
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్-3. శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ మూడో చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన హిట్, హిట్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి అబ్‌కీ బార్.. అర్జున్ సర్కార్..అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు మిక్కీ జె మేయర్ సంగీతమందించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన మెలోడి సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Lil something to start the heat.
Fireworks on 14th.
All hell breaks loose on May 1st. #AbKiBaarArjunSarkaar full song is here. https://t.co/6URUQmtchs #HIT3 pic.twitter.com/z104cXigpE— Nani (@NameisNani) April 9, 2025