Malupu
-
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే ఉంటుంది.. వీడియో వైరల్
స్టార్ యూట్యూబ్ జంట షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన కొత్త సంవత్సరానికి బ్రేకప్ న్యూస్‌తో వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం రోజు ఈ ప్రేమజంట తమ దారులు వేరని ప్రకటించింది. ఇప్పటిదాకా కలిసి సాగించిన ప్రయాణానికి స్వస్తి పలుకుతూ ఇకపై విడివిడిగా ఉంటామని వెల్లడించారు. వీరి బ్రేకప్ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జంట విడిపోయి వారానికి పైనే అవుతున్నా ఫ్యాన్స్ మాత్రం మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్ సాంగ్ 'మలుపు' మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది' అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది. ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. 'మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి', 'మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్ ఇదే అవుతుందనుకోలేదు', 'ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి' అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. వంద రోజుల రియాలిటీ షో వల్ల భవిష్యత్తును పాడు చేసుకోకండని సూచిస్తున్నారు. కాగా శనివారం(జనవరి 8న) రిలీజ్ చేసిన మలుపు మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
గెలుపు కోసం... ఎన్నెన్నో మలుపులు
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘మలుపు’ తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ,మిథున్ చక్రవర్తి కెమేరా: షణ్ముఖ సుందరం సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్ నిర్మాత: రవిరాజా పినిశెట్టి రచన - దర్శకత్వం: సత్యప్రభాస్ పినిశెట్టి కళ జీవితాన్ని అనుకరిస్తుందంటారు! నిజజీవిత కథలు వెండితెర కళగా తెర మీదకు రావడం ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే, కొన్ని చిత్రమైన యథార్థ సంఘటనలు సినిమాటిక్‌గా తెరపై పలకరించినప్పుడు, అది నిజజీవిత ఘటనే అని తెలిసినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజా ‘మలుపు’ చిత్రం కూడా అలాంటిదే! నిజానికిది చెన్నైలో నలుగురు ఫ్రెండ్స మధ్య జరిగిన కథ. సినిమా కోసం తెలుగులో ఇది విశాఖపట్నంలో జరిగిందన్నట్లు చూపెట్టారు. కథ ప్రకారం హాయిగా, మరో ముగ్గురు స్నేహితులతో కలసి జీవితాన్ని గడిపేసే కుర్రాడు ‘సగా’గా అందరూ పిలుచుకొనే సతీష్ గణపతి (ఆది పిని శెట్టి). అతని ఫ్రెండ్సలో ఒకడు పోలీస్ కమిషనర్ కొడుకు, మరొకడు పార్ల మెంట్ సభ్యుడి కొడుకు. ఈ ఫ్రెండ్స అంతా జీవితంలో మరికొన్నాళ్ళు కలిసి స్టూడెంట్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం డిగ్రీ ఫైనలియర్ ఎగ్జావ్ు్స రాయ కుండా ఎగ్గొడతారు. హీరోకు అమ్మ (ప్రగతి), నాన్న, అక్క ఉంటారు. లాస్య (నిక్కీ గల్రానీ) అనే మోడరన్ ఏజ్ ఫాస్ట్ గర్లను హీరో ప్రేమిస్తాడు. ఆమెను రక్షించే క్రమంలో ఒక గొడవలోనూ ఇరుక్కుంటాడు. ఇంతలో అక్క పెళ్ళి పనులు హీరోకు అప్పగించి, అమ్మానాన్న ఊరెళతారు. తీరా, వాళ్ళటెళ్ళగానే ఆ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అనూహ్యమైన ఒక సంఘటన ఎదురవుతుంది. దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ నుంచి అతని జీవితమే తలకిందులైపోతుంది. దాంతో ముంబయ్‌లోని నేర సామ్రాజ్యనేత ముదలియార్‌ను వెతుక్కుంటూ అతను బయలుదేరతాడు. ఇంతకీ, ఆ డిసెం బర్ 31 రాత్రి ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ అంశం. దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ రోజేం జరిగింది? దానికీ, ముంబయ్ డాన్కీ లింకేంటి? జీవితంలో కుటుంబమా, స్నేహమా... ఏది ముఖ్యం? ఏదో ఒకటే ఎంచుకో వాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? లాంటి ప్రశ్నలకు జవాబు మిగతా సినిమా. సస్పెన్స డ్రామాను నమ్ముకొన్న ఈ కథలో అవన్నీ తెరపై చూడాలి. ‘పెదరాయుడు’, ‘చంటి’ లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాత అవతారమెత్తి, తెలుగు, తమిళాల్లో నిర్మించిన సినిమా ఇది. ఆయన పెద్ద కొడుకు సత్యప్రభాసే దీనికి దర్శకుడు కూడా! తేజ దర్శకత్వంలో ‘ఒక ‘వి’చిత్రమ్’ ద్వారా తెలుగులో పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత తెలుగులో కనిపించింది తక్కువన్న (‘గుండెల్లో గోదారి’) మాటే కానీ, తమిళంలో పేరున్న హీరో. ‘మృగమ్’, ‘ఈరమ్’ లాంటి తమిళ చిత్రాల ద్వారా తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఈ సమ్మర్‌కి రానున్న ‘సరైనోడు’లో విలన్‌గా కనిపించనున్న ఆదికి ఇది ఓ కీలకమైన పాత్ర. తెలుగు వాచికం స్పష్టంగా ఉన్న ఈ చెన్నై కుర్రాడి నటన, డ్యాన్సులు, ఫైట్లు మాస్ మెచ్చేవే. నిక్కీ గల్రానీ పాత్రోచితంగా బాగున్నారు. హిందీ హిట్ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘గోపాల... గోపాల’లో కనిపించిన ప్రసిద్ధ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి ఓ కీలకపాత్రధారి. నిజానికి, ఆయన అంగీకరించిన తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ఇదే. కాకపోతే, దీని తమిళ వెర్షన్ కన్నా ముందే తెలుగులో ‘గోపాల... గోపాల’ రిలీజైపోయింది. ముంబయ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపే నేరసామ్రాజ్య నేత ముదలి యార్గా ఆయన బాగా చేశారు. చూడడానికి కూడా విభిన్నంగా ఉన్నారు. నాజర్, పశుపతి లాంటి సీజన్డ ఆర్టిస్ట్‌ల కంట్రోల్డ్ యాక్షన్ కూడా బాగుంది. రచన, దర్శకత్వ విభాగాల్లో సత్యప్రభాస్ కొత్త తరానికి నచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్సను నమ్ముకున్నారు. వర్తమానానికీ, గడచిపోయిన సంఘటనల ఫ్లాష్ బ్యాక్లకూ మధ్య తరచూ అటూ ఇటూ తిరిగే కథాకథన శైలిని బలంగా ఉప యోగించుకున్నారు. ఆసక్తికరంగా ఆరంభమయ్యే ఈ సినిమా కాసేపయ్యాక ఎక్కువగా ప్రేమకథ వైపు మొగ్గుతుంది. ఆ క్రమంలో వేగం తగ్గడం అర్థం చేసుకోవాలి. ఇంటర్వెల్‌కు కాస్తంత ముందు నుంచి కథలో వేగం, అదే ఊపులో ట్విస్టులు పెరుగుతాయి. సినిమా చివరకు వచ్చేసరికి కథ ఎన్నెన్నో ములుపులు తిరుగుతుంది. కొండొకచో అవి పరిమితి మించాయనిపించినా ఉత్కంఠ ఆశించే ప్రేక్షకులు ఫిర్యాదులు చేయరు. నిజానికి, ఎనిమిది నెలల క్రితమే ఈ సినిమా తమిళంలో విడుదలైంది. అక్కడి టైటిల్ - ‘యాగవ రాయినుమ్ నా కాక్క’. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. చిత్ర నిర్మాత, దర్శ కుడు, హీరో - అందరూ తెలుగు వాళ్ళు కావడంతో ఆలస్యంగానైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సినిమాలు తమిళ ప్రేక్షకులకు కొత్త కాకపోయినా, తెలుగు వారికి కొత్తగా అనిపించడం, ఇటీవలి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండడం బాక్సాఫీస్ వద్ద గెలుపు విషయంలో ‘మలుపు’కు కలిసొచ్చే అంశాలు. - రెంటాల జయదేవ -
ప్రతి మలుపూ కొత్తగా...!
‘యముడికి మొగుడు, చంటి, బంగారు బుల్లోడు, పెదరాయుడు’... లాంటి కమర్షియల్ టచ్ ఉన్న కుటుంబ కథాచిత్రాలనందించి సక్సెస్ఫుల్ దర్శకుడనిపించుకున్నారు రవిరాజా పినిశెట్టి. ఆయన రెండో కుమారుడు ఆది పినిశెట్టి తమిళంలో గుర్తింపున్న హీరో. ఇక, పెద్ద కుమారుడు సత్యప్రభాస్ తండ్రి బాటలో దర్శకుడయ్యారు. తమ్ముడు ఆది హీరోగా తండ్రి నిర్మాణంలో ఆదర్శ చిత్రాలయ పతాకంపై సత్యప్రభాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మలుపు’. ఇవాళ తెరపైకొస్తున్న ఈ చిత్రం గురించి సత్యప్రభాస్ మాట్లాడుతూ - ‘‘నేను ఏంబీఏ పూర్తి చేశాక అమెరికా వెళ్లాను. అక్కడి ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్ తీయాలి. అప్పుడు ‘మై సిస్టర్ అండ్ ఐ’ పేరుతో నేను తీసిన షార్ట్ ఫిలిమ్ చూసి, చేర్చుకున్నారు. అక్కడ డిగ్రీ పూర్తి చేశాక, కమర్షియల్, కామెడీ టచ్ ఉంటూనే కొత్త రకం సినిమాలు తీయాలని బలంగా నిర్ణయించుకుని ఇండియాకు వచ్చాను. ఆ మేరకు నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘మలుపు’ చేశాను. ప్రతి మలుపూ కొత్తగా ఉంటూ, ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. దర్శకుడిగా నాన్నగారి ప్రభావం నా పై లేదు. ఆయన కూడా మేము స్వశక్తిగా ఎదగాలనుకుంటారు. ఈ సినిమా చూసి, ‘పాసయ్యావ్.. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అని అభినందించారు’’ అని చెప్పారు. హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, ‘‘గంటా యాభై నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఓ కొత్త సినిమా చూసిన ఫీల్‌ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. నేపథ్యం అంత కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు’లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హీరోగానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చేయాలన్నది నా అభిప్రాయం. అందుకే ‘సరైనోడు’ ఒప్పుకున్నా. అందులో నేను స్టైలిష్ అండ్ స్లీక్ విలన్‌గా కనిపిస్తా’’ అని యువ నటుడు చెప్పారు. -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!
- నిక్కీ గల్రానీ ‘‘చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. నేను మాత్రం చదువు మధ్యలోనే మానేసి ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి, సినిమా రంగానికి వచ్చా’’ అన్నారు యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాల్లో నటించిన నాయిక సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’లో, ఆది పినిశెట్టికి జతగా ‘మలుపు’ చిత్రంలో హీరోయిన్గా నటించారామె. ఈ రెండు చిత్రాలూ ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. తెలుగులో తన తొలిచిత్రమైన ‘కృష్ణాష్టమి’ విశేషాలు నిక్కీ గల్రానీ మాటల్లోనే... * చదువుతున్నప్పుడు మధ్యలో మానేసి మోడలింగ్‌లోకి వచ్చా. కేవలం 10 నెలల్లో 45 యాడ్స్ చేశా. ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా రంగానికి వచ్చా. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రెండున్నరేళ్లలో 15 సినిమాలు చేశా. * మలయాళంలో చేస్తున్నప్పుడు నిర్మాత ‘దిల్’ రాజుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. కానీ, మలయాళ చిత్రం పూర్తయ్యేవరకు కుదరదని చెప్పా. తరువాత ‘దిల్’రాజుగారు ఫోన్ చేసి, ‘నెల తరువాతే షూటింగ్’ అని చెప్పడంతో ఓకే అనేశా. అలా తెలుగులో ‘కృష్ణాష్టమి’ నా మొదటి చిత్రమైంది. * ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర చేశా. ‘పల్లవిజం’ అనే బుక్ రాస్తుంటా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందనుకునే తత్త్వం. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటుంది. * కెరీర్‌పరంగా నాకు ఏదైనా అనుమానం వస్తే మా అక్క సంజనను అడిగి, సమాధానం తెలుసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగ అన్నమాట! * వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి హీరో సునీల్. ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. విదేశాల్లో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో వణుకొచ్చే చలిలో కూడా ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి జాగింగ్‌కు వెళ్లొచ్చేవారు. నేను చాలా సహనంగా ఉంటాను. ఇక, మా డెరైక్టర్ వాసువర్మగారైతే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. * ఏ సినిమా చేసినా నా పాత్రకూ, నా నటనకూ ప్రాధాన్యం ఉండాలి. నా సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలి. అటువంటి పాత్రలైతేనే ఎంచుకుంటా. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిలను చీరలో కూడా అందంగా చూపొచ్చు. ఈ చిత్రంలో స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యత ఉండదు. * తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ తర్వాత ఖరారు చేస్తా. -
కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..
తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం ఆనందంగా ఉందని సినీనటి నిక్కీ గర్లాని అన్నారు. సునీల్‌తో కలిసి ఆమె నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో సందడి చేశారు. ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. తాను నటించిన మరో చిత్రం ‘మలుపు’ కూడా రిలీజ్‌కు సిద్ధమైందని, రెండూ హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగళూరుకు చెందిన అమ్మాయినే అయినా ఈ చిత్రాల కోసం తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. - బంజారాహిల్స్ -
యథార్థ కథతో!
‘‘నా పెద్ద కుమారుడు సత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మించాను. సత్య తన ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు’’ అని సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అన్నారు. సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో తన రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ ఈ నెల 19న విడుదల కానుంది. నిక్కీ గల్రాని కథానాయిక. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సత్య ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఆది రేంజ్‌కు మించి ఈ సినిమా కోసం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం తను ఎన్నో ఆఫర్స్ వదిలేసుకున్నాడు’’ అని చెప్పారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ మిస్ కాదు’’ అని ఆది అన్నారు. నిక్కీ, ప్రగతి, ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
‘మలుపు’ మూవీ స్టిల్స్
-
అనుకోని మలుపు
జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఓ యువకుడు ముంబయ్లోకి అడుగుపెట్టాడు. కానీ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ముంబయ్ మాఫియా అతని జీవితంలోకి అడుగుపెట్టింది. అలాంటి సందర్భంలో జీవితంలోని సవాళ్లను అతనెలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే ‘మలుపు’ చూడాల్సిందే అంటున్నారు సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన తనయుడు ఆది పినిశెట్టి, నిఖిత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన మరో తనయుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. ఈ నెల 14న పాటలను, 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘స్నేహం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం. -
అరుదైన కలయిక
ఇటీవలి కాలంలో ఇదొక అరుదైన సందర్భం. తండ్రి నిర్మాత... ఒక కొడుకు హీరో... మరొక కొడుకు దర్శకుడు. పైగా, సినిమా ఏమో రెండు భాషల్లో! ఈ అరుదైన దృశ్యానికి సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుటుంబం కారణమైంది. రవిరాజా నిర్మాతగా, ఆయన కుమారుల్లో ఒకరైన సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా, ఆది పినిశెట్టి హీరోగా, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తయారవుతున్న చిత్రం ‘మలుపు’. నిక్కీగల్ రాణి కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. ‘‘ఆది ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ‘మలుపు’ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.