అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని | Tollywood Hero Nani Commets On Variations Bettween Actors | Sakshi
Sakshi News home page

Nani: దాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం.. ఇకనైనా ఆపేయాలి: నాని

Apr 14 2025 9:00 PM | Updated on Apr 14 2025 9:23 PM

Tollywood Hero Nani Commets On Variations Bettween Actors

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్‌లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.

మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరో.. ఇక టైర్‌- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.

నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్‌ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్‌ కాన్సెప్ట్‌. ఎవరు మొదలుపెట్టారోగానీ..  మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం.  ఇకపై ఆ వేరియేషన్‌ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement