సీతో కట్ అని చెప్పగా, రవి.. పింకీతో సెట్, జెస్సీతో కట్ అని వెల్లడించాడు. ఉమాదేవి.. పింకీతో సెట్, నటిస్తున్న కాజల్‌తో కట్ అని కుండ బద్ధలు కొట్టేసింది. హమీదా.. సరయూతో సెట్, షణ్నూతో కట్ అని; ప్రియ... యానీ మాస్టర్‌తో సెట్, హమీదాతో కట్ అని; పింకీ.. ప్రియతో సెట్, నటరాజ్ మాస్టర్‌తో కట్ అని; కాజల్.. శ్రీరామచంద్రతో సెట్, ఉమాదేవితో కట్ అని చెప్పేశారు. ఆమెలో అమ్మను చూసుకుంటున్నా: ఏడ్చేసిన శ్వేత యానీ మాస్టర్.. తనలో అమ్మను చూసుకుంటున్న శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అంది. షణ్నూ.. తనతో ఈజీగా కలిసిపోయిన రవితో సెట్, హమీదాతో కట్ అని చెప్పాడు. అనంతరం తన దిండు సీక్రెట్‌ను బయటపెట్టాడు. అది కనిపించకపోతే కంగారెత్తిపోయే తాను దిండు మీద గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన పేరు రాశానని చెప్తూ తెగ సిగ్గుపడిపోయాడు. అనంతరం నాగార్జున హమీదా సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇంకా మానస్, కాజల్, సరయూ, జెస్సీ డేంజర్ జోన్లోనే ఉన్నారు. వీరిలో నాగ్ ఎవర్ని సేవ్ చేస్తాడు? ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! -
దమ్ముంటే మానస్ ముందు నాకు లైనేయ్: ప్రియాంక సింగ్
బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్లు మహాముదుర్లులా ఉన్నారు. చాలామంది పక్కా ప్రణాళికతో హౌస్‌లో అడుగు పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తే కెమెరాల్లో కనిపిస్తాం? ఎలా వ్యవహరిస్తే ఆడియన్స్‌ను బుట్టలో వేసుకోవచ్చు అన్న విషయాల్లో పీహెచ్డీ చేసినట్లు కనిపిస్తున్నారు. అందుకే హౌస్‌లో ఇలా అడుగు పెట్టారో లేదో అప్పుడే గొడవలు షురూ చేశారు. కొందరైతే కావాలని కన్నీళ్ల కుళాయిని విప్పుతూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నార జనాలు. ఇక ఇప్పటికే హౌస్‌లో లవ్ యాంగిల్‌ను కూడా పరిచయం చేశాడు బిగ్‌బాస్. అందరినీ అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంకసింగ్(పింకీ) మానస్‌ను మాత్రం అలా పిలవలేనని బాహాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటిది పింకీని ఓరగా చూశాడు లోబో. ఈ మేరకు గురువారం ఓ ప్రోమో రిలీజైంది. నువ్వు నన్ను చూస్తున్నావని మానస్‌కు ఫిర్యాదు చేస్తాను. నీకు దమ్ముంటే మానస్ ముందు లైనేయ్ అంది ప్రియాంక. దీంతో షాకైన లోబో.. నేను ప్రియాంకు ప్రపోజ్ చేద్దామనుకుంటే ఆమె ముందు నీతో మాట్లాడమంది అని చెప్తూ మానస్‌కు దండం పెట్టేశాడు. ఇక పవర్ యాక్సెస్ టాస్క్‌లో విశ్వ, మానస్, సిరి తర్వాత హమీదా గెలుపొందింది. అయితే తనకు బిగ్‌బాస్ టఫ్ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల్లో ఒకరు ఎప్పటికీ కెప్టెన్ కాకుండా ఎంచుకోవాలన్నాడు. దీంతో అయోమయంలో పడిపోయిన హమీదా నటి ప్రియ పేరు చెప్పినట్లు లీకైంది. అసలే కెప్టెన్సీ అనేది ఓ ఆపన్నహస్తం వంటిది. ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి దీన్ని మించిన అస్త్రం లేదు. అలాంటిది ఎప్పటికీ కెప్టెన్ అవలేరు అంటే అది నిజంగానే భారీ మైనస్‌గా మారనుంది. -
బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్! అలాంటి అమ్మాయే ఇష్టమంటున్న సింగర్!
Sreerama Chandra and Hamida: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఆది నుంచే రంజుగా మారింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా కంటెస్టెంట్లు ఓ రేంజ్లో పోట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని వాటికి కూడా అతిగా ఆవేశపడుతున్నారు. దీంతో వీరిది నటనా? లేక నిజమా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా వుంటే అందరి పర్సనల్ విషయాలు కూపీ లాగుతున్న కాజల్ ఈసారి సింగర్ శ్రీరామచంద్ర దగ్గర వాలిపోయింది. సేమ్ నీలాంటి అమ్మాయి ఉంటే నచ్చుతుందా? అపోజిట్ ఉంటే నచ్చుతుందా? అని అడిగింది. దీనికి శ్రీరామచంద్ర.. సరదాగా, బబ్లీగా ఉండేవాళ్లు నచ్చుతారు అని బదులివ్వగానే హమీదా మీద ఫోకస్ చేస్తూ హౌస్‌లో ఓ కొత్త లవ్ ట్రాక్ మొదలైందన్నట్లుగా చూపించారు. 'నీకు ఫీలింగ్స్ లేవా? ఏడ్వవా? అని బయట నాఫ్రెండ్స్ అంటుండే వాళ్లు' అని హమీదా చెప్పుకురాగా ఇక్కడ అవన్నీ బయటకు తన్నుకొచ్చేస్తున్నాయని బదులిచ్చాడు సింగర్. ఇద్దరూ ముచ్చట్లలో పడి సరదాగా నవ్వుకున్నారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. ఎడిటర్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. సాధారణ కబుర్లను కూడా లవ్ యాంగిల్లో చూపించడం మీకే చెల్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి అన్నీ కయ్యాలే చూపిస్తున్నారు అనుకునేలోగా పులిహోర విషయాల మీద ఫోకస్ పెట్టాడుగా అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
బిగ్‌బాస్: లోబోతో కలిసి దమ్ము కొట్టిన భామలు
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే మేల్ కంటెస్టెంట్లలో పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్ అయ్యేలా లేరని లహరి షారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని సిగ్గులమొగ్గయింది. ఇక యానీ మాస్టర్ మార్నింగ్ డ్యాన్స్‌లో మాత్రమే కనిపిస్తుండగా తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్ జోన్లో దర్శనమిచ్చారు. లోబోతో కలిసి ఈ ఇద్దరు భామలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి ముచ్చట్లను ప్రస్తావించారు. ఇంటి సభ్యుల్లో కొందరు కనెక్ట్ కావడం కష్టమని, బయటే కనెక్ట్ అవుతామంటూ సంభాషించారు. అనంతరం సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని బదులిచ్చాడు లోబో. అన్‌సీన్ ఎపిసోడ్లో ప్రసారం చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అరేయ్ ఏంట్రా ఇది?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by BiggBossTelugu5 (@bbtelugu5offl) -
బిగ్‌బాస్ హౌస్‌లో పిల్లి లొల్లి.. జెస్సీ కంటతడి
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం.అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత కనీసం వారం రోజుల తర్వాత ఈ చిచ్చు మొదలవుతుంది. కానీ ఐదో సీజన్లో మాత్రం రెండు రోజులకే రచ్చ మొదలైపోయింది. నామినేషన్ ప్రక్రియలో జెస్సీ, హమిదా మధ్య పిల్లి లొల్లి మొదలైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. లోబో గురకతో విసిగెత్తిపోయిన జెస్సీ, హహీదా, శ్వేతా వర్మ.. గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!) ఈ సందర్భంగా హమీదా తన పెంపుడు పిల్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. సాధారణంగా పిల్లులు మ్యావ్ అని అరుస్తాయి. కానీ తన పిల్లి మాత్రం మా.. అమ్మా అని పిలిస్తాయాని చెప్పింది. వాటికి చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండా ‘అమ్మా’అనే మాటలను ప్రాక్టీస్ చేయించానని, అందుకే అవి అలా పిలుస్తాయని చెప్పింది. అది విని జెస్పీ షాకయ్యాడు. అంతేకాదు తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పగా... కుక్కలు ఏమంటాయ్? డాడీ అని పిలుస్తాయా?అని సరదాగా అన్నాడు. ఆ మాటలకు హర్ట్ అయినా హమీదా.. ఈ విషయాన్ని మిగతా ఇంటి సభ్యులతో పంచుకుంది. దీంతో జెస్సీ ఫైర్ అయ్యాడు. నేను సరదాగా అన్నానని, అయినా అక్కడే నేను సారీ కూడా చెప్పాను. మళ్లీ ఎందుకు ఆ విషాయాన్ని ప్రస్తావిస్తున్నావని కోపగించాడు. దీని కారణంగానే హమీదాతో పాటు విశ్వ, యానీ మాస్టార్ అతడిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు. ఆ సమయంలో జెస్సీ ఎమోషనల్‌కు గురయ్యాడు. ఇలా మొత్తానికి పిల్లి లొల్లి వల్ల జెస్సీ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు. ఇక హమిదా పిల్లి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. మరి వీరిలో ఎమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!
Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్ ఐదో సీజన్లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్మేట్స్ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి. దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు. మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా.. ఇక ప్రియాంక సింగ్ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్. చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్, యాంకర్ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్, జెస్సీలను నామినేట్ చేశారు. చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్ పారితోషికం ఎంతో తెలుసా? యాంకర్ రవికి కౌంటరిచ్చిన నటరాజ్ మాస్టర్ ఇక బిహేవియర్ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్ చేసింది యానీ మాస్టర్. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్ చేశాడు నటరాజ్ మాస్టర్. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్ చేశాడు. ఫస్ట్ వీక్‌లోనే అందరూ నామినేట్ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్ చేసిన లోబో రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్ చేశాడని జెస్సీని నామినేట్ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్ చేశాడు షణ్ముఖ్. యాటిట్యూడ్ చూపించిందని ప్రియను, యాపిల్ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్ చూపించాడని రవిని నామినేట్ చేశాడు లోబో. మొదటి వారం నామినేట్ అయిన ఆరుగురు మానస్.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్, లహరిని; ప్రియాంక సింగ్.. షణ్ముఖ్, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్.. విశ్వ, సరయూలను; కాజల్.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి! -
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?!
బోర్డమ్ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ఆడియన్స్‌కు మాటిచ్చేశాడు నాగ్. అన్నట్లుగా ఎక్కువ వినోదాన్ని అందించాలంటే అంతే ఎక్కువ కంటెస్టెంట్లు ఉండాలనుకున్నారో ఏమోగానీ ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు. వీరిలో నటి సిరి హన్మంత్, వీజే సన్నీ, నటి లహరి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, ప్రముఖ నటి ప్రియ, మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ), ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జశ్వంత్, నటి హమీదా, నటరాజ్ మాస్టర్, నటి ఉమాదేవి, విశ్వ, 7ఆర్ట్స్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ, యాంకర్ రవి ఉన్నారు. నేడు హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈవారం నామినేషన్లో ఉండేది వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. యాంకర్ రవి, జెస్సీ, మానస్, హమీదా, కాజల్, సరయూ తొలివారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియ కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మొట్టమొదట సేవ్ అయ్యే కంటెస్టెంట్ యాంకర్ రవి అని ఊహించవచ్చు. యాంకర్ రవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అతడు ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కుతాడు. మరి మిగతా ఆరుగురిలో ఎవరు సేవ్ అవుతారు? ఈ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉన్నాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బిగ్‌బాస్ 5: అబ్బాయిల కళ్లు ఇష్టమంటున్న నటి హమీదా
నటి హమీదా సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ నటి బిగ్‌బాస్ ద్వారా తన కెరీర్‌ను గాడిలో పెట్టాలనుకుంటోంది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో పదకొండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన హమీదా.. అబ్బాయిల్లో తనకు హైట్, కళ్లు, చిరునవ్వు, హెయిర్ స్టైలింగ్ అంటే ఇష్టమని చెప్పింది. దీంతో బిగ్‌బాస్ స్క్రీన్‌పై ఇతర మేల్ కంటెస్టెంట్ల కళ్లు మాత్రమే చూపించాడు. అందులో ఒకరి కళ్లు తనకు బాగా నచ్చాయని చెప్పింది హమీదా. మరి ఆ కళ్లు ఎవరివి? వారి మధ్య స్నేహం చిగురిస్తుందా? అన్నది మున్ముందు తేలనుంది. -
'సాహసం సేయరా డింభకా' స్టిల్స్
-
అనుబంధం...అనురాగం!
తల్లీ కొడుకుల అనుబంధాన్నీ, ప్రేయసీ ప్రియుల అనురాగాన్నీ ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘మొహబ్బత్ మే’. కార్తీక్, హమీదా జంటగా మహేశ్ సూర్య దర్శకత్వంలో రమా రవిశంకర్ నిర్మిస్తోన్న ఈ హిందీ టైటిల్ తెలుగు సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలో పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో అమ్మ పాట హైలైట్ అని సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ చెప్పారు. కార్తీక్, అనిత తదితరులు సినిమా బాగా వచ్చిందని అన్నారు.