
Bigg Boss 5 Telugu Latest Promo: షణ్ముఖ్, దీప్తి సునయన.. ఈ యూట్యూబర్లు ఇద్దరూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లే.! కాకపోతే దీప్తి రెండో సీజన్‌లో పాల్గొంటే షణ్నూ లేటేస్ట్‌గా ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అతడిని ఎలాగైనా గెలిపించాలని తెగ ఉవ్విళ్లూరుతోంది దీప్తి. అందుకే ప్రేయసిగా తను ఏమైతే చేయగలదో అంతా చేస్తోంది. సోషల్ మీడియాలో షణ్నూకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు, అతడు టీవీలో కనిపించగానే తెగ సంబరపడుతోంది. తాజాగా షణ్ను బర్త్‌డేను పురస్కరించుకుని బిగ్‌బాస్ సెట్ ముందు సెలబ్రేషన్స్ జరిపి రచ్చరచ్చ చేసింది.
ఏం కాదు, చెప్పురా: షణ్నూను ఊరడించిన హమీదా
అయితే హౌస్‌మేట్స్ షణ్నూ మనసులో ఉన్న దీప్తి సునయన స్థానానికే ఎసరు పెడుతున్నారు. హమీదాతో లింకు పెడుతూ అతడిని ఆటపట్టిస్తున్నారు. ఈ మేరకు స్టార్ మా ఓ ప్రోమోను వదిలింది. ఇందులో కాజల్ మరోసారి ఆర్జే అవతారమెత్తింది. హమీదాలో నీకు నచ్చే మూడు క్వాలిటీస్ చెప్పమని షణ్నూను ప్రశ్నించింది. అందుకు అతడు కొంత ఇబ్బంది పడుతుండటంతో హమీదా.. ఏం కాదు, చెప్పురా! అంటూ తన చేయి పట్టుకోమని అందించింది. ఇది చూసి షాకైన లహరి.. దీప్తి సునయన ఇక్కడ కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించింది.
దీప్తి సునయన పేరు తీసేయ్, నా పేరు రాసుకో: హమీదా
వీరి వ్యవహారం చూసిన యాంకర్ రవి.. షణ్ను ఎంతో ప్రేమగా చూసుకునే దిండు మీద కన్నేశాడు. ఆ దిండు మీద S(షణ్ముఖ్), D(దీప్తి సునయన) అని రాసున్నాయని, మధ్యలో H(హమీదా) అని రాస్తానని చెప్పడంతో జడుసుకున్న షణ్నూ ఆ పని మాత్రం చేయొద్దంటూ దండం పెట్టేశాడు. అయితే హమీదా మాత్రం ఏకంగా.. ఇంట్లో ఉన్నంతవరకు ఆ దిండుపై D తీసేసి H రాసుకోమని ఆఫర్ ఇచ్చింది. కావాలంటే బయటకెళ్లాక మళ్లీ D రాసుకోమని సలహా ఇవ్వడంతో షణ్నూ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ తర్వాత షణ్నూ బర్త్‌డేను పురస్కరించుకుని దీప్తి సునయన స్పెషల్ విషెస్ చెప్పిన వీడియోను బిగ్‌బాస్ హౌస్‌లో ప్లే చేశాడు. అందులో దీప్తి ఐ లవ్‌యూ చెప్పడంతో షణ్నూ ఎమోషనల్ అయ్యాడు. మరి హౌస్‌లో అతడి పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్‌లో జరిగాయో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment