కల నెరవేరనుందా? | Pooja Hegde to work with Shah Rukh Khan in his next Project | Sakshi
Sakshi News home page

కల నెరవేరనుందా?

Published Mon, Oct 9 2023 4:24 AM | Last Updated on Mon, Oct 9 2023 4:24 AM

Pooja Hegde to work with Shah Rukh Khan in his next Project - Sakshi

పూజా హెగ్డేకి బోలెడన్ని కలలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సరసన నటించాలన్న కల ఒకటి. ‘షారుక్‌ ఖాన్‌ రొమాంటిక్‌ లుక్స్‌ అంటే నాకిష్టం. అందుకోసమే ఆయన సినిమాలు చూడ్డానికి ఇష్టపడతాను. షారుక్‌ రొమాంటిక్‌ కింగ్‌’ అని గతంలో ఓ సందర్భంలో పూజా పేర్కొన్నారు కూడా. షారుక్‌ సరసన నటించాలనే తన కల నెరవేరే చాన్స్‌ ఉందని కూడా ఆమె అన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లుంది.

ప్రస్తుతం షారుక్‌ ‘డంకీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘డంకీ’ తర్వాత షారుక్‌ నటించనున్న చిత్రంలోనే పూజా హెగ్డే ఈ బాలీవుడ్‌ బాద్‌షా సరసన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘టైగర్‌ వెర్సస్‌ పఠాన్‌’లోనే పూజా హెగ్డే నటించనున్నారట. ఈ విష యంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement