
స్టార్ యూట్యూబ్ జంట షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన కొత్త సంవత్సరానికి బ్రేకప్ న్యూస్‌తో వెల్‌కమ్ చెప్పిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం రోజు ఈ ప్రేమజంట తమ దారులు వేరని ప్రకటించింది. ఇప్పటిదాకా కలిసి సాగించిన ప్రయాణానికి స్వస్తి పలుకుతూ ఇకపై విడివిడిగా ఉంటామని వెల్లడించారు. వీరి బ్రేకప్ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జంట విడిపోయి వారానికి పైనే అవుతున్నా ఫ్యాన్స్ మాత్రం మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్ సాంగ్ 'మలుపు' మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది' అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది.
ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. 'మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి', 'మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్ ఇదే అవుతుందనుకోలేదు', 'ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి' అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. వంద రోజుల రియాలిటీ షో వల్ల భవిష్యత్తును పాడు చేసుకోకండని సూచిస్తున్నారు. కాగా శనివారం(జనవరి 8న) రిలీజ్ చేసిన మలుపు మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment