యథార్థ కథతో! | Aadhi Pinisetty's career set to take 'Malupu'! | Sakshi
Sakshi News home page

యథార్థ కథతో!

Published Sun, Feb 14 2016 11:08 PM | Last Updated on Sun, Jul 14 2019 1:28 PM

యథార్థ కథతో! - Sakshi

యథార్థ కథతో!

‘‘నా పెద్ద కుమారుడు సత్య ప్రతిభ  మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మించాను. సత్య తన ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు’’ అని సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అన్నారు. సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో తన రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా రవిరాజా పినిశెట్టి  నిర్మించిన ‘మలుపు’  ఈ నెల 19న విడుదల కానుంది. నిక్కీ గల్రాని కథానాయిక.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సత్య ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఆది రేంజ్‌కు మించి ఈ సినిమా కోసం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం తను ఎన్నో ఆఫర్స్ వదిలేసుకున్నాడు’’ అని చెప్పారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాదు’’ అని ఆది అన్నారు. నిక్కీ,  ప్రగతి, ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement