ఆది పినిశెట్టి
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది.
ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించాం.
ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్‌ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్.
Comments
Please login to add a commentAdd a comment