
ఆది పినిశెట్టి- డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'శబ్దం'.. 'వైశాలి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇందులో సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ కార్యక్రంలో భాగంగా మీడియాతో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో విడాకుల రూమర్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు.
హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్తా ప్రేమగా మారడం.. ఆపై నిక్కీనే ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటి అయ్యారు.

అయితే, విడాకుల రూమర్స్ గురించి ఆది పినిశెట్టి ఇలా రియాక్ట్ అయ్యారు. నిక్కీ తనకు స్నేహితురాలు కావడంతో పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. అలా చాలాబాగా అందరితో ఆమె కలిసిపోయింది. 'మేము సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటే.. కొందరు విడాకులు తీసుకుంటున్నామని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌లో కథనాలు కూడా వచ్చాయి. అలాంటివి చాలానే మా వరకు వచ్చాయి.
అలాంటి వారిని ఏం అనాలో కూడా అర్థం కాదు. ఒక్కోసారి బాగా కోపం కూడా వస్తుంది. వారి యూట్యూబ్ ఛానల్స్‌లలో పాత వీడియోలను చెక్ చేస్తే.. అన్నీ ఇలాంటి రూమర్స్ వార్తలే ఉన్నాయి. వ్యూస్ కోసం వాళ్లు ఈ దారి ఎంచుకున్నారని అర్థం అయింది. వాళ్లను పట్టించుకోకపోవడమే మంచిదని వదిలేశాను. కానీ, వాళ్ల బాగు కోసం ఇతరుల జీవితాలను రోడ్డున పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాలి.' అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment