Aadhi Pinisetty
-
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్‌పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.The thrill has a new face! 🎬🔥#Sabdham trailer is out now!🎧Link: https://t.co/FsVROFuRUnGet ready for a #SoundThriller ❤️🔥From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28Starring @AadhiOfficialAn @dirarivazhagan FilmA @MusicThaman Musical pic.twitter.com/FTt0HZ814g— Aadhi🎭 (@AadhiOfficial) February 19, 2025 -
థ్రిల్లింగ్ శబ్దం
‘వైశాలి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘శబ్దం’. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్ తదితరులు ఇతరపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో శివ నిర్మించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తెలుగులో ఎన్ సినిమాస్ ద్వారా రిలీజ్ అవుతోంది. ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘శబ్దం’. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
ఓటీటీకి సిద్ధమైన హన్సిక చిత్రం.. థియేటర్ల కంటే ముందుగానే!
కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, హన్సిక హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం పార్ట్నర్. తమిళంలో ఆగస్ట్ 25న రిలీజైన ఈ మూవీని తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 6 నుంచి సింప్లీసౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఓవర్సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. (ఇది చదవండి: జిమ్ ట్రైనర్‌పై లైంగిక వేధింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో నటుడి అరెస్ట్!) అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంగా డైరెక్టర్ మనోజ్దామోదరన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగిబాబు కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్, టీజర్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. -
కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం
నటుడు ఆది పినిశెట్టి తమిళంలో కథానాయకుడిగా నటించి చాలా కాలం అయ్యింది. ఈయన ఇటీవల విలనిజం ప్రదర్శించేందుకే మొగ్గుచూపుతున్నారు. అలా ఇటీవల ది వారియర్ వంటి కొన్ని చిత్రాల్లో నటించి దుమ్ము రేపారు. కాగా తాజాగా ఒక తమిళ చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఎంపీ.గోపి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మలైయన్, వేల్ మురుగన్ బోరింగ్ వెల్స్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా తాజాగా ఇటీవల విడుదలై కన్నడతో పాటు దక్షిణాది భాషల్లోనూ సంచలన విజయాన్ని సాధించిన కాంతార చిత్రం తరహాలో గ్రామ దేవత ఇతివృత్తంతో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. -
‘శపథం’తో మళ్లీ వచ్చేస్తున్న లక్ష్మీ మీనన్!
తమిళ సినిమా: కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను తన వైపు తిప్పుకున్న నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత విశాల్, విజయ్ సేతుపతి, విమల్ వంటి కథానాయకులతో జతకట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళం కుట్టి కెరీర్ మంచి పీక్‌లో ఉండగానే ప్లస్–2 చదువును పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్ ఇచ్చింది. అదే ఈ అమ్మడు చేసిన పెద్ద పొరపాటు అని అ తరువాత తెలిసొచ్చినట్లుంది. కళ్లు తెరిచే సరికి అంతా తారుమారు అయ్యింది. అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. విజయ్ సేతుపతితో రెక్క అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, అది నిరాశ పరచడంతో లక్ష్మీ మీనన్ పూర్తిగా తెరమరుగై పోయింది. అలా 2016 తరువాత లక్ష్మీ మీనన్‌ను కోలీవుడ్ పట్టించుకోలేదు. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు నామమాత్రమే. అలాంటిది తాజాగా కొత్త చిత్రంతో తమిళంలో రీఎంట్రీ అవుతోంది. దర్శకుడు అరివళగన్ తాజాగా నటుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు ఈరమ్ అనే సక్సెస్ ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అరివళగన్ తన తాజా చిత్రాన్ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. దీనికి శపథం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా అరివళగన్ నిర్మాతగా మారడం విశేషం. దీన్ని ఆయన 7జీ ఫిలిమ్స్ శివతో కలిసి నిర్మిస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో కథానాయకిగా నటి లక్ష్మీ మీనన్‌ను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నటి లక్ష్మీ మీనన్ ఫొటోతో పోస్టర్‌ను యూనిట్ వర్గాలు విడుదల చేశాయి. చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల ఎప్పుడు అన్నది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన హీరో ఆది, పిక్స్ వైరల్
హీరోహీరోయిన్లు ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ గతేడాది మేలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మలుపు చిత్రం నుంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ మొదట్లో చాలా గొడవపడేవారు. ఈ గొడవలు, మనస్పర్థల వల్ల కొన్ని రోజులు మాట్లాడుకోలేదు కూడా! మలుపు ముగింపులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీ గల్రానీ ఆదికి ప్రపోజ్ చేసింది. తనే అంత ఓపెన్‌గా మనసులోని మాట బయటపెట్టడంతో ఇంక ఆలస్యం చేయడం ఇష్టం లేని ఆది వెంటనే ఓకే చెప్పాడు. దీంతో ఇంట్లోవాళ్లను ఒప్పించి మే 18న చెన్నైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మంగళవారం(జనవరి 3న) నిక్కీ బర్త్‌డే. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సమక్షంలో భార్య బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు ఆది. పనిలో పనిగా ఆమె ముఖానికి కేక్ రుద్దాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిక్కీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విషెస్ తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నా పుట్టినరోజును నా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నాను అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Nikki Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) చదవండి: కొడుకుతో వంట చేయిస్తున్న స్నేహ నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య -
తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి?
యంగ్ హీరో, నటుడు ఆది పినిశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో అయిన ఆది, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వీ చిత్రం మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ఆది ప్రస్తుతం తెలుగులో విలన్ పాత్రలు చేస్తున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది ఇక్కడి ప్రేక్షకుల బాగా మెప్పిస్తున్నాడు. దీంతో ఓ స్టార్ హీరో స్థాయిలో తెలుగు ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో కోలీవుడ్ హీరోయిన్, తన ప్రేయసి నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆది సంబంధించిన ఓ ఆసక్తిర న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్ త్వరలోనే ఆది తండ్రి కాబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఆది-నిక్కీలు తల్లిదండ్రులు కాబోతున్నారని కోలీవుడ్‌లో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ కోలీవుడ్ జంట స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా మే 18, 2022న ఇరు కుటుంబ సమక్షంలో ఆది-నిక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకులో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సందీప్ కిషన్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆది ది వారియర్మూవీలో నటించారు. ప్రస్తుత్తం ఆది తమిళం, తెలుగులో పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. -
నాన్న.. మూవీలో నా నెగెటివ్ పాయింట్స్ చెప్పారు: ఆది
‘‘నేను తెలుగువాణ్ణి అని తమిళ ప్రేక్షకులు అనుకుంటున్నారు.. తెలుగువాళ్లేమో తమిళోడిని అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, నటన బాగుంటే ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గురు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి శుక్రవారం విలేకరులతో చెప్పిన విశేషాలు ► ‘సరైనోడు’ తర్వాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా ‘అజ్ఞాతవాసి’ కంటే బెటర్‌గా ఉండాలని అనుకున్నాను. ‘ది వారియర్’లో ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురు పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది.. అది నచ్చడంతో ఈ చిత్రం చేశాను. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ► ‘ది వారియర్’ క్లైమాక్స్ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. ఆ క్రెడిట్ అన్బు–అరివు మాస్టర్లదే. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నట్టుందని లింగుసామి చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. ► నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి) నాలో నెగెటివ్ పాయింట్స్ చెప్తారు. ఈ చిత్రంలో నా యాస ఇంకొంచెం బాగుండాల్సింది అని మా నాన్న అన్నారు. నేను హైలైట్ అయ్యానంటే రామ్ గొప్పదనం అని, అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని కూడా ఆయన అన్నారు. నిక్కీ గల్రానీతో నా పెళ్లి జీవితం బాగుంది.. అంతా హ్యాపీ. చదవండి: లలిత్ మోదీ గట్టిగానే ట్రై చేశాడు, ఇన్నేళ్లకు ఫలించింది! లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్ -
The Warrior Review: డాక్టర్ చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా చేసిన 'ది వారియర్' రివ్యూ..
టైటిల్ 'ది వారియర్' నటీనటులు: రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్ లింగుస్వామి నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ విడుదల తేది: జులై 14, 2022 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'ది వారియర్'. కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా మొదటిసారిగా రామ్ పోతినేని తమిళ డైరెక్టర్‌తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల మధ్య రిలీజైన 'ది వారియర్' ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం. కథ: సత్య (రామ్ పోతినేని) ఓ డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హౌస్ సర్జన్‌గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు (ఆది పినిశెట్టి) మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్‌లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్‌కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్‌గా చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలంటే 'ది వారియర్' చూడాల్సిందే. విశ్లేషణ: పోలీస్ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి మెప్పించాయి. కానీ ఒక డాక్టర్.. పోలీస్‌గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథతో 'ది వారియర్'ను తెరకెక్కించారు దర్శకుడు ఎన్ లింగుస్వామి. డాక్టర్‌గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్‌గా సాగుతుంది. దీంతో కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. చెప్పుకోదగ్గ డైలాగ్‌లు సినిమాకు పడలేదు. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే: రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్‌గా, పోలీస్‌గా, లవర్‌గా రామ్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ సీన్లలో చాలా బాగా చేశాడు. పోలీస్ లుక్‌లో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక విలన్‌గా ఆది పినిశెట్టి యాక్టింగ్ ఇరగదీశాడు. రామ్, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. మాస్ లుక్‌లో మాస్ పెర్ఫామెన్స్‌తో ఆది చక్కగా నటించాడు. ఆర్జే విజిల్ మహాలక్షిగా కృతీశెట్టి అందంగా నటించింది. సినిమాలో ఆమె ప్రజెన్స్ హాయినిస్తుంది. సత్య తల్లిగా నదియా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చెడ్డవారిని శిక్షించాలని కొడుక్కి చెప్పే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. విలన్ గురు పాత్రకు వచ్చే బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ కొత్తగా ఉన్నా కథనం రొటీన్‌గా ఉన్న 'ది వారియర్'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
-
హీరో ఆది పినిశెట్టి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?
యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే! మే 18న తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే ఆది దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది కట్నకానులకు బద్ధ వ్యతిరేకి అని, పెళ్లికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారట. ఆది ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిక్కీ కుటుంబం రెడీగా ఉన్నా అతడు మాత్రం పైసా కూడా వద్దని సున్నితింగా తిరస్కరించాడట. ఆది మంచి మనసుకు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) చదవండి 👇 నేనూ సాయిపల్లవి ఫ్యానే, జూన్ 5న రెడీగా ఉండండి: రానా మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిమానులతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి: సీక్రెట్ ఎంగేజ్మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ విక్రమ్ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
ఆది-నిక్కీ రిసెప్షన్లో కోలీవుడ్ తారలు.. ఫొటోలు
-
అంగరంగ వైభవంగా హీరో ఆది పినిశెట్టి ,నిక్కీ గల్రానీ వివాహం (ఫొటోలు)
-
ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు. ఇప్పటికే హల్ది వేడుకల్లో వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆది, నిక్కీల పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తారట! కాగా ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అజిత్‌ను కలిసిన ఆది, అందుకేనా?
యంగ్ హీరో ఆది పినిశెట్టి, స్టార్ హీరో అజిత్‌ను కలిసిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న అజిత్‌ను ప్రత్యేకం ఆది కలవడం అందరిని ఆలోచనలో పడేసింది. దీంతో ప్రస్తుతం ఇది పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆది ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మరి అజిత్‌ను కలవడం వెనక ఏదైన అంతర్యం ఉందా?, ఇద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ విషయమై కలుసుకున్నారా? అంటూ కొందరు చర్చించుకుంటుండగా.. మరికొందరు ఈ మే 18న ఆది పెళ్లి సందర్భంగా ఆయనను ఆహ్వానించేందుకు కలిసి ఉంటాడని అభిప్రాయ పడుతున్నారు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఏదేమైనా వీరిద్దరు కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేంలో చూసిన వీరి ఫ్యాన్స్ ఆది-అజిత్‌లు కలిసి ఓ మల్టిస్టార్ సినిమా చేస్తే బాగుంటుందంటూ వారి మనసులోని మాటను బయటపెడుతున్నారు. కాగా ఆది మార్చి 24న తన ప్రియురాలు, హీరోయిన్ నిక్కీ గల్రానీని సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరి పెళ్లి తేదీపై ఈజంట ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చదవండి: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్ కానీ ఈ నెల 18వ తేదీన ఈ జంట వివాహనికి ముహుర్తం ఫిక్స్ అయ్యిందంటూ తమిళ మీడియా తమ వెబ్సైట్లో కథనాలు రాసుకొస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ప్రస్తుతం అజిత్ తన తాజా చిత్రం ఏకే61 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్లనే ఉంటున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
హీరో ఆది పినిశెట్టితో హీరోయిన్ నిక్కీ గల్రానీ నిశ్చితార్థం (ఫొటోలు)
-
సీక్రెట్‌గా హీరో, హీరోయిన్ల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అంతేకాదు తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలియజేస్తూ... ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ఎంగేజ్మెంట్ మార్చి 24న జరగ్గా.. రెండు రోజుల తర్వాత శనివారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘2022 మార్చి 24.. మా ఇద్దరికి ఎంతో స్పెషల్. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’అని తన ట్విటర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది నిక్కీ గల్రానీ. ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. The best thing to hold onto in life is each other. We found each other a couple of years ago & it’s official now💍 24.3.22 was really special to us. We got engaged in the presence of both our families🌸 Seeking all you love & blessings as we take on this new journey together🙏🏻♥️ pic.twitter.com/hrMbxieCAn — Nikki Galrani (@nikkigalrani) March 26, 2022 -
వేగంగా పరిగెత్తమంటున్న ఆది.. అలరిస్తోన్న 'క్లాప్' ట్రైలర్
Aadhi Pinisetty Starrer Clap Movie Trailer Released: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించగా.. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతమందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరెకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్లాప్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. పముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'మనం జీవితంలో ఓడిపోయేది ఎప్పుడో తెలుసా ? మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం' అంటూ ప్రారంభమైన క్లాప్ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. 'పరిగెత్తూ.. వేగంగా పరిగెత్తూ.. నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్‌తో' అనే డైలాగ్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది. భాగ్యలక్ష్మీ అనే యువతిని అథ్లేట్‌గా చేయడానికి ఆది పడిన కష్టమేంటీ అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కోచ్‌గా ఆది అదిరిపోయే నటన కనబర్చి ఆకట్టుకున్నాడు. -
ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్
Aadhi Pinisetty As Guru In Ram Pothineni The Warrior Movie: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. 'సరైనోడు' తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో 'గురు' పాత్రలో ఆది పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు. విలన్‌గా ఆది పినిశెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తాడని పేర్కొన్నారు. హీరో విలన్ల మధ్య సీన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయన్నారు. గురు పాత్రకు ఆది పినిశెట్టి వంద శాతం యాప్ట్ అయ్యారని నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు. ఈ రోల్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండనుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. Meet GURU from #TheWarriorr ! @AadhiOfficial you Monster!! Haha..can’t wait for them to witness your career best performance brother! Happy #MahaShivaratri my people. Love..#RAPO pic.twitter.com/uuWEMxrRCR — RAm POthineni (@ramsayz) March 1, 2022 -
ఓటీటీలో గుడ్ లక్ సఖి.. ఎప్పటి నుంచంటే
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. జనవరి28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సినిమా ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రేపట్నుంచి(ఫిబ్రవరి12) స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. -
భుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే!
పాత్రలు ప్రతిసారీ ఛాలెంజ్‌లు విసరవు.. క్యారెక్టర్ ప్రతిసారీ కొత్తగా ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఛాలెంజ్ గట్టిగా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్స్‌కి యాక్టర్స్ ‘యస్’ అన్నారంటే... సిల్వర్ స్క్రీన్ మీద తప్పకుండా మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం కొందరు స్టార్స్‌ని అలాంటి రోల్స్ ఛాలెంజ్ చేశాయి. ‘తగ్గేదే లే’ అంటూ ఆ సవాల్‌ని స్వీకరించారు. ఆ విశేషాలేంటో చూద్దాం. భారమంతా భుజం పైనే! సాధారణంగా మాస్ కమర్షియల్ సినిమాల బరువంతా స్టార్ హీరోల భుజాలపైనే ఉంటుంది. ఎందుకంటే సినిమాకు సెంటరాఫ్ అట్రాక్షన్ హీరోయే. అలాంటి భారీ సినిమాలను మోయాలంటే హీరో భుజాలు ఎంత బలంగా ఉండాలి! కానీ షోల్డర్ ఇన్బ్యాలెన్స్తోనే పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో కనిపిస్తారు బన్నీ. గుబురు గడ్డం, రింగులు తిరిగిన జుట్టు, కమిలిని చర్మంతో బన్నీ డీ–గ్లామరస్ పాత్రలో కనిపిస్తారని తెలిసిందే. అలాగే షోల్డర్ ఇన్‌బ్యాలెన్స్ (భుజ అసమతుల్యత) ఉన్న వ్యక్తిగా బన్నీ కనిపిస్తారనే ఫీల్‌ని ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నిను చుస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..’ పాట కలగజేస్తోంది. భుజ అసమతుల్యత భారాన్ని తన భుజం మీద బన్నీ బాగా మోసిన విషయం పాటలో కనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ ‘తగ్గేదే లే’ అని డైలాగ్ చెబుతారు. నటన పరంగా తగ్గేదే లే అంటూ ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని చేశారు. ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదల కానుంది. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..! పాప కోసం ఒంటి కాలితో... ప్రభుదేవా మ్యాజిక్ అంతా ఆయన కాళ్లలోనే ఉంది. మెరుపు వేగంతో కాళ్లను ఆడించే నైపుణ్యం ఉన్న డ్యాన్సర్ ప్రభుదేవా. ఆయన కాళ్లలోని చురుకుదనానికి ఇన్నేళ్లు ఈలలు వేశారు. ఇప్పుడు ఓ కొత్త ఛాలెంజ్‌కి రెడీ అయ్యారు ప్రభుదేవా. ‘పొయ్ కాల్ కుదిరై’ (కృత్రిమ కాలు ఉన్న గుర్రం అని అర్థం) సినిమాలో ప్రభుదేవా ఒక కాలు లేని వ్యక్తిగా కనిపించనున్నారు. కృత్రిమ కాలు ధరించి ఉన్న ఆయన లుక్ ఇటీవల విడుదలయింది. ఈ చిత్రంలో శత్రువుల బారి నుంచి ఓ పాపను కాపాడే పాత్రను ప్రభుదేవా చేస్తున్నారని తెలుస్తోంది. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ట్రాక్‌లో సవాల్ హీరోగా, విలన్‌గా ప్రూవ్ చేసుకుంటూ కెరీర్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు ఆది పినిశెట్టి. ఇప్పుడు ‘క్లాప్’ సినిమాలో రన్నర్ ట్రాక్ ఎక్కారు. ఇందులో జాతీయ స్థాయిలో రన్నింగ్ రేస్‌లో బంగారు పతాకం సాధించాలనే పాత్రలో కనిపించనున్నారు. అయితే మధ్యలో తన కుడి కాలుని పోగొట్టుకుంటారు. కృత్రిమ కాలుతో తన ప్రయాణాన్ని ఈ రన్నర్ మళ్లీ మొదలుపెడతాడా? అనేది కథ. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయిక. ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్యా దర్శకుడు. చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత -
ఒకింత భయపెడుతున్న ‘క్లాప్’ టీజర్, హీరోకి ఏమైంది..
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తనకి అత్యంత సన్నిహితుడు అయిన రవి రాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి తన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకడని. ఈ ‘క్లాప్’ టీజర్‌ను విడుదల చేయడం తనకి చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ చిత్రబృందానికి చిరు అభినందనలు తెలిపారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో రన్నింగ్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. నేషనల్ లెవెల్ రన్నింగ్ కాంపిటిషన్లో పాల్గొని విజేతగా నిలవాలని పరితపించే ఓ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. Mega🌟 @KChiruTweets garu launched thrilling teaser of @AadhiOfficial's #CLAP #ClapTeaserhttps://t.co/oFwulfYalg#ilaiyaraaja @aakanksha_s30 @actorbrahmaji @prakashraaj @KurupKrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @pravethedop @LahariMusic @UrsVamsiShekar pic.twitter.com/2hARXSkGUV — BA Raju's Team (@baraju_SuperHit) September 6, 2021 అయితే అతనికి ఆవేశం కూడా ఎక్కువే. అందుకే గొడవలు పడుతున్నట్టు ఈ టీజర్లో చూపించారు.అలాగే ఆకాంక్ష సింగ్‌తో లవ్ ట్రాక్‌ను ఆసక్తిగా చూపించారు. టీజర్ చివర్లో ఆది .. ఒక కాలుతో మాత్రమే కనిపిస్తుండడం అందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పాలి. హీరో ఏ కారణంతో తన కాలుని కోల్పోయాడు అనే విషయాన్ని సస్పెన్స్ నిస్తూ మేకర్స్ టీజర్‌ను వదిలారు. తెలుగు, తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
బతుకు పాఠాలు చదివిన రచయిత
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సినీ, నాటక రంగాలపై చెరగని ముద్ర వేసిన పినిశెట్టి శ్రీరామమూర్తి 1985 ఏప్రిల్ 15న కన్నుమూశారు. సినీ నాటక రంగాలు ఉన్నంత వరకు ఆయన చిరస్మరణీయుడు. బతుకు పాఠాలు చదివిన రచయిత.. డిసెంబర్ 30 పినిశెట్టి శ్రీరామమూర్తి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సహజ ప్రతిభావంతుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. నాటకం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియలను తన రచనలతో సుసంపన్నం చేసిన రచయిత ఆయన. ఆనాటి ప్రతిష్ఠాత్మకమైన సాహితీ పత్రిక ‘భారతి’లో 1940 ప్రాంతాల్లో ఆయన రచనలు ప్రచురితమై, పండితుల దృష్టిని ఆకర్షించాయి. ‘భారతి’లో ప్రచురితమైన కథలను ఏరి కూర్చి, 1946లో ‘సవతితల్లి’ కథాసంపుటిని ప్రచురించారు. గ్రామీణ నేపథ్యంలో ఆయన రాసిన నాటకాలు ప్రజామోదం పొందాయి. ఆయన నాటకాలకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆంధ్ర నాటక పరిషత్’ పురస్కారాలు లభించాయి. నాటకరంగం మీదుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన వారిలో పినిశెట్టి శ్రీరామమూర్తి కూడా ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ప్రేక్షకుల మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి ఆయన. పినిశెట్టి శ్రీరామమూర్తి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1920 డిసెంబర్ 30న జన్మించారు. ఆయన తల్లి అమ్మణ్ణమ్మ గృహిణి, తండ్రి వెంకటరత్నం కోర్టు అమీను. బాల్యంలోనే రెండేళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ప్రాథమిక పాఠశాలలో చదుకుంటుండగా, పినిశెట్టి తెలివితేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్ చేశారు. తండ్రి ఉద్యోగ విరమణతో ఆయన చదువు ప్రాథమిక పాఠశాలతోనే ఆగిపోయింది. పెదతల్లి సలహాతో వ్యవసాయం, టైలరింగ్ నేర్చుకున్నా సంతృప్తి కలగలేదు. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవాడు. ఆయన ఉన్నత పాఠశాలలో చదవకున్నా, జీవిత పాఠశాలలో కష్టాలూ కన్నీళ్లూ బాధలూ వేదనలూ సహాధ్యాయులుగా, సహనం, సంయమనం, తాత్త్వికతలు గురువులుగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. పినిశెట్టి గురించి, ‘పాఠ్యపుస్తకాలు చదవని రచయిత. బతుకు పాఠాలు చదివిన నాటక సినీ రచయిత జీవన కథనం స్ఫూర్తిదాయకం’ అని ప్రముఖ విమర్శకుడు కిరణ్‌ప్రభ ప్రశంసించారు. ఆధునిక తెలుగు నాటక రచనలో పినిశెట్టి ముద్ర ప్రత్యేకం. గ్రామీణ జీవన నేపథ్యంలో సాగేవి ఆయన నాటకాలు. 1944లో ‘ఆదర్శజ్యోతి’ నాటకాన్ని రాసి, ‘ఆదర్శ నాట్యమండలి’ ద్వారా ప్రదర్శించి, నటించి ప్రశంసలు పొందారు. ఆయన 1949లో ‘పల్లెపడుచు’ నాటకం రాశారు. ఆ నాటకాన్ని ‘ఆంధ్ర కళాపరిషత్’ ఆధ్వర్యాన 1950లో కాకినాడలో ప్రదర్శించగా, ఉత్తమ నాటక బహుమతి పొందింది. ఆ నాటకంలో ఆదర్శ రైతు సూరయ్య పాత్ర ధరించిన రచయిత, ఉత్తమ నటుడిగా కూడా బహుమతి పొందారు. ఆనాటి కార్యక్రమానికి ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్యఅతిథిగా హాజరై, బహుమతి ప్రదానం చేశారు. అద్భుతమైన సంభాషణలతో కూడిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించని పల్లెటూరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదని రంగస్థల ప్రముఖుడు డాక్టర్ చాట్ల శ్రీరాములు ఒక సందర్భంలో చెప్పారు. ఆ నాటకం అప్పట్లోనే ఏడు ముద్రణలు పొందిందంటే, ఎంతగా ఆనాటి పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పినిశెట్టికి పేరు తెచ్చిపెట్టిన నాటకాల్లో ‘అన్నాచెల్లెలు (1952), స్త్రీ పాత్ర లేని ‘ఆడది’ (1952), ‘కన్నకొడుకు’ (1956) వంటివి ముఖ్యమైనవి. పినిశెట్టి 1954లో సినీరంగంలోకి అడుగు పెట్టారు. సినిమారంగంలో ప్రవేశించిన సంవత్సరంలోనే ఆయన రాసిన రెండు నాటకాలు సినిమాలుగా రూపొందాయి. వాటికి ఆయనే సంభాషణలు రాశారు. సినీరంగంలో కొనసాగుతూనే, నాటక ప్రేక్షకుల కోరిక మేరకు 1963లో ‘పంజరంలో పక్షులు’ నాటకం రాశారు. ఈ నాటకాన్ని 1968లో పుస్తకరూపంలో ముద్రించి, ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావుకు అంకితం చేశారు. పినిశెట్టి సినీ ప్రస్థానం బీఏ సుబ్బారావు దర్శకత్వంలోని ‘రాజు–పేద’ (1954) సినిమాతో మొదలైంది. ఆ సినిమాకు ఆయన సంభాషణలు రాశారు. అదే ఏడాది ఆయన నాటకం ‘పల్లెపడుచు’ను బోళ్ల సుబ్బారావు సినిమాగా నిర్మించారు. ఆయన రాసిన ‘అన్నాచెల్లెలు’ నాటకం తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పరివర్తన’గా అదే ఏడాది వెండితెరపై విడుదలైంది. ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి ఆనాటి అగ్ర నటీనటులు నటించారు. పినిశెట్టి ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. తోట కృష్ణమూర్తి నిర్మించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘సంతానం’, ‘ఇలవేల్పు’, ‘రామాలయం’, ‘బంగారు గాజులు’ వంటి దాదాపు అరవై సినిమాలకు సంభాషణలు రాశారు. ‘చిలకా గోరింక’, ‘గృహలక్ష్మి’ వంటి సినిమాల్లో హాస్యపాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా పత్రికలు ఆయనను ‘స్వతంత్ర చిత్రరచనా చక్రవర్తి’గా అభివర్ణించాయి. పినిశెట్టి శ్రీరామమూర్తి పెద్దకొడుకు రవిరాజా పినిశెట్టి ప్రముఖ దర్శకుడు. రవిరాజా 1980లో దర్శకత్వం వహించిన ‘వీరభద్రుడు’ సినిమాకు కూడా పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు రాశారు. ఆయన మనవడు ఆది పినిశెట్టి హీరోగా సినీరంగంలో కొనసాగుతున్నారు. - డాక్టర్ పీవీ సుబ్బారావు -
ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు
‘‘సినిమా రాయడాన్ని పాత్రలు తయారు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పుడు సాంకేతిక నిపుణులతో కలసి సినిమా చూస్తాను. నా సినిమాని ఫైనల్‌గా చూసేది కూడా అప్పుడే. ఆ తర్వాత జరిగేదాన్ని పట్టించుకోను. సినిమా ఎలా ఆడుతుంది? కలెక్షన్లు, రివ్యూలు పెద్దగా పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు నగేశ్ కుకునూర్. ‘హైదరాబాద్ బ్లూస్’తో దర్శకుడిగా మారిన ఈ తెలుగు దర్శకుడు కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 22 ఏళ్ల తర్వాత తెలుగులో తొలి చిత్రంగా ‘గుడ్ లక్ సఖీ’ని తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రధారులు. సుధీర్ చంద్ర నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రవిశేషాలను నగేశ్ కుకునూర్ పంచుకున్నారు. ► నేను పక్కా హైదరాబాదీ. నేను దాచుకున్న సేవింగ్స్‌తో నా తొలి సినిమా ‘హైదరాబాద్ బ్లూస్’ చేశాను. నాన్న ప్రొడక్షన్ చూసుకున్నారు. అమ్మ కుక్, ఆంటీ కాస్ట్యూమ్స్ చూసుకున్నారు. మొదటిసారి స్క్రీన్ మీద నా పేరు చూసుకోగానే నేను దర్శకుడినయిపోయాను అని గర్వంగా ఫీల్ అయ్యాను. ‘హైదరాబాద్ బ్లూస్’ చిత్రాన్ని అమెరికాలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపుదాం అనుకుని ప్రింట్లను సూట్‌కేస్‌లో అమెరికా తీసుకెళ్లాను. అనుకోకుండా ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాం. ప్రేక్షకులకు నచ్చింది. అక్కడే ఉండిపోయి సినిమాలు చేస్తున్నాను. ► నేను హిందీ రాయగలను, మాట్లాడగలను. అయితే తెలుగు మాట్లాడతాను. తెలుగు సినిమా చేయాలంటే భాష మీద పూర్తి అవగాహన ఉండాలనుకునేవాణ్ణి. నాకున్న పెద్ద చాలెంజ్ తెలుగు సినిమా చేయడం. హిందీలోనే ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చావురా బాబూ అని ప్రేక్షకులు అనుకోకూడదు. ► కీర్తీ సురేష్‌తో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇందులో మేకప్ లేకుండా యాక్ట్ చేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ ‘గుడ్‌లక్ సఖీ’ అనుకుంటున్నాం. 60 శాతం షూటింగ్ చేశాం. 25 రోజుల షూటింగ్ ఉంది. నాటకాలు వేసే కంపెనీలో పనిచేస్తుంటాడు ఆది. జగపతిబాబు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ► నాకు ఇద్దరు దర్శకులంటే విపరీతంగా ఇష్టం. టాలీవుడ్లో కె. విశ్వనాథ్‌గారు, బాలీవుడ్లో రిషికేశ్ ముఖర్జీ. ఈ సినిమాలో ముఖర్జీగారి స్టయిల్ కనిపిస్తోంది. ఇది ఆడియన్స్ టేస్ట్‌కి నచ్చుతుందా లేదా? అని నేను చెప్పలేను. ఇప్పటికీ ఆడియన్స్‌కు ఏం నచ్చుతుందో నాకు తెలియదు. ► నా సినిమా నాకు బిడ్డలాంటిది. కథను తయారు చేయడానికి మానసికంగా, ఎమోషనల్‌గా చాలా శ్రమిస్తాం. ఎవ్వరైనా వచ్చినప్పుడు మీ బిడ్డ బాలేదు అంటే ఎవరికి నచ్చుతుంది? దర్శకులు విమర్శలను తీసుకోవాలి అంటారు? ఎందుకు తీసుకోవాలి? అది విమర్శ కాదు.. వాళ్ల అభిప్రాయం? నీ అభిప్రాయం ఎంత కరెక్ట్ అయినా నేను వినదలచుకోలేదు. ఎవరి గురించైనా మంచి ఉంటే చెప్పండి. ఏదైనా చెడు చెప్పాలనుకుంటే మీలోనే ఉంచుకోండి. దానికి ఎటువంటి విలువ లేదు. ► నా సినిమాలన్నీ నాకు నచ్చినట్టుగానే తీస్తాను. కొన్ని వర్క్ అవుతాయి.. కొన్ని అవ్వవు. పెద్ద పెద్ద స్టార్స్‌తో చేయాలని పరుగులు పెట్టను. నాకు స్టోరీ నరేషన్ ఇవ్వడం రాదు. రాసింది నా యాక్టర్స్‌కి ఇస్తాను. ‘మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం’ అని చెబుతుంటాను. నేను సినిమాలు ఎక్కువగా చూడను. ట్రెండ్‌ని పట్టించుకోను. అప్డేట్ కాను. అప్డేట్ అవాల్సిన అవసరం కూడా లేదు. అప్డేట్ అయితే ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో దానికి తగ్గట్టు ఓ సినిమా చేస్తాం. ఆ లోపు వాళ్ల ఇష్టాలు మారిపోవచ్చు. -
‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు
సినీ అభిమానులకు దీపావళి పండుగు ఒక రోజు ముందే వచ్చేసింది. దీపావళి కానుకగా పలు చిత్రాలు, క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. టెన్ థౌసెండ్ వాలా పేల్చితే కుర్రకారు ఏ రేంజ్లో ఎగ్జైట్మెంట్కు గురవుతారో.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతిగా కనిపించనున్న విజయశాంతి ఫస్ట్‌లుక్ చూసి అంతకుమించి ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇక విజేత ఫలితం తర్వాత మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ ఇంట్రస్టెంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సూపర్ మచ్చి’నే టైటిల్‌గా ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ నయా లుక్‌లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్గా నటిస్తోంది. Machis.... it is #SuperMachi Title & First look! pic.twitter.com/W3Uml0TKM9 — Kalyaan Dhev (@IamKalyaanDhev) October 26, 2019 ఆది పినిశెట్టి కథానాయకుడిగా కొత్త డైరెక్టర్ పృథ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీపావళి కానుకగా చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. నో కట్.. రిలీజ్ డేట్ ఫిక్స్ రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా దీపావళి కానుకగా చిత్ర రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 1న థియోటర్లో కలుద్దామంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్ర టైటిల్, టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకోవడంతో ‘ఆవిరి’ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘కనితన్’ సినిమాను ‘అర్జున్ సురవరం’ గా రిమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు. నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు ‘అర్జున్ సురవరం’రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. -
నవ్వుల కీర్తి
‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి సినిమాలను తెరకెక్కించిన హైదరాబాదీ దర్శకుడు నగేష్ కుకునూర్ స్పోర్ట్స్ రామెడీ (రొమాంటిక్ కామెడీ) జానర్లో తెలుగులో తొలిసారి ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇవాళ కీర్తీ సురేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో కీర్తీ లుక్‌ను రిలీజ్ చేశారు. మెడలో తాయత్తు, చేతికి మట్టి గాజులతో హాయిగా నవ్వుతూ కీర్తి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: శ్రావ్య వర్మ. -
అథ్లెటిక్ నేపథ్యంలో...
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్లాప్’. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం.రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రెండు విభిన్నమైన పాత్రల్లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నాం. దినేశ్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ స్పెష్ల్ సాంగ్‌లో మోనాల్ గజ్జర్ చిందేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్. -
క్రీడల నేపథ్యంలో...
కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నగేశ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ. -
క్లాప్‌కి ఇళయరాజా క్లాప్
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తదితరులు ‘క్లాప్‘ బౌండెడ్ స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్ చేశాను. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష. -
ఆట మొదలు
మైదానంలోకి దిగి ఆట ఆడటానికి ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు ఆది పినిశెట్టి. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మించ నున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి. మనోజ్, జి. శ్రీహర్ష సహ నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ‘‘ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు. వాటిని అధికమించి ఎలా ఉన్నతస్థాయికి చేరుకున్నాడన్నదే కథాంశం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్ కుమార్. -
మరో విభిన్న పాత్రలో.. ఆది పినిశెట్టి
వైవిధ్యమైన కథలు, పాత్రలతో మెప్పిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు ఆది పినిశెట్టి. ఈయన తర్వలోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకుడు ప్రిత్వి ఆదిత్య అన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నాడనేదే ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
అథ్లెట్‌గా ఆది పినిశెట్టి
హీరో ఇమేజ్‌కు ఫిక్స్ అయిపోకుండా సౌత్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్న యువ నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఈ విలక్షణ నటుడు ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంతకం చేశాడు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ ‘నేను ఈ కథను రాసుకుంటున్నంత సేపూ నా మనసులో ఆదిగారే మెదిలారు. ఆయనకు కథ వినిపించాక, ఆయన సరే చేస్తాను అని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయనతో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది. తప్పకుండా మంచి చిత్రాన్ని అందిస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ ఇది. తను కన్న కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. అథ్లెటిక్స్ పట్ల అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఆదికి ‘పార్ట్నర్’గా హన్సిక
వైవిధ్య కథా చిత్రాలను ఎంచుకుని నటిస్తున్న నటుడు ఆది. కోలీవుడ్‌లో ఈరమ్, అరవాన్, యూటర్న్ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆది తాజాగా నటిస్తున్న చిత్రం పార్టనర్. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ‘మహా’ చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రా ల నాయకి స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ ఇప్పుడు తొలిసారిగా ఆదితో కలిసి నటిస్తోంది. అయితే ఇందులో వీరిద్దరూ జంటగా నటించడం లేదట. పార్టనర్ చిత్రంలో ఆదికి జంటగా పాలక్ లల్వాణి అనే నటి నటించనుంది. ఈ అమ్మడు కుప్పత్తురాజా చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించింది. ఆర్ఎఫ్సీ క్రియేషన్స్ పతాకంపై ఎస్పీ.కాళీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మనోజ్ దామోదరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్టనర్ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథా చిత్రం. అదే సమయంలో సైన్స్ ఫిక్షన్‌తో కూడిన ఫాంటసీ పార్టు కూడా చిత్రంలో ఉంటుంది. ఇక హన్సిక పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక నటుడు ఆది సినీ కెరీర్లోనే ముఖ్యమైన చిత్రంగా పార్టనర్ నిలుస్తుంద’ని తెలిపారు. -
పెద్దోళ్లు కుదరదన్నారు
రవిచంద్ర, సుమయ హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ 2 మనసులు’. ఆది పినిశెట్టి దర్శకత్వంలో శేఖర్ మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ ఎస్. నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చంద్రశేఖర్ ఎస్. మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రకథని చాలామంది పెద్ద హీరోల వద్దకు తీసుకెళితే ఎవ్వరూ డేట్స్ ఇవ్వలేదు. బ్యానర్ ఏంటి? సినిమా వస్తుందా? లేదా? అని అడిగేవారు. దీంతో అందరూ కొత్తవాళ్లనే తీసుకున్నాం. ఎప్పటికైనా మాది చాలా పెద్ద బ్యానర్ అవుతుందని ఆశిస్తున్నా. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లు అయినా సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఇదొక ప్రేమకథ. నా తమ్ముడు సత్య ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశాడు. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఈ మధ్య వచ్చిన ప్రేమ కథలకి చాలా భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అని రవిచంద్ర అన్నారు. రంగి, మహేశ్, కాదంబరి కిరణ్, తిరుపతి, జావెద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: జి.వి.ఎం.గౌతమ్. -
గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం
దక్షిణ భారతాన్ని వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇప్పటికీ తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు. తాజాగా మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అంధించారు. 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు. -
రిలీజ్ కాకముందే రీమేక్ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కి ఇది రీమేక్. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్ మీద యు టర్న్‌ని పట్టించుకోం. రాంగ్ రూట్లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను. ► కన్నడ ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్‌లోనే రిలీజ్ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్ చేస్తాం అన్నారు. ► ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తుంటాం. కానీ రిలీజ్ కాకముందే సమంత రీమేక్ చేయాలనుకోవడం గ్రేట్. తనకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా స్టార్ట్ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్–యాక్టర్ ఈక్వేషన్ కంటే కూడా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం. ► నా ఫస్ట్ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఇంకా నిర్ణయించుకోలేదు. -
ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నాను
‘‘ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా వస్తున్నాయి. మెల్లిగా గేమ్ చేంజ్ అవుతోంది. ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఏ పాత్ర చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. మంచి సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటా. నా కెరీర్లో బెస్ట్ మూవీస్‌లో ‘యు టర్న్’ తప్పకుండా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆది పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పాయింట్ అయినా ఆసక్తి కలిగించేలా దర్శకుడు పవన్ చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న కథను బోధించినట్టు కాకుండా కమర్షియల్‌గా చెప్పారు. ► కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా తప్పు చేస్తే అది మళ్లీ మనకే వస్తుంది అన్నదే ఈ సినిమా కథ. ► ‘వైశాలి’ తర్వాత మళ్లీ పోలీస్ పాత్ర చేశాను. పోలీస్ అనగానే స్లో మోషన్ షాట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండాలనుకోను. ఈ సినిమాలో ఏ ఇంట్రడక్షన్ ఉండదు. సాధారణ పాత్రలానే ఎంటర్ అవుతాను. ఇదే నా కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్. పవన్ నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్. తనకి చాలా ఫ్యూచర్ ఉంది. ‘రంగస్థలం’ తర్వాత సమంతతో మరో సక్సెస్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ► సినిమాను అనలైజ్ చేసే వాళ్లు కేవలం 15 శాతం మంది ఉంటారు. మిగతా వాళ్లకు బావుందా బాలేదా అన్నదే ముఖ్యం. ‘నీవెవరో’ సినిమా కూడా కామన్ ఆడియన్స్‌కు నచ్చొచ్చు అన్నాను. కానీ క్రిటిక్స్ మీద కామెంట్ చేయలేదు. క్రిటిసిజిమ్ నుంచే నేర్చుకొంటాను. ఎప్పటికప్పుడు యాక్టర్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి మీరిచ్చే (క్రిటిక్స్) ఫీడ్‌బ్యాకే ముఖ్యం. పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కూడా చూస్తుంటాను. ► సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండను. కొంతమంది సంబంధం లేకుండా నెగటివిటీ షేర్ చేస్తుంటారు. అలాంటి వాళ్లను పాపం అనుకొని పక్కన పెట్టేయడమే. ► ప్రస్తుతానికి మంచోడిలా ఉందాం అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ వస్తే అప్పుడు చెడ్డగా (విలన్) మారతాను. నెక్ట్స్ నాలుగు ప్రాజెక్ట్‌లు అనుకుంటున్నాను. -
పెళ్లయితే అత్త.. వదినలేనా?
‘‘నా పాత్ర స్క్రీన్ మీద ఎంత సేపు ఉంటుంది అని కాదు. కథకు ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది ముఖ్యం. నాకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాడికోసం కేటాయించే సమయాన్ని ఓ సినిమాకి ఇవ్వాలంటే అది ఎంతో విలువైనదిగా ఉండాలనుకుంటున్నాను. అద్భుతమైన క్యారెక్టర్, టీమ్ దొరికితే చేస్తా. మా అబ్బాయి స్కూల్, వాడితో స్పెండ్ చేసే టైమ్ మిస్ అవ్వదలచుకోలేదు’’ అని భూమిక అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా పలు విశేషాలు పంచుకున్నారు. ► దర్శకుడు పవన్ ‘యు టర్న్’ కథ చెప్పినప్పుడు డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నా పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఒరిజినల్ చూశాను. కానీ నా స్టైల్లో, దర్శకుడు చెప్పినట్టు చేశాను. ఒరిజినల్‌తో పోలిస్తే కొన్ని కొన్ని మార్పులు చేశాం. నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా సూపర్ హిట్స్‌లో థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. ► సమంత బ్రిలియంట్ యాక్టర్. సెట్లో తనుంటే మంచి ఎన ర్జీ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. సమంతవి ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు. రీసెంట్గా తన ‘ఈగ, రంగస్థలం’ చూశాను. ► హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా వస్తున్నాయి. అవి ఇంకా పెరగాలి. కొంచెం టైమ్ పడుతుంది. ఉమెన్ సెంట్రిక్ అంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ అది కూడా త్వరలోనే మారిపోతుంది. ఈ తరహా సినిమాలు కూడా ఎక్కువ రావాలి. ► పెళ్లి అయిపోయిన హీరోయిన్స్‌ని అత్తలు, వదిన పాత్రలకు ఫిక్స్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. బాలీవుడ్లో విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ ఎంత బావుంటుంది? జ్యోతిక, రాణీ ముఖర్జీ ఇలా మంచి సినిమాలు చేస్తున్నారు. 40 ప్లస్ ఏజ్ ఉన్న హీరోయిన్స్ మెయిన్ లీడ్‌గా కూడా రాణిస్తారు. దర్శకులు కూడా ఇంకా మంచి ఉమెన్ సెంట్రిక్ స్టోరీలు రాయాలి. ఆడియన్స్ ఆదరించాలి ► కమర్షియల్ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ఒకే ఒక్క సినిమాతో కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్‌గా మారిపోరు. సినిమా సినిమాకి మెల్లిగా మారుతూ వస్తుంటాం. ► జయాపజయాలు నా కెరీర్‌పై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాలీవుడ్ రిలీజ్ ఉన్నప్పుడు ఇక్కడ షూట్లో ఉండేదాన్ని. తెలుగు రిలీజ్ ఉంటే నార్త్‌లో ఎక్కడో షూటింగ్ చేస్తుండేదాన్ని. వరుసగా ‘ఎంసీఏ, యు టర్న్, సవ్యసాచి’ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. నెక్ట్స్ తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. -
మలుపులో మిస్టరీ
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్, ప్రమోషనల్ వీడియోకి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ్లో తెరకెక్కించాం. రెండు భాషల్లోనూ ఒకే రోజు విడుదల చేస్తున్నాం. సమంత నటన, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్‌గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్‌లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హోమ్‌వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్‌బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్‌గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్‌తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్‌ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్‌కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది
‘‘వైజాగ్ వాతావరణం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా నేటివ్ ప్లేస్‌కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ‘నీవెవరో’ సినిమా వంద శాతం సక్సెస్ అవుతుంది’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘కోన వెంకట్‌గారు చెబితేనే ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. ఈ సినిమా ఆయన వల్లే స్టార్ట్ అయ్యింది. మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌తో 2003లో విడుదలైన ‘వెంకీ’ చిత్రం రైటర్‌గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుంచి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. 50 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాను. ఎంత గొప్ప కథ రాసినా ఆ కథను తెరపై పండించేది నటీనటులే. ‘నీవెవరో’ సినిమాకు ఆది ప్రాణం పోశారు. తన కెరీర్లో ఇదో మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ. సప్తగిరి, వైజాగ్ మేయర్ మళ్ల విజయ ప్రసాద్, వైజాగ్ సత్యానంద్ పాల్గొన్నారు. -
కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా
‘‘యు టర్న్’ టీమ్ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్‌కుమార్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్ రోల్లో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా. కానీ, వాళ్లు చక్కగా డీల్ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్‌కుమార్. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో టాప్ హీరోయిన్!
టాలీవుడ్లో ఈ ఏడాది సంచలనం రేపిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉందంటూ ఎన్ని విమర్శలు వచ్చినా.. అవి సినిమా సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఇక ఇలాంటి సంచలనం సృష్టించిన సినిమా వస్తే.. ఊరికే ఉంటారా? ఇతరా భాషల వాళ్లు రీమేక్ అంటూ ఎగబడతారు. ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్‌రెడ్డి’ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా... ‘ఆర్ఎక్స్ 100’ను ఆది పినిశెట్టి హీరోగా తమిళంలో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్రను డామినేట్ చేస్తూ.. హీరోయిన్ పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆదితో ఇదివరకే నటించిన తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఇక తాప్సీ.. పాయల్ రాజ్‌పుత్‌ను మరిపించేలా ఘాటు సీన్లలో ఏ మేరకు నటిస్తుందో చూడాలి. ‘గుండెల్లో గోదారి’, విడుదలకు సిద్దంగా ఉన్న ‘నీవెవరో’ సినిమాల్లో ఆది, తాప్సీలు కలిసి నటించారు. -
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ‘సరైనోడు’లో విలన్ పాత్రలో, ‘రంగస్థలం’లో హీరో అన్న పాత్రలో నటించి మెప్పించాడు . అలాంటి ఆది అంధుడి పాత్రను పోషిస్తున్నాడంటే అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆది అంధుడి పాత్రను పోషిస్తూ.. హీరోగా చేసిన సినిమా ‘నీవెవరో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రయాంగిల్ లప్స్టోరీని కూడా సింపుల్‌గా చూపారు. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలానే ఎడిట్ చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో తాప్సీ, ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తమిళ ‘ఆర్ఎక్స్ 100’లో ఆది!
బోల్డ్ కంటెంట్‌తో భారీ హిట్లు కొడుతున్నారు నూతన దర్శకులు. ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలతో సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతి తమ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే అర్జున్‌రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఆర్ ఎక్స్ 100 మూవీని కూడా తమిళ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ తెలుగునాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
మిస్టరీ వీడిందా?
‘రంగస్థలం, అభిమన్యుడు, మహానటి’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకొని, నటిగా తన స్థాయిని పెంచుకున్న సమంత ‘యూ టర్న్’ చిత్రంతో మరోసారి తన నట విశ్వరూపం చూపనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌గా, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సమంత ఇన్టెన్స్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ‘యూ టర్న్‘ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్ 13న మా సినిమాని తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘యూ టర్న్’ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్. కాగా, సమంత తమిళంలో నటించిన ‘సీమరాజా’ చిత్రం కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
ఇప్పుడు రితిక
అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్గా అదితీ రావ్ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రితికాసింగ్. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్. వెంకటేశ్ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. -
సిక్సర్
రయ్ రయ్ మంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు సమంత. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ‘రంగస్థలం’, ‘మహానటి’(తమిళంలో ‘నడిగయర్ తిలగం’), ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ‘యు టర్న్’ సినిమాలో తన షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ కూడా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ‘‘ఇంకో సినిమా (యు టర్న్) షూటింగ్‌ను కంప్లీట్ చేశా. ఇక డబ్బింగ్ స్టార్ట్ చేయాలి’’ అన్నారు సమంత. ఈ సినిమాకు సోమవారం నుంచి సమంత డబ్బింగ్ చెప్పనున్నారు. తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా ‘సీమరాజా’, విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలను కూడా కంప్లీట్ చేశారు సమంత. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యాయన్నది పక్కన పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకూ సమంత అరడజను సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేసి సిక్సర్ కొట్టారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. సో.. ఈ సినిమానే సమంత నెక్ట్స్ చిత్రం అని ఊహిస్తున్నారు సినీ లవర్స్. -
డైనమిక్ జర్నలిస్ట్
జోరున వర్షం పడుతోంది. ఓ లేడీ జర్నలిస్ట్ స్కూటర్ డ్రైవ్ చేస్తూ హడావిడిగా వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఆమె డైనమిక్ జర్నలిస్ట్. అందుకే ఓ ఇన్వెస్టిగేషన్ వర్క్‌పై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నెక్ట్స్ ఏం జరిగింది? అంటే.. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? థియేటర్స్‌లో చూస్తేనే కదా ఫుల్ మజా. పవన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ హిట్ ‘యు–టర్న్’ సినిమాను అదే టైటిల్‌తో, సేమ్ డైరెక్టర్‌తో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీస్ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సమంత బాయ్ ఫ్రెండ్‌గా రాహుల్ కనిపించనున్నారని సమాచారం. ఇటీవల ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్లో పోలీస్ స్టేషన్ సెట్లో సమంత, ఆది పినిశెట్టి పాత్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదే యు–టర్న్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. -
సెకండ్ టర్న్
అతను పవర్ఫుల్ పోలీసాఫీసర్. ఆమె పవర్ఫుల్ జర్నలిస్ట్. ప్రెస్, పోలీస్ పవర్ కలిస్తే క్రిమినల్స్‌కి ఫీవరే. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫ్లై ఓవర్‌పై జరుగుతున్న హత్యలను ఎలా ఛేదించారు? అనే అంశంతో పలు మలుపులతో రూపొందుతున్న చిత్రం ‘యు–టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు–టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్‌నే తెలుగు, తమిళ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టారై్టంది. అంటే.. యు–టర్న్‌లో సెకండ్ టర్న్ స్టారై్టందన్న మాట. ‘‘ఒక ఫ్లై ఓవర్ మీద జరుగుతున్న మర్డర్ మిస్టరీస్ను ఛేదించే జర్నలిస్ట్ కథే ‘యు–టర్న్’. హైదరాబాద్‌లో వేసిన భారీసెట్లో సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. జర్నలిస్ట్‌గా సమంత, పోలీసాఫీసర్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. సినిమాలో నరేన్, భూమిక పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. తెలుగు నేటీవిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్ కుమార్ బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి. -
గెస్ట్ ఘోస్ట్
సమంత లీడ్ రోల్లో కన్నడ సూపర్ హిట్ ‘యూ–టర్న్’ చిత్రాన్ని ఆ చిత్రదర్శకుడు పవన్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ఇందులో ఘోస్ట్ క్యారెక్టర్ కోసం చిత్రబృందం భూమికను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వదిన, అక్క క్యారెక్టర్స్ చేస్తున్న భూమిక ఇప్పుడు దెయ్యంగా కనిపించనున్నారు. గెస్ట్ రోల్లో కొన్ని నిమిషాల ఘోస్ట్‌గా అప్పియరెన్స్ ఇవ్వనున్నారట భూమిక. తన క్యారెక్టర్ ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడంతో దెయ్యంగా మారతారు. ఈ యాక్సిడెంట్ చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో సమంత కనిపిస్తారు. సమంత్ పక్కన రాహుల్ రవీంద్రన్, పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
'నాకేం కాలేదు.. క్షేమంగా ఉన్నా..'
కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. తనకి ప్రమాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయని .. అవి ఎంత మాత్రం నిజం కావని, తాను క్షేమంగా ఉన్నట్టు ఆది ట్విటర్ ద్వారా తెలిపారు. ఆది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని, ఆయన కండిషన్ సీరియస్‌గా ఉందని గత రెండు రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆది స్పందించాడు. ‘నాకు యాక్సిడెంట్ జరిగి.. సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. నేను క్షేమంగా ఉన్నాను. నా తర్వాతి చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. నాపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు. లవ్ ఆల్’ అని ఆది ట్వీట్లో తెలిపారు. మరో వైపు ‘భాగమతి’ సినిమాలో ఆది నటిస్తున్నట్లు వచ్చిన వదంతులను ఆయన ఖండించారు. భాగమతి సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నారు. Hav ben seeing rumors that I've met wit an accident... which is absolutely not true!! I am totally alright and keeping myself busy with my ongoing shoots and script works of my next films.... Thaks fr all d love and care... Love all!! — Aadhi's (@AadhiOfficial) January 21, 2018 I've come across a lot of articles online that I am a part of #Bhaagamathie which is not at all true!! I wish the entire team a grand success!!! — Aadhi's (@AadhiOfficial) January 21, 2018 -
నువ్వా.. నేనా!
ఓ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలు నటించినప్పుడు ‘నువ్వా.. నేనా?’ అని పోటీ పడి నటిస్తారు. అలా గట్టి పోటీ ఇచ్చే పాత్రలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. పాతిక సినిమాలకు పైగా నటించిన తాప్సీ, పట్టుమని పది సినిమాలు కూడా చేయని రితికా సింగ్ ఓ సినిమాకి పచ్చ జెండా ఊపారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఏమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కూడా నటించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సై అంటారు ఆది. ఈ చిత్రంలో ‘అంధుడి’గా నటించడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 27న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అనుష్కతో జత కట్టనున్న విలన్
వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తమిళ బాట పట్టిన ఈ యంగ్ హీరో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది మంచి మార్కులు సాధించాడు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు ఆది మీద పడింది. డిఫరెంట్ జానర్లో తెరకెక్కే సినిమాల కోసం ఆదిని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారు. అదే బాటలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లేడి ఓరియంటెడ్ సినిమా భాగమతిలో అనుష్కకు జంటగా ఆదిని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు అశోక్ చెప్పిన కథ విన్న ఆది వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇప్పటికే మళయాల నటుడు జయరాంను విలన్ పాత్రకు ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం టబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల నటులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అప్పుడే సినిమాలో నటించే నటీనటుల విషయంలో మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. -
ఆ టైమ్‌లో నాన్నగారు నవ్వడం మానేశారు!
‘‘ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రికార్డ్ నాన్నగారిది. అలాంటి ఆయన టెన్షన్ పడటం చూసి నాకు విచిత్రంగా అనిపించింది. ఒక కొడుకు డెరైక్టర్.. మరో కొడుకు హీరో.. ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమా ఏమవుతుందోనని ఆయన టెన్షన్. ఇప్పుడు చాలా కూల్‌గా ఉన్నారు’’ అని ఆది పినిశెట్టి అన్నారు. ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఆది ‘గుండెల్లో గోదారి’తో ఇక్కడ కూడా భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు తన అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ ద్వారా మరోసారి తెరపైకొచ్చారు. ఈ సందర్భంగా ఆదితో చిట్ చాట్.. ‘మలుపు’ విషయంలో మీ నాన్నగారు టెన్షన్ పడినప్పుడు మీకేమనిపించింది? బేసిక్‌గా మాది హ్యాపీ ఫ్యామిలీ. కానీ, ‘మలుపు’ మొదలుపెట్టిన తర్వాత నాన్నగారు దాదాపు నవ్వడం మానేశారు. ఎప్పుడూ టెన్షన్ పడేవారు. ‘మీరు చేయని సినిమాలా నాన్నా.. అంతా బాగానే ఉంటుంది’ అని సర్దిచెప్పేవాణ్ణి. కానీ, ఆయన టెన్షన్ పడేవారు. సినిమా విడుదలై, హిట్ టాక్ వచ్చాక కూల్ అయిపోయారు. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా డిఫరెంట్ రూట్లో వెళుతున్నారు.. మరి... మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యేదెప్పుడు? స్టార్ అనిపించుకునే ముందు మంచి నటుడు అనిపించుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఆ తర్వాత స్టార్డమ్ దానంతట అది వచ్చేస్తుంది. తమిళంలో మొదటి సినిమా ‘మృగం’ తర్వాత నాకలాంటి కథలే వస్తే, ‘ఇలాంటి పాత్రలకే పనికొస్తాడు’ అని స్టాంప్ వేస్తారని చేయనన్నాను. తెలుగుకి వస్తే, ‘గుండెల్లో గోదారి’లో చేపలు పట్టేవాడిగా యాక్ట్ చేశాను. ‘మలుపు’లో నా వయసున్న కుర్రాళ్లు ఎలా ఉంటారో అలాంటి పాత్ర చేశాను. కిక్ కోసమే ఇలా డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్నా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై కూడా దృష్టి సారిస్తాను. అవి చేయననడంలేదు. ‘సరైనోడు’లో విలన్‌గా నటించడంవల్ల, తర్వాత అలాంటి పాత్రలకే మిమ్మల్ని పరిమితం చేసే అవకాశం ఉంటుందేమో? ఉండొచ్చు. కానీ, నేను చేయాలి కదా. ‘సరైనోడు’ కథ చాలా బాగుంటుంది. నటుడిగా నాకు మంచి స్కోప్ దక్కుతుంది. అందుకే ఒప్పుకున్నా. తమిళంలో ‘తని ఒరువన్’ని తీసుకుందాం. విలన్‌గా చేసిన అరవింద్ స్వామికి హీరోకన్నా ఎక్కువ పేరొచ్చింది. కొన్ని విలన్ పాత్రలు అలా సెట్ అవుతాయి. ‘సరైనోడు’లో హీరో అల్లు అర్జున్ పాత్రకు దీటుగా ఉండే విలన్ పాత్ర నాది. మీ నాన్నగారు దర్శకత్వం వహించినవాటిలో ఏ చిత్రం రీమేక్‌లో నటించాలని ఉంటుంది? కార్తీక్, రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్లో నాన్నగారు చేసిన ‘పుణ్యస్త్రీ’ నాకు చాలా ఇష్టం. ‘యముడికి మొగుడు’కి మించిన మంచి మాస్ సినిమా ఉంటుందా? ‘యమపాశం’ సినిమా కూడా నాకిష్టం. అవకాశం వస్తే ఈ మూడు చిత్రాల రీమేక్స్‌లో నటించాలని ఉంది. తెలుగు అబ్బాయి అయ్యుండి తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.. మరి తెలుగులో కంటిన్యూస్‌గా చేయాలని లేదా? మాతృభాషలో చేయాలని ఎందుకుండదు? ఈ మధ్య నాలుగైదు కథలు విన్నాను. డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మలుపు’ ఉందనీ, చాలా మంచి సినిమా అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. సో.. నా నెక్ట్స్ సినిమా కూడా వాళ్లతో మెప్పు పొందాలి. అందుకే ఆలోచించి ఫైనలైజ్ చేస్తా. ప్రొఫెషనల్‌గా హ్యాపీ.. పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయ్యేదెప్పుడు? పెళ్లే కదా. నాకెలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో అమ్మానాన్నకు తెలుసు. అందుకే, అమ్మాయిని చూసే బాధ్యతని వాళ్లకే వదిలేశా. కానీ, నాక్కూడా నచ్చితేనే పెళ్లి చేసుకుంటా. -
గెలుపు కోసం... ఎన్నెన్నో మలుపులు
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘మలుపు’ తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ,మిథున్ చక్రవర్తి కెమేరా: షణ్ముఖ సుందరం సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్ నిర్మాత: రవిరాజా పినిశెట్టి రచన - దర్శకత్వం: సత్యప్రభాస్ పినిశెట్టి కళ జీవితాన్ని అనుకరిస్తుందంటారు! నిజజీవిత కథలు వెండితెర కళగా తెర మీదకు రావడం ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే, కొన్ని చిత్రమైన యథార్థ సంఘటనలు సినిమాటిక్‌గా తెరపై పలకరించినప్పుడు, అది నిజజీవిత ఘటనే అని తెలిసినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజా ‘మలుపు’ చిత్రం కూడా అలాంటిదే! నిజానికిది చెన్నైలో నలుగురు ఫ్రెండ్స మధ్య జరిగిన కథ. సినిమా కోసం తెలుగులో ఇది విశాఖపట్నంలో జరిగిందన్నట్లు చూపెట్టారు. కథ ప్రకారం హాయిగా, మరో ముగ్గురు స్నేహితులతో కలసి జీవితాన్ని గడిపేసే కుర్రాడు ‘సగా’గా అందరూ పిలుచుకొనే సతీష్ గణపతి (ఆది పిని శెట్టి). అతని ఫ్రెండ్సలో ఒకడు పోలీస్ కమిషనర్ కొడుకు, మరొకడు పార్ల మెంట్ సభ్యుడి కొడుకు. ఈ ఫ్రెండ్స అంతా జీవితంలో మరికొన్నాళ్ళు కలిసి స్టూడెంట్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం డిగ్రీ ఫైనలియర్ ఎగ్జావ్ు్స రాయ కుండా ఎగ్గొడతారు. హీరోకు అమ్మ (ప్రగతి), నాన్న, అక్క ఉంటారు. లాస్య (నిక్కీ గల్రానీ) అనే మోడరన్ ఏజ్ ఫాస్ట్ గర్లను హీరో ప్రేమిస్తాడు. ఆమెను రక్షించే క్రమంలో ఒక గొడవలోనూ ఇరుక్కుంటాడు. ఇంతలో అక్క పెళ్ళి పనులు హీరోకు అప్పగించి, అమ్మానాన్న ఊరెళతారు. తీరా, వాళ్ళటెళ్ళగానే ఆ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అనూహ్యమైన ఒక సంఘటన ఎదురవుతుంది. దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ నుంచి అతని జీవితమే తలకిందులైపోతుంది. దాంతో ముంబయ్‌లోని నేర సామ్రాజ్యనేత ముదలియార్‌ను వెతుక్కుంటూ అతను బయలుదేరతాడు. ఇంతకీ, ఆ డిసెం బర్ 31 రాత్రి ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ అంశం. దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ రోజేం జరిగింది? దానికీ, ముంబయ్ డాన్కీ లింకేంటి? జీవితంలో కుటుంబమా, స్నేహమా... ఏది ముఖ్యం? ఏదో ఒకటే ఎంచుకో వాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? లాంటి ప్రశ్నలకు జవాబు మిగతా సినిమా. సస్పెన్స డ్రామాను నమ్ముకొన్న ఈ కథలో అవన్నీ తెరపై చూడాలి. ‘పెదరాయుడు’, ‘చంటి’ లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాత అవతారమెత్తి, తెలుగు, తమిళాల్లో నిర్మించిన సినిమా ఇది. ఆయన పెద్ద కొడుకు సత్యప్రభాసే దీనికి దర్శకుడు కూడా! తేజ దర్శకత్వంలో ‘ఒక ‘వి’చిత్రమ్’ ద్వారా తెలుగులో పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత తెలుగులో కనిపించింది తక్కువన్న (‘గుండెల్లో గోదారి’) మాటే కానీ, తమిళంలో పేరున్న హీరో. ‘మృగమ్’, ‘ఈరమ్’ లాంటి తమిళ చిత్రాల ద్వారా తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఈ సమ్మర్‌కి రానున్న ‘సరైనోడు’లో విలన్‌గా కనిపించనున్న ఆదికి ఇది ఓ కీలకమైన పాత్ర. తెలుగు వాచికం స్పష్టంగా ఉన్న ఈ చెన్నై కుర్రాడి నటన, డ్యాన్సులు, ఫైట్లు మాస్ మెచ్చేవే. నిక్కీ గల్రానీ పాత్రోచితంగా బాగున్నారు. హిందీ హిట్ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘గోపాల... గోపాల’లో కనిపించిన ప్రసిద్ధ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి ఓ కీలకపాత్రధారి. నిజానికి, ఆయన అంగీకరించిన తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ఇదే. కాకపోతే, దీని తమిళ వెర్షన్ కన్నా ముందే తెలుగులో ‘గోపాల... గోపాల’ రిలీజైపోయింది. ముంబయ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపే నేరసామ్రాజ్య నేత ముదలి యార్గా ఆయన బాగా చేశారు. చూడడానికి కూడా విభిన్నంగా ఉన్నారు. నాజర్, పశుపతి లాంటి సీజన్డ ఆర్టిస్ట్‌ల కంట్రోల్డ్ యాక్షన్ కూడా బాగుంది. రచన, దర్శకత్వ విభాగాల్లో సత్యప్రభాస్ కొత్త తరానికి నచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్సను నమ్ముకున్నారు. వర్తమానానికీ, గడచిపోయిన సంఘటనల ఫ్లాష్ బ్యాక్లకూ మధ్య తరచూ అటూ ఇటూ తిరిగే కథాకథన శైలిని బలంగా ఉప యోగించుకున్నారు. ఆసక్తికరంగా ఆరంభమయ్యే ఈ సినిమా కాసేపయ్యాక ఎక్కువగా ప్రేమకథ వైపు మొగ్గుతుంది. ఆ క్రమంలో వేగం తగ్గడం అర్థం చేసుకోవాలి. ఇంటర్వెల్‌కు కాస్తంత ముందు నుంచి కథలో వేగం, అదే ఊపులో ట్విస్టులు పెరుగుతాయి. సినిమా చివరకు వచ్చేసరికి కథ ఎన్నెన్నో ములుపులు తిరుగుతుంది. కొండొకచో అవి పరిమితి మించాయనిపించినా ఉత్కంఠ ఆశించే ప్రేక్షకులు ఫిర్యాదులు చేయరు. నిజానికి, ఎనిమిది నెలల క్రితమే ఈ సినిమా తమిళంలో విడుదలైంది. అక్కడి టైటిల్ - ‘యాగవ రాయినుమ్ నా కాక్క’. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. చిత్ర నిర్మాత, దర్శ కుడు, హీరో - అందరూ తెలుగు వాళ్ళు కావడంతో ఆలస్యంగానైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సినిమాలు తమిళ ప్రేక్షకులకు కొత్త కాకపోయినా, తెలుగు వారికి కొత్తగా అనిపించడం, ఇటీవలి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండడం బాక్సాఫీస్ వద్ద గెలుపు విషయంలో ‘మలుపు’కు కలిసొచ్చే అంశాలు. - రెంటాల జయదేవ -
యథార్థ కథతో!
‘‘నా పెద్ద కుమారుడు సత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మించాను. సత్య తన ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు’’ అని సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అన్నారు. సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో తన రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ ఈ నెల 19న విడుదల కానుంది. నిక్కీ గల్రాని కథానాయిక. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సత్య ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఆది రేంజ్‌కు మించి ఈ సినిమా కోసం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం తను ఎన్నో ఆఫర్స్ వదిలేసుకున్నాడు’’ అని చెప్పారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ మిస్ కాదు’’ అని ఆది అన్నారు. నిక్కీ, ప్రగతి, ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
‘మలుపు’ మూవీ స్టిల్స్
-
ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
ఓ యథార్థ ఘటన ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మలుపు’. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా అనుకోని మలుపులతో సాగుతుంది. డిసెంబరు 31 రాత్రి ఏం జరిగిందనే అంశం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘ ‘రుక్మిణి’ తర్వాత నేను నిర్మించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం ఇదే. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించాం’’ అని నిర్మాత తెలిపారు. నటునిగా నాకు ‘వైశాలి’ కంటే ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని హీరో ఆది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్-ప్రవీణ్-శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం.