combination
-
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం షురూ అయింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘దసరా’కి 2023 మార్చి 7న చివరిసారిగా కట్, షాట్ ఓకే అని చెప్పాను. 2024 సెపె్టంబర్ 18న ‘నాని ఓదెల 2’ ప్రకటన వీడియో కోసం మళ్లీ యాక్షన్ చెప్పాను.48,470,400 సెకన్లు గడిచాయి. ప్రతి సెకను ఈ ్రపాజెక్ట్ కోసం సిన్సియర్‌గా ఉన్నాను. ‘దసరా’ చిత్రం స్థాయిని ‘నాని ఓదెల 2’తో వంద రెట్లు పెంచుతానని మాట ఇస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘నానీని ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్లో చూపిస్తూ, యునిక్ అండ్ ఎగ్జయిటింగ్ నెరేటివ్‌తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ‘నాని ఓదెల 2’ చిత్రం అందించనుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్‌కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్‌లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. -
కాంబినేషన్ రిపీట్?
‘పవర్’ మూవీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పవర్’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట దర్శకుడు.అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అవుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారని భోగట్టా. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్‌ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
హిట్ కాంబినేషన్ రిపీట్
హిట్ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. -
ఆరంభం అప్పట్నుంచేనా..?
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ టార్గెట్ అని సమాచారం. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్‌చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్‌చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
గోవాలో మాఫియా
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ షెడ్యూల్లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
బ్యాక్ టు హోమ్
మహేశ్‌బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిట్నెస్ ట్రైనింగ్, ఓ వర్క్‌షాప్‌లో భాగంగా మహేశ్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లవారు. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారాయన. కాగా ఈ సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. -
సీక్వెల్ కోసం వెంకటేశ్– అనిల్ రావిపూడి ప్లాన్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల (వరుణ్ తేజ్ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథను వెంకటేశ్‌కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ‘ఎఫ్ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్‌బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్‌బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్‌లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్‌బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్‌గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. -
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్‌లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్‌కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్‌కు ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్
అడివి శేష్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్‌కు షాన్ దర్శకత్వం వహించారు. శేష్, శ్రుతి కాంబినేషన్లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్‌లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
లవ్.. యాక్షన్.. రొమాన్స్
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు అనిల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లవ్.. యాక్షన్.. రొమాన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున. -
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
ఫైట్‌తో ప్రారంభం
‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మంగళవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్–లక్ష్మణ్ ఈ ఫైట్ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
కల నెరవేరనుందా?
పూజా హెగ్డేకి బోలెడన్ని కలలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన నటించాలన్న కల ఒకటి. ‘షారుక్ ఖాన్ రొమాంటిక్ లుక్స్ అంటే నాకిష్టం. అందుకోసమే ఆయన సినిమాలు చూడ్డానికి ఇష్టపడతాను. షారుక్ రొమాంటిక్ కింగ్’ అని గతంలో ఓ సందర్భంలో పూజా పేర్కొన్నారు కూడా. షారుక్ సరసన నటించాలనే తన కల నెరవేరే చాన్స్ ఉందని కూడా ఆమె అన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లుంది. ప్రస్తుతం షారుక్ ‘డంకీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘డంకీ’ తర్వాత షారుక్ నటించనున్న చిత్రంలోనే పూజా హెగ్డే ఈ బాలీవుడ్ బాద్షా సరసన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందనున్న ‘టైగర్ వెర్సస్ పఠాన్’లోనే పూజా హెగ్డే నటించనున్నారట. ఈ విష యంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.