
యంగ్ హీరో ఆది పినిశెట్టి, స్టార్ హీరో అజిత్‌ను కలిసిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న అజిత్‌ను ప్రత్యేకం ఆది కలవడం అందరిని ఆలోచనలో పడేసింది. దీంతో ప్రస్తుతం ఇది పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆది ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మరి అజిత్‌ను కలవడం వెనక ఏదైన అంతర్యం ఉందా?, ఇద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ విషయమై కలుసుకున్నారా? అంటూ కొందరు చర్చించుకుంటుండగా.. మరికొందరు ఈ మే 18న ఆది పెళ్లి సందర్భంగా ఆయనను ఆహ్వానించేందుకు కలిసి ఉంటాడని అభిప్రాయ పడుతున్నారు.
చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
ఏదేమైనా వీరిద్దరు కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేంలో చూసిన వీరి ఫ్యాన్స్ ఆది-అజిత్‌లు కలిసి ఓ మల్టిస్టార్ సినిమా చేస్తే బాగుంటుందంటూ వారి మనసులోని మాటను బయటపెడుతున్నారు. కాగా ఆది మార్చి 24న తన ప్రియురాలు, హీరోయిన్ నిక్కీ గల్రానీని సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరి పెళ్లి తేదీపై ఈజంట ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
చదవండి: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్
కానీ ఈ నెల 18వ తేదీన ఈ జంట వివాహనికి ముహుర్తం ఫిక్స్ అయ్యిందంటూ తమిళ మీడియా తమ వెబ్‌సైట్లో కథనాలు రాసుకొస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ప్రస్తుతం అజిత్ తన తాజా చిత్రం ఏకే61 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్‌లనే ఉంటున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment