Shahrukh Khan
-
హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్
సినిమా హీరోహీరోయిన్లు పలువురు ఓవైపు నటిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు అదే యాడ్స్ వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడుతుంటారు. మొన్నీమధ్యే క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తమన్నా, కాజల్ అగర్వాల్ కి పోలీసులు నోటీసులిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఇలానే నోటీసులు అందుకున్నారట.ఏం జరిగింది?బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్.. ఓ పాన్ మసాలా యాడ్ లో నటించారు. చాన్నాళ్ల నుంచి టీవీల్లో దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, ఇది ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని జైపూర్ కి చెందిన లాయర్ యోగేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)ఈ యాడ్ లో 'పలుకు పలుకులో కేసరి' అనే ట్యాగ్ లైన్ ఉపయోగించారని, కానీ సంస్థ చెప్పినట్లు ఈ ఉత్పత్తిలో అసలు కేసరి (కుంకుమ పువ్వు) కలిపి లేదని న్యాయవాది ఆరోపించారు. దీంతో మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ముగ్గురు హీరోలతో పాటు గుట్కా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.ఒకవేళ కోర్టుకు ఎవరూ హాజరు కాకపోయినా విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కోర్ట్ ఆదేశించింది.€మరి ఏం జరుగుతుందో చూడాలి? తెలుగులోనూ మహేశ్ బాబు ఇలా ఓ పాన్ మసాలా యాడ్ లో నటించాడు.(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్) -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయనేది మరికాసేపట్లో తెలుస్తుంది. ఎంతొస్తుందనే విషయం పక్కనబెడితే ఇప్పుడు బాలీవుడ్లో బన్నీ తనదైన బ్రాండ్ రికార్డ్ సెట్ చేశాడు. తొలిరోజు కలెక్షన్స్‌తో ఏకంగా దిగ్గజ షారుఖ్ ఖాన్నే అధిగమించేశాడట. నార్త్ అంతా ఇప్పుడు ఇదే టాక్.(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)తెలుగుతో పోలిస్తే 'పుష్ప 2'కి ఉత్తరాదిలో బీభత్సమైన హైప్ ఉంది. పాట్నాలో ఈవెంట్ జరగ్గా.. దానికి వచ్చిన లక్షలాది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ. అందుకు తగ్గట్లే నార్త్‌లో తొలిరోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలా ఏకంగా హిందీ వెర్షన్‌కి తొలిరోజు రూ.67 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయట.గతంలో షారుక్ 'జవాన్' మూవీకి రూ.64 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్.. బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్‌ని ఇకపై బన్నీవుడ్ అని పిలొచ్చేమో! తొలిరోజే ఈ రేంజులో ఉందంటే.. వీకెండ్ అయ్యేసరికి తెలుగు సంగతి పక్కనబెడితే హిందీలో సగం రికార్డులు 'పుష్ప 2' దెబ్బకు గల్లంతవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు
-
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
షారూఖ్ ఖాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. తొలి భారతీయ నటుడిగా ఘనత!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చివరిసారిగా డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా అభిమానులను మెప్పించడంలో విఫలమైంది. అయితే షారూఖ్ ఖాన్ తాజగా లోకార్నో ఫిల్మ్ ఫిస్టివల్‌లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు.పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారూఖ్ ఖాన్ నిలిచారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్షా ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల ప్రేమవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. మూడున్నర దశాబ్దాల కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేశానని బాద్షా చెప్పుకొచ్చారు. విలన్‌గా, ఛాంపియన్‌గా, సూపర్ హీరోగా, జీరోగా కనిపించానని వెల్లడించారు.ముఖ్యంగా దక్షిణాది సినిమాలపై షారూఖ్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలో చాలా భాషలు ఉన్నాయప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా దక్షిణాది నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయని షారూఖ్ అన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు సినిమాటిక్‌గా, టెక్నికల్‌గా ఫెంటాస్టిక్ అని కొనియాడారు. సౌత్‌లో హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని బాలీవుడ్ బాద్షా తెలిపారు. Shah Rukh Khan - "To regionalize Indian Cinema is wrong, we have some wonderful cinema and talents from each corner of country. Technically South Cinema is very fantastic, and I loved the opportunity to create a fusion of Bollywood & South in Jawan" pic.twitter.com/Rpr8ZjqFnd— sohom (@AwaaraHoon) August 11, 2024 -
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.pic.twitter.com/MIWgJ4WWbZ— Saksham Nagar (@SAKSHAMNAGAR90) April 28, 2024 -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.<blockquote class="twitter-tweet"><p lang="zxx" dir="ltr"><a href="https://t.co/MIWgJ4WWbZ">pic.twitter.com/MIWgJ4WWbZ</a></p>&mdash; Saksham Nagar (@SAKSHAMNAGAR90) <a href="https://twitter.com/SAKSHAMNAGAR90/status/1784551354158969025?ref_src=twsrc%5Etfw">April 28, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్, ఆనన్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ యాజమాని, బాలీవుడ్ బాదుషా షారుఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు అతని కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సైతం కేకేఆర్‌ను సపోర్ట్ చేసేందుకు వచ్చారు. ముఖ్యంగా లక్నో కీలక ఆటగాడు ఆయూష్ బదోని ఔటయ్యాక షారుఖ్,సుహానా,అనన్య సంబరాల్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు. pic.twitter.com/fdC6JLf9Lf — Sitaraman (@Sitaraman112971) April 14, 2024 -
కాంగ్రెస్ ప్రత్యర్థిగా షారూఖ్ తండ్రి.. నాడు ఏం జరిగింది?
రాజకీయాల్లోకి సినీతారలు ప్రవేశించడం కొత్తవిషయమేమీ కాదు. అయితే వారు రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారనేది ఆసక్తికర అంశం. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆ తరువాత ఏం జరిగింది? హిందీ నటుడు షారూక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ స్వాతంత్ర్య సమరయోధుడు. నాడు ఆయనకు కాంగ్రెస్‌లో పలువురు సన్నిహిత మిత్రులు ఉండేవారు. స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీర్ తాజ్ మహ్మద్‌కు లభించింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 1957లో దేశంలో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో తాజ్ మహ్మద్ గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నాటి కాంగ్రెస్ దిగ్గజ నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల రణరంగంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాటి ఎన్నికల్లో భారత తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్ అమోఘ విజయం సాధించారు. జనసంఘ్ అభ్యర్థి మూల్ చంద్ రెండో స్థానంలో నిలిచారు. తాజ్ మహ్మద్ జాతీయవాద నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరుడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో తాజ్ మహ్మద్ చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. పెషావర్‌లో పెరిగిన తాజ్ మహ్మద్ న్యాయశాస్త్రం చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. 1947లో భారత్-పాక్ విభజన సమయంలో తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉన్నారు. కారవాన్‌లో ప్రచురితమైన ఇరామ్ అఘా నివేదిక ప్రకారం విభజన అనంతరం పాక్ ప్రభుత్వం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తాజ్ మహ్మద్ అనుచరులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. నాటి నుంచి తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉండిపోయారు. -
పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా తెరిస్తే చాలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపించాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఇంకేం పనిలేనట్లు జామ్ నగర్లోనే కనిపించారు. పాటలు పాడుతూ డ్యాన్సులేస్తూ ఊహించన పనులెన్నో చేశారు. అయితే ఇదేదో అంబానీ అంటే గౌరవంతో చేసింది కాదు. తెర వెనక కోట్ల రూపాయల డీలింగ్స్ జరిగాయట. తాజాగా హీరోయిన్ కంగన పోస్ట్‌తో ఇదంతా బయటపడింది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!) స్టార్ సెలబ్రిటీల్లో చాలామంది ప్రతి విషయాన్ని డబ్బుతోనే లెక్కేస్తారు. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. ఇది కాదన్నట్లు పలు వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ అంబానీ లాంటి బిజినెస్‌మేన్ పెళ్లికి.. జస్ట్ అలా హాజరయ్యేందుకు కూడా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుంటారట. అవును మీరు సరిగానే విన్నారు. గతంలో తనకు కూడా ఇలా ఆఫర్స్ వచ్చాయని, కానీ తాను ఆత్మగౌరవం చంపుకోలేదని కంగన రాసుకొచ్చింది. 'ఆర్థికంగా దారుణమైన పరిస్థితుల్ని చాలాసార్లు నేను ఫేస్ చేశారు. కానీ ఎవరెన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసినా సరే పెళ్లిళ్లలో డ్యాన్స్ లాంటివి చేయలేదు. ఐటమ్ సాంగ్స్‌లో కూడా నాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నేను చేయలేదు. కొన్నాళ్ల తర్వాత అవార్డ్ షోలకి కూడా వెళ్లడం మానేశాను. ఇలా డబ్బు, ఫేమ్ వద్దని చెప్పడానికి ఆత్మగౌరవం చాలా కావాల్సి ఉంటుంది' అని కంగన తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) కంగన తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఆర్టికల్ చూస్తే.. గతంలో దిగ్గజ సింగర్స్ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్లకు కూడా తమ పెళ్లిలో పాటలు పాడితే రూ.50 కోట్లకు అంతకు మించిన మొత్తం ఇస్తామని ఆశ చూపారట. కానీ వాళ్లు వెళ్లలేదు. కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో మాత్రం బాలీవుడ్ హేమాహేమీలు అందరూ కనిపించారు. వీళ్లు.. పెళ్లికి హాజరవడంతో పాటు డ్యాన్సులు చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. బహుశా అందుకేనేమో ప్రీ వెడ్డింగ్‌కే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అయనట్లు ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌లో బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్‌లతో పాటు చిన్న పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు. దక్షిణాది నుంచి మాత్రం రామ్ చరణ్, రజినీకాంత్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు కంగన పోస్ట్ చూస్తుంటే.. చరణ్, రజినీకాంత్‌లకు కూడా పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చారేమో అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?) -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారుఖ్ హాజరయ్యాడు. ఈ లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరేట్స్‌పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు Shah Rukh Khan spotted watching #ILT20 game in UAE pic.twitter.com/AW6BywpDF0 — Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) January 20, 2024 -
రణబీర్, సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా?
-
కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు షారుక్ కూడా ప్రమోషన్స్లలో బిజీగా ఉన్నారు. తాజాగా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్‌కు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న షారుక్.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గత రెండు సినిమాలు పఠాన్,జవాన్ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్ ఖాన్ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ కూడా విడుదల కానుంది. -
షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ తన 'ఐయోనిక్ 5' (Ioniq 5) ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత 20 సంవత్సరాలుగా హ్యుందాయ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్‌కు కంపెనీ 'ఐయోనిక్ 5' 1100వ యూనిట్‌ను డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ఐయోనిక్ 5 ఈవీ లాంచ్ సమయంలో కూడా షారుక్ పాల్గొన్నారు. ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' కావడం గమనార్హం. మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదీ చదవండి: తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు షారూఖ్ ఖాన్ ఇతర కార్లు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో ఒకరైన షారుక్ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద ఉన్న కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, బుగట్టి వేరాన్ స్పోర్ట్స్, ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, హ్యుందాయ్ క్రెటా వంటివి మరెన్నో ఉన్నాయి. -
The Archies Screening: ద ఆర్చీస్ గ్రాండ్ ప్రీమియర్.. కదిలొచ్చిన బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
చాలా భావోద్వేగానికి గురయ్యాను
‘‘డంకీ’ సినిమాలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాట తొలిసారి విన్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, బొమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్‌పై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ‘హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ ఎస్ఆర్కే’ సెషన్స్‌లో భాగంగా అభిమానులు, నెటిజన్స్‌తో మాట్లాడిన షారుక్ ఖాన్ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటని తొలిసారి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?’ అనే ప్రశ్నకు షారుక్ ఖాన్ మాట్లాడుతూ–‘‘ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను గుర్తు చేసింది. అలాగే ఢిల్లీలో నేను గడిపిన నాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బదులిచ్చారు. -
అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ ను పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ.9 కోట్ల భారీ ధరకు షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఫినిషర్‌గా పంజాబ్ జట్టులోకి వచ్చిన షారూఖ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. 3 సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ తరపున 33 మ్యాచ్‌లు ఆడిన ఆడిన అతడు 134.81 స్ట్రైక్ రేట్‌తో కేవలం 426 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ కింగ్స్ ఈసారి విడిచిపెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. వేలంలోకి వచ్చిన షారుఖ్ ఖాన్ మరోసారి భారీ ధరకు అమ్ముడుపోతాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. షారుఖ్ ఖాన్ కోసం వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్లు కచ్చితంగా పోటీపడతాయి. గుజరాత్ హార్దిక్ పాండ్యాను విడిచిపెట్టింది కాబట్టి ఆ జట్టు ఇప్పుడు ఒక ఫినిషర్ కావాలి. ఈ నేపథ్యంలో అతడిని సొంతం చేసుకునేందుకు గుజరాత్ ప్రయత్నిస్తోంది. అదే విధంగా చెన్నైకు బెన్ స్టోక్స్ కూడా లేడు, దీంతో సీఎస్కే కూడా అతడిని దక్కించుకునేందుకు శ్రమిస్తోంది. ఇప్పటివరకు షారుఖ్ పంజాబ్ కింగ్స్‌తో 9 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఈసారి అతడిని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. అతడు మళ్లీ రూ.12 నుంచి 13 కోట్లకు అమ్ముడుపోతడాని అశ్విన్ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!? -
Shah Rukh Khan Daughter Suhana Khan: షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఎంత అందంగా ఉందో చూశారా? (ఫొటోలు)
-
కల నెరవేరనుందా?
పూజా హెగ్డేకి బోలెడన్ని కలలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన నటించాలన్న కల ఒకటి. ‘షారుక్ ఖాన్ రొమాంటిక్ లుక్స్ అంటే నాకిష్టం. అందుకోసమే ఆయన సినిమాలు చూడ్డానికి ఇష్టపడతాను. షారుక్ రొమాంటిక్ కింగ్’ అని గతంలో ఓ సందర్భంలో పూజా పేర్కొన్నారు కూడా. షారుక్ సరసన నటించాలనే తన కల నెరవేరే చాన్స్ ఉందని కూడా ఆమె అన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లుంది. ప్రస్తుతం షారుక్ ‘డంకీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘డంకీ’ తర్వాత షారుక్ నటించనున్న చిత్రంలోనే పూజా హెగ్డే ఈ బాలీవుడ్ బాద్షా సరసన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందనున్న ‘టైగర్ వెర్సస్ పఠాన్’లోనే పూజా హెగ్డే నటించనున్నారట. ఈ విష యంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
స్టార్ హీరో షారుక్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎందుకంటే గత ఐదేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాడు. చెరో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించాడు. థియేటర్లలోకి వచ్చిన నెల దాటిపోయినా సరే 'జవాన్' ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?) 'జవాన్' సంగతేంటి? షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తీశాడు. కథ పరంగా చూస్తే చాలా రొటీన్. కానీ స్క్రీన్ ప్లేతో పాటు ప్రతి సీన్లోనూ ఎలివేషన్, భారీతనం కనిపించింది. దీంతో సినీ ప్రేక్షకులు మిగతా విషయాల్ని పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేశారు. దీంతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చాయి. బర్త్‌డే నాడు ఓటీటీలోకి జవాన్ డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పుడు షారుక్ పుట్టినరోజు సందర్భంగా నవంబరు 2న 'జవాన్'ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో లేని సీన్స్‌ని కూడా ఓటీటీ కట్లో ఉండబోతున్నాయని సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే ఓటీటీలోనూ 'జవాన్' రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!
బాద్షా షారుక్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేయడమే గొప్ప. అలాంటిది తమిళం నుంచి బాలీవుడ్‌కి వెళ్లి మరీ దర్శకుడు అట్లీ 'జవాన్' తీశాడు. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్న డైరెక్టర్ అట్లీ.. గతంలో తన రంగు విషయమై చాలా ట్రోల్స్ అనుభవించాడు. ఆ హీరోతో సినిమా వల్ల స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాడు. 'రాజా రాణి' మూవీతో దర్శకుడు అయిపోయాడు. తమిళ, తెలుగులో ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. దీని తర్వాత విజయ్‌తో తెరి (పోలీసోడు) అనే సినిమా తీశాడు. విజయ్ అంటే పడని కొందరు అట్లీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) కలర్ కామెంట్స్ అయితే 'తెరి' సినిమా చేస్తున్న సమయంలోనే నటి కృష్ణప్రియతో అట్లీకి పెళ్లయింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం ఆమెది. సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తూ పేరు తెచ్చుకున్న ఈమె.. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అట్లీకి పరిచయమైంది. అలా ఐదేళ్ల పాటు సాగిన వీళ్ల బంధం చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెద్దల్ని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ తో సినిమా చేస్తున్నాడని పడని కొందరు.. అట్లీ కలర్‌ని ఉద్దేశిస్తూ.. కృష్ణప్రియతో ఉన్న ఫొటోలపై కామెంట్స్ చేశారు. 'కాకి ముక్కుకు దొండపండు' అని ఎగతాళి చేశారు. మొన్న 'జవాన్' రిలీజ్ టైంలోనే ఈ తరహా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా మనసులో పెట్టుకోని అట్లీ.. నవ్వుతూ ముందుగు సాగిపోతున్నాడు. (ఇదీ చదవండి: నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: కమల్ హాసన్) -
30 అడుగుల అభిమానం
‘జవాన్’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్ బెనర్జీ మార్బుల్ స్టోన్ చిప్స్, పెయింట్ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్ పోట్రాయిన్ రూపొందించాడు. ఈ స్టన్నింగ్ పోర్ట్రయిట్ డ్రోన్ షాట్ అదిరిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్ టూ ది కింగ్‌ఖాన్. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ. -
నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్‌పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్‌గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్‌పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్‌లను వివిధ రకాల పాస్‌వర్డ్‌లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’.‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘జవాన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. (చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్ మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జవాన్’కి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందని కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమని, షారుఖ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. Just started watching #Jawan, and I'm already hooked! The action scenes are intense, and the story is gripping. Can't wait to see how the hero saves the day. Any recommendations for similar action-packed movies? #MovieNight 🍿 — RushLabs (@RushLab) September 7, 2023 ఇప్పుడే జవాన్ చూశాను. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. కథనం ఆకట్టుకుంది. షారుఖ్ నటన అదుర్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Jawan Early Review B L O C K B U S T E R: ⭐️⭐️⭐️⭐️⭐️#Atlee has delivered a masterpiece, an exhilarating blend of emotion and mass action This year belongs to the baadhshah #ShahRukhKhan𓃵 👑 #VijaySethupathi #Nayantara & rest were great DON'T MISS IT !!#JawanReview pic.twitter.com/lKuYZ6oWGr — ConectMagnet (@ConectMagnet) September 7, 2023 ‘జవాన్ బ్లాక్ బస్టర్ హిట్. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్ మరియు మాస్ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే. విజయ్ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు. జవాన్ చూడడం మిస్ కాకండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #Atlee#OneWordReview #Jawan : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Jawan is a WINNER and more than lives up to the humongous hype… Atlee immerses us into the world of Mass pan-Indian film, delivers a KING-SIZED ENTERTAINER… Go for it. MUST WATCH. #JawanReview #ShahRukhKhan pic.twitter.com/WgtqoKFyjD — Rithik Modi (@rithiek) September 7, 2023 జవాన్ విజయం సాధించాడు. సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్డ్ ఎంటర్టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #jawanReview..!!! 1st Half ok👍 2nd Half average.. Nayanthara Entry 🔥 VJ sethupathi Acting🙏 🔥 'One word ' #Jawan film loved by Shahrukh Khan fans#JawanFirstDayFirstShow#JawanFDFS #ShahRukhKhan𓃵 #AskSRK pic.twitter.com/qC7eArxP79 — Raj (@Rajwriter7) September 7, 2023 ‘ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ యావరేజ్. నయనతార ఎంట్రీ బాగుంది. విజయ్ సేతుపతి నటన అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే...‘జవాన్’ షారుఖ్ అభిమానులను అలరిస్తుంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. The film @iamsrk starer #jawan will create a tsunami at Bharat & overseas box office 🔥🔥🔥 from its Day1, all the existing records in danger. People are going to witness what happens when the world's biggest superstar comes with mass Avtar 💥💥💥 #JawanFDFS #ShahRukhKhan𓃵 💓 — basha (@Noone47949911) September 6, 2023 My friends from New Zealand told me. It's going to be tsunami at the box office for #Jawan. #KingKhan SRK is going to rule Global Box Office. The collections will be earth shattering. 🔥🔥 — Says A man (@saysAmann) September 7, 2023 Jawan came to creat history at box office. Biggest blockbuster of bollywood industry. CRAZE for #Jawan is unmatchable. Even in early morning 🔥🔥🔥#JawanFirstDayFirstShow #JawanReview #JawanAdvanceBooking #JawanFDFS pic.twitter.com/Ta0uM5gZwv — Satya Prakash (@Satya_Prakash08) September 7, 2023 #JawanReview :⭐⭐⭐⭐#Jawan is a fascinating crime filled movie told from multiple perspectives with perfect pace & cinematography. An absolute entertainer package with action, comedy, thrill & what else.. @iamsrk @VijaySethuOffl & @Atlee_dir keep us on the edge of our seat pic.twitter.com/kBVFX3UK4B — Shams Ansari (@realshams01) September 7, 2023 #Jawan craze is like a festival 🔥 This is unbelievable and Unmatchable for other stars.#ShahRukhKhan𓀠 is ready to rule the box office and wins hearts ✅#JawanTsunamiTomorrow #JawanFirstDayFirstShow #Jawan #ShahRukhKhan𓀠 #JawanReviews #Nayanthara #ThalapathyVijay pic.twitter.com/sohSZzbeom — Jani ( Fan Account) (@filmy49515) September 7, 2023 -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
కొత్త డాన్ వచ్చేశాడు.. షారుక్ ప్లేస్‌లో
బాలీవుడ్లో కొత్త డాన్ వచ్చాడు. ‘మై హూ డాన్’ అంటున్నారు రణ్వీర్ సింగ్. షారుక్ ఖాన్ హీరోగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ బుధవారం ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. ఇందులో డాన్‌గా రణ్వీర్ సింగ్ నటించనున్నట్లు వెల్లడించారు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి.. వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్ని..’ అనే డైలాగ్స్ ‘డాన్ 3’ అనౌన్స్మెంట్ వీడియోలో వినిపిస్తాయి. ‘డాన్ 3’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, 2025లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్‌కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్‌బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!) -
హీరో షారుక్ ఖాన్‌కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!
మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ కనిపిస్తే ఏం చేస్తారు? మహా అయితే సెల్ఫీ దిగుతారు. కుదరకపోతే దురం నుంచే ఫొటో తీసుకుని సంతోషపడతారు. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం అంతకు మించి అనేలా ప్రవర్తించింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఎప్పుడు ఏం జరిగిందో తెలుసా? హిందీలో ఇప్పుడు చాలామంది హీరోలున్నారు. కానీ 90స్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు అందరినీ కవర్ చేసిన హీరో అంటే మాత్రం షారుక్ ఖాన్ గుర్తొస్తాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో హిట్స్ కొట్టిన షారుక్.. గత కొన్నేళ్లుగా వరసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది మాత్రం 'పఠాన్' తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రెండు కొత్త మూవీస్ చేస్తూ బిజీ. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయిన షారుక్.. రీసెంట్ గా దుబాయిలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఈవెంట్ కి సంబంధించిన వాళ్లతో పాటు కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకామె షారుక్ ని చూసి ఆత్రం ఆపుకోలేకపోయింది. పర్మిషన్ లేకుండానే అతడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది. తెగ ఆనందపడిపోయింది. కొందరు నెటిజన్స్ ఇదంతా చూసి.. అనుమతి లేకుండా ఇలా చేసినందుకు ఆమెని జైల్లో వేయమని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: షారుక్ ఖాన్ ఇంటికి ఫ్రీ ఫుడ్.. ఇది యాపారం!) The love #ShahRukhKhan gets every part of the world, is truly amazing. He deserves every bit of it & more. Thank You @iamsrk for existing, You truly are love itself ❤️ pic.twitter.com/yzhKUMd9wg — Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 13, 2023 -
12 ఏళ్లుగా డాన్ 3 గురించి చర్చ.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన నిర్మాత
షారుక్ ఖాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘డాన్’ (2006) ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘డాన్ 2’ (2011) కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ‘డాన్ 3’కి సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన పన్నెండేళ్లల్లో ‘డాన్ 3’ గురించి అడపా దడపా చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘డాన్ 3’ గురించి చిత్రనిర్మాత రితేష్ అద్వానీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కథ సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చెబుతామనీ పేర్కొన్నారు రితేష్. -
షారుక్ ఖాన్‌పై నెటిజన్స్ ఫైర్!
-
ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్‌వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్‌ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. టీజర్లో షారుక్ ఎంట్రీ సూపర్! ఇందులో ఆర్యన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్‌ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్‌తో సింపుల్‌గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్‌ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ల పనుల్లో సోదరి సుహానా ఖాన్‌తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) -
షారుక్ ఖాన్.. పంజాబ్ కింగ్స్‌కు దొరికిన వరం
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ దూసుకెళుతుతంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సికందర్ రజా హాఫ్ సెంచరీతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆఖర్లో సికందర్ రజా ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి షారుక్ ఖాన్ తన సూపర్స్మార్ట్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. షారుక్ ఖాన్ చేసింది 23 పరుగులే కావొచ్చు.. కానీ ఒత్తిడిలో అతను పంజాబ్‌ను గెలిపించిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. అంతకముందు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో షారుక్ ఖాన్ రెండు స్టన్నింగ్ క్యాచ్‌లతో మెరిశాడు. బౌండరీ లైన్ వద్ద కష్టసాధ్యంగా అనిపించిన క్యాచ్‌లను బౌండరీ లైన్ తొక్కకముందే బంతిని గాల్లోకి ఎగరేసి బ్యాలెన్స్ చేసుకొని మళ్లీ బౌండరీ లైన్ ఇవతలు వచ్చి స్మార్ట్‌గా క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే దాదాపు రెండు క్యాచ్‌లను ఒకేలా తీసుకున్న షారుక్ ఖాన్ స్మార్ట్‌నెస్ ఉపయోగించాడు. అలా ఇవాళ్టి మ్యాచ్‌లో సికందర్ రజాతో పాటు షారుక్ ఖాన్ కూడా హీరో అయ్యాడు. షారుక్ ఖాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ''నిజంగా షారుక్ ఖాన్ పంజాబ్ కింగ్స్‌కు దొరికిన ఒక వరం.. అతన్ని ఉపయోగించుకుంటే తెలివిగా మ్యాచ్‌లను గెలవొచ్చు'' అంటూ కామెంట్ చేశారు. Shahrukh Khan and happy endings 👌🏼@PunjabKingsIPL seal their third victory in #IPL2023 💥#IPLonJioCinema #TATAIPL | @shahrukh_35 pic.twitter.com/9jO8L3hAD9 — JioCinema (@JioCinema) April 15, 2023 Safe hands ft. Shahrukh Khan 👏👏@PunjabKingsIPL gain momentum as #LSG lose both Krunal Pandya & Nicholas Pooran!@KagisoRabada25 with the crucial breakthroughs 👏 Follow the match ▶️ https://t.co/OHcd6Vf5zU #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/LUbO5VUc75 — IndianPremierLeague (@IPL) April 15, 2023 Two wickets in the final over for @CurranSM 👌👌 The @PunjabKingsIPL skipper had an impressive day with the ball 🙌#TATAIPL | #LSGvPBKS pic.twitter.com/ert0qdNx7D — IndianPremierLeague (@IPL) April 15, 2023 -
బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్.. అందుకేనా భారీ రెమ్యునరేషన్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ సన్నివేశంలో నటించటానికైనా రెడీగా ఉండాలి. ఇక కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ బాగా ప్లస్ అవుతుంది. ఈ నాటి స్టార్ హీరోయిన్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్ లో అందాలు ఒలకబోసివారే. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు.....ఇంటిమేట్ సీన్స్ లో వారి టాలెంట్ చూపించారు. గ్లామర్ షో చేయటానికి ఇష్టపడే హీరోయిన్స్ కూడా బికినీ డ్రెస్ లో నటించటానికి నో చెబుతారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే బికినీ ధరించి ప్రేక్షకులకి ట్రీట్ ఇస్తారు. వారిలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. అయితే గత కొంతకాలంగా నయనతార రోమాంటిక్ సన్నివేశాలకు...బోల్డ్ అటెంప్ట్ లకు దూరంగా ఉంటుందనే చెప్పాలి. అయితే నయనతార కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ను తన గ్లామర్ తోనే ఆకట్టుకుంది. ఎక్కువ కమర్షియల్ మూవీస్ లో నటించిన నయనతార తన అందాలతో కనువిందు చేయటానికి ఏ మాత్రం వెనకడుగు వేసేది కాదు. అజిత్ బిల్లా సినిమాలో నయనతార బికినీ ధరించి కనిపించింది. అలాగే శింబు వల్లభ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో నటించటమే కాదు..ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది. అలా నయనతార తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిస్ చేసుకుంది. ఆ తర్వాత వుమెన్ సెంట్రిక్ సినిమాలవైపు టర్న్ తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇన్నాళ్లు సౌత్ మూవీస్ చేసిన నయన్.. షారుఖ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నయనతార గతంలో ఎప్పుడూ లేని విధంగా జవాన్ సినిమాలు కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె గ్లామర్ షో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆమె స్టన్ అయ్యేలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. షారూఖ్ ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ తప్పకుండా కనిపిస్తాయి. రీసెంట్ గా పఠాన్ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునేతో చాలా ఘాటు సీన్స్ ఉన్నాయి. అలాగే బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీ వేసుకుని నటించింది. అలాగే జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నయన్ బికినీ సీన్ చేయబోతుందనే టాక్ బీటౌన్ లోనే కాదు చెన్నైలో కూడా వినిపిస్తోంది. బికినీ సీన్లు ఉన్నాయి కాబట్టే.. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుందట నయన్. ప్రతి సినిమాకు రూ.6 నుంచి 7 కోట్ల వరకు తీసుకునే నయన్.. జవాన్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. ఒకవేళ నయన్ జవాన్ లో బికినీ కనిపిస్తే ..సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవటం మాత్రం గ్యారెంటీ. జవాన్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్.. ఇంత మంది మూర్ఖులా!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఏముందని చూస్తున్నారు? ‘పఠాన్’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్’ను కనుగొన్నారని సెటైర్ వేశారు. My estimate of fools in India has gone up from 90% to 95% after seeing the response to the film Pathan — Markandey Katju (@mkatju) January 26, 2023 అన్నీ ఉన్నాయి 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్’లో అన్నీ ఉన్నాయి. స్టార్ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్ ఖాన్. 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్!’అని ట్వీట్ చేశారు. అంతేకాదు ట్విటర్లో ‘పఠాన్’సినిమాకు నాలుగున్న స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. #OneWordReview...#Pathaan: BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/Xci1SN72hz — taran adarsh (@taran_adarsh) January 25, 2023 కాగా, పఠాన్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్ పని అయిపోయిందంటూ ట్వీట్.. చివర్లో ట్విస్ట్!) -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
‘పఠాన్’ కోసం షారుఖ్ ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు
షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహాం నటించిన సినిమా పఠాన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం షారుఖ్ చాలా కష్టపడినట్లు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెలిపాడు. ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించడానికి బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ అంకితభావంతో పనిచేశారని, ఇలాంటి శారీరక సౌష్టవం పొందాలంటే, హద్దులు దాటిన ప్యాషన్ ఉండాలని, అది షారుఖ్ లో కనిపించదని అన్నారు దర్శకుడు. `పఠాన్‌లో షారుఖ్ చూపించిన ఫిజిక్ కోసం ఆయన అత్యంత కృషి చేశారు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్‌ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. శారీరకంగా ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడాలో మాట్లాడుకున్నాం. ఆయన ప్రతి పదాన్ని గుర్తుంచుకున్నారు. ఆచరణలో పెట్టారు. ఇవాళ దాని ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేశారు షారుఖ్. ప్రమాదకరమైన ప్రదేశాల్లో, ప్రమాదకరమైన వాతావరణంలో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ కి థియేటర్లలో మరో రేంజ్ అప్లాజ్ దక్కి తీరుతుంది. ఇంత కష్టమైన స్టంట్స్ కోసం ఆయన శారీరకంగా అంతే గొప్పగా సిద్ధమయ్యారు. మన దేశంలోనే అత్యంత భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది పఠాన్. షారుఖ్‌ని స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరికీ ఆయన చేసిన కృషి అర్థమవుతుంది. మేం డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని నిజం చేయడానికి ఆయన తీసుకున్న శ్రమకు ఫిదా అయిపోయాం. షారుఖ్‌లాగా ఇంకెవరూ ఉండరు. సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకితభావం, ప్రేమను అర్థం చేసుకోవాలంటే పఠాన్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే` అని సిద్దార్థ్ ఆనంద్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది. -
బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!
బాలీవుడ్ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్‌లో కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లు–బాలీవుడ్ హీరోల కాంబినేషన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్’, ‘బిగిల్’ వంటి హిట్ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. (చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?) ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమాకి సై అన్నారు రణ్వీర్ సింగ్. 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్’ హిందీ రీమేక్ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో శంకర్ ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్‌ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిందీలో శంకర్ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్’ (2001)గా తెరకెక్కించారు శంకర్. ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్ వేదా’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పుష్కర్–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌నూ తెరకెక్కించారు. పుష్కర్– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరోవైపు తక్కువ టైమ్‌లో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్’ హిందీ రీమేక్) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్‌తో లోకేశ్ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఇంకోవైపు రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ హిందీలో ఓ సినిమా కమిట్ అయ్యారు. జార్ఖండ్‌కు చెందిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్’గా చెప్పుకునే పి. రాజగోపాల్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్‌ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రద్దు.. విజేత ఎవరంటే..?
వర్షం కారణంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రద్దైంది. దీంతో ఫైనలిస్ట్‌లు చెపాక్ సూపర్ గిల్లీస్ (సీఎస్జీ), లైకా కోవై కింగ్స్ (ఎల్‌కేకే) జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఆటను 17ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (42 బంతుల్లో 65; 8ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఎల్‌కేకే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గంగ శ్రీధర్ రాజు (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), షారుక్ ఖాన్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. సీఎస్జీ బౌలర్లలో సందీప్ వారియర్ (4/29), సాయి కిషోర్ (3/26), సోనూ యాదవ్ (2/29) సత్తా చాటారు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన సీఎస్జీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కౌశిక్ గాంధీ (1), ఎన్ జగదీషన్ (2) పరుగులకే ఔటవ్వగా.. ఎస్ రాధాకృష్ణన్ (11 బంతుల్లో 9; ఫోర్), రాజగోపాల్ సతీశ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో (4 ఓవర్లలో 14/2) మొదలైన వర్షం ఎంతకీ ఎడతెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సందీప్ వారియర్ దక్కించుకోగా.. సంజయ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ -
Viral Video: ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో..
తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ఫీలు అంటూ మీద పడతారు. ఇబ్బందులకు గురిచేస్తారు. ఒక్కొక్కసారి వారి అభిమానం చూసి భయపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా తాజాగా తన ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్షా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'పఠాన్' మూవీ కంప్లీట్ చేసిన బాద్షా 'డుంకీ' చిత్రీకరణలో పాల్గొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్లో ఆయన్ను గుర్తుపట్టిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం షారుక్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన షారుక్ ఖాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు View this post on Instagram A post shared by Javed_srkian (@bigfansrk_) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉంది షారుక్ ఖాన్ పొట్టిగా కనపించడంతో అతను కాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో షారుక్‌కు సరసన తాప్సీ నటిస్తోంది. అలాగే షారుక్ 'పఠాన్' సినిమా 2023 జనవరిలో విడుదల కానుంది. చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !..
ఖాన్ త్రయం (సల్మాన్, షారుక్, ఆమిర్) కలిసి సినిమా చేస్తే.. ఫ్యాన్స్ తీన్ మార్ డ్యాన్స్ వేయడం ఖాయం. అలాంటి ఓ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖాన్ త్రయం కాంబినేషన్లో సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగ దాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆ విశేషాల్లోకి వెళదాం. గజిని, తుపాకీ, కత్తి, సర్కార్.. ఇలా తమిళంలో మురుగదాస్ భారీ చిత్రాలనే తెరకెక్కించారు. ఆయన ఇచ్చిన భారీ హిట్స్‌లో ఈ నాలుగుతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ‘గజిని’ చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్‌తో తెరకెక్కించి, బాలీవుడ్‌లోనూ హిట్ సాధించారు మురుగదాస్. ఆ తర్వాత హిందీలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సల్మాన్, షారుక్‌లతో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ‘గజిని’ ద్వారా ఆమిర్‌తో ఏర్పడిన అనుబంధంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పారట మురుగదాస్. దాంతో షారుక్, సల్మాన్‌లను మురుగదాస్ కలిసే ఏర్పాటు ఆమిర్ చేశారని బాలీవుడ్ టాక్. ఇద్దరు ఖాన్లకు మురుగదాస్ స్టోరీ లైన్ చెబితే, నచ్చి, కథ డెవలప్ చేయమన్నారని భోగట్టా.. 27 ఏళ్ల తర్వాత.. 1995లో వచ్చిన ‘కరణ్ – అర్జున్’లో సల్మాన్, షారుక్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలరించింది. అప్పటినుంచి ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అయితే మధ్యలో మనస్పర్థల వల్ల ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయి, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు చేస్తున్నారు. సెట్స్‌లో ఉన్న సల్మాన్ ‘టైగర్ 3’లో షారుక్ అతిథిగా, షారుక్ ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కి పండగే. ‘కరణ్ – అర్జున్’ రిలీజైన 27 ఏళ్లకు సల్మాన్, షారుక్ చేసే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆమిర్ ఖాన్‌కి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర రాస్తున్నారట మురుగదాస్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆరంభమవుతుందని బాలీవుడ్ అంటోంది. -
షారుక్‌కి కరోనా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే. -
స్టార్ హీరో.. కోకిల రెట్టను రోజు మొహానికి పూసుకుంటాడట!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ఆ బుద్ధిలోనే మనిషికో అలవాటునూ కలిపేసుకోవచ్చు. సామాన్యుల అలవాట్లు, ప్రవర్తన ఎంత అసామాన్యంగా ఉన్నా ప్రాచుర్యంలోకి రావు. అసామాన్యులు లేదా పదిమందికీ తెలిసిన ప్రముఖుల అలవాట్లు ఎంత సామాన్యమైనవైనా ఇట్టే ప్రచారమవుతాయి. అలా వైరలైన కొందరు సెలబ్రిటీల వింత అలవాట్లు తెలుసుకుందాం.. సరదాగా! ఎంతిష్టమైతే మాత్రం.. చెప్పులంటే ఎంతిష్టమైతే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటామా!? కానీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అలాగే చేస్తాడు ఇంచుమించుగా! అంటే .. తల మీద పెట్టుకోడు అలాగని చెప్పుల స్టాండ్‌లోనూ పెట్టడు. షారుఖ్‌కి షూస్ అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే ఇరవై నాలుగ్గంటలూ ఇంటాబయటా షూస్ వేసుకునే ఉంటాడు. రాత్రి కూడా చాలాసార్లు షూస్‌తోనే నిద్రపోతాడట. ఏమయ్యా క్రూజూ.. ఏంటయ్యా అది? వ్వాక్.. ఎంత సౌందర్య పోషణయితే మాత్రం ఆ పనేంటండీ బాబూ.. ! ఏం చేశాడేంటి ఆ అమెరికన్ యాక్టర్ టామ్ క్రూజ్.. అంతమాటనేసినారు? తన ముఖారవింద చర్మ సంరక్షణ కోసం రోజూ నైటింగేల్ పిట్ట (కోకిల) రెట్టనింత తీసుకుని ఫేషియల్ క్రీమ్‌లా మొహానికి పూసుకుంటాడట!! అవాక్కయ్యారా! అది మరి మ్యాటర్... అట్లుంది వీళ్లలోని! అన్నింట్లోకి.... పెరుగు ఉండాల్సిందే ఆలియా భట్‌కు. ఉండొచ్చు .. పరోటా.. ఉప్మా.. పోహా.. ఆఖరుకు చపాతీకీ పెరుగు కాంబినేషన్ బాగానే ఉంటుంది. కానీ ఆలియాకు చైనీస్.. ఇటాలియన్.. మెక్సికన్.. ఇలా ఏ దేశపు వంటకానికైనా తోడు కూడా పెరుగు లేకపోతే ముద్ద దిగదట. ఆలియా పెరుగు పిచ్చి చూసి తోటివాళ్లంతా నవ్వుకుంటారట. నవ్విపోదురు గాక.. నాకేటి.. ప్లేట్లో పెరుగుంటే చాలు అనుకుంటూ వేళ్లకంటిన పెరుగును చప్పరించేస్తుందట. గుడ్లప్పగించి... సెలబ్రిటీలనెవరైనా గుడ్లప్పగించి చూస్తే బౌన్సర్లు వచ్చి కనుగుడ్లు పీకేసినా పీకేస్తారు. మరి సెలబ్రిటీలే అలా చూస్తే..! ఆ బుద్ధి ఉన్నది ఎవరికి?అని అడిగితే దీపికా పడుకోణ్ అని చెప్పాలి మరి. అవును.. ఎయిర్ పోర్ట్స్‌లో.. షాపింగ్ మాల్స్‌లో.. ఇలా పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడైనా కొత్తవాళ్లను కన్నార్పకుండా చూస్తుందట. ఆమెకున్న ఈ అలవాటు తెలియక ఆ స్ట్రేంజర్స్ జడుసుకుని వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోతారట. పాఫం..! ఆరుబయట... సొంత ఇల్లయినా.. అద్దె ఇల్లయినా సౌకర్యాలకు సంబంధించి రాజీ పడని అంశం.. బాత్రూమ్. మాజీ మిస్ యూనివర్స్.. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా అంతే. అసలు కాంప్రమైజ్ కాదు.. బాత్రూమ్లో స్నానం చేయని విషయంలో! మీరు చదువుతున్నది కరెక్టే.. ఆమెకు మేడ మీద.. ఆరుబయట స్నానం చేయడం ఇష్టం.. కంఫర్ట్ కూడా! అందులో రాజీ సమస్యే లేదు అంటుంది. ఈ గుట్టు చెప్పాం కదా అని ఆమె ఇంటి చుట్టూ ఉన్న మేడల మెట్లెక్కేయకండి! ఆ జాగ్రత్త ఆమెకు తెలుసు. -
అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్
ఐపీఎల్ జట్టైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ సంబంధిత వ్యాపారంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. త్వరలోనే ఓ భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. భారీ వ్యయంతో, సుమారు పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో (15 ఎకరాల విస్తీర్ణంలో), అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రాంతంలో (ఐర్విన్ సిటీ) నిర్మించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టాడు. 🚨 STADIUM NEWS 🚨 Plans are underway to build an iconic home for cricket in the Greater Los Angeles metropolitan area! "MLC venue in Southern California takes significant step forward with Great Park in the City of Irvine" 👉 https://t.co/WLUigjldoU 👈 #buildamericancricket pic.twitter.com/BKo9CGKpGq — Major League Cricket (@MLCricket) April 29, 2022 మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) తో కలిసి అతను సహా యజమానిగా ఉన్న నైట్‌రైడర్స్ గ్రూప్ (కేఆర్జీ) ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ మేరకు ఎంఎల్సీ-కేఆర్జీల మధ్య ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కింగ్ ఖాన్ ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇదే విషయమై బాద్షా స్పందిస్తూ.. అమెరికాలో రాబోయే రోజుల్లో క్రికెట్ వ్యాప్తి పెరుగుతుందనే నమ్మకంతో ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నామని తెలిపాడు. చదవండి: ఫాస్టెస్ట్ డెలివరీ వేసింది అక్తర్ కాదు, నేనే.. అప్పట్లో మిషన్లు పని చేయక..! -
షారుక్ ఖాన్ కోసం ముంబైలో పంజాబ్ సెట్!
హీరో షారుక్ ఖాన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటిస్తున్న ‘పటాన్’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి(‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, 3 ఇడియట్స్, పీకే’ ఫేమ్) దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందన్నది బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పంజాబ్ లొకేషన్ సెట్స్ వేశారు చిత్ర యూనిట్. దాదాపు ఇరవై రోజులు ఇక్కడే షూటింగ్ జరుగుతుందట. ఆ తర్వాత విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు షారుక్ అండ్ కో. అక్రమంగా పాస్‌పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్. -
IPL 2022: తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ హిట్టర్
Shahrukh Khan: ఢిల్లీతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ లీగ్ మ్యాచ్ మూడో రోజు ఆటలో తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్, విధ్వంసకర బ్యాటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ షారుక్ ఖాన్ భారీ శతకంతో చెలరేగాడు. 148 బంతుల్లో 20 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 194 పరుగులు చేసి, 6 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి సెంచరీనే భారీ శతకంగా మలిచిన షారుక్.. సహచర ఆటగాడు బాబా అపరాజిత్ (117 పరుగులు)తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఫలితంగా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. షారుక్ ఖాన్, బాబా అపరాజిత్‌తో పాటు కౌశిక్ గాంధీ (55), వికెట్‌కీపర్ జగదీశన్ (50) అర్ధ శతకాలతో రాణించడంతో తమిళనాడుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బాట్యింగ్‌కు దిగిన ఢిల్లీ.. యశ్ ధుల్ (113), లలిత్ యాదవ్ (177) శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, షారుక్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ తమిళనాడు కంటే అతన్ని ఇటీవల తిరిగి కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టునే ఎక్కువగా సంతోషపరిచిందని చెప్పాలి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ జట్టు షారుక్‌ను ఏకంగా 9 కోట్లకు కొనుగోలు చేసి అందరీ ఆశ్చర్యంలో ముంచెత్తింది చదవండి: షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లకి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాకు! -
షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లకి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాకు!
స్వదేశలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే ,టీ20 సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్ కోసం తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్ , సాయి కిషోర్‌లను టీమిండియా బ్యాకప్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే టర్నమెంట్లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. భారత్- విండీస్ సిరీస్ సమయంలో ఏ ఆటగాడైనా కరోనా బారినా పడితే వీరిద్దరూ జట్టులోకి రానున్నారు. కాగా రెండేళ్లలో అనేక సిరీస్‌ల మధ్యలో చాలా మంది ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరినీ రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా! -
IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!
Two Players Who May Fetch High Price In IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ జట్టు ఏ ఆటగాడికి ఎంత వెచ్చించి కొనుగోలు చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో క్రికెట్ విశ్లేషకులు, మాజీలు వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంపై తమతమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఇదే విషయమై ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా బోగ్లే సైతం తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడు. వేలంలో అత్యధిక ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లు వీరే నంటూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా ఆక్షన్‌లో టీమిండియా యువ వికెట్‌కీపర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ ఇషాన్ కిషన్, అలాగే తమిళనాడు పవర్ హిట్టర్, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ షారుక్ ఖాన్లు రికార్డు ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లుగా నిలుస్తారని జోస్యం చెప్పాడు. ఈ ఇద్దరి కోసం మొత్తం 10 ఐపీఎల్ జట్లు ఎగబడతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అందులోనూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం ఇషాన్ కిషన్‌కు అదనంగా కలిసొచ్చే అంశమని.. లోయర్ ఆర్డర్లో పవర్ఫుల్ హిట్టర్ కావడమే షారుక్ ఖాన్‌కు ప్లస్ పాయింట్ అని.. ఈ కారణాల చేతనే ఈ ఇద్దరు భారత ఆటగాళ్లకు జాక్‌పాట్ ధర లభిస్తుందని హర్షా బోగ్లే అంచనా వేశాడు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌ను టీమిండియా మాజీ హిట్టర్ యూసఫ్ పఠాన్‌తో పోల్చాడు. షారుక్ కూడా యూసఫ్ పఠాన్ లాగే భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని కొనియాడాడు. వేలంలో షారుక్ ఖాన్‌కు 10 నుంచి 13 కోట్లు, ఇషాన్ కిషన్.. 10 నుంచి 17 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. కాగా, గతంలో ఇషాన్ కిషన్(6.5 కోట్లు)ను ముంబై, షారుక్ ఖాన్(5.25 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇషాన్.. గతేడాది ఐపీఎల్‌ల్లో 10 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 241 పరుగులతో పర్వాలేదనిపించగా, షారుక్.. 11 మ్యాచ్‌ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. చదవండి: IPL 2022: అతను కెప్టెన్ కాలేడు.. అయినా భారీ ధర పలకడం ఖాయం..! -
Ind Vs WI: ఆ ఇద్దరికి బంపరాఫర్.. ఒకరు వన్డే, మరొకరు టీ20 సిరీస్‌కు ఎంపిక!
India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్‌రౌండర్ రిషి ధావన్, షారుఖ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 458 పరుగులు.. 17 వికెట్లు.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్ ఖాన్ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్ టీ20 సిరీస్‌కు షారుఖ్‌ను సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్‌కు దూరమైన అక్షర్ పటేల్, కరోనా కారణంగా వన్డే సిరీస్ మిస్సైన వాషింగ్టన్ సుందర్.. వీరితో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! -
మరోసారి కోర్టును ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతును సడలించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను డిసెంబర్ 13న జస్టిస్ నితిన్ సాంబ్రే విచారించే అవకాశం ఉంది. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 8(సీ), 20(సీ), 27, 28, 29, 35 నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌స్(ఎన్డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 28న బాంబే హైకోర్టుతో ఆర్యన్‌తో పాటు మరొ ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. 14 కఠినమైన బెయిల్ షరతులు విధించింది. (చదవండి: మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం) -
షారుక్ ఖాన్.. ఇక చకచకా!
షారుక్ ఖాన్ ఇక స్పీడ్ పెంచనున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ‘జీరో’ ఆశించినంత సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న షారుక్ ఆ తర్వాత ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్, అట్లీ దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి షూటింగ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ స్పీడ్‌గా జరుగుతున్న టైమ్‌లో తనయుడు అర్యన్‌ఖాన్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి. ఇటీవల ఆర్యన్‌ఖాన్ విడుదల కావడంతో తన సినిమాలపై షారుక్ మళ్లీ ఫోకస్ పెట్టారని బాలీవుడ్ సమాచారం. తన సినిమాల్లోని గెటప్స్‌కు తగ్గట్లుగా ఫిజిక్‌ను చేంజ్ చేసేందుకు జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారట ఆయన. ముందుగా ‘పఠాన్’ చిత్రాన్ని, ఆ తర్వాత అట్లీ సినిమాను పూర్తి చేసేసి, ఆ నెక్ట్స్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించే సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ‘పఠాన్’ షూటింగ్ తిరిగి ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. (చదవండి: సోనూసూద్‌కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక) -
MS Dhoni: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో.. ధోని ఫొటో వైరల్
MS Dhoni Watches Shahrukh Khan Hit Last Ball Six SMAT Final Goes Viral: ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరప్పా.. అది కూడా ఆ ‘విన్నింగ్ షాట్’తో టైటిల్ సొంతమైతే..!! ఇక చెప్పేదేముంటుంది!! ఇలాంటి మజాను ఎన్నోసార్లు ఆస్వాదించాడు టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయాల బాట పట్టించాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. అచ్చంగా అలాగే.. ధోని మాదిరిగానే తమిళనాడు క్రికెటర్ షారూఖ్ ఖాన్ సైతం.. చివరి బంతికి సిక్సర్ బాది తమ జట్టుకు విజయం అందించాడు. తమిళనాడు మూడోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటకపై తమిళనాడు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన సమయంలో షారుఖ్ ఖాన్ సిక్స్ కొట్టడంతో విజయం ఖరారైంది. PC: BCCI ఈ నేపథ్యంలో తలా ధోని షారుఖ్ షాట్‌ను వీక్షిస్తున్న దృశ్యాలను చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ధోని తరహాలో ఫినిషింగ్!’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ సైతం తమ జట్టు ఆటగాడి అద్భుత విజయాన్ని ఉటంకిస్తూ... ‘‘నువ్వు అందరి మనసులు గెలిచావు’’ అంటూ ఆనందాన్ని పంచుకుంది. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి చదవండి: MS Dhoni: ‘నా చివరి మ్యాచ్ చెన్నైలోనే’ Fini 𝙎𝙚𝙚 ing off in sty7e! 💛#SyedMushtaqAliTrophy #WhistlePodu 🦁 pic.twitter.com/QeuLPrJ9Mh — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 22, 2021 When cricket meets bolllywood , #Sharukhkhan - the real hero of #SMATFinal.#SyedMushtaqAliTrophy #TNvKAR pic.twitter.com/q4JPsCbTcY — LeoTamil (@Leotamil14) November 22, 2021 5 needed off 1 and SRK hits a six off the final ball to take Tamil Nadu over the line! 💥💥💥 Shahrukh Khan, you beauty! ❤️ In the end, it had to be SRK who wins all the hearts! ❤️#SyedMushtaqAliTrophy #SaddaPunjab #PunjabKings — Punjab Kings (@PunjabKingsIPL) November 22, 2021 Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
సన్ స్ట్రోక్
-
ఆర్యన్ ఖాన్ కేసు: సీనియర్ లాయర్ రంగప్రవేశం.. ఎవరాయన?
ముంబై: తన కుమారుడిని ఎలాగైనా జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్ అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను బెయిల్‌పై తీసుకువచ్చేందుకు మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు. మంగళవారం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున ఆయన వాదనలు వినిపించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదనే కోణంలో ఆయన గట్టిగా వాదించారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ గురించి నెటిజనులు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..) తలపండిన లాయర్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహత్గీ.. భారత్‌కు 14వ అటార్నీ జనరల్ (ఏజీ)గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్‌గానూ సేవలు అందించారు. 66 ఏళ్ల ఈ తలపండిన లాయర్.. పలు హైప్రొఫైల్, కీలక కేసులు వాదించారు. హైకోర్టు మాజీ జడ్జి కుమారుడు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరాత్ అల్లర్లు, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ ఎన్కౌంటర్ల కేసుల విచారణలో సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరపున ప్రాతినిథ్యం వహించారు. సభర్వాల్ శిష్యుడు ముకుల్ రోహత్గీ.. 1955, ఆగస్టు 17న ఢిల్లీలో జన్మించారు. ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగేశ్ కుమార్ సభర్వాల్ వద్ద ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కొంత కాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 1993లో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ సతీమణి పేరు వసుధ, కుమారు పేరు సమీర్. (చదవండి: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
డ్రగ్స్ ముఠాతో ఆర్యన్‌కు లింకు?
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ బెయిల్‌పై ముంబైలోని స్పెషల్ కోర్టులో వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ వి.వి. పాటిల్ సమక్షంలో ఇరుపక్షాలు బుధవారం రోజంతా తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను గురువారానికి జడ్జి వాయిదా వేశారు. ఆర్యన్ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో ఆర్యన్‌కి సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇక ఆర్యన్ విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నట్టు ఎన్సీబీ వెల్లడించింది. ఆర్థిక అంశాలపై విచారణకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఎన్సీబీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఒక్క నిందితుడిని విడుదల చేసినా విచారణపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. ఆర్యన్, సహనిందితుడు అర్బాజ్ వాట్సాప్ చాట్స్‌ని పరిశీలిస్తే విదేశస్తులకు భారీగా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసిన విషయం వెల్లడవుతోందని వాదించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మత్తుకు బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ తరఫున హాజరైన అమిత్ దేశాయ్ ఎన్సీబీ చేసిన వాదనలు అర్థరహితమని కొట్టిపారేశారు. నిందితులు డ్రగ్స్ విక్రేతలు కాదని వాదించారు. -
ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీపై విమర్శలు.. ‘బీజేపీ హస్తం ఉంది’
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్‌తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. (చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ) ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్‌లో కనిపించారు. ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్‌తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. (చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్‌లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! -
మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..!
డ్రగ్స్ తీసుకున్నారనే విషయంపై షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌తో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు టీనేజర్లను ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నిన్న అదుపులోకి తీసుకుంది. ఈ వార్త విన్న వారిలో చాలా మంది ‘డబ్బున్న వారి పిల్లలు అంతే’ అని ఓ మాట ఘాటుగా అనేసి తిరిగి తమ పనుల్లో పడిపోయుంటారు. ఇటీవల తరచూ మనముందుకొస్తున్న వార్తల్లో డ్రగ్స్ అనే బూచి తీసుకువస్తున్నవే ఎక్కువ. సినీ తారలు, డబ్బున్నవారు మాత్రమే డ్రగ్స్ వాడతారు అనుకునే సాధారణ జనం కూడా ఇప్పుడు తమ పిల్లల గురించి చర్చించుకోవాల్సిన, సరి చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ‘సమస్య మా ఇంట్లోకి రాదు, మా పిల్లలు బంగారం’ అనేది చాలామంది తల్లిదండ్రుల భావన. బయట సులువుగా దొరుకుతున్నప్పుడు, పిల్లలు ఆకర్షణకు లోనుకాకుండా ఉండరు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ‘డ్రగ్’ ప్రపంచంలో అత్యంత సాదాసీదాగా అడుగుపెట్టేవారిలో 18 ఏళ్ల లోపు టీనేజర్లే ఉంటున్నట్టు నివేదికలు చూపుతున్నాయి. అంటే, టీనేజర్లు డ్రగ్స్ వినియోగంలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఒక్కసారేగా..! ఏదేమైనా ఈ దశలో ‘ప్రయోగం చేద్దాం’ అనుకోవడం నిజం. మాదకద్రవ్యాలు లేదా మద్యం ప్రయత్నించినంత మాత్రాన వాటికి బానిస అవుతారని చెప్పలేం. అయితే, కొంతమంది టీనేజర్లు ఈ తరహా ప్రయోగాలు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ‘అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత, తోటి స్నేహితుల నుంచి తీసుకోమనే ఒత్తిడి, ట్రెండ్‌లో ఉన్నామని అనుకోవడం, కష్టం నుంచి తప్పించుకోవాలనే కోరిక’ సాధారణ కారణాలుగా ఉన్నాయి. అతి సాధారణ సంకేతాలు ఇంట్లో టీనేజ్ దశలో ఉన్న పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారా.. అని కొన్ని విషయాలను గమనించి తెలుసుకోవచ్చు. పిల్లలతో రోజూ కొద్దిసేపు సన్నిహితంగా మెలిగితే అవేంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల మాట, ఆలోచన, ప్రవర్తన.. ఈ మూడింటిని గమనించాలి. అలాగే.. ‘పిల్లలు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారా... కారణం లేకుండా నవ్వడం లేదా ఏడ్వడం చేస్తున్నారా, చదువు, ఇతరత్రా రోజువారి కార్యకలాపాలపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదా, శుభ్రంగా ఉండటం లేదా, బాగా ఆకలి అంటూ రుచీ పచీ అని పట్టించుకోకుండా తింటున్నారా, వారి శ్వాస సిగరట్ వాసన వస్తోందా, బట్టలు పొగ వాసన వస్తున్నాయా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా, వారి వయసువారితో కాకుండా కొత్త కొత్త స్నేహాలు చేస్తున్నారా, ఇంట్లో డబ్బులు, ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా... వంటి విషయాలను పరిశీలించక తప్పదు. అయితే, తాము వారిని అనుమానిస్తున్నట్టు పిల్లలు అనుకోకూడదు. మరింత రహస్య జీవనంలోకి జారుకోవచ్చు! మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారనే నిజం తెలిసి కరకుగా పిల్లలతో ప్రవర్తిస్తే ‘మీకు తెలియకుండా మరింత రహస్యంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు’ అంటారు మానసిక నిపుణులు. ‘మీరు గమనించారని తెలిస్తే.. ఎత్తుకు పై ఎత్తు వేసి ఇంకా రహస్యంగా డ్రగ్స్ తీసుకోవచ్చు. పిల్లలను విమర్శిస్తూ మాట్లాడితే వారు ఎదురు తిరిగే అవకాశమూ ఉంది’ అంటారు. ప్రేమతోనే మందు వేయడం అనేది తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. గమనింపు అనేది అసలు బాధ్యతగా ఉండాలి. పిల్లలతోనే కాకుండా, వారి స్నేహితుల తల్లిదండ్రులతో కూడా సంభాషించాలి. మారేందుకు మూడు పద్ధతులు.. పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తెలిస్తే వారితో గొడవపడకుండా, ప్రేమ పూర్వకమైన వాతావరణంలోనే వారిని నేర్పుగాSతమ దారిలోకి తెచ్చుకోవాలి అన్నది మానసిక నిపుణుల సూచన.‘స్కూల్ లేదా ఇంటి చుట్టుపక్కల వాతావరణంపై అనుమానం వస్తే వాటిని మార్చాలి. ఒక్కోసారి ఉన్న చోటును వదిలి మరో కొత్త ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇవి మొదట్లో తల్లిదండ్రులు చేస్తారు. రెండవది.. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అనేది ప్రతి కుటుంబాల్లో సరిచూసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. అందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం. మూడవది.. డ్రగ్స్‌కు బానిస అయ్యారని గుర్తిస్తే వైద్యుల సాయంతో రిహాబిలిటీ సెంటర్లో పెట్టి కౌన్సెలింగ్, యోగా, మందులు వాడకం ద్వారా తిరిగి మామూలు జీవనంలోకి తీసుకురావచ్చు’ అని వివరించారు. డ్రగ్స్ కేవలం సెలబ్రిటీ క్లాస్ ట్రెండ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా టీనేజర్లు ఉన్న ఇంటింటి సమస్య కూడా. మన ఇంట్లో లేదంటే పొరుగింట్లో టీనేజ్ వయసున్న పిల్లలున్నారంటే వారిని ఓ కంట కనిపెడుతూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయచ్చు. సకాలంలో గుర్తించి, మాదక ద్రవ్యాల బారి నుంచి టీనేజర్లను కాపాడుకోవడం ఈ రోజుల్లో మన ముందున్న అసలైన సవాల్. మన ఇంట్లోనూ ఉండొచ్చు! కరోనా కారణంగా 18 నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న పిల్లలు, ఇప్పుడు ఒక్కసారిగా తిరిగి కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. గతంలో టీనేజ్ దశలో అబ్బాయిలు, అమ్మాయిలు 3:1 రేషియోలో ఉండేవారు. ప్రస్తుత రోజుల్లో 1:1 గా ఉన్నారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా అన్నిచోట్లా, అన్ని దిక్కులా మాదకద్రవ్యాలు సులువుగా దొరకడం కూడా ప్రధాన కారణం. – డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్టు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్‌పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు. నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్ ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్ గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ఎవరీ సమీర్ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. -
షారుక్ పాటకు.. స్టెప్పులు వేసిన అమెరికన్ జంట
గతంలో భోజపూరీ పాట లాలీపాప్ లాగేలు, తెలుగులో అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టిన అమెరికన్ జంట మళ్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన రావన్ సినిమాలోని చమ్మక్ చల్లో పాటకి డ్యాన్స్ చేసి ఈ జంట నెటజన్లను ఫిదా చేస్తోంది. 25 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా రీకీపాండ్ తన భార్యతో కలిసి చమ్మక్ చల్లో పాటకు స్టెప్పులు వేశాడు. కాగా సోషల్ మీడియాలో "డ్యాన్సింగ్ డాడ్" అని పిలువబడే రికీ పాండ్, అతని భార్య భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించారు. రికీ పాండ్ పైజామా ధరించగా.. అతని భార్య కుర్తా, గాగ్రా ధరించారు. ఈ వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) -
షారుఖ్ ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా : నటి
ఆట, పాట, మాట, అభినయం.. ఈ బహుముఖ ప్రజ్ఞను ఆశించడం అత్యాశే. కానీ టీనా దేశాయ్ విషయంలో కాదు. అందం ఆమె అడిషనల్ మెరిట్. ఇంతకీ ఎవరీమే? ఇక్కడ మాట్లాడుతున్నామంటే కచ్చితంగా వెబ్ సిరీస్ నటే అయ్యుంటుంది కదా! ► తండ్రి గుజరాతీ. తల్లి.. తెలుగు. ఆమె కుటుంబం కర్ణాటకలో స్థిరపడింది. దాంతో టీనా బెంగుళూరులోనే పుట్టింది, పెరిగింది. అక్కడే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే టాప్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. 2012లో ప్రముఖ కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో చోటూ దక్కించుకుంది. ► తెలుగు, గుజరాతీ, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో టీనా అనర్గళంగా మాట్లాడుతుంది. దీనివల్లే ఆమెకు కొన్ని హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో డబ్బింగ్ చెప్పే చాన్స్ వచ్చింది. చెప్పి మెప్పించింది కూడా. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆట, పాటలతో అలరించింది. ► ‘యే ఫాస్లే’ సినిమాతో 2011లో చిత్రసీమలోకి ప్రవేశించింది. అది అంతగా ఆడకపోయిన ఆ తర్వాత ‘టేబుల్ నెం.21’ థ్రిల్లర్ మూవీతో మంచి హిట్ కొట్టింది. అప్పటి నుంచి వరుసగా బాలీవుడ్ సినిమాలతోపాటు హాలీవుడ్ మూవీస్ కూడా కాల్షీట్స్ అడిగాయి. వాటిల్లో ‘ది బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో స్లమ్ డాగ్ మిలయనీర్ దేవ్ పటేల్ హీరో. ► నెట్‌ఫ్లిక్స్ ‘సెన్స్ 8’ సిరీస్‌తో వెబ్ ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిది దేశాలకు చెందిన ఓ ఎనిమిది మంది మధ్య జరిగే కథే ఈ సెన్స్ 8. ► పెంపుడు కుక్కలతో ఆడుకోవడం, ట్రావెలింగ్ అంటే చాలు నేల మీద పాదం ఆగదు టీనాకు. గోవా, లాస్ ఏంజెల్స్ ఆమెకు నచ్చే ప్రదేశాలు. షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. నిజానికి నా పదమూడేళ్ల వయసులో ‘కోయల్’ సినిమా చూసే నిర్ణయించుకున్నా నేను కూడా సినిమాల్లో నటించాలని. అందులో షారుఖ్ చేసిన ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎప్పటికైనా.. షారుఖ్ ఖాన్ పక్కన నటిస్తా. – టీనా దేశాయ్ -
పొలార్డ్‌ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్నర్ అయిన షారుఖ్.. హార్ద్ హిట్టర్ కూడా. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో షారుఖ్ వెలుగులోకి వచ్చాడు. లోయర్-మిడిల్ ఆర్డర్లో 30 నుంచి 40 పరుగుల్ని ఈజీగా సాధిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. షారుఖ్‌పై ముందు నుంచీ కన్నేసిన పంజాబ్ కింగ్స్.. వేలంలో భారీ ధర చెల్లించి తీసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలు ఉంటే రూ. 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్ పోటీ పడి మరీ కొనుగోలు చేసింది. ప్రధానంగా ఒక హిట్టర్ కావాలనే ఉద్దేశంతో షారుఖ్‌పై ముందు నుంచి ఫోకస్ చేసిన పంజాబ్ అతన్ని తీసుకున్న వెంటనే ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంచితే, పంజాబ్ కింగ్స్ ప్రాక్టీస్‌లో షారుఖ్ ఖాన్ ఆకట్టుకోవడంపై ఆ ఫ్రాంఛైజీ కోచ్ అనిల్ కుంబ్లే సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఏకంగా ఆ యువ క్రికెటర్‌ను ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీరోన్ పొలార్డ్‌తో పోలుస్తున్నాడు. షారుఖ్ షాట్లు చూస్తుంటే తనకు పొలార్డ్ గుర్తుకు వస్తున్నాడంటూ కుంబ్లే పేర్కొన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా పని చేసిన సమయంలో పొలార్డ్‌కు నెట్స్ బౌలింగ్ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తాను నెట్స్‌లో పొలార్డ్‌కు బౌలింగ్ వేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే షారుక్ కూడా అవే స్కిల్స్ ఉన్నాయంటూ కొనియాడాడు. ‘ నేను ముంబై ఇండియన్స్‌తో కలిసి పని చేసిన సమయంలో పొలార్డ్ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడు. నేను అతనికి పదే పదే ఒకే విషయం చెప్పేవాడిని. నా వైపు స్టైయిట్ బంతిని కొట్టకు అనే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు షారుక్‌కు బౌలింగ్ వేసే ధైర్యం చేయడం లేదు. నా వయసు పెరిగింది. నా శరీరం బౌలింగ్ చేయడానికి సహకరించడం లేదు. దాంతో షారుఖ్‌కు కూడా బౌలింగ్ చేసే సాహసం చేయడం లేదు. అతని ప్రాక్టీస్‌ను గమనిస్తే పొలార్డ్ షాట్లే నాకు గుర్తుకు వస్తున్నాయి’అని కుంబ్లే తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 12వ తేదీన పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ చదవండి: రూ. 8 కోట్లు పెట్టి కొన్నారు.. మెరెడిత్‌కు స్థానం లేదా! పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే -
టీనేజ్ అమ్మాయిలకు షారుఖ్ ఇచ్చే సలహా ఏంటంటే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లుపైనే అయిపోయింది. మరి.. షారుక్ తన అభిమానులకు ఏం చెబుతున్నారు? సల్మాన్ ఖాన్ గురించి ఈ హీరో ఏమన్నారు? తన జీవితం గురించి ఏం చెప్పారు? సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విసిరిన ప్రశ్నల బాణాలకు షారుక్ వ్యంగ్యంగా, ప్రేమగా, సరదాగా సమాధానాలు ఇచ్చారు. అవేంటో సరదాగా చదివేయండి. ►ఒక తండ్రిగా మీరు మీ పిల్లలతో ఎంత కఠినంగా ఉంటారు? పిల్లలు కొన్ని తప్పులు చేసినప్పటికీ వారితో ప్రేమగానే ఉండాలి. తరచూ మందలించడం, వారి పట్ల కఠినంగా ఉండటం కరెక్ట్ కాదు. ప్రేమకు ప్రతిరూపం వారు. నేను నా పిల్లలతో కఠినంగా ఉండటం చాలా చాలా అరుదు. ►అమ్మాయిలను ఆకర్షించాలంటే ఏం చేయాలి? ముందు ఆకర్షణ అనే పదాన్ని మీరు మీ ఆలోచనల్లో నుంచి తీసివేయండి. వారితో హుందాగా ప్రవర్తిస్తే, గౌరవిస్తే వారికి మీ పట్ల మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నం సఫలం కావొచ్చు. ►మిమ్మల్ని కలిసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాం? ఆ క్షణాల కోసం నేనూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నాను. కానీ ప్రస్తుతం నేను బయటకు వస్తే చాలామంది గంపులుగా నా కోసం వస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు (కరోనాను ఉద్దేశించి) బాగాలేవు. మనందరం కలుసుకునే తరుణం దగ్గర్లోనే ఉందని నమ్ముతున్నాను. ►కొందరు టీనేజ్ అమ్మాయిలు తాము అందంగా లేమని బాధపడుతుంటారు. వారికి మీరిచ్చే సలహా? అమ్మాయిలందరూ అందంగానే ఉంటారు. అయితే ఎవరి అందం వారిది. పోలికలు పెట్టుకోకూడదు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరెప్పుడూ ఎవరితోనూ పోల్చలేని ప్రత్యేకమైనవారే. ►మీరు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతోంది? నిజంగానా? సహనం కూడా భరించలేని గ్యాప్ అది (నవ్వుతూ). త్వరత్వరగా షూటింగ్ చేసేద్దాం. ►మీరు ఒక పెద్ద స్టార్? సాధారణ జీవితం గడపాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాది కూడా సాధారణ జీవితమే. ఆ మాటకొస్తే మనందరివీ సాధారణ జీవితాలే. కాకపోతే ఎవరి దారుల్లో వారిది వారికి సాధారణ జీవితం.. అంతే తేడా. ►ప్రస్తుతం నా వయసు 23ఏళ్లు. నా కెరీర్ గురించి నాకు భయంగా ఉంది? వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. కష్టపడి పని చేయి. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నేను 26 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. సమయాన్ని వృథా చేసుకోకు. ►నా జీవితం నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. మీ మాటలతో స్ఫూర్తిని ఇవ్వండి? ముందు సమయాన్ని ప్రయోజనకరంగా సద్వినియోగం చేసుకోవాలని గుర్తుపెట్టుకో. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, వారితో సరదాగా ఆటలు (బోర్డ్ గేమ్స్) ఆడటం వంటివాటితో నీ బోరింగ్ డేస్‌ను అధిగమించవచ్చు. ఓసారి ప్రయత్నించు. ►ఐపీఎల్ (ఇండియన్ ప్రిమియర్ లీగ్)లో మీ కేకేఆర్(కోల్‌కతా నైట్ రైడర్స్) టీమ్ ఈ సీజన్ టైటిల్ గెలవాలి లేదా మీ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్స్‌ను సాధించాలి? ఏదో ఒకటి కోరుకోండి. మల్టీఫుల్ క్వొశ్చన్స్ను ఆన్సర్ చేయడంలో నాకు అంత ప్రావీణ్యత లేదు. కానీ అన్ని సమాధానాలు నిజం కావాలని కోరుకుంటాను. ►మీ లేటెస్ట్ సినిమాకు చెందిన వీడియోను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? మనమే కాదు.. చాలామంది తమ సినిమాలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు. తప్పకుండా మన వంతు వస్తుంది. అప్పుడు రిలీజ్ చేస్తాను. ►మీకు స్నేహితులు లేరని మీరు ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికీ మీరు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారా? లేదు. ఇప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు. నా పిల్లలే నా స్నేహితులు. ►నేను చదువుకోవాలా? లేక మీకు సోషల్ మీడియాలో టెక్ట్స్ చేయాలా? చదువుకో... ►మీరు ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి? నేను తక్కువగా తింటాను. ►ఆమిర్‌ఖాన్ నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్ మూవీస్? రాక్, ఖయామత్ సే ఖయామత్ తక్ , దంగల్, త్రీ ఇడియట్స్, లగాన్ ►సల్మాన్ భాయ్ గురించి? భాయ్ ఎప్పటికీ భాయే. ►మీకు చాలా ఈగో ఉందట కదా! లేదు. నేను చాలా గొప్పవాడిని. నాకు ఈగో లేదు (నవ్వుతూ). -
షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్
‘జీరో’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ చేసే సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే... తమిళ దర్శకుడు అట్లీ పేరు బాగా వినిపించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో ‘పఠాన్’ సినిమా ఆరంభించారు షారుఖ్. ఈ చిత్రం తర్వాత రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకే దర్శకత్వాల్లో సినిమాలు ఉంటాయనే కథనాలు బాలీవుడ్లో వినిపించాయి. దీంతో షారుఖ్ – అట్లీ కాంబినేషన్ సినిమా దాదాపు లేనట్లే అని చాలామంది అనుకున్నారు. అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందనే వార్త తాజాగా ప్రచారంలోకొచ్చింది. అంతేకాదు... ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని అట్లీ కూడా కొంతకాలం ముంబైలోనే ఉండాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఆఫీస్ వెతుకుతున్నారట. అయితే ఇంత సడన్‌గా వీరి సినిమా తెరపైకి రావడానికి కారణం దర్శకులు రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకేలతో షారుఖ్ సినిమాలు లేకపోవడమే అనే ప్రచారం బీ టౌన్లో వినిపిస్తోంది. మరి... ‘పఠాన్’ తర్వాత షారుఖ్ ఏ దర్శకుడితో సినిమాని పట్టాలెక్కిస్తారో చూడాలి. -
వీడియో లీక్.. ‘పఠాన్’అదుర్స్ అంటున్న షారుఖ్ ఫ్యాన్స్
ముంబై గ్యాంగ్స్టర్ల బెండు తీస్తున్నాడు ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ కారుపైకి ఎక్కి షారుక్ ఫైట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన షారుక్ ఫ్యాన్స్‘పఠాన్ ..అదుర్స్’ అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు కొత్తవా? పాతవా? అనే విషయంపై సరైన స్పష్టత లేదు. ఎందుకుంటే గత నెల దుబాయ్ లొకేషన్లో ‘పఠాన్ ’ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తీశారు. ఆ వీడియోలే ఇప్పుడు ప్రచారంలోకొచ్చాయి అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ వీడియోలు ఎప్పటివి అనేది పక్కనపెడితే... ‘పఠాన్ ’ సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయేలా ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్‌లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్‌కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
యాక్షన్ ఇన్ బూర్జ్ ఖలీఫా
రెండేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ చేస్తున్న చిత్రం ‘పతాన్’. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. జాన్ అబ్రహామ్ విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బూర్జ్ ఖలీఫాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట ‘పతాన్’ చిత్రబృందం. బూర్జ్ ఖలీఫాలో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ వంటి హాలీవుడ్ సినిమాలను ఈ భవనంలో చిత్రీకరించారు. ‘పతాన్’ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
రెండేళ్ల తర్వాత మేకప్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. సున్నాకి సున్నా అని కొంతమంది జోకులు కూడా వేశారు. ఈ సినిమాకి ముందు షారుక్ చేసిన ‘జబ్ హ్యరీ మెట్ సెజల్’ కూడా అంతగా ఆడలేదు. దాంతో షారుక్ డైలమాలో పడ్డారు. ఇక లాభం లేదు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తపడాలనుకున్నారు. 2018 డిసెంబర్లో ‘జీరో’ విడుదలైంది. ఆ తర్వాత ఏడాది పాటు కథలు విన్నారు షారుక్. అయినా ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈలోపు ఈ ఏడాది కోవిడ్ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ లో బాగా ఆలోచించుకుని, ‘పఠాన్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు షారుక్. రెండేళ్ల తర్వాత హీరోగా మేకప్ వేసుకుని, బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్. మరి.. పరాజయాల్లో ఉన్న షారుక్‌కి ఈ చిత్రం భారీ విజయాన్ని అందిస్తుందా? అనేది వేచి చూడాలి. -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
కాంబినేషన్ రిపీట్?
షారుక్ ఖాన్ – కాజోల్ అప్పట్లో బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మైనేమ్ ఈజ్ ఖాన్’ వంటి బాక్సాఫీస్ హిట్స్‌లో ఈ ఇద్దరూ నటించారు. ఇప్పుడు షారుక్ ఖాన్ – దీపికా పదుకోన్ అలాంటి జోడీలా మారింది. ఈ ఇద్దరూ ఆల్రెడీ ‘ఓంశాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాల్లో కనిపించారు. తాజాగా షారుక్ ఖాన్ చేయబోతున్న రెండు సినిమాల్లోనూ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటిస్తారని టాక్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోతున్న ‘పఠాన్’, తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న ‘సంకీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లోనూ కథానాయికగా దీపిక పేరునే పరిశీలిస్తున్నారట. మరి ఈ ఇద్దరూ మళ్లీ జంటగా నటిస్తే... ముందు సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? వేచి చూడాలి. -
జర్నలిస్ట్ షారుక్!
హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్ సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్ ఖాన్ . నంబి నారాయణన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
గర్వంగా ఫీల్ అవుతున్నా: షారూఖ్
ముంబై : పిల్లలు చేసే చిన్న చిన్న పనులే తల్లిదండ్రులకు కొత్త అనుభూతినిస్తాయి. వాళ్ల చిట్టి చేతులతో ఏం చేసినా మురిసిపోతుంటారు. అయితే సెలబ్రిటీలు వారి బిజీ షెడ్యూల్లో పడి పిల్లలను ఏం పట్టించుకుంటారులెండి అని అనుకోకండి. ఎంత సంపాదించినా పిల్లలకు మించిన ఆస్తి మరొకటి లేదనుకుని బతికేవారు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. కాగా షారుక్ కొడుకు అబ్రామ్, కరీనా- సైఫ్ కొడుకు తైమూర్, ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్.. వీళ్లకు ఇప్పటికే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న వయస్సులోనే సెలబ్రిటీలుగా మారి అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా షారుక్ తన గారాల కొడుకు అబ్రామ్ చేసిన ఓ పనికి తెగ సంబరపడిపోతున్నాడు. అబ్రామ్, పప్పా అని రాసి ఇద్దరి బొమ్మలను గీయగా దీన్ని షారుక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఓ తండ్రిగా నాకు గర్వంగా ఉందంటూ అబ్రామ్ డ్రాయింగ్‌ను ప్రశంసించాడు. నేను గర్వంగా ఫీల్ అవడానికి నా కొడుకు ఓ కారణం. తన వినయం, ప్రేరణ, విజయం నాకు ఎన్నో నేర్పాయి. డ్రాయింగ్‌లో నేను ఏ కారణం లేకుండా నవ్వుతున్నానంటా. అందుకే నా కొడుకు కంటే నేను బాగా కనిపిస్తున్నానని అబ్రామ్ చెప్పాడు’ అని పేర్కొన్నాడు. ఇక కింగ్‌ఖాన్ షారుక్ తన కొడుకును ప్రశంసించడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే తన పెద్ద కొడుకు ఆర్యన్, కూతురు సుహానా సాధించిన విజయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవవల టైక్వాండో టోర్నమెంట్లో సాధించిన బంగారు పథకాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. (చదవండి: ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!) Being a father (3x) has been, my greatest source of pride, humility, inspiration & even achievement. It has taught me to choose innocent honesty over smarts....in every aspect of life. My lil one told me I look better than him in his drawing cos I am smiling without a reason.... pic.twitter.com/PJu3zRhDAP — Shah Rukh Khan (@iamsrk) March 2, 2020 -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం
దుబాయ్: బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కింగ్‌ఖాన్ బర్త్‌డే సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఆయన పేరును ప్రదర్శించారు. కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్‌ఖాన్ హ్యాపీ బర్త్‌డే అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగానే ఆయన అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి. షారుఖ్ ఖాన్ శనివారం 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
మహాత్మున్ని స్మరించిన సల్మాన్, షారుఖ్, రణబీర్
-
వైరల్ : మనసుల్ని తట్టిలేపే అద్భుతమైన వీడియో
న్యూఢిల్లీ : మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ‘గాంధీ ఎట్ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను లోక కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోదీ విడుదల చేశారు. గాంధీజీ బోధనల ఆధారంగా #ChangeWithin పేరుతో రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన 100 సెకండ్ల వీడియోలో ఆమిర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్, సోనమ్‌కపూర్ అహుజా, కంగనా రనౌత్, విక్కీ కౌశల్ భాగమయ్యారు. గాంధీజీ గొప్ప ఆలోచనలు ప్రతిధ్వనించేల ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే బాపు మాటలు, ఆలోచనలతో వీడియో రూపొందించారని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మోదీని కలిసిన వారిలో బోనీ కపూర్, అనిల్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖలు ఉన్నారు. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైనా ఈ సమావేశంలో చర్చించారు. (చదవండి : ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్) #ChangeWithin లో రాజ్‌కుమార్ హిరాణీ తననూ భాగం చేసినందుకు ధన్యవాదాలు అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. ‘ఒక వ్యక్తి మన యావత్ జాతిని మార్చగలిగారు. ఆయన ఆలోచనలు, ఆయన వారసత్వం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా #ChangeWithin లో భాగం అయ్యాను. థాంక్స్ రాజ్‌కుమార్’ అని సల్మాన్ ట్విటర్లో రాసుకొచ్చారు. వీరితోపాటు అలియా, సోనమ్, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ హిరాణీ ట్విటర్లో ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. (చదవండి : బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని భేటీ) -
ఈ ఫోటోలో ఉన్న సూపర్స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్
ముంబై : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram Breaking the internet z pic of the day can you name all superstar in this picture? #ShahRukhKhan #TeamShahRukhKhan 😍 A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan) on Oct 13, 2019 at 7:40am PDT ‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్‌లతో షారూఖ్ షేర్ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు అభిమానులు షేర్ చేసిన ఓ వీడియోలో షారుఖ్ తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్.. జాసన్ అభిమానని షారుఖ్ తెలిపారు. ఏప్రిల్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. View this post on Instagram Khan, Damme, Chan at the #JoyForum19. The joys all mine as I got to meet my heroes. @jcvd @jackiechan @joyforumksa A post shared by Shah Rukh Khan (@iamsrk) on Oct 13, 2019 at 8:17am PDT సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు. అనుష్కశర్మ, కత్రినాకైఫ్ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్ బిజీ బిజీగానే గడుపుతున్నారు. -
ఇంకా నెలరోజులు; అప్పుడే సందడి మొదలైంది!
ముంబై : స్టార్ హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు వారి అభిమానులంతా వారం రోజుల ముందునుంచే తెగ హడావుడి చేస్తూంటారు. ఇంకా బర్త్ డే రోజైతే వారి హంగామా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కేకులు కట్ చేయడం, రక్తాదానాలు చేయడం, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బర్త్ డే ఇంకా నెలరోజులు ఉండగానే అభిమానుల హంగామా మొదలైంది. కింగ్ ఖాన్ చిన్నప్పటి ఫోటోలకు ‘షారుక్ డేకు ఇంకా నెలరోజు ఉందని, మరో 30 రోజుల్లో బిగ్ డే రానుంది’ అనే హాష్ ట్యాగ్‌తో షేర్ చేస్తున్న ఫోటోలు ట్విటర్లో, బ్లాగింగ్ సైట్లలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా నెలరోజుల ముందే షారుక్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఈ సారి తమ అభిమాన హీరోను ట్విటర్ ట్రేండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టేలా కనిపిస్తున్నారు. కాగా బాద్షా చిన్ననాటి ఫోటోలకు ‘లిటిల్, క్యూట్ స్వీట్ నైస్ లుకింగ్ కింగ్ ఖాన్, వన్ మంత్ టూ షారుక్ డే.. లవ్ యూ కింగ్ ఖాన్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాగే ‘ స్టార్ డమ్ అంటే ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నవంబర్ 2న మన్నత్‌కు రండి! అంటూ షారుక్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆహ్వనిస్తున్నారు. ఇందులో భాగంగా.. భాగీ ఫేం టైగర్ ష్రాఫ్ ఓ చాట్‌షోలో మాట్లాడుతూ... ‘నాకు అందరు ఖాన్లు ఇష్టమే కానీ.. ఎందుకో తెలియదు నేను ఎప్పుడు షారుఖ్ ఖాన్ సార్నే ఎక్కువగా ఇష్టపడతా’ అని చెప్పుకొచ్చిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లంతా షారుక్‌కు సినిమా పరంగానే కాకుండా ఇంకా చాలా విషయాలు తమను అతడి పిచ్చి అభిమానులుగా మార్చివేశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. Little cute sweet beautiful nice looking king👑 khan.... #1MonthForSRKDay #1MonthToSRKDay Love❤😘 you king👑 khan pic.twitter.com/NvmilG0N56 — Kazi raees roy(Srkian) (@roy_kazi) October 1, 2019 Apart from movies , there are lots of things which inspire us to be his fans . pic.twitter.com/JeohqW3LwF #1MonthForSRKDay — तूफान का देवता ᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) October 1, 2019 -
27వ పడిలో షారుఖ్ ఖాన్
న్యూఢిల్లీ : అదేంటి షారుఖ్ ఖాన్ వయస్సు 53 సంవత్సరాలయితే 27సంవత్సరాలు అని చెబుతున్నారని తికమక పడుతున్నారు. అదేనండీ షారుఖ్‌ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి నేటికి సరిగ్గా 27 ఏళ్లు. నటుడిగా 27 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ బాలీవుడ్ బాద్ షా.. ఎన్నో మరుపురాని సూపర్‌హిట్ చిత్రాలతో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన విశిష్టమైన నటనతో దాదాపు మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న ఫారుఖ్‌ను ఈ సందర్భంగా అభినందిస్తూ.. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ట్వీట్ల వర్షం కురిసింది. సరిగ్గా ఇదే రోజున (జూన్ 25, 1992లో) 'దీవానా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన షారుఖ్‌ఖాన్ తన మొదటి సినిమాతోనే 'ఉత్తమ మేల్ డెబ్యూ' అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాలో రిషికపూర్, దివ్యభారతి లీడ్ రోల్స్‌లో నటించగా, షారుఖ్‌ఖాన్ రెండో కథానాయకుడి పాత్రను పోషించాడు. మంచి హిట్‌గా నిలిచిన దీవానా షారుఖ్ కెరీర్లో కీలకంగా నిలిచింది. షారుఖ్ 'దిల్ ఆప్నా హై' సినిమాను మొదట సైన్ చేసినా 'దీవానా ' సినిమా ముందు రిలీజైంది. గతేడాది 'జీరో' సినిమాతో ముందుకు వచ్చిన షారుఖ్‌ఖాన్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. కత్రినా కైఫ్, అనుష్కశర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకాలం తన నటనతో ఆకట్టుకొన్న బాలీవుడ్ బాద్షా మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
అదిరే స్టెప్పులతో దుమ్మురేపిన సుహానా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. తాజాగా సుహానా అదిరే స్టెప్పులు వేసిన షార్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ నటించిన ‘ద ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్’ థీమ్ సాంగ్‌కు షారుఖ్ తనయ స్టైలిష్‌గా స్టెప్పులు వేశారు. త్వరలోనే హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలనుకుంటున్న ఈ స్టార్ కిండ్ ప్రస్తుతం సుహానా ఇంగ్లండ్‌లో చదువుతున్నారు. చదువు ముగిసిన తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసే అవకాశముంది. -
ఎస్ అండ్ ఎస్.. గెస్ట్‌గా యస్!
ఎస్ అండ్ ఎస్.. షారుక్ ఖాన్ అండ్ సూర్య.. గెస్టులుగా నటించడానికి ‘యస్’ అన్నారట. ఏ సినిమా అంటే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో. ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. నంబి నారాయణన్ పాత్ర పోషించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. శాస్త్రవేత్త పాత్రలో ఒదిగిపోవడానికి మాధవన్ కాస్త బరువు తగ్గారు. గడ్డం పెంచారు. నెరిసిన గడ్డంతో కనిపించనున్నారు. ఒక నటుడు పాత్రను ప్రేమిస్తే ఎంతలా ఒదిగిపోతాడో చెప్పడానికి తాజాగా మాధవన్ గెటప్ ఓ ఉదాహరణ. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రను ఇటు తమిళ్ అటు హిందీ వెర్షన్లో పేరున్న నటుడు చేస్తే బాగుంటుందని మాధవన్ భావించారట. షారుక్ ఖాన్, సూర్య అయితే న్యాయం జరుగుతుందని ఇద్దరినీ అడిగారని సమాచారం. మాధవన్ అడగ్గానే కాదనకుండా షారుక్, సూర్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బోగట్టా. ఈ ఇద్దరూ నటిస్తే కథకు బలం చేకూరడంతో పాటు తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతోంది కాబట్టి ఆయా భాషల్లో సినిమా బిజినెస్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
త్రీటర్న్‌ముగ్గురు ఖాన్ల కహానీ
బాలీవుడ్ త్రిమూర్తులు వాళ్లు ............ ఒకప్పుడు.మరింకిప్పుడు? ముగ్గురికీ పుష్కలంగా ఫ్లవర్లు పడ్డాయి.హిట్టు కొట్టాలని ఉన్నా కొట్టగలమా అనే సందేహంఉండే ఉండుంటుంది. ఒకప్పుడు యంగ్ హీరోలు వెనకాల్నించితరుముకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ముందు పరిగెడుతూకనిపిస్తున్నారు. ముగ్గురికీ ఇది తరమగీతమేనా? సక్సెస్ వైపు ముగ్గురూ రిటర్న్ అవుతారా? అదే ఈ త్రీటర్న్ స్టోరీ. ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ పేల లేదు.సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ ట్రాక్‌లో నిలువలేదు.షారుక్ ఖాన్ ‘జీరో’ జీరో రిజల్ట్స్ ఇచ్చింది.ఖాన్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు.వాళ్లకు హిట్స్ కావాలి.వాళ్ల ఖాన్‌దాన్‌కు కంటిన్యూయేషన్ కావాలి.కానీ మారిన పరిస్థితుల్లో రెండూ కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.భారతీయ పురాణాలలో త్రిమూర్తులు ఎవరో మనకు తెలుసు. కానీ బాలీవుడ్ పురాణంలో కూడా త్రిమూర్తులు ఉన్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా వీరు హిందీ సినిమాను ఏలుతున్నారు. ఖాన్ త్రయంగా పేరు తెచ్చుకున్నారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్... ఈ ముగ్గురూ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే ఇది ఖాన్ల ఇజ్జత్ కా సవాల్. ఖాన్దాన్ బాలీవుడ్ స్టార్‌డమ్‌ను చూసిన తొలి ఖాన్ యూసఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్. అప్పట్లో బాలీవుడ్‌ను ఏలిన దేవ్ ఆనంద్, రాజ్ కపూర్లతో దిలీప్ కుమార్ కలవడంతో వారు స్టార్ త్రయంగా మారారు. ముగ్గురూ మూడు ధోరణుల్లో పని చేసినా ఒక నటుడుగా మిగిలిన ఇద్దరి కంటే దిలీప్ కుమార్ ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే ‘మదర్ ఇండియా’ వంటి గొప్ప సినిమాలు తీసిన దర్శక–నిర్మాత మెహబూబ్ ఖాన్, ‘హమ్ కిసీసే కమ్ నహీ’ తదితర బ్లాక్‌బస్టర్స్ తీసిన నాసిర్ హుసేన్ ఖాన్, ‘అజిత్’ పేరుతో ఫేమస్ అయిన విలన్ హమిద్ ఖాన్ వీరంతా బాలీవుడ్లో ఖాన్ల ఖాన్దాన్ను బలపరిచారు. కానీ దిలీప్‌కుమార్‌లా పెద్ద హీరో కాదగిన ఖాన్ రాలేదు. ఫిరోజ్ ఖాన్ కొన్ని సినిమాలు చేసినా, విలన్‌గా అమ్జాద్ ఖాన్ వచ్చినా స్టార్ హీరోగా ఎవరూ ఎదగలేకపోయారు. ఆమిర్‌తో షురూ మళ్లీ ఖాన్ ఈజ్ ద బెస్ట్ అనిపించడానికి 1988లో ఆమిర్ ఖాన్ రావాల్సి వచ్చింది. అతడు చేసిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మరుసటి సంవత్సరమే సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ వచ్చింది. అదీ కలెక్షన్ల వరద సృష్టించింది. జనం వీళ్లిద్దరినీ చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉండగా మూడేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ 1992లో ‘బాజీగర్’తో వెండి తెర మీద వెలిగాడు. 1995లో వచ్చిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ మెగా హిట్‌తో అతడి స్థానం ఆజన్మాంతం స్థిరపడింది. దాంతో ముగ్గురు ఖాన్లు వెండి తెర మీద చెలరేగిపోయారు. ‘హమ్ హై రాహీ ప్యార్ కే’, ‘ఇష్క్’, ‘రాజా హిందూస్తానీ’, ‘గులామ్’, ‘మన్’, ‘సర్ఫరోష్’, ‘లగాన్’ వంటి హిట్స్‌తో ఆమిర్ ఖాన్, ‘సాజన్’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘జుడ్వా’, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ హిట్స్‌తో సల్మాన్ ఖాన్, ‘పర్దేశ్’, ‘దిల్ తో పాగల్ హై’, ‘కుచ్ కుచ్ హోతాహై’, ‘మై హూనా’ వంటి హిట్స్‌తో షారుక్ ఖాన్ తమ స్థానం తిరుగులేనిదని నిరూపించుకున్నారు. కాలం గడిచే కొద్దీ ఎక్కువ సినిమాలు చేయడం మాని చేసే ఒక్క సినిమా భారీ కలెక్షన్లు వచ్చేలా ఉండాలనే స్థాయికి వీరు వెళ్లారు. ‘డాన్ 2’. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘ఫ్యాన్’, ‘రయీస్’ వంటి ఒన్ మేన్ షో సినిమాలను షారుక్ ఖాన్ చేస్తే, ‘కిక్’, ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘సుల్తాన్’, ‘ట్యూబ్ లైట్’, ‘టైగర్ జిందా హై’ వంటి ఒన్‌మేన్ షో సినిమాలను సల్మాన్ చేశాడు. ఇక ఆమిర్ ఖాన్ చాలా ఏళ్లుగా ప్రతి సినిమా ముఖ్యమైన సినిమాగా భావిస్తూ ‘తారే జమీన్ పర్’,‘గజనీ’, ‘త్రీ ఇడియెట్స్’, ‘పికె’, ‘దంగల్’ చేశాడు. స్థిరపడ్డ ఈ ఖాన్ త్రయాన్ని ఛేదించే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. హృతిక్ రోషన్ వచ్చినప్పుడు వీళ్లు ముగ్గురూ చెదిరిపోతారని భావించారు. కానీ అలా జరగలేదు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అజయ్ దేవ్‌గణ్ వంటి హీరోలు సాటి హీరోలుగా నిలబడ్డారు తప్ప ఖాన్‌లను మించిన హీరోలు కాలేకపోయారు.అయితే వెండితెర ఎప్పుడూ యంగ్ గానే ఉంటుంది. హీరోలకు వయసు మీద పడుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురి వయసు సరిగ్గా 53 సంవత్సరాలు. వీరికి తగ్గ కథలు, వీరు హిట్ ఇవ్వాలంటే కావలసిన దినుసులు ఏమిటా అనేది ఇప్పుడు సందేహంతో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సవాల్ విసురుతున్న కుర్రకారు... మరోవైపు బాలీవుడ్లో ఇప్పుడు కుర్రకారు మంచి జోష్ మీద ఉంది. రణవీర్ సింగ్ దాదాపు ఖాన్ హోదాను పొందినట్టే అని అతడు సాధిస్తున్న విజయాలతో బాలీవుడ్ పండితులు కితాబు ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ మరోవైపు పెద్ద హీరోగా మారాడు. వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావ్, షాహిద్ కపూర్లతో పాటు నిన్న మొన్న వచ్చిన టైగర్ షరాఫ్, విక్కీ కౌశల్ వంటి వారు కూడా గట్టిగా నిలబడ్డారు. వీరెవరూ ఖాన్ల ఖాన్‌దాన్‌కు కొనసాగింపుగా వచ్చినవారు కాదు. నిజానికి ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్, సంజయ్ ఖాన్ కొడుకు జాయెద్‌ఖాన్ వీరెవరూ ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. యువ హీరోల్లో ఒక్క ఖాన్ కూడా ఇప్పుడు లేనట్టే. డిఫరెంట్ హీరోగా నిలబడ్డ ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కోలుకొని వచ్చి తిరిగి హిట్స్ ఇచ్చినా ఇప్పటి జనరేషన్ మేటనీ ఐడల్ కాబోడు. కనుక సీనియర్ ఖాన్‌లే ఖాన్ల పరువును నిలబెట్టుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముగ్గురు ఖాన్లు ఏం చేస్తున్నారంటే.. సల్మాన్ ‘భారత్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఒక కొరియన్ సినిమా ఆధారంగా ‘పోలీస్ స్టోరీ’ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. అతడికి గతంలో బ్రహ్మాండమైన హిట్స్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ బర్జాత్యాతో కూడా ఒక సినిమా చేయనున్నాడని కథనం. ఆమిర్, షారుక్‌ల సినిమాలు అధికారికంగా నిర్ధారణ కాలేదు. తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న ‘సారే జహాసే అచ్ఛా’ సినిమా నుంచి షారుక్ తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా నుంచి బయటకు వస్తే ఏ సినిమా చేస్తాడో చూడాలి. ఇక ఆమిర్ స్క్రిప్ట్‌లు చదువుతున్నాడు. క్యాసెట్ కింగ్ గుల్షన్ కుమార్ బయోపిక్‌లో ఆమిర్ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే అవి నిర్ధారితం కాలేదు. ఖాన్లకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే వీరికొచ్చిన నష్టం ఏమీ లేదని బాక్సాఫీస్ దగ్గర వీళ్లు మళ్లీ హవా క్రియేట్ చేస్తారని అభిమానులు అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వీరి ఒక్కోసినిమా ఎన్నో వేల మందికి ఉపాధి. కనుక వీరి సినిమాలు ఎన్ని తయారైతే అంత మేలు. ఖాన్ త్రయం కళకళలాడుతూ ఉండాలనే కోరుకుందాం. గొడవలూ గుద్దులూ.... ఖాన్ త్రయం మధ్య స్నేహం కొంచెం ఘర్షణాయుతమనే చెప్పాలి. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు మంచి స్నేహితులు. షారుక్ ఖాన్ తన స్ట్రగ్లింగ్ డేస్‌లో సల్మాన్ ఖాన్ ఇంట ఆశ్రయం పొందాడు. ‘కరణ్ అర్జున్’ లాంటి సినిమాలు షారుక్‌కు రావడంలో సల్మాన్ పాత్ర ఉంది. అయితే తాను స్టార్ అయ్యాక షారుక్ వీరిద్దరికీ దూరంగా ఉన్నాడనే చెప్పాలి. ఆమిర్ బహిరంగంగా ‘నా కంటే షారుక్ మంచి నటుడు కాదు. నాతో కలిసి పని చేస్తే అతడి అసలు టాలెంట్ తేలిపోతుంది’ అని సవాలు విసిరాడు. అంతేకాదు తన గెస్ట్‌హౌస్‌లోని కుక్కపిల్లకు ‘షారుక్’ అనే పేరు ఉందని చెప్పి ఒక కాంట్రవర్సీ రేపాడు. షారుక్ ‘కింగ్’ అయితే తాను ‘ఏస్’ అని పోల్చుకున్నాడు. ఇక సల్మాన్ ఇచ్చిన ఒక పార్టీలో షారుక్ ఏదో కామెంట్ చేశాడని కత్రినా కైఫ్ సమక్షంలో ఇద్దరి మధ్యా బాహాబాహీ జరిగింది. అయితే అన్నీ గొడవలు దాదాపుగా సమసిపోయాయి. సల్మాన్, షారుక్‌లు ఒకరి సినిమాల్లో ఒకరు కామియో అప్పీరియెన్స్ ఇస్తున్నారు. ఆమిర్, షారుక్‌లు కూడా ఏమీ మాటా మాటా అనుకోవడం లేదు. జంటలుగా నటించిన ఈ ముగ్గురు ఒకేసారి ఒకే సినిమాలో నటిస్తే అప్పుడది ప్రేక్షకుల పండగ అవుతుంది. అలాంటి కథ వండి అటువంటి సినిమా తీసే దర్శకుడు రావాల్సి ఉంది. -
మా ఇద్దరికీ కుదరదేమో!
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తుంటారు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలనైనా ఆయన థియేటర్స్‌లో వేస్తారు. ఈ ఏడాది కూడా అక్షయ్ నటిస్తున్న ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ కానున్నాయి. కానీ షారుక్‌ఖాన్ లాంటి స్టార్స్ కొందరు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తుంటారు. అక్షయ్‌లా మీరు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయవచ్చు కదా? అన్న ప్రశ్నను షారుక్ ముందు ఉంచితే... ‘‘నేను అక్షయ్‌లా ఉదయాన్నే నిద్ర లేవలేను. అక్షయ్ నిద్రలేచే సమయానికి నేను సెట్లో ప్యాకప్ చెబుతాను. ఆయన సెట్‌కి బయలుదేరే టైమ్‌కి నేను నిద్రపోతా. మేం ఇద్దరం కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలన్నా కూడా టైమ్ కుదరదేమో’’ అని సరదాగా చెప్పారు. -
సూపర్‌స్టార్‌ను తీసేసి యంగ్ హీరోతో..!
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ తరువాత అదే స్థాయిలో స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస విజయాలతో బాద్షాగా వెలుగొందిన కింగ్ ఖాన్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. తాజాగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్‌కు మరో భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీరో భారత్‌లో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. దీంతో షారూఖ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా మార్పలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ నుంచి షారూఖ్‌ను తొలగించటం ఫ్యాన్స్ అవమానంగా భావిస్తున్నారు. వయసు కారణంగానే షారూఖ్‌ను కాదని యంగ్ హీరోల వైపు చూస్తున్నట్టుగా నిర్మాతలు చెపుతున్నా మార్కెట్ లేని కారణంగానే బాద్షాను పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. షారూఖ్ స్థానంలో యంగ్ హీరో విక్కీ కౌషల్ పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ పరిస్థితులనుంచి కింగ్ ఖాన్ ఎలా బయటపడతాడో చూడాలి. -
‘జీరో’ వసూళ్లు.. నిరాశపరిచిన బాద్షా
కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. జీరోకు కూడా డివైడ్ టాక్ రావటంతో ఆ ప్రభావం కలెక్షన్ల మీద గట్టిగానే కనిపిస్తోంది. భారీ హైప్ కారణంగా తొలిరోజు 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన జీరో వీక్డేట్స్లో అదే రేంజ్ కంటిన్యూ చేయలేకపోయింది. తొలి వారాంతానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి నిరాశపరిచింది. సోమవారం కలెక్షన్లు మరింత భారీగా పడిపోయినా మంగళవారం క్రిస్టమస్ సెలవు కావటంతో వసూళ్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటించారు. #Zero has clearly underperformed... Remained on similar levels over the weekend... No turnaround / big jump in biz... #Christmas holiday [tomorrow] should boost biz... Real test on Wed and Thu... Fri 20.14 cr, Sat 18.22 cr, Sun 20.71 cr. Total: ₹ 59.07 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 24 December 2018 -
అఫీషియల్ : కృష్టుడిగా ఆమిర్..!
ఇప్పటికే చాలా సార్లు వెండితెరకెక్కిన మహాభారత గాథ ఇప్పుడు మరింత భారీగా రూపొందనుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు పూనుకున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సిరీస్‌గా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమిర్.. శ్రీ కృష్ణుడిగా నటించే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పందించాడు. జీరో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షారూఖ్ తనకు శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాలని ఉందని.. అయితే ఆ పాత్రను త్వరలో ఆమిర్ పోషించబోతున్నాడని వెల్లడించారు. దీంతో మహాభారతంలో ఆమిర్ చేయబోయేది శ్రీకృష్ణుడి పాత్రే అని కన్ఫామ్ అయ్యింది. -
‘జీరో’ వివాదం ముగిసినట్టేనా..!
కొంత కాలంగా వరుసఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ ఈ శుక్రవారం జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ట్రైలర్లో షారూఖ్.. సిక్కులు కిర్పన్ ను ధరించి ఉండటం వివాదాస్పదమైంది. అమృతాపాల్ సింగ్ అనే న్యాయవాధి కోర్టును ఆశ్రయించటంతో చిత్రయూనిట్ స్పందించింది. అది కిర్పన్ కాదని కేవలం ఆ పాత్ర తన పెళ్లి సమయంలో వేసుకున్న ఓ అలంకారం మాత్రమే అని కోర్టుకు తెలిపారు. ఈ సన్నివేశాల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే సదరు సన్నివేశాల్లో కనిపించిన బాకును గ్రాఫిక్స్‌లో ఓ షో పీస్‌లా మారుస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో జీరో వివాదం ముగినట్టే అని భావిస్తున్నారు. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. -
అల్లు అర్జున్ చాలా టాలెంటెడ్ : షారుఖ్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ శుక్రవారం జీరోతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న షారుఖ్ ప్రమోషన్లో భాగంగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘బన్నీ చాలా టాలెంటెడ్ త్వరలోనే తనని కలిసి టైం స్పెండ్ చేస్తా’నన్నాడు షారుఖ్. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న బాద్ షా ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. తెలుగు హీరోల్లో ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్. బన్నీ సినిమాలు మాలీవుడ్ లో రికార్డ్‌లు తిరగరాస్తుంటే.. హిందీలో డబ్ అయిన సినిమాలు యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. -
బబితా కుమారీ ఆయా
కత్రినా కైఫ్కీ స్పెషల్ సాంగ్స్‌కు ఓ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ‘షీలాకీ జవానీ...’ అంటూ ‘తీస్మార్ ఖాన్’లో స్క్రీన్‌ని ఫైర్‌తో నింపారు. ఆ తర్వాత ‘చికినీ చమేలీ.., ధూమ్ మచాలే.., కాలా చష్మా’ అంటూ స్క్రీన్ మీద మెరుపు వేగంతో స్టెప్పులేశారు. ఆ సాంగ్సే థియేటర్‌వైపు రిపీట్ ఆడియన్స్‌ను రప్పించడానికి రీజన్ అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. మళ్లీ అలాంటి డ్యాన్స్ నంబర్‌తో వచ్చారు. ‘హుస్న్ పర్చమ్..’ అనే సాంగ్ కోసం ‘జీరో’ సినిమాలో నర్తించారామె. ఈ పాటలో కైఫ్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు కైపెక్కిపోతారనడంలో సందేహం లేదు. షారుక్ ఖాన్ హీరోగా అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జీరో’. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించగా, హీరోయిన్ బబితా కుమారీ పాత్రలో కత్రినా నటించారు. ఈ పాటలో కైఫ్ కోసం షారుక్, సల్మాన్ పోటీపడటం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. -
కత్రినా కోసం ఖాన్స్
బాక్సాఫీస్ దగ్గర పోటీపడే బాలీవుడ్ ఖాన్స్ షారుక్, సల్మాన్ సరదాగా డ్యాన్స్ ఫ్లోర్‌పై పోటీ పడ్డారు. నువ్వా? నేనా అన్నట్లుండే ఈ ఖాన్స్ నువ్వూ నేనూ అంటూ ఓ సాంగ్‌కి చిందేశారు. షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీరో’. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రను పోషించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో ‘ఇస్క్బాజీ..’ అనే సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ పాట వీడియో సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘జీరో’ సినిమాలో కత్రినా తన నిజ జీవిత పాత్రనే పోషించారు. ఆమె కోసం ఈ ఇద్దరు ఖాన్స్ సరదాగా పోటీ పడుతున్నట్టుగా ఈ సాంగ్‌ను రూపొందించారు. డిసెంబర్ 21న ‘జీరో చిత్రం రిలీజ్ కానుంది. -
ఆరంభం.. అట్టహాసం
భువనేశ్వర్: అగ్ర తారల తళుకులు... బాణా సంచా మెరుపులు... రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు... హుషారెత్తించే పాటలు... మైమరపించే నృత్య ప్రదర్శనల మధ్య... మనుషులంతా ఒక్కటే అని చాటుతూ... 14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఆతిథ్య రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో, 16 ప్రాతినిధ్య దేశాల కెప్టెన్ల హాజరీలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అందాల తార మాధురీ దీక్షిత్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు కట్టిపడేశాయి. మాధురీ భూ దేవీగా అవతరిస్తూ, ప్రపంచ ప్రజలందరినీ తన పిల్లలుగా సంబోధిస్తూ చేసిన ప్రసంగంతో షో ప్రారంభమైంది. ఆమెపై చిత్రీకరించిన ‘ఎర్త్ సాంగ్’ అలరించింది. 1100 మంది కళాకారులతో, షిమాక్ దావర్ కొరియోగ్రఫీలో రూపొందిన ‘ఫ్యూజన్ డ్యాన్స్’ అబ్బురపర్చింది. గుల్జార్ రచించిన ప్రపంచ కప్ అధికార పాట ‘జై హింద్, జై ఇండియా’కు రెహమాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ మరింత వన్నె తెచ్చింది. ‘డ్రమ్స్’ శివమణి తన వాయిద్యాలతో హోరెత్తించారు. మరోవైపు ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాభిమానులను ఈ కప్ అలరిస్తుందని, భారత దేశ, ప్రత్యేకించి ఒడిశా సంస్కృతిని ప్రపంచానికి చాటుతుందున్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘తమ్ముడు నువ్వు ఎంతో ఎదిగిపోయావ్’
బడా హీరోల సినిమాలు.. చిన్న హీరోల సినిమాలు ఒకేసారి రావు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురయితే చిన్న హీరోలు రేస్ నుంచి తప్పుకుంటారు. ఎప్పుడో.. ఎక్కడో కథ మీద బాగా నమ్మకం ఉంటే తప్ప చిన్న హీరోలు, బడా హీరోలతో పోటికి దిగరు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘జీరో’.. రితేష్ దేశ్ముఖ హీరోగా వస్తోన్న మరాఠీ చిత్రం మౌలీ చిత్రం రెండు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగునున్నాయి. ఈ క్రమంలో షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ఎందుకంటే షారుక్ ఖాన్ ‘జీరో’ చిత్రం ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఈ క్రమంలో అదే రోజు ‘మౌలీ’ సినిమా కూడా వస్తే మరాఠీ ప్రజలు వారి మాతృభాష చిత్రానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఆ ప్రభావం షారుక్ ‘జీరో’ చిత్రం మీద పడుతోంది. ఇవన్ని ఆలోచించిన రితేష్, షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన షారుక్, రితేష్ మంచి మనసుకు మురిపిపోయి ట్విట్టర్ వేదికగా తన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నా చిన్న తమ్ముడు చాలా పెద్దవాడు అయ్యాడు. నీ విశాల హృదయానికి.. ప్రేమకు, గౌరవానికి నా ధన్యవాదాలు. నీ అవసరం కన్నా నా ఆత్మాభిమానానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చావ్. ఈ విషయం నిజంగా నా హృదయాన్ని కదిలించింది. చాలా సంతోషంగా ఉంది’ అంటూ షారుక్ ట్వీట్ చేశారు. @Riteishd jab chota bhai bahut bada ho jaata hai. Thank you baby for the love respect and largesse of heart you showed me today. Grateful. Touched. I am so happy to have ‘asked’ something of a friend who kept my self respect higher than his own need. — Shah Rukh Khan (@iamsrk) November 5, 2018 ‘మౌలీ’ రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న రెండో మరాఠీ చిత్రం. రితేష్ ‘లయి భారి’ అనే మరాఠి చిత్రంతో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రితేష్ హిందీలో ‘హౌస్‌ఫుల్ 4’లో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, బాబి డియోల్‌తో కలిసి నటిస్తున్నాడు. -
షారుఖ్ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలను జరుపుకున్న షారుఖ్.. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితులైన కొందరు మిత్రులను ఆ పార్టీకి పిలిచారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద శబ్దాలతో కూడిన సంగీతం ఆగక పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నగరంలోని రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పనిచేయరాదనే నిబంధనలున్నాయంటూ కార్యక్రమాన్ని ఆపుచేయించారు. -
షారుఖ్ బర్త్‌డే పార్టీలో పోలీసులు
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్ షా 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా ఆయన నటించిన ‘జీరో’ ట్రైలర్ కూడా అదే రోజు విడుదల కావడంతో ఆయన బిజీబిజీగా గడిపారు. అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఫ్రెండ్స్‌కు బాంద్రాలోని ‘అర్ధ్’ నైట్ క్లబ్లో పార్టీ ఇచ్చారు. అయితే ఈ ప్రైవేటు కార్యక్రమానికి పోలీసులూ హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. చెవులు చిల్లులు పడేల హోరెత్తుతున్న మ్యూజిక్‌ను ఆపేశారు. (బాల్కనీలో నుంచుని చేతులు జోడించిన షారుఖ్) సాదారణంగా రాత్రి ఒంటిగంట వరకే నైట్క్లబ్బులకు పర్మిషన్ ఉంటుంది. అప్పటికే రాత్రి 3 గంటలయినా షారుఖ్ అతని మిత్రులు పాల్గొన్న ‘అర్ధ్’క్లబ్ తెరిచే ఉందని పోలీసులు తెలిపారు. బాద్షా పార్టీ కోసం అక్కడున్న వారందరినీ అప్పటికే పంపేశారని అన్నారు. రాత్రి 3 దాటినా ‘అర్థ్’ ఇంకా తెరచే ఉందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నామని పోలీసులు వెల్లడించారు. దీంతో షారుఖ్ అతని ఫ్రెండ్స్ త్వత్వరగా పార్టీ ముగించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఇదిలాఉండగా.. పోలీసుల రాకను ముందే పసిగట్టిన మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా అప్పటికే క్లబ్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. (చదవండి : అనుష్క, షారుఖ్, కత్రిన అదరగొట్టారు!) -
బాల్కనీలో నుంచుని చేతులు జోడించిన షారుఖ్
సాక్షి, ముంబై : 53వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా తన పుట్టిన రోజు వేడుకలు గురువారం అర్ధరాత్రి ఘనంగా జరుపుకున్నారు. బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తన ఇంటికొచ్చిన వేలాదిమంది అభిమానులకు షారుఖ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. బాల్కనీలో నిలబడి అభిమానులకు చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సతీమణి గౌరీ, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్తో షారుఖ్ ఆనందాన్ని పంచుకున్నారు. గౌరీకి కేక్ తినిపించిన ఫోటో, అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటోలు ట్వీట్ చేశారు. ‘నా అర్ధాంగికి కేక్ తినిపించా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నా అభిమాన కుటుంబాన్ని కలుసుకున్నా. ఇప్పుడు నా గారాల పట్టీలతో ఆడుకుంటున్నా. ఎనలేని మీ ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. విశేషమేమంటే. గౌరీకి కేక్ తినిపిస్తున్న షారుఖ్ ఫోటోను దర్శకుడు కరణ్‌జోహర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘హ్యాపీ బర్త్ డే షారుఖ్. నువ్వూ, గౌరీ నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. మీతో పరిచయం నా జీవితంలో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నా. మీలో ఒకడిగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చారు. మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్టున్న ‘జీరో’ చిత్రం ఘనవిజయం సాధించాలని కరణ్ ఆకాక్షించారు. కాగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు (నవంబర్ 2 ) ‘జీరో’ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. (జీరో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది : ఆమిర్) Fed cake to wife...Met my family of fans outside Mannat...now playing Mono Deal with my lil girl gang! Having a Happy Birthday. Thank u all...for this amazing love. pic.twitter.com/8IthQY3cxQ — Shah Rukh Khan (@iamsrk) November 1, 2018 -
థగ్తో హగ్
షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఒకప్పుడు ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఆ ఈక్వేషన్స్ అన్నీ మార్చేశారు. ఒకరి సినిమాలను మరొకరు పొగుడుతూ, సినిమాల రిలీజ్‌ల ముందు అభినందించుకుంటూ ఆహ్లాదకర వాతావరణం తీసుకొచ్చారు. తాజాగా షారుక్ ‘జీరో’ ట్రైలర్‌ను చూసిన ఆమిర్‌ఖాన్ ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. షారుక్ నిన్ను నువ్వు బీట్ చేసేశావ్. సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా షారుక్ ‘థగ్తో హగ్’ అంటూ ఆమిర్‌తో దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఇవాళ (నవంబర్ 2) షారుక్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘జీరో’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. -
ప్రతిభని బట్టే పారితోషికం
ఫిల్మ్ ఇండస్ట్రీలో పారితోషికాలు జెండర్‌ని బట్టి ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ‘‘పారితోషికం అనేది ప్రతిభను బట్టి ఇవ్వాలి కానీ జెండర్‌ని బట్టి డిసైడ్ అవ్వకూడదు’’ అన్నారు షారుక్ ఖాన్. ఈ పారితోషికం వ్యత్యాసాల గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘స్త్రీ, పురుషుల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనే వైఖరి కరెక్ట్ కాదు. ఇద్దరూ సమానమే. వాళ్ల పారితోషికం కూడా అలానే డిసైడ్ చేయాలి. స్త్రీలు మన ల్ని (మగవాళ్లను) ఇంకా గొప్పగా ఆలోచించేలా తీర్చిదిద్దుతారు. మనల్ని ఇంకా బెటర్ పర్సన్‌గా మారుస్తారు. ఇప్పటికీ వాళ్లకు రావాల్సిన క్రెడిట్, రెమ్యునరేషన్ రాకపోవడం కరెక్ట్ కాదు’’ అని పేర్కొన్నారు. -
తరలివచ్చిన తారాగణం
-
అందుకే గౌరీని పెళ్లాడాను : హీరో
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ చాలా ఓపికగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘మీరెందుకు సార్ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నించగా.. ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని, గౌరీపై తనకు ఉన్న ప్రేమని ఎంత హృద్యంగా చెప్పారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీవీ షోలు చేస్తున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ జంటగా పేరొందిన వీరికి ఆర్యన్, సుహానా, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. -
అక్షయ్, సల్మాన్‌లకు చోటు ; షారుక్ మిస్
న్యూయార్క్ : ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది షారుక్ ఖాన్ ఈ జాబితాలో 65వ స్థానంలో నిలువగా ఈసారి మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 2017 జూన్ 1 నుంచి 2018 జూన్ 1 మధ్య కాలంలో ప్రముఖల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. టాప్ 100లోని సెలబ్రిటీలు చెల్లించే ముందస్తు పన్నుల విలువ 22 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఈ జాబితాలో అక్షయ్ రూ. 276 కోట్లతో 76వ స్థానంలో నిలువగా, సల్మాన్ రూ. 257 కోట్లతో 82వ స్థానంలో నిలిచారు. అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ 1946 కోట్లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలువగా, యాక్టర్ జార్జ్ క్లూనీ 2వ స్థానంలో, అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ 3వ స్థానంలో, ఫుట్‌బాల్ ప్లేయర్స్ లియోనల్ మెస్సీ 8వ స్థానంలో, క్రిస్టియానో రొనాల్డో 10వ స్థానంలో నిలిచారు. కాగా క్రితం ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి షారుక్ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్ రూ.238 కోట్లతో 71వ స్థానంలో, అక్షయ్ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
షారుఖ్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
చెన్నై : షారుఖ్ ఖాన్.. స్టన్నింగ్ క్యాచ్ ఏంటీ? అనుకుంటున్నారా? అయితే ఇది మీరనుకునే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కాదు. తమిళనాడు క్రికెటర్ మసూద్ షారుఖ్ ఖాన్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో భాగంగా లైకా కోవా కింగ్స్(ఎల్‌కేకే), ఐడ్రీమ్ కరైకుడి కలై(ఐకేకే) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ తమిళ షారుఖ్ ఖాన్ అద్బుత క్యాచ్‌తో అదరగొట్టాడు. ఈ డొమెస్టిక్ లీగ్‌లో ఎల్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న షారుఖ్ ఖాన్.. బౌండరీ లైన వద్ద ఐకేకే జట్టు బ్యాట్స్‌మన్ రాజమణి శ్రీనివాసన్ ఆడిన భారీ షాట్‌ను అడ్డుకోవడమే కాకుండా అద్బుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ షారుఖ్ ఫీట్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కూడా ఫిదా అయ్యాడు. దీంతో ఈ తమిళ షారుఖ్ ఒక్కసారి హీరో అయిపోయాడు. 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 oh my!!! https://t.co/dMkhutd7sa — Dean Jones (@ProfDeano) July 16, 2018 ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐకేకే 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఎల్‌కేకే కూడా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
షారుఖ్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ ఏంటీ? అనుకుంటున్నారా?
-
బాలీవుడ్ హీరోకు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ప్రశంస
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తన ఆత్మకథలో సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె తన ఆటోబయోగ్రఫీని విడుదల చేయడంతో ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తన మాజీ భర్త ఒక మత్తు బానిస అని, అతడి స్నేహితుడితో శారీరక సంబంధం కలిగి ఉండేవారని, ఆయనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారంటూ ఇలా తన ఆత్మకథలో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్‌ను విమర్శిస్తూనే రాశారు. అంతేకాకుండా తన పైశాచికత్వంతో భార్యను వేధించాడంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రంపై కూడా వివాదాస్పద ఆరోపణలు చేశారు. అయితే పలువురు వ్యక్తులను కటువైన పదజాలంతో విమర్శిస్తూ రాసుకొచ్చిన రేహమ్... 445 పేజీలతో కూడిన తన ఆత్మకథలో కేవలం ఒకే ఒక వ్యక్తిని పొగడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో మర్యాద కలిగిన వ్యక్తి అంటూ రెహమ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అసలైన వ్యక్తిత్వం అంటే ఇదే.. గతంలో ఒక ప్రఖ్యాత చానల్లో జర్నలిస్టుగా పని చేసిన రెహమ్ ఖాన్.. ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కాసేపు ముచ్చటించారట. ‘2008లో డోంట్ డిలే... క్లెయిమ్ టుడే అనే కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్, భారత్ నుంచి కొంత మంది ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చింది. అందరిలోనూ ప్రధాన ఆకర్షణగా ఉన్న షారుఖ్ ఖాన్‌తో మాట్లాడాను. వృత్తి పట్ల అతడి నిబద్ధత అమోఘం. అంత పెద్ద సెలబ్రిటీ అయినా కొంచెం కూడా పొగరు లేదు. అతడి ప్రొఫెషనలిజం చూస్తే నాకు ముచ్చటేసింది. మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన తన మూలాల్ని మర్చిపోలేదు. నిజమైన వ్యక్తిత్వం అంటే అదే. షారుఖ్ ఎంతో మర్యాదస్తుడు’ అంటూ రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాశారు. -
‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుటుంబం ప్రస్తుతం సెలవుల్లో భాగంగా యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు షారుఖ్ పిల్లలు. ట్రిప్‌లో భాగంగా నేపుల్స్ చేరుకున్న సందర్భంగా షారుఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ తన చిన్నారి సోదరుడు అబ్రామ్తో కలిసి దిగిన ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అబ్రామ్మై చెయ్యి వేసి నిల్చున్న ఫొటోను పోస్ట్ చేసిన ఆర్యన్... ‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి స్పందించిన నెటిజన్లు ‘ఒక పెద్దన్న ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ సోదరులిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చెల్లెలు సుహానా ఖాన్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో ఆర్యన్ కాస్త అరుదుగానే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్లోడ్ చేసిన ప్రతిసారీ తండ్రి లాగే చమత్కారంతో కూడిన కామెంట్లతో ఆకట్టుకుంటాడు. గతంలో అబ్రామ్ను తలకిందులుగా వేలాడదీస్తూ పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేసిన ఆర్యన్.. ‘హ్యాంగింగ్ ఔట్ విత్ బ్రదర్’ అంటూ చమత్కరించాడు. Nobody lays a hand on my brother. A post shared by Aryan Khan (@___aryan___) on Jul 6, 2018 at 9:49am PDT Hanging out with the brother A post shared by Aryan Khan (@___aryan___) on Feb 5, 2017 at 3:47am PST -
సచిన్ కోసం ప్రత్యేకంగా...
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటో సచిన్ అభిమానులతో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ అభిమానుల మనసు కూడా దోచుకుంటోంది. మహారాష్ట్రలో ఓ వివాహ వేడుకకు హాజరైన సచిన్, షారుఖ్‌తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘జబ్ ఎస్ఆర్కే(షారుఖ్ ఖాన్) మెట్ ఎస్ఆర్టీ(సచిన్ రమేశ్ టెండుల్కర్) ??’ అంటూ క్యాప్షన్ కూడా జత చేశారు. సచిన్ ట్వీట్‌కు స్పందించిన షారుఖ్... ‘ఫొటోలను ఆల్బమ్‌లో పదిలపరచుకునే అలవాటు లేదు. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తితో దిగిన ఫొటోను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలి అనుకుంటున్నా గనుక ఆయన కోసం ప్రత్యేకంగా ఓ ఆల్బమ్‌ను తయారు చేసుకుంటా’ అంటూ సచిన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. టోపీ(వివాహ వేడుకలో ధరించే సంప్రదాయ టోపీ) పెట్టుకున్న మీ ఇద్దరు ఈ సెల్ఫీలో ఎంతో చక్కగా ఉన్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Jab SRK met SRT 😋 pic.twitter.com/8Nj8UpyDxw — Sachin Tendulkar (@sachin_rt) July 3, 2018 We don’t keep photo albums anymore… but I will make an album just to keep this pic with the great man forever. https://t.co/gYN24yMNyk — Shah Rukh Khan (@iamsrk) July 3, 2018 -
ఇంటి తాళం ఇచ్చేశాడు
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ఖాన్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ను ప్రస్తుతం లండన్‌లో తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ కోసం ఇర్ఫాన్ లండన్‌లో ఎన్ని నెలలుంటారో తెలియదు. కానీ లండన్‌లో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని షారుక్ లండన్‌లోని తన ఇంటి తాళాలను స్నేహితుడు ఇర్ఫాన్ చేతికి అందించారట. ట్రీట్మెంట్కి ప్రయాణమయ్యే కొన్ని రోజుల ముందు షారుక్‌ని ఇంటికి ఆహ్వానించారట ఇర్ఫాన్ భార్య సుతపా. రెండు గంటలు మాట్లాడుకున్న ఈ స్నేహితులు, సంభాషణ ఆఖర్లో షారుక్ తన లండన్ ఇంటి కీస్‌ని ఇర్ఫాన్‌కి అందించారట. లండన్‌లో స్నేహితుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ఇంటి వాతావరణం మిస్ అవ్వకూడదని షారుక్ ఇలా చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మరోసారి తండ్రి కాబోతున్న హీరో..!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్ ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుఖ్.. తనకు ఆకాంక్ష అనే పేరు అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన ఓ అభిమాని.. ‘ ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. మీరు నాలుగోసారి తండ్రి కాబోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరబోతుందంటూ’ క్రేజీ కామెంట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన షారుఖ్.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్..! ఒకవేళ నీ కల నిజమైతే అబ్రాం దుస్తులు ఇప్పటి నుంచే దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా’ అంటూ చిలిపిగా సమాధానమిచ్చారు. కాగా షారుఖ్- గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్, సుహాన, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. OMG OMG I JUST REMEMBERED I HAD THIS DREAM WHERE YOU WERE EXPECTING YOUR 4TH CHILD IT WAS SO CRAZYY AND SWETTTT #AskSRK — RAAZ SRK❤️ (@RazJabra) June 6, 2018 OMG OMG!! Better save AbRam’s clothes just for in case your dream comes true..kaam aa jayenge https://t.co/alixtVHmV6 — Shah Rukh Khan (@iamsrk) June 6, 2018 -
అప్పుడు సొంత కారు కూడా లేదు: ఆమిర్ ఖాన్
సాక్షి, ఢిల్లీ: ‘కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది. నేడు వైవిధ్యమైన, వినూత్నమైన కథలను అభిమానులు ఆదరిసున్నార’ని బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో భారతీయ సినీ అభిమానుల ఆసక్తుల్లో వచ్చిన మార్పులపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా 1992లో తెరకెక్కిన ‘జో జీతా హై వొహీ సికందర్’ నేటి కాలానికి కూడా సరిపోయే గొప్ప సినిమా. ఆ తరహా కథలతో వచ్చే సినిమాలకు నేడు మంచి ఆదరణ ఉంది. కథలో వైవిధ్యం ఉన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలు సాధిస్తున్నాయ’ని ఆమిర్ అన్నారు. ‘కేవలం కథను నమ్మి సినిమా చేయడం కత్తి మీత సామే. నా వరకైతే అది కమర్షియల్ సినిమానా, కథ ప్రధానంగా రూపొందే సినిమానా అని చూసుకోను. మంచి కథతో సినిమా చేయాలి. సినిమాను ఎక్కువ మంది ఇష్టపడాలి’ అని మాత్రామే ఆలోచిస్తానని ఆమిర్ వివరించారు. ‘కానీ, ఈ రోజుల్లో ఫలానా మూవీ మంచి సినిమా అని చెప్పడం కష్టం. ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాను గొప్ప సినిమాగా లెక్కేస్తున్నామ’ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కథ గురించి సగటు ప్రేక్షకుడిగా ఆలోచిస్తాని అన్నారు. వాణిజ్య పరంగా సినిమా నిలదొక్కుకోవడానికి కొన్ని మెళకువలు కూడా పాటిస్తానన్నారు. సినీ రంగంలో చాలా మంది హీరోలు ప్రయోగాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రమే కథను నమ్మి సినిమాలు చేస్తున్నారని ఆమీర్ అభిప్రాయ పడ్డారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు అటు వాణిజ్య విలువలు, ఇటు విభిన్న కథాంశాలను మిళితం చేస్తూ పలు సినిమాలు చేశారు. స్వదేశ్, రాయీస్, భజరంగీ భాయ్‌జాన్ వంటి సినిమాలు ఆ కోవకు చెందినవేనని ఆయన అన్నారు. కథ ప్రధానంగా తెరకెక్కిన తారే జమీన్ పర్, రంగ్ దే బసంతి, దిల్ చాహ్తా హై వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించినా.. వసూళ్లు సాధించలేదని అన్నారు. ‘నా కెరీర్లో తొలి కమర్షియల్ హిట్ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’. అప్పటికీ నాకు సొంత కారు కూడా లేదు. ప్రయాణం బస్సుల్లోనే సాగేద’ని ఆమిర్ గుర్తు చేసుకున్నారు. నెలకు వెయ్యి రూపాయల సంపాదనతో కెరీర్ ప్రారంభించాననీ.. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రానికి తన సంపాదన పదకొండు వేలు మాత్రమేనని ఆయన తెలిపారు. ఎప్పుడూ వైవిధ్యం కోసం ఆరాటపడే ఆమిర్ ఖాన్ నటించిన గజిని సినిమా 2008లో విడుదలై ఘనవిజయం సాధించింది. రూ.100 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ సినిమా రంగంలో వసూళ్ల పరంగా ‘వంద కోట్ల సినిమా క్లబ్’కు నాంది పలికింది. -
స్విమ్‌సూట్‌లో సుహానా.. వైరల్
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్.. సోషల్ మీడియాలో మరోసారి హల్చల్ చేస్తోంది. స్విమ్‌సూట్‌లో ఉన్న సుహానా ఖాన్ తాజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘ఫ్యూచర్ బాలీవుడ్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఓ గుర్తుతెలియని ఐడీ ఈ ఫొటోలను పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో సుహానా తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు, ఓ వీడియోను ఈ పేజీ షేర్చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వెంటనే వైరల్‌గా మారిపోయాయి. సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్ అవుతూ ఉంటాయి. -
దిలీప్ కుమార్‌కు కింగ్‌ఖాన్ పరామర్శ
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌ను కింగ్ ఖాన్ షారూఖ్ పరామర్శించారు. సోమవారం ముంబైలోని దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లిన షారూఖ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో షారూఖ్ దిగిన ఫొటోను పారిశ్రామిక వేత్త ఫైసల్ ఫారూఖీ దిలీప్ కుమార్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. గత ఆరునెలల కాలంలో దిలీప్ కుమార్‌ను షారూఖ్ పరామర్శించడం ఇది రెండో సారి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్న షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు వ్యక్తిగా కనిపించనున్నాడు. .@iamsrk came to visit Saab at home today. -FF pic.twitter.com/GLrnqu1Ln2 — Dilip Kumar (@TheDilipKumar) 12 February 2018 -
అమితాబ్ తప్పుకుంటున్నారు
....అయితే ఆయన తప్పుకుంటున్నది సినిమాల నుంచి కాదు.. ట్విట్టర్ ఖాతా నుంచి! యంగ్ హీరోలకంటే కూడా ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ హఠాత్తుగా ఎందుకు తప్పుకుంటున్నారు? అనే ప్రశ్న రాక మానదు. ట్విట్టర్లో తన ఫాలోయర్ల సంఖ్య తగ్గిందని అభిప్రాయపడ్డ అమితాబ్ బుధవారం చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘ట్విటర్... (ట్విట్టర్‌ని ఉద్దేశించి) నువ్వు నా ఫాలోయర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా ఉంది. ఇక నీ నుంచి బయటకు రావాల్సిన టైమ్ వచ్చింది. బయట ఇంకా చెప్పాల్సినవి, ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్యూ’’ అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న సెలబ్రిటీ బిగ్ బీనే. ఆయన ఫాలోయర్ల సంఖ్య 32,902,353. తాజాగా బిగ్ బీని షారుక్ ఖాన్ దాటేశారు. షారుక్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య 32,944,338. షారుక్ ఫస్ట్ ప్లేస్‌కి రావడంవల్లే బిగ్ బి ఏకంగా ట్విట్టర్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ టాక్. -
షారూక్ ఖాన్ ఫాంహౌస్ అటాచ్
ముంబై: మహారాష్ట్ర అలీబాగ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ పేరిట ఉన్న ఫాంహౌస్‌ను ఆదాయ పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్చేసింది. వ్యవసాయం కోసం అనుమతి తీసుకున్న భూమిలో నిబంధనలు ఉల్లంఘించి విలాసవంతమైన ఫాంహౌస్‌ను నిర్మించారని ఆరోపించింది. షారూక్ ఐటీ శాఖకు 90 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వ్యవహారంలో రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ కూడా షారూక్‌కు నోటీసులు పంపారు. షారూక్ బంధువులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ దెజావు ఫార్మ్స్ వ్యవసాయ కార్యకలాపాలకు 19,960 చ.మీ. భూమిని కొనుగోలు చేసింది. కానీ ఆ స్థలంలో పెద్ద భవంతి, ఈత కొలను, హెలిప్యాడ్లను నిర్మించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే షారూక్‌కు నోటీసులు పంపామని ఓ అధికారి తెలిపారు. -
దావోస్ సదస్సులో షారుఖ్‌కు క్రిస్టల్ అవార్డు
న్యూఢిల్లీ/జెనీవా: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ అరుదైన గుర్తింపు దక్కనుంది. సదస్సు సందర్భంగా ఈ నెల 22వ తేదీన హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్ జాన్‌తోపాటు షారుఖ్ క్రిస్టల్ అవార్డు అందుకోనున్నారు. షారుఖ్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని డబ్ల్యూఈఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల ఆయన సాగిస్తున్న పోరాటానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. యాసిడ్ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మీర్ ఫౌండేషన్‌ను నడుపుతున్నారని, కేన్సర్ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది. గతంలో ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, మల్లికా సారాభాయ్, ఏఆర్ రెహమాన్, షబానా అజ్మి తదితరులున్నారు. -
నాడు కమల్ హాసన్.. నేడు షారుక్ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జీరో’ తొలి టీజర్ విడుదలైన విషయం తెల్సిందే. వచ్చే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో ఎలా నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సరిగ్గా 29 ఏళ్ల క్రితం కమలా హాసన్ నటించిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో విడుదల చేయగా కలెక్షన్లు హోరెత్తాయి. తమిళనాట అప్పటి వరకు నెలకొన్న అన్ని రికార్డులను ఆ సినిమా బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా రికార్డును అధిగమించినది రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రం మాత్రమే. అపూర్వ సహోదరులు అంతటి ఆదరణ పొందడానికి కారణం ‘అప్పు’ పాత్రలో కమల్ హాసన్ మరుగుజ్జుగా కనిపించడమే. మోకాళ్ల వరకే పూర్తి కాలున్నట్లుగా కమల్ హాసన్ ఆ చిత్రంలో కనించడానికి కమలహాసన్‌తోపాటు దర్శకుడు ఎంతో కష్టపడ్డారు. అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని కమలా హాసన్గానీ, ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావుగానీ వెల్లడించకుండా 2008 సంవత్సరం వరకు గోప్యంగా ఉంచారు. ఈ రహస్యం ఇప్పటి కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ చిత్రంలో మరుగుజ్జు పాత్ర కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నిగానీ, గ్రాఫిక్స్గానీ ఉపయోగించలేదు. సింగీతం శ్రీనివాస్ రావు కథనం ప్రకారం. కమల్ హాసన్ ఎక్కువ వరకు వెనక కాళ్లు కనిపించకుండా మోకాళ్లపై నడిచారు. అందుకనే ఎక్కువ షాట్లు క్లోజప్లోనే ఉంటాయి. ఇక కమల్ హాసన్ పక్కకు తిరిగి నడుస్తున్నట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు కందకం తవ్వి అందులో మోకాలి వరకు కమల్‌ను నిలబెట్టి ఇసుకతో పూడ్చి నడిపించారు. మోకాళ్లపై నడుస్తున్నప్పుడు ఎక్కువ వరకు సహజంగా కనిపించేందుకు, మోకాలి చిప్ప నొప్పి పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడారు. ఇక తోటి నటుల మధ్య ఎదురుగా కాకుండా అటూ ఇటూగా ఉన్నప్పుడు కూడా కందకం టెక్నిక్‌నే వాడారు. పాటల సందర్భంలో, ముఖ్యంగా సర్కస్ మిత్రులతో కలిసి కాళ్లూపుతూ పాటలు పాడినప్పుడు కమల్ ప్రత్యేకంగా రూపొందించిన కత్రిమ కాళ్లను వాడారు. ఆ కాళ్లను వంచిన మోకాళ్లకు తగిలించి కదిలేలా చేశారు. అప్పు పాత్రలో కమల్ హాసన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోకాళ్ల వరకు కాళ్లను కత్తిరించినట్లు కనిపిస్తుంది తప్పా, పూర్తి సహజత్వం కనిపించదు. అయినప్పటికీ ఆ ప్రయోగం నచ్చడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత 2001లో విడుదలైన ఆషిక్ సినిమాలో జానీ లివర్ ఇలాంటి టెక్నిక్కే ఉపయోగించి మరుగుజ్జు పాత్రలో నటించారు. ఇక 2006లో విడుదలైన ‘జాన్ ఏ మన్’ చిత్రంలో అనుపమ్ ఖేర్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన మోకాళ్ల వరకు కాళ్లు మడిచే నడిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆయన మోకాలి చిప్పలు అప్పట్లో వాచి పోయాయి. ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతుంటే మోకాలి చిప్పలు కలుక్కుమంటున్నాయని అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు ‘జీరో’ చిత్రంలో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా ఎలా నటిస్తున్నారన్నది ఆసక్తికరమైన తాజా ప్రశ్న. కమల్ హాసన్, అనుపమ్ ఖేర్లలాగా మోకాలి చిప్పలను దెబ్బతీసుకోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి షారుక్ ఖాన్ నటించారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్’ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన పీటర్ జాక్సన్ ‘పర్స్పెక్టివ్ టెక్నిక్’ను ఇందులో ఉపయోగించారు. దీనికి విస్తతమైన సెట్లు అవసరం అవుతాయి. తోటి పాత్రలకన్నా షారుక్ ఖాన్‌ను చాలా దూరంగా ఉంచి షూటింగ్ చేయడం వల్ల షారుక్ ఖాన్ పొట్టిగా కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రల మధ్య ఆ దూరం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా కెమేరా పనితనం బాగా లేకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మిక్సింగ్ బాగాలేకున్నా, సినిమా మొత్తం నిడివిలో ఒకేతీరు పర్స్పెక్టివ్ లేకున్నా సహజత్వం లోపిస్తుంది. -
బిగ్‌బాస్.. అడిగినంత ఇస్తే ఓకే..!
ముంబై: బిగ్‌బాస్ హోస్టింగ్ గురించి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ స్పందించాడు. షో చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నాడు. కాకపోతే అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్ షో హోస్ట్ చేయడానికి తాను సిద్ధమేనని షారుక్ ప్రకటించారు. తన షెడ్యూల్ ప్రస్తుతం ఖాళీగానే ఉందని తెలిపారు. ‘ ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరున్నారనేది ముఖ్యం కాదు. కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించడమే ముఖ్యం. కాకకపోతే నన్ను ఇంతవరకు బిగ్‌బాస్‌కు సంబంధించి ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మంచి ఆఫర్ ఇస్తే నేను హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’నని ఈ బాద్షా ప్రకటించారు. ఇప్పటివరకు 10 సీజన్లను పూర్తి చేసుకొన్న ‘బిగ్‌బాస్’ షో, 11వ సీజన్ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత పది సీజన్లుగా బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన స్థానంలో షారూక్ కానీ, అక్షయ్ కానీ ఈ షోను మరింత అందంగా నడిపించగలరని అన్నాడు. ఈ నేపథ్యంలో షారుక్, సల్మాన్ వ్యాఖ్యలపై స్పందించాడు. -
స్విమ్మింగ్‌పూల్‌లో సుహానా.. వైరల్
ముంబై : త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్న సుహాన ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురైన సుహానా ఫొటో ఒకటి కొద్ది గంటలుగా వైరల్ అయింది. స్విమ్మింగ్‌పూల్‌లో నిలబడి చక్కటి పోజిచ్చిన ఫొటోకు ‘యు ఆర్ మై సన్‌షైన్.. మై ఓన్లీ సన్ షైన్’ వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోన్న సుహానా.. సినిమాల్లోకి రానుందని, ఆమె అరంగేట్రం సినిమా కోసం ప్రేమకథలు వింటున్నానని షారూఖ్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ల్యాక్మే ఫ్యాషన్ షో లోనూ పాల్గొన్న సుహానా ఫ్యాషన్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఒకవైపు కూతురి కోసం కథలు వింటూనే, ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు షారూఖ్. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో బాద్షాకు జోడీగా అనుష్క శర్మ నటిస్తున్నారు. -
తొక్కితే 500 స్పీడులో...
వెళ్లాలంతే! ఎక్కడికి? బాక్సాఫీస్ లెక్కల్లో మరింత ముందుకి! ధూమ్... ధూమ్... మంటూ సిల్వర్ స్క్రీన్ రోడ్డుపై పైపైకి! ధూమ్... హిందీలో సూపర్‌హిట్ ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో మూడు సిన్మాలొచ్చాయి. మూడూ హిట్టే. ‘ధూమ్’కి 100 కోట్ల వసూళ్లొస్తే, ‘ధూమ్–2’కి 150 కోట్లొచ్చాయి. ఇక, ఆమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘ధూమ్–3’ అయితే 550 కోట్లకు పైగా వసూలు చేసింది. అందువల్ల రీసెంట్గా కలెక్షన్ల రేసులో కాస్త వెనకబడిన షారూఖ్ ఖాన్ ‘ధూమ్–4’తో మళ్లీ రేసులోకి రావాలనుకుంటున్నారట! ఆల్రెడీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత, క్లోజ్ ఫ్రెండ్ ఆదిత్యా చోప్రా కూడా షారూఖ్ ‘ధూమ్–4’ చేస్తే బాగుంటుందని, హీరోతో డిస్కస్ చేశారని బీటౌన్ టాక్! ధూమ్ అంటేనే హైఎండ్ బైకులకు, రేసీ చేజింగ్ ఫైట్స్‌కి ఫేమస్. షారూఖ్ అవన్నీ చేస్తే ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు!! -
తెర పై తడాఖా దేఖో
రాబోయే ఆరు నెలల్లో బాలీవుడ్లో రిలీజ్ కానున్న సినిమాలపై ఏక్ నజర్ 2017 తొలి సగం బాలీవుడ్‌కు మంచి ఠస్సా ఇచ్చింది. బాహుబలి 2 హిందీ డబ్బింగ్ వెర్షన్ రికార్డ్ కలెక్షన్లు సాధించి దానికి దక్షిణాది సత్తా చూపించింది. 2017 జూన్ వరకు జరిగిన బాలీవుడ్ రిలీజుల్లో షారూక్ ఖాన్ ‘రయీస్’, సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ సినిమాలు ఉన్నా ‘బాహుబలి’ హిందీ డబ్బింగే తన వసూళ్లతో మొదటి వరుసలో నిలిచింది. ఈ సీజన్లో విజయం సాధించిన సినిమాల్లో హృతిక్ రోషన్ ‘కాబిల్’, అక్షయ్ కుమార్ ‘జాలీ ఎల్ఎల్బి–2’ ఉండగా చిన్న బడ్జెట్‌తో రిలీజయ్యి మంచి కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ మీడియం’ నిలిచింది. అయితే 2017 మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాల కంటే నేటి నుంచి రాబోయే రోజుల్లో విడుదల కానున్న సినిమాలే ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా ప్రేక్షకులను ఊరిస్తూ ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం. జబ్ హ్యారీ మెట్ సెజల్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తన మొదటి సినిమా ‘జబ్ వియ్ మెట్’తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాతో అదే మేజిక్‌ను ఇంతియాజ్ చేయాలనుకుంటున్నాడు. ‘రబ్ నే బనాదీ జోడీ’లో జంటగా నటించిన షారూక్, అనుష్క శర్మలు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెజల్ అనేది సినిమాలో అనుష్క పేరు. ఆ మాటకు ‘కెరటం’ అని అర్థం అట. ‘హ్యారీ’ అనేది హరిందర్ సింగ్‌కు హ్రస్వనామం. ఇది షారుక్ ఖాన్ పేరు. సినిమాలో షారుక్ టూరిస్ట్ గైడ్‌గా నటిస్తున్నాడు. యూరప్ చూడటానికి వచ్చిన హీరోయిన్ తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను పోగొట్టుకుంటుంది. దాని కోసం తన ట్రిప్‌ను కేన్సిల్ చేసుకుని వెతికే క్రమంలో షారుక్‌తో ఎలా ప్రేమలో పడిందనేది కథ. ఆగస్టు 4న విడుదల. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ‘స్వచ్ఛభారత్’ క్యాంపెయిన్ని స్వీకరించారు. సినిమా వాళ్లు ఈ క్యాంపెయిన్‌ను అందిపుచ్చుకుని తయారు చేసిన సినిమాయే ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ అనే కొత్తమ్మాయి హీరోయిన్గా నటించింది. ఒక పల్లెటూరికి కొత్త కోడలిగా వచ్చిన హీరోయిన్ తన అత్తగారింట్లో టాయిలెట్ లేదని, మల విసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని కాపురం నిరాకరిస్తుంది. భర్త మీద ప్రేమ ఉన్నా ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. భర్త ఇంట్లో టాయిలెట్ కట్టించాలనుకుంటే నువ్వొక్కడివే కట్టిస్తే మిగిలిన ఊళ్లో అందరూ కట్టించాల్సి వస్తుంది అని ఊరు ఎదురు తిరుగుతుంది. ఈ పంతాలు పౌరుషాలలో వారి మధ్య ఏం జరిగిందనేది కథ. ఆగస్టు 11 విడుదల. బరేలీ కి బర్ఫీ ‘దంగల్’ సినిమాకు దర్శకత్వం వహించిన నితిష్ తివారీ కథ అందించిగా అతని భార్య అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన సినిమా. ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన ఒక అమ్మాయి వెంట ఇద్దరు కుర్రవాళ్లు పడగా వారిలో ఎవరో ఆ అమ్మాయిని గెలుచుకున్నారనేది కథ. ఇది పైకి కనిపించే కథే అయినా ఉత్తర ప్రదేశ్ టౌన్ కల్చర్ చూపించడం అసలు ఉద్దేశ్యం. రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, క్రితి సనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 18 విడుదల. హసీనా పార్కర్ హసీనా పార్కర్: దావుద్ ఇబ్రహీం అందరికీ తెలుసు. కాని అతడి చెల్లెలు హసీనా ముంబైలో దాదాపు అంతే హవా చలాయించింది. ఆమె మీద తీసిన సినిమాయే ‘హసీనా పార్కర్’. ముంబై పేలుళ్ల వరకూ నేర ప్రపంచంతో సంబంధం లేని హసీనా ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావుద్ కావడంతో అతడి చెల్లెలైన కారణాన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముంబైలోని ముఠాల మధ్య కొట్లాటలు కూడా అనివార్యంగా ఆమెను లేడీ డాన్‌గా మారుస్తాయి. దావుద్ ‘భాయ్’ అయితే హసీనా ‘ఆపా’. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహించాడు. ఆగస్టు 18 విడుదల. పార్టిషన్ 1947 లార్డ్ మౌంట్ బాటెన్ చివరి వైస్రాయ్గా భారత విభజనలో కీలకపాత్ర పోషించాడనేది చరిత్ర. దీనిపై భారతీయులు, పాకిస్తానీయులు తమదైన దృష్టికోణం కలిగి ఉన్నా అసలు లార్డ్ మౌంట్ బాటన్ దృష్టికోణం నుంచి ఈ విభజనను ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ సినిమా చెబుతుంది. బ్రిటిష్–ఇండియన్ చిత్రంగా దర్శకురాలు గురిందర్ చద్దా దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా దేశ విభజన లోతు పాతులపై కొత్త వెలుతురు వేసే అవకాశం ఉంది. గాంధీ, జిన్నా, నెహ్రూ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి చారిత్రక పాత్రలతో నిండిన ఈ సినిమా దేశ చరిత్రపై కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా. ఇంగ్లిష్‌లో తీసిన ఈ సినిమా భారతీయుల కోసం హిందీలో డబ్ చేశారు. ఆగస్టు 18 విడుదల. బాబూమోషాయ్ బందూక్‌బాజ్ ఉత్తర ప్రదేశ్‌లో డబ్బులకు హత్యలకు చేసే ఒక షార్ప్ షూటర్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సినిమా ఇది. ఉత్తర ప్రదేశ్ యాసను, కొందరి మోటు జీవనాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయంటూ షూటింగ్ మధ్యలోనే నటి చిత్రాంగదా సింగ్ తప్పుకోవడం వివాదాస్పదం అయ్యింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు దాదాపు 38 కట్స్ చెప్పడంతో ఇందులో నటించిన హీరోయిన్ బిదిత ‘ఏం... భారతీయులు ముద్దు పెట్టుకోరా?’ అని మండి పడింది. ఆగస్టు 18 విడుదల. డాడీ ముంబై అండర్‌వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీని అందరూ ముద్దుగా ‘డాడీ’ అని పిలుస్తారు. అతడి జీవిత చరిత్ర ఆధారంగా నటుడు అర్జున్ రాంపాల్ నటించి, నిర్మించిన సినిమా ‘డాడీ’. శివసేన అధినేత బాల్ థాకరే ఆశీస్సులతో డాన్‌గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాలలో వచ్చి బాల్థాకరేతోనే విభేదించి సొంత పార్టీ పెట్టి ఎం.ఎల్.ఏ అయిన అరుణ్ గావ్లీ ఒక దశలో ముంబై పోలీసులను గడగడలాడించాడని చెప్పాలి. బట్టల మిల్లులో కూలివాడిగా పని చేసే స్థాయి నుంచి నేర సామ్రాజ్య అధిపతిగా ఎదిగే గావ్లీ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. సెప్టెంబర్ 8 విడుదల. ఇవి కాకుండా జైలు నేపధ్యంలో రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి ‘ఖైదీ బ్యాండ్’, రెండు ‘లక్నో సెంట్రల్’. రెంటిలోనూ ఖైదీలు మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యాంశం.కెరీర్లో కొంత వెనుక బడి ఉన్న సైఫ్ అలీ ఖాన్ సినిమాలు కూడా రెండు విడుదల అవుతున్నాయి. ‘కాలాకాండీ’, ‘షెఫ్’ ఆ సినిమాల పేర్లు. ‘క్వీన్’తో సంచలనం సృష్టించిన కంగనా మళ్లీ ‘సిమ్రన్’ పేరుతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్ ఖాన్ ముఖ్యపాత్ర పోషించిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ అక్టోబర్ 13న విడుదల కానుంది. పోఖ్రాన్ అణుపరీక్షల ఆధారంగా తీసిన చిత్రం ‘పరమాణు’ డిసెంబర్లో వస్తుండగా అదే నెలలో సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ కూడా విడుదల కానుంది. -
విమానంలో షారుఖ్,అనుష్కల డ్యాన్స్
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
క్యుపిడ్ ఫెలో.. నెట్టేస్తాడు లవ్‌లోకి జెన్నిఫర్ లోపెజ్ – ని తూ ని యో నిడివి : 4 ని .16 సె.; హిట్స్ : 88,25,675 సింగర్, యాక్ట్రెస్, డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, ఆథర్, ప్రొడ్యూజర్, టీవీ పర్సనాలిటీ... ఉఫ్.. ఇవన్నీ జెన్నీఫర్ లోపెజ్. ఇప్పుడు కొత్తగా ఈ నలభై ఏడేళ్ల అమెరికన్ ‘ని తూ ని యో’ అంటూ ఓ పురాణకాల కథాంశపు మ్యూజిక్ వీడియోను విడుదల చేసి, యూత్‌ని సమ్మోహన పరుస్తోంది. ఆమెతో పాటు క్యూబన్ పాప్ బ్యాండు ‘జెంటె డి జోనా’లోని హిప్ హాప్ గాయకులు అలెగ్జాండర్, ర్యాండీ మాల్కమ్ జెన్నీని ఉత్తేజపరుస్తూ కనిపిస్తారు. వీడియోలోని 1970ల నాటి దక్షిణ ఫ్లారిడా వస్త్రధారణలు ఈ కొత్త కాలానికి దక్కిన పాత మణులు, మాణిక్యాల్లా మీకు అనిపిస్తున్నాయంటే జెన్నిఫర్ లోపెజ్‌ను ఆసాంతం మీరు ఇష్టపడిపోతున్నారన్న మాటే. ‘..ఏమీ లేని దాని నుంచి పుట్టి, అన్నీ తనే అయిపోతుంది ప్రేమ. నేనిలా ప్రేమలో పడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. నీకేమో ప్రేమను అనుభూతి చెందాలన్న ఆలోచనే ఉండదు.. అని జెన్నీ బడబడా పాడేస్తుంది. ఆ పక్కన ఉన్నవాళ్లు కూడా ఆమెతో పాటు ఆడుతూ, పాడుతూ.. ప్రేమ జీవితాన్ని ఎలా వెలిగిస్తుందో, ప్రేమ లేని జీవితం ఎలా అంధకారం అయిపోతుందో చెబుతుంటారు. అక్కడితో ఆగుతారా! ఊహు. ‘మన తప్పేం లేదు.. అంతా ఆ క్యుపిడ్ ఫెలో చేస్తుంటాడు’ అని నిందను ఆకాశంలోకి ఎగరేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి బాస్. దీపికా.. పాట నచ్చిందా? సఫర్ – జబ్ హ్యారీ మెట్ సెజల్ నిడివి : 4 ని. 53 సె.; హిట్స్ : 47,86,191 షారుక్ ఖాన్, అనుష్కా శర్మ నటిస్తున్న ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రంలోని మూడో పాటగా ‘సఫర్’ రిలీజ్ అయింది. మొదటి పాట ‘రాధా’ ను సునిధీ చౌహాన్, షాహిద్ మాల్యా; రెండో పాట ‘బీచ్ బీచ్ మే’ ను అరిజిత్ సింగ్, షల్మాలి ఖోల్గేడ్, షెఫాలీ అల్వేర్ పాడారు. మూడో పాట ‘సఫర్’ని కూడా అరిజిత్ సింగే పాడినప్పటికీ సోనీ మ్యూజిక్ ఇండియా యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన సఫర్ వీడియోలో షారుక్ ఖాన్, ఇతర సాంగ్ టెక్నీషియన్లు కనిపిస్తారు. షారుక్‌ను పాడనిచ్చి, ఆఖర్లో.. ‘ఇక మీరు పక్కకు వెళ్లండి సర్.. అరిజిత్ వచ్చి పాడతారు అని టెక్నీషియన్లు చెప్పడం సరదాగా ఉంటుంది. అప్పుడు షారుక్.. ‘మరి నేనూ’ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ‘మీకు రోడ్డే’ అంటారు వాళ్లు. విషయం ఏంటంటే.. ఇది ట్రావెల్ సాంగ్. రెండో సాంగ్ ‘బీచ్ బీచ్ మే’ విడుదలైన ప్పుడు దీపికా పడుకోన్ ఆ పాట తనకెంతో నచ్చిందని ట్వీట్లో పెట్టడం చూసిన షారుక్... నెక్స్›్ట సాంగ్ ‘సఫర్’ కూడా మీకు నచ్చుతుంది అని రీట్వీట్ చేశారు. దాంతో సఫర్.. విడుదలకు ముందే పాపులర్ అయింది. రికార్డింగ్ రూమ్‌లో షారుక్‌ని సింగర్‌గా చూడదలచిన ఆయన అభిమానులకు కూడా సఫర్ నచ్చుతుంది. సినిమా ఆగస్టు 4న సినిమా రిలీజ్ అవుతోంది. ఎవడబ్బా వీడు! బాబూమోషాయ్ బందూక్‌బాజ్ : ట్రైలర్ నిడివి : 3 ని.; హిట్స్ : 47,00,323 బెంగాలీలో బాబూమోషాయ్ అంటే.. చంటబ్బాయ్ అని. ఈ మూవీలో నవాజ్ సిద్ధిక్కీ చంటబ్బాయ్ లాంటి వాడు. బట్.. జీవితం మలుపు తిరిగి చేతిలోకి గన్ వచ్చేస్తుంది. అంతే! బందూక్‌బాజ్ (కిల్లర్) అయిపోతాడు. మామూలు కిల్లర్ కాదు. నంబర్ వన్ కాంట్రాక్ట్ కిల్లర్! అప్పుడొస్తాడు ‘బంకే’ అనేవాడు.. నువ్వొక్కడివే పిస్తావి కాదు. నేనూ గన్ని గిర్రున తిప్పి పేల్చిపడేయగలను గురూ’ అని! ఇద్దరూ నువ్వా? నేనా అన్నట్లు ఉంటారు. ఓసారి ఓ ముగ్గురు వ్యక్తుల్ని చంపడానికి నవాజ్‌కి కాంట్రాక్ట్ వస్తుంది. అదే కాంట్రాక్ట్ ఆ ‘బంకే’ అనేవాడికీ వస్తుంది. ఇద్దరూ కలిసి ఓ చావు ఆట ఆడతారు. కాంట్రాక్టుకు దొరికిన ముగ్గురు మనుషుల్లో ఎక్కువ మందిని (ఇద్దర్ని గానీ, లేదా మొత్తం ముగ్గుర్ని గానీ) ఎవరు చంపితే వారే ఈ ఫీల్డులో నెంబర్ వన్ అనేది ఆ ఆట! అయితే ఈ మధ్యలో తనను చంపడం కోసం ఇంకో గేమ్ నడుస్తుంటుందని నవాజ్ కనిపెడతాడు. ఇక అక్కడి నుంచి నవాజ్ థ్రిల్లింగ్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతాడు. వీళ్లాడే గేమ్ డ్రా అవుతుంది. ముగ్గుర్ని ఇద్దరు చంపినప్పుడు గేమ్ ఎలా డ్రా అవుతుంది? ఎలా అవుతుందో ట్రైలర్ చూడండి. ట్రైలర్లో మిమ్మల్ని ఆకట్టుకునే ఇంకో గన్.. బిబిత బాగ్. గన్ అంటే గన్ కాదు. గన్‌లాంటి అమ్మాయి! మూవీ ఆగస్టు 25న రిలీజ్ అవుతోంది. పదిమైళ్లు ఈది ఒడ్డెక్కించారు నేవీ రెస్క్యూస్ ఏన్ ఎలిఫెంట్ ఎట్ సీ నిడివి : 1 ని. 38 సె.; హిట్స్ : 2,02,127 శ్రీలంక అడవిలోంచి షికారుగా బయటికి వచ్చిన గజరాజు, అలల ధాటికి ఆ దాపుల్లోనే ఉన్న హిందూ మహా సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆ సంగతి శ్రీలంక నౌకా దళానికి తెలిసి, రెస్క్యూ స్క్వాడ్‌తో రంగంలోకి దిగింది. అబ్బే.. వారి శక్తి సరిపోలేదు. వైల్డ్‌లైఫ్ అఫీసర్లను రప్పించారు. అందరి ధ్యేయం ఒక్కటే. ఆ గజరాజును సురక్షితంగా ఒడ్డుకు తెప్పించడం. గజరాజు కాసేపు మునిగిపోతోంది. కాసేపు తేలుతూ కనిపిస్తోంది. అంతలోనే స్థానభ్రంశం చెందుతోంది. నీటిపైకి కనిపిస్తూ, మాయం అవుతున్న ఏనుగు తొండం ఆనవాలు ఆధారంగా.. మొత్తానికి రక్షణ దళాలు గజరాజుకు తాళ్లు కట్టారు. మెల్లిగా ఒడ్డుకు లాక్కొచ్చారు. ఇందుకు దాదాపు 12 గంటలుపట్టింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని చిత్రీకరించిన శ్రీలంక ఆర్మీ... ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. వీడియో యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. అన్నట్లు నేవీ ఈ గజరాజును ఎంత దూరం నుంచి భద్రంగా తీరానికి లాక్కోచ్చిందో తెలుసా? సముద్రంలో పది మైళ్ల లోపలి నుంచి! -
షారూఖ్‌కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కి గిఫ్ట్ ఇవ్వటం అలవాటు. తన తోటి నటీనటులతో పాటు తనకు ఏ మాత్రం సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని మరి ఏదో ఒక బహుమతి ఇవ్వటం సల్లూభాయ్‌కి అలవాటు. అదే బాటలో ఈ సీనియర్ బ్యాచిలర్ తన తోటి హీరో షారూఖ్‌కు ఓ కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఇటీవల విడుదలైన సల్మాన్ సినిమా ట్యూబ్ లైట్లో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించాడు. చిన్న పాత్రే కావటంతో షారూఖ్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడట. ఆ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన సల్మాన్ మాత్రం షారూఖ్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. షారూఖ్ సెట్స్‌లో ఉండగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరి తన గిఫ్ట్ అందించాడు సల్మాన్. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న షారూఖ్ సినిమాలో సల్మాన్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. మరి సల్మాన్ కోసం షారూఖ్ ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేస్తాడో చూడాలి. -
లిప్ లాక్ చేస్తే ఊరుకోను!
‘దేశానికి రాజైనా తల్లితండ్రులకు కొడుకే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లలకు మాత్రం తండ్రే. తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్ క్రమశిక్షణ విషయంలో షారుక్ చాలా కఠినంగా ఉంటారు. సుహానా బాయ్‌ఫ్రెండ్‌తో, ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. పిల్లల ఫ్రెండ్షిప్, ప్రేమ వ్యవహారాలపై బాద్షా బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కూడా ఓ ఇంటర్వూ్యలో పిల్లల క్రమశిక్షణపై స్పందించి, కూతురు, కొడుక్కి హెచ్చరికలు జారీ చేశారీ కింగ్ ఖాన్. ‘‘సుహానే పెదవులను తన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలు కోసేస్తా. ఆర్యన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇచ్చినా, లేక గర్ల్‌ఫ్రెండే ఆర్యన్‌కు లిప్ కిస్ ఇచ్చినా వాడి పెదాలు(ఆర్యన్) కోసేస్తా’’ అని బహిరంగంగా తన పిల్లలకు వార్నింగ్ ఇచ్చారు. ‘లిప్ కిస్’ పై షారుక్ ఎందుకంత సీరియస్ అయ్యారని కొందరు విమర్శించినా, పిల్లల మంచీ.. చెడూ ఆలోచించే బాధ్యత గల తండ్రిగా ఆయన కరెక్ట్‌గానే చెప్పారని మెజారిటీ వర్గం షారుక్‌ని అభినందిస్తోంది. -
షారూఖ్ అరెస్ట్ తప్పదా..?
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన తన మూవీ రాయిస్ ప్రమోషన్ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇబ్బందుల్లో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయిస్ ప్రమోషన్ కోసం షారూఖ్ రైల్లో ప్రయాణించారు. ప్రతీ స్టేషన్ లోనూ అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ సాగారు. అయితే వడోదరా స్టేషన్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో షారూఖ్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ ఏడాది జనవరి 23న రాయిస్ మూవీ ప్రమోషన్లో భాగంగా షారూఖ్ వడోదరా స్టేషన్‌కు చేరుకున్నారు. షారూఖ్ వస్తున్నాడన్న విషయం ముందే తెలియటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు టీషార్ట్స్, బాల్స్‌ను వాళ్లు మీదకు విసిరాడు షారూఖ్. దీంతో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షారూఖ్ ఖాన్, రాయిస్ బృంద నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టుకు తెలిపారు. షారూఖ్‌తో పాటు రాయిస్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్పై ఐపీసీ సెక్షన్ 304 ఏ 2 (నిర్లక్షంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణం కావటం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు కారణంగా షారూఖ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
‘ఫోర్బ్స్’లో షారుక్, సల్మాన్, అక్షయ్
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్–100 సెలబ్రిటీల జాబితాలో భారత స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ప్రముఖ అమెరికన్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఈ ముగ్గురు ‘టాప్–100’లో స్థానం సంపాదించారు. 2016 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 వరకు ఉన్న లెక్కల ప్రకారం జాబితా విడుదల చేశారు. షారుక్ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్ రూ.238 కోట్ల తో 71వ స్థానంలో, అక్షయ్ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచారు. అమెరికన్ గాయకుడు సీన్ కూమ్బస్ రూ.837 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. అమెరికన్ సింగర్ బియోన్స్ రూ.676 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2016 జూన్ 1 – 2017 జూన్ 1 మధ్య కాలంలో టాప్–100 సెలబ్రిటీలు 5.15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33వేల కోట్లు)ను సంపాదించారని ఫోర్బ్స్ పేర్కొంది. జాబితాలో 10 మంది నటులున్నారని, అయితే ఒక్క నటికీ లిస్టులో స్థానం దక్కలేదని వెల్లడించింది. టాప్–100 జాబితాలో 16 శాతం మందే మహిళలున్నారని పేర్కొంది. -
దేవదాసు... త్రీడీలో బాసు!
మీరు చదివింది నిజమే! దేవదాసు త్రీడీలో తెరపైకి రానున్నాడు. కొత్తగా ఎవరూ త్రీడీలో సిన్మా తీయడం లేదు. పాత సినిమాను త్రీడీలో రీ–రిలీజ్ చేయనున్నారు. షారూఖ్ ఖాన్ హీరోగా చేసిన హిందీ ‘దేవదాస్’ను త్రీడీలో విడుదల చేయనున్నట్టు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. యాక్చువల్లీ... ఏదైనా సినిమాను త్రీడీ ఫార్మట్‌లో రిలీజ్ చేయాలంటే షూటింగ్ అప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కెమెరా యాంగిల్స్, డైమెన్షన్స్ అంటూ చాలా లెక్కలున్నాయి. దర్శకుడు భన్సాలీకి కూడా సేమ్ డౌట్ వచ్చిందట! అయితే... సిన్మాలో ప్రతి ఫ్రేమ్ త్రీడీలో కన్వర్ట్ చేయడానికి కరెక్ట్‌గా ఉందని కన్విన్స్ అయిన తర్వాత ఈ నిర్ణయానికి (త్రీడీ రిలీజ్) వచ్చారట. ఈ జూలై 12కు ‘దేవదాస్’ విడుదలై 15 ఏళ్లు అవుతోంది. మళ్లీ అదే తేదీకి త్రీడీ వెర్షన్‌ను విడుదల చేసే ఛాన్సుంది!! సాధారణంగా ఫాంటసీ ఫిల్మ్స్, గ్రాఫికల్ వండర్స్ త్రీడీలో ఎక్కువ విడుదలవుతుంటాయి. బహుశా... త్రీడీలో వస్తోన్న ఫస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ దేవదాసే కావొచ్చు. -
సారీ.. డేట్స్ లేవు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన సినిమా అంటే ఎవరైనా కాదంటారా? ఎగిరి గంతేస్తారు కదా. కానీ, ఆలియా భట్ మాత్రం ‘ఊహూ.. కుదరదు’ అని చెప్పేశారట. ‘అమ్మ ఆలియా.. నీకు అంతుందా?’ అని బాలీవుడ్బుగ్గలు నొక్కుకుంటోంది. ఇంతకీ షారుక్‌తో సినిమాని ఈ బ్యూటీ ఎందుకు కాదన్నారు? కారణం ఉందట. పాపం డేట్స్ లేవట. అందుకే వినయంగా ‘సారీ... డేట్స్ లేవు’ అన్నారట. అయినా కొందరు నమ్మడం లేదు. సీనియర్ హీరో సరసన నటిస్తే.. సీనియర్ హీరోయిన్ అనే ముద్రపడిపోతుందని ఆలియా భయపడిందని, అందుకే డేట్స్ లేవని చెప్పి, ఎస్కేప్ అయిందని చెప్పుకుంటున్నారు. నిజమేంటో ఆలియాకే ఎరుక! కాగా, ఆలియా నో చెప్పడంతో అనుష్కా శర్మను ఓకే చేశారని బాలీవుడ్ టాక్. -
హాలీవుడ్ ఎటాక్
చోటు: షారుక్ ఖాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు మోటు: కాదురా.. టెన్షన్‌తో కొట్టుకుంటున్నాడు. చోటు: వాట్స్ హిజ్ ప్రాబ్లమ్? మోటు: హాలీవుడ్ బాలీవుడ్‌ని ఎటాక్ చేస్తుందట. చోటు: సినిమా కథలు చెప్పకు.. ఇంకా బలిసి బ్లాస్ట్ అవుతావు. చోటు: పుల్లలాగా ఉన్నావు. ఒక్కటి పీకానంటే టూ పీస్ అవుతావు. చోటు: ట్రాక్ మార్చకుండా షారుక్ ప్రాబ్లమ్ ఎంటో చెప్పు. మోటు: మనోళ్లకు స్క్రీన్‌ప్లే రైటింగ్ రాదట! చోటు : వాట్? మోటు: మార్కెటింగ్ రాదట, టెక్నాలజీలో వీక్ అట, డిజిటల్ వేల్యూస్‌లో జీరో అట. చోటు : హవ్వ.. హవ్వ... మోటు: అమెరికన్ హీరో బ్రాడ్ పిట్ తన డిజిటల్ సినిమా ‘వార్ మెషీన్’ ప్రమోషన్‌కి వచ్చి కొట్టిన కొట్టుడుకి బెంబేలెత్తిపోయి హాలీవుడ్ ఎటాక్ స్టార్టయ్యింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. బాలీవుడ్‌ని క్యాప్చర్ చేసేస్తారు అని షారుక్ భోరునlఏడుస్తున్నాడు. చోటు: ఒకసారి ‘బాహుబలి’ చూడమను... బాలీవుడ్‌ని కాపాడేది టాలీవుడ్ అని తెలుస్తుంది. -
నటి క్షమాపణలు.. షారుక్ ఇంప్రెస్!
బాలీవుడ్: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీలో అవకాశం వస్తుందంటే హీరోయిన్లు ఎగ్జైట్ అవుతారు. అయితే ఇటీవల షారుఖ్, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్లో ఓ మూవీ తీయడానికి సిద్ధమయయ్యాడు. ఆయనకు జోడీగా ఎవరిని ఎంచుకుంటారన్న దానిపై కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయి. షారుక్‌కు ఎంతగానో అచ్చొచ్చే నటి దీపికా పదుకొనేకు తొలుత ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది, ఆపై కత్రినాను సంప్రదించారని వదంతులు ప్రచారం అయ్యాయి. చివరికి ఆలియా భట్‌ను ఈ మూవీ కోసం సంప్రదించారట. అయితే ఆమె మాత్రం ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకొలేదట. ఈ విషయంపై షారుక్ కాస్త సీరియస్ అయ్యారన్న వార్త ఆలియా చెవిన పడింది. అంతటి స్టార్ హీరో తనపై అభిప్రాయం మార్చుకునే ఛాన్స్ ఉందని భావించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ సలహా మేరకు నేరుగా షారుక్ ఇంటికి వెళ్లింది. డియర్ జిందగీ మూవీలో జతకట్టిన నటి రెండోమూవీకి నో చెప్పడానికి కారణాలు వివరించింది. రణ్‌వీర్‌సింగ్‌తో 'గల్లీ బాయ్', రణ్‌బీర్ కపూర్‌తో 'డ్రాగన్' మూవీలకు తాను ఇచ్చిన కాల్షీట్లను నేరుగా షారుక్ చేతిలో పెట్టింది. ఈ బిజీ షెడ్యూల్ ఉన్నా తనకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలని.. మూవీకి నో చెప్పినందుకు తనను క్షమించాలని కోరింది. దీంతో షారుక్ కోపం పోయి ఆలియా నిజాయితీకి, ఆమె వివరణ ఇచ్చుకున్న తీరుకు బాద్షా ఇంప్రెస్ అయ్యారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం..
కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ కోల్‌కతా: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తమ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలుస్తుందని, ట్రోఫీతో ఈడెన్ గార్డెన్‌కి తిరిగొస్తామని జట్టు యజమాని షారూక్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్ షెడ్యూల్ వల్ల తాజా సీజన్ మ్యాచ్‌లకు హాజరుకాలేకపోయిన షారూక్, శనివారం కోల్‌కతా–ముంబై జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ను మాత్రం తిలకించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ‘ప్రతి మ్యాచ్‌లోనూ మాకు అభిమానుల మద్దతు లభిస్తోంది. మా శక్తిమేర కృషి చేసి ట్రోఫీ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తాం. కొన్ని మ్యాచుల్లో గెలుపు వరకూ వెళ్లి ఓడిపోయాం. రాబోయే మూడు కీలక మ్యాచుల్ని (ఎలిమినేటర్, ప్లే ఆఫ్, ఫైనల్) గెలిచి విజేతలుగా నిలుస్తాం. కోల్‌కతాలో ముంబైతో జరిగిన మ్యాచే చివరిది. ఈ సీజన్లో మళ్లీ ఇక్కడ ఆడే అవకాశం లేదు. కానీ మేం ట్రోఫీతో ఈడెన్ గార్డెన్‌కు తిరిగొస్తాం. జట్టు గెలుపు, ఓటముల్లో కోల్‌కతా అభిమానులు మాకెప్పుడూ అండగానే ఉన్నారు.’ అని షారూక్ అన్నాడు. -
ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!
షారుక్ ట్వీట్‌కు సచిన్ స్పందన న్యూఢిల్లీ: ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్ ఖాన్ బాలీవుడ్‌కు బాద్షా అయితే... సంచలన బ్యాటింగ్‌తో సచిన్ క్రికెట్లో పరుగుల మెషీన్ అయ్యాడు. ఈ హేమాహేమీలు అప్పట్లో పెప్సీ యాడ్‌లో కలిసి నటించడం... ఇద్దరి స్టార్ల అభిమానుల్ని అదేస్థాయిలో అలరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కొత్తగా ట్వీట్లతోనూ ఒకరికొకరు తమ హృదయ స్పందనను తెలియజేసుకున్నారు. దీనికి ట్విట్టర్ వేదికైంది. ఈ సెలబ్రిటీల ట్వీట్లు ఇరు వర్గాల అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఉన్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’. చ్చే నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో షారుక్... మాస్టర్ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నేను బలంగా నమ్ముతున్నా... నీవు బాగా ఆడినపుడు నా సినిమా బాగా ఆడింది. అదే నీవు విఫలమైనపుడు నా సినిమా ఫెయిలైంది. నీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడ్ని. నీ బయోపిక్చర్కు ఆల్ ద బెస్ట్ సచిన్’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్ ‘జీవితంలో ఓటమే లేకుంటే గెలుపనేదే ఉండదు... నేర్చుకునేదీ ఉండదు. శతకోటి అభిమానుల్లాగే నీ మాటలు నా మనసును తాకాయ్..! లవ్ యూ షారుక్’ అని పోస్ట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ అభినేత్రి మాధురి దీక్షిత్, శ్రేయా ఘోషల్‌లు కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
‘ది రింగ్’ మూవీ స్టిల్స్
-
బయటపడండి!
ఈ రోజు వరల్డ్ హెల్త్ డే. రెండు రోజుల క్రితం... సిరియాలో ‘కెమికల్ ఎటాక్’ వల్ల చనిపోయిన పిల్లల బొమ్మలు చూసి, మనందరం కుంగిపోయాం. ఇంకొన్ని నెలల క్రితం సిరియా నుంచి శరణార్థులుగా వెళ్లిపోతున్న వారిలోంచి సముద్రంలో మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చిన్న పిల్లాడిని చూసి హతాశులమయ్యాం. ఇలాంటి సన్నివేశాలు మనల్ని కుంగదీస్తాయి. ఆ క్షణం లేదా ఆ రోజు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అన్నం సహించదు... వికారంగా అనిపిస్తుంది. అసలు జీవించి ఉండాలా అన్న ప్రశ్న వెంటాడుతుంది.ఇవన్నీ బాహ్య ప్రపంచం మనపై చూపించే ప్రభావాలు. ఈ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచం మనకు తెలుసు. అది ‘మన’లోని ప్రపంచం. అక్కడా బీభత్సాలు జరుగుతాయి.అక్కడా దాడులు జరుగుతాయి. అక్కడా మనోభావాలు దెబ్బతింటాయి. అక్కడా మనోస్థైర్యంపై బాంబులు పేలుతాయి. ఈ యుద్ధం మనలో రేగేదే. దాన్ని చల్లార్చే శక్తి... మనలో పుట్టాల్సిందే. సమాజంలో అదృష్టవంతుల్లా కనపడే సెలిబ్రిటీల జీవితాల్లోనూ ఈ కుంగుబాటు తప్పలేదు. మామూలు మనుషుల జీవితాల్లో కూడా... కొన్ని పేజీలు డిప్రెషన్ బారిన పడుతుంటాయి. బయటపడిన వారి పోరాట పటిమ నాలుగు పుటలు చదివితే డిప్రెషన్ నుంచి బయటపడే ధైర్యం తెచ్చుకోవచ్చు. వరల్డ్ హెల్త్ డే... ఈ ఏడాది ఉద్దేశం... ‘డిప్రెషన్ గురించి మాట్లాడండి’. డిప్రెషన్ గురించి సిగ్గుపడే బదులు, భయపడే బదులు... మౌనాన్ని వీడండి... పెదవి విప్పండి! కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులతో మాట్లాడండి. మనసులో మాట బయటపెట్టండి... అలజడిని పారదోలండి! డిప్రెషన్ నుంచి బయటపడండి!! నాకు నేనే సమాధానం! నాకు 2010లో భుజానికి గాయం అయింది. సాధారణంగా నేను కొంత ఆశావాదినే. కానీ భుజం కదలించ లేని స్థితిలో దానికి సర్జరీ అవసరమైంది. సర్జరీ తర్వాత ఎంతో డిప్రెషన్లోకి జారిపోయా. ఎంతగానో నిరాశ, నిస్పృహలలో మునిగిపోయా. ఎప్పటికైనా బయటికి వస్తానా అనే తీవ్ర నైరాశ్యం. కానీ ఎప్పటికప్పుడు నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా. ఇప్పటి స్థితి కంటే రేపు మరెంతో బాగుంటుందని ధైర్యం చెప్పుకున్నా. అవేవీ వ్యర్థం కాలేదు. నా నిరాశ, నిస్పృహ అంతా గతం. ఇప్పుడు నాలో కొత్త శక్తులు నిండాయి. కొత్త సామర్థ్యం పుంజుకుంది. సంతోషంగా ఉన్నా, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నా. దృష్టిని పూర్తిగా కెరియర్ మీదనే నిలిపా. ఆ తర్వాత కూడా ఎంతగా సక్సెస్ అయ్యానో, ఎన్నెన్ని విజయాలు సాధించానో అందరికీ తెలిసిన విషయమే’’ - షారూక్ ఖాన్ చేదును వదిలించుకున్నా! ‘‘నిజానికి ఆ ఏడాది నేను అత్యంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. ఎన్నో అవార్డులు సాధించిన సంవత్సరం అది. కానీ ఎందుకో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. ఒక రోజు పొద్దున్నే లేచి ఎంతో ఏడ్చాను. అలా ఏడుస్తూనే ఉన్నాను. కానీ అలా కుంగిపోతున్నందుకు కారణం ఏదీ కనిపించలేదు. తీవ్రమైన డిప్రెషన్ వల్ల అలా జరిగింది. ‘‘అంతా ఒత్తిడి. పని మీద దృష్టి నిలవడం లేదు. ఒక్కసారిగా కుంగిపోయాను. అయితే నా చుట్టూ ఉన్నవారు నా గురించి ఆలోచించారు. చేయూతనిచ్చారు. కానీ నన్నంటుకున్న ఆ చేదు నన్ను వదలడం లేదనిపించింది. నేను లోతుగా శ్వాస తీసుకోలేకపోతున్నాని అనిపించింది. విషాదాన్ని ఒక్కపెట్టున వదిలించుకున్నాను. జీవితాన్ని మళ్లీ కౌగిలించుకున్నాను. డిప్రెషన్ నుంచి బయటపడడానికి డాక్టర్‌ను కలిసి మందులు వాడాను. దాంతో నేను త్వరగానే బయటపడ్డాను.నాకు డిప్రెషన్ నుంచి బయట పడగలిగాననే సత్యం తెలిసి, ఒక్కరైనా ప్రభావితమైతే చాలు. తమకు తాముగా ఒక్కరు డిప్రెషన్ నుంచి బయటపడినా... నేను బయటకు చెప్పుకున్నందుకు ఫలితం దక్కినట్టే.’’ - దీపికా పదుకొనే వచ్చేదంతా ఫన్‌టైమ్! ‘‘ఎందుకలా అయ్యిందో తెలియదు. కానీ వివాహం విషయంలో అందరమ్మాయిలలాగే నేనూ ఆలోచించాను. కానీ ఎంతో దగ్గర అనుకుంటున్న నా మాజీ మిత్రుడు కలలో కూడా ఊహించనంతగా దూరమయ్యాడు. ఆ మిత్రుడే కాదు... ఎందరో స్నేహితులు దూరమయ్యారు. ఇలాంటి వారా నాకు జీవితాంతం అండగా ఉంటానంటూ... ఆ తర్వాత క్షణం కూడా దగ్గర లేకుండా పోయారు. ఎంతటి ఆశాభంగం! మిత్రుత్వం కూడా క్షణభంగురమేనా? కానీ... జీవితంలో కొత్త ఆశలు ఉండాలి కదా. కొత్త మిత్రులూ వస్తారు కదా. కాబట్టి ఏదో పిచ్చిగా ప్రవర్తించే బదులు జీవితాన్ని మరోమారు మళ్లీ ప్రారంభిస్తా. వచ్చేదంతా ‘ఫన్ టైమ్’ అనుకుంటూ తిరిగి ఆరంభిస్తా. ఇలాంటి విల్ పవర్ ఉంటే ఎవరైనా, ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలరు. ఎలాంటి అవరోధాలనైనా ఈజీగా అధిగమించగలరు. ఒకసారి వ్యాధి బారినుంచి బయటపడ్డ తర్వాత నాకు తెలిసి వచ్చిన సత్యమిది’’. - మనీషా కొయిరాలా తలనొప్పి వంటిదే! ‘‘తమకూ, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నన్ను ఉండమంటారు. కానీ వాస్తవ సత్యాలతో ఎవరికీ అవసరం లేదు. దీని గురించి నాకు ఎప్పుడూ నిమిత్తం లేదు. ఒకరేమనుకుంటారో అనే బెంగ లేదు. అయినా ఎందుకో గానీ ఒక సమయంలో నాకెంతో ఉద్విగ్నత. ఎంతో ఉద్వేగం. నాకెందుకింత యాంగై్జటీ. ఉద్వేగాన్ని వేగంగా వదిలించుకోవాలి. డాక్టర్లు నాకు మందులిస్తున్నారు. నా కుటుంబంలోనూ ఇలా యాంగై్జటీకి గురై చికిత్స తీసుకున్నవారు ఉన్నారు. ప్రపంచంలోనూ ఉంటారు. అవును... డిప్రెషన్లోకి వెళ్తే ఏమిటి? కడుపునొప్పి, తలనొప్పి లాగే ఇదీ ఒక సమస్య. చాలా సాధారణమైన బయలాజికల్ సమస్య. లాజికల్‌గా బయటపడవచ్చు. అందుకే దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుంటా. ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తా. నేను డిప్రెషన్లోకి వెళ్లి... బయటపడి తిరిగివచ్చానని అందరితో మాట్లాడుతా. డిప్రెషన్ మీద అవగాహన పెంచుతా. నాలాగే బయటపడవచ్చని అందరికీ చెబుతా. అందుకే డిప్రెషన్‌ని అందరూ కడుపునొప్పి, తలనొప్పి అంత తేలిగ్గా తీసుకోవాలన్నది నా కోరిక’’ - అనుష్క శర్మ ధైర్యమే గెలిచింది! డిప్రెషన్‌కు లోనయ్యి... విజయవంతంగా బయటపడిన వాళ్లలో అత్యంత ముఖ్యులు... ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్. 1996లో తన ‘ఏబీసీఎల్’ కంపెనీ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు...అది లెక్కలు చెప్పలేనంతగా దివాలా తీసినప్పుడు... ఆయన డిప్రెషన్లో కూరుకుపోయారు. ధైర్యం తెచ్చుకుని బయటపడి...ఇప్పుడు తన బాటలో ఎందరినో నడిపిస్తున్నారు. - అమితాబ్ బచ్చన్ లొంగడం ఎందుకు? సంజయ్‌దత్ 2013లో తాను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లినట్లు చెబుతారు. కానీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న తాను తాత్కాలికమైన కొన్ని సమస్యలకు ఎందుకు లొంగిపోవాలంటూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడని కూడా అంటారు. - సంజయ్ దత్ ఆనందతీరం! ‘‘బదలాపూర్... సినిమాలో నటిస్తున్నప్పుడు నేను జీవితంలోని విషాదం అనే తీరానికి చేరిపోయాను. ఎవరెన్ని మందులు ఇచ్చినా పని చేయడం లేదు. దాంతో ఇంకెప్పటికీ ఆ తీరం ఒడ్డునే ఉండిపోతాననుకున్నాను. ఇంకెప్పటికీ ఇవతలి ఆనందతీరానికి చేరననుకున్నాను. కానీ అప్పుడు ఆ డాక్టర్ ఢిల్లీ నుంచి వచ్చారు. అప్పటికి ఆయన నాలుగో డాక్టర్. ఇక నేనెప్పటికీ విషాదాలలోనే ఉండిపోతాననుకున్నప్పుడు, ఏడాదిగా చికిత్స జరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని అనుకున్నప్పుడు, ఆ నిరాశలోనే కుంగిపోయినప్పుడు నాలుగో డాక్టర్ నన్ను విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు.’’ అని చెప్పుకున్నాడు వరుణ్ ధావన్. ‘తాము డిప్రెషన్లో ముగినిపోయాం’ అని తెలుసుకున్న తర్వాత కుంగుబాటు సాగరంలో మునిగిపోకుండా... ఎంతోమంది ఆ సాగరాన్ని ఈది బయటకు వచ్చారు. జీవితంలో తిరిగి ఉన్నత స్థానాలను అధిరోహించారు. - వరుణ్ ధావన్ పైన చెప్పుకున్న వాళ్లు మాత్రమే కాదు... కెరియర్ అనుకోని విధంగా మలుపులు తిరిగి... తన నుంచి సూపర్‌స్టార్ కిరీటం దూరమైందని కుంగిపోయారు రాజేశ్‌ఖన్నా. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, విజయాలకు దోహదపడిన పర్వీన్ బాబి... డిప్రెషన్ బారిన పడి, దాని నుంచి బయటపడలేకపోవడంతో జీవితంలో ఓడిపోయారు. అయితే స్ఫూర్తి పొందాల్సి వస్తే... దీపికా, షారూఖ్, వరుణ్ ధావన్ లాంటి వారూ ఉన్నారు. వారిని స్ఫురణకు తెచ్చుకోవడం, వారు మాట్లాడిన మాటలు మళ్లీ తలుచుకోవడం, వాటి నుంచి ప్రేరణ పొందడమే మనం చేయాల్సిన పని. అపోహలు వాస్తవాలు డిప్రెషన్ మందులతో తగ్గదనే అభిప్రాయం కొందరిలో ఉంది. కానీ ఇది మందులు, సైకోథెరపీ ద్వారా పూర్తిగా తగ్గుతుంది. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. డిప్రెషన్ లాగే ఈ షాక్ ట్రీట్మెంట్పై కూడా చాలా అపోహలు ఉన్నాయి. అయితే షాక్ ట్రీట్మెంట్గా పేర్కొనే ఈ చికిత్సలో తీవ్రమైన షాక్ కొడుతుందనేది అపోహ. చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ కరెంటు అస్సలు షాక్ కొట్టదు. -
షారూక్, జుహీ చావ్లాలకు నోటీసులు
ముంబై: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీకి సంబంధించి బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరి, నటి జుహీ చావ్లాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం షోకాజ్ నోటీసులిచ్చింది. ఫెమా చట్టం నిబంధనలు ఉల్లంఘించి రూ.73.6 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేందుకు వారు కారణమయ్యారంటూ నోటీసులు పంపింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలంది. ఈ కేసు 2008–09 కాలానికి చెందినది. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాతృసంస్థ అయిన కేఆర్‌ఎస్‌పీఎల్‌కు చెందిన 90 లక్షల షేర్లను మారిషస్‌కు చెందిన మరో సంస్థకు వీరు షేరు రూ.10కే ఇచ్చారు. కానీ అప్పటికి కేఆర్ఎస్పీఎల్ ఒక్కో షేర్ విలువ రూ.86 నుంచి రూ.99 మధ్య ఉంది. -
21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం షారూఖ్, సల్మాన్‌లు తెగ పోటిపడుతున్నారు. ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు గతంలో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు. చివరగా 1995లో రిలీజ్ అయిన కరణ్ అర్జున్ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఈ సూపర్ స్టార్స్. ఆ తరువాత వివాదాలతో దూరమైన ఈ ఇద్దరు, ఈ మధ్య అన్ని మర్చిపోయి ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ టాప్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపించింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూసల్మాన్, షారూఖ్‌లు కలిసి నటించేందుకు అంగీకరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అయితే అది కూడా సినిమాను మలుపు తిప్పే కీలక పాత్ర కావటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమానే అనిపిస్తుందంటున్నారు మేకర్స్. -
కింగ్‌ఖాన్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
‘స్వదేశ్’ మహిళకు చేదు అనుభవం
న్యూయార్క్: షారూక్ ఖాన్ ’స్వదేశ్’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగు తేజం అరవింద పిల్లలమర్రికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. గతేడాది డిసెంబర్ 21 ఉదయం మేరీల్యాండ్‌లోని బెల్ ఎయిర్‌లో నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నావా? అంటూ ప్రశ్నించారు. వరుసగా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదని, నేర విచారణ జరుగుతోందని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అరవింద గట్టిగా నిలదీయడంతో వెనక్కి తగ్గిన పోలీసులు తమ వద్ద ఉన్న కంప్యూటర్లో వివరాలు తెలుసుకుని ఆమెను విడిచిపెట్టారు. అరవింద భారత్‌లోనే జన్మించినా... తల్లిదండ్రులతో కలసి అమెరికాలో స్థిర నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. -
షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. ‘టి. సుబ్బరామిరెడ్డి (టి.ఎస్.ఆర్) ఫౌండేషన్’ ద్వారా ప్రముఖ సినీ నిర్మాత – రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి గత మూడేళ్లుగా ప్రతి ఏటా ఒకరికి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును ఇచ్చేందుకు సుబ్బరామిరెడ్డి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మినీ కొల్హాపురి, బోనీ కపూర్ నిర్ణయించారు. లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖలకు గతంలో ఈ అవార్డును ఇచ్చారు. రానున్న ఫిబ్రవరి 25న ముంబయ్‌లో అమితాబ్, ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, శ్రీదేవి తదితరులు పాల్గొనగా, భారీయెత్తున జరిగే ఒక కార్యక్రమంలో షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును అందించనున్నారు. -
షారుక్ ఖాన్‌కు యశ్ చోప్రా అవార్డు
హైదరాబాద్: బాలీవుడ్ దర్శక నిర్మాత యశ్ చోప్రా జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందజేసే యశ్ చోప్రా జాతీయ స్మారక అవార్డును ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో షారుక్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారు. టీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. టీఎస్ఆర్, యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీ కపూర్లతో కూడా జ్యూరీ ఈ అవార్డుకు షారుక్‌ను ఎంపిక చేసింది. 2012లో యశ్ చోప్రా కన్నుమూశారు. యశ్ చోప్రా జ్ఞాపకార్థం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆయన పేరుమీద ఈ అవార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ అవార్డును ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రేఖలకు అందజేశారు. -
మనసు మాట వినండి
► లేదంటే నా వయసుకు వచ్చాక బాధపడతారు: షారుఖ్ ► ‘మనూ’స్నాతకోత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ► విద్యార్థి దశలో ఎంతో ఉత్సాహం.. ఎన్నో ఆకాంక్షలు.. ► తల నిండా వెంట్రుకలుంటాయి.. ► కాలం గడిచే కొద్దీ అవి తగ్గిపోతాయి ► లోకంలో విద్యకు మించిందేమీ లేదు ► షారూఖ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం ► అనారోగ్యంతో హాజరు కాలేకపోయిన రాష్ట్రపతి ప్రణబ్ సాక్షి, హైదరాబాద్: ‘‘విద్యార్థి దశలో అంతులేని ఉత్సాహం... భవిష్యత్తుపై ఎన్నో ఆకాంక్షలు.. తల నిండా వెంట్రుకలు ఉంటాయి.. కాలం గడిచే కొద్దీ ఇవన్ని తగ్గిపోతాయి. జీవితంలో ఏం సాధించాలన్నా విద్యార్థి దశ కీలకం. మనసు ఏం చెబితే అదే చేయాలి. మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలి.. లేదంటే మీరు(విద్యార్థులు) నా వయసు, తల్లిదండ్రులు, గురువుల వయసుకు చేరిన తర్వాత మనసు చెప్పినట్లు ఎందుకు చేయలేదన్న బాధ కలుగుతుంది..’’అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ యువతకు సూచించారు. లోకంలో విద్యకు మించిందేమి లేదని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఉర్దూ భాషకు చేసిన సేవకు గుర్తింపుగా షారుక్‌ఖాన్, రేఖ్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరఫ్లకు వర్సిటీ యాజమాన్యం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ... తన తల్లి పుట్టినిళ్లయిన హైదరాబాద్‌లో ఈ పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ‘‘ఈ గౌరవం అందుకునే అర్హత నాకు ఉందో నాకు లేదో తెలియదు.. మీరు ఇచ్చారు కాబట్టి సంతోషంగా స్వీకరిస్తున్నా..’అంటూ చమత్కరించారు. తల్లిదండ్రులు ఈ రోజు బతికి ఉంటే చాలా ఆనందించేవారన్నారు. ఉన్నత విద్యావంతుడైన తన తండ్రికి చదువు పట్ల ఎంతో మమకారం ఉండేదని, చాలా అందమైన ఉర్దూ మాట్లాడేవారని పేర్కొన్నారు. తనకు లభించిన కొద్దో గొప్పో మాట్లాడే జ్ఞానం తండ్రి నుంచే అబ్బిందన్నారు. విద్య, ఉర్దూ భాష పట్ల ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. స్నాతకోత్సవంలో 276 మంది వర్సిటీ విద్యార్థులకు పీహెచ్డీ, ఎంఫిల్, 2,885 మంది విద్యార్థులకు గ్యాడ్యుయేషన్ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేష్వాలా, వీసీ డాక్టర్ ముహమ్మద్ అస్లాం పర్వేజ్, వర్శిటీ పాలకవర్గం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయారు. విద్యార్థులను ఉద్దేశించి షారుక్ ఖాన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. చెస్.. టైప్‌రైటర్.. పాత కెమెరా.. డబ్బుల్లేకపోయినా తన తండ్రి తమకు చాలా ప్రేమానురాగాలను పంచారని షారుక్ చెప్పారు. ‘‘డబ్బుల్లేక నా ప్రతి జన్మదినానికి తండ్రి ఆయన ఏదో ఒక పాత వస్తువును కానుకగా ఇచ్చేవారు. ఉర్దూ పదాలతో ఆ వస్తువు గొప్పతనాన్ని అందంగా వివరించి నచ్చజెప్పేవారు. అలా తొలి కానుకగా విరిగిపోయిన చదరంగం సెట్‌ను ఇచ్చారు. దాంతో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని చెప్పారు. కలిసిమెలిసి పరస్పర సహకారంతో ఎలా పని చేయాలి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక్కోసారి వెనక్కి తగ్గాల్సి రావచ్చు.. జీవితంలో ఏ వ్యక్తి చిన్నవాడు కాదు.. ఎవరితోనైనా అవసరం పడొచ్చు.. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి.. జీవితంలో విజయం సాధించేందుకు త్యాగాలు తప్పవన్న విషయాలను చదరంగం నేర్పుతుంది. ఇక రెండో కానుకగా నా తండ్రి టైప్‌రైటర్ ఇచ్చారు. దాంతో రాస్తే చెరపడం కష్టం కావడంతో ఎంతో ఏకాగ్రత్తతో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. జీవితంలో అభ్యాసంతో ఏదైన సాధించవచ్చని ఆ టైప్‌రైటర్ నేర్పింది. మూడో కానుక పాత కెమెరా. అందులోంచి చూస్తే అందమైన దృశ్యాలు కనిపిస్తుండేవి. అయితే ఆ కెమెరా ఫోటోలు తీసేందుకు పనికొచ్చేది కాదు. మనలోని సృజనాత్మకత, ఆకాంక్షలకు తగ్గట్లు చాలా మంది జీవితాలు ఉండవని ఆ కెమెరా ద్వారా తండ్రి బోధించారు’’అని షారుక్ వివరించారు. మనసు బాగోలేనప్పుడు కవిత్వం రాస్తా తన మనసుకు నచ్చిన నటనా రంగంలో అడుగుపెట్టి విజయం సాధించానని, జీవితంలో కొందరికే ఈ అదృష్టం దక్కుతుందని షారుక్ అన్నారు. మనలోని సృజనాత్మకతను ప్రపంచం స్వీకరించాలన్న నిబంధన లేదన్నారు. ‘‘కష్టకాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన సృజనాత్మకతే మనకు తోడుగా నిలుస్తుంది. నాకు కవిత్వం రాయడం రాకపోయినా మనసు బాగో లేనప్పుడు రాస్తుంటా’’అని చెప్పారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘హమ్నే తుమ్హారీ రాహ్మే రోరోకే టబ్ భర్దియా...వోహ్ ఆకే నహకే చలేగయే’కవితను ఉటంకించారు. ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఇలా కవిత్వం రాస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. కొంచెమైనా పిల్లల అమాయకత్వం ఉండాలి.. ప్రతి ఒక్కరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ (హస్య చతురత) ఉండాలని షారుక్ అన్నారు. చిన్నపిల్లాడిలో ఉండే అమాయకత్వాన్ని కొంచెమైనా కలిగి ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. మన గురించి మంచి, చెడు రెండు రకాలుగా చెప్పేవారుంటారని, వాటిని ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’దృష్టితో స్వీకరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందన్నారు. తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని ప్రేమించాలని, జీవితంపట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉండాలన్నారు. -
షారూక్ అంటే ఇష్టం
లిటిల్స్టార్గా పేరు గాంచిన నటి షామిలి. బాలతారలుగా అక్కాచెల్లెళ్లు శాలిని, షామిలి తమదైన నటనతో అబ్బుర పరిచారు. అక్క శాలిని కథానాయకిగా మూడు నాలుగు చిత్రాలే చేసి నటుడు అజిత్‌కు అర్ధాంగి అయి నటనకు స్వస్తి పలికారు. ఇక బాల తారగా జాతీయ అవార్డును సైతం గెలుచుకున్న షామిలి ఇటీవల తెరపైకి వచ్చిన వీరశివాజీ చిత్రంతో కథానాయకిగా పరిచయమయ్యారు. అయితే అంతకు ముందే టాలీవుడ్లో ఓయ్ అనే చిత్రంలో సిద్ధార్థకు జంటగా నటించారన్నది గమనార్హం. ఏ విషయాన్నైనా గలగలా మాట్లాడే షామిలితో చిన్న భేటీ.. ప్ర: కోలీవుడ్‌లో నాయకిగా పరిచయం అవడానికి ఇంత ఆలస్యమైందే? జ: విజువల్ కమ్యూనికేషన్ చదివిన నేను అందులో పై చదువుకోసం సింగపూర్ వెళ్లాను. అక్కడ మూడేళ్ల నటన, సినిమాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకున్నాను. ఆ సమయంలో నాలో చిన్న సందిగ్ధం నెలకొంది. సింగపూర్‌లోనే సెటిల్ అవుదామా? లేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోదామా? అన్న చిన్న సంశయం కలగగా చివరికి నటనకే మొగ్గు చూపి చెన్నైకి తిరిగి వచ్చాను. అప్పుడే వీరశివాజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్ర: వీరశివాజీ చిత్రంలో నటించిన అనుభవం? జ: చాలా తీయని అనుభవం. ఈ చిత్రంలో నటించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కలగలేదు. కారణం ఈ చిత్ర కథానాయకుడు విక్రమ్ ప్రభు చెల్లెలు నేనూ బా ల్య స్నేహితురాళ్లం. అందువల్ల విక్రమ్‌ప్రభు,ఆయన కుటుంబంతో మంచి పరిచయం ఉంది. దీంతో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించడానికి శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడలేదు. ప్ర: బేబీ షామిలిగా నటించడానికి, కథానాయకి షామిలికీ వ్యత్యాసం ఏమైనా ఉందా? జ: చాలా ఉంది.బేబీ షామిలిగా కెమెరా ముందు నిలబడి నటించడానికి ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు కెమెరా ముందుకు వెళ్లడానికి కాస్త భయం అనిపించింది. కారణం ఇప్పుడు నాకు చెప్పడానికి నాన్న లేరు. ప్ర: మీ అక్క శాలిని నటన గురించి మీకు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? జ: మా అక్క నాకు ఎలాంటి సలహాలు ఇవ్వరు. కాకపోతే మేకప్, హెయిర్‌స్టయిల్ వంటి విషయాల్లో సూచనలు ఇస్తుంటారు. ప్ర: మీ బావ అజిత్ గురించి? జ: మా బావ ఎక్కువగా మాట్లాడరు. ఇక ఇంట్లో సినిమాల గురించి చర్చిండం చాలా తక్కువే. ప్ర: అజిత్ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి? జ: చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వాలి, విల్లన్, గాడ్‌ఫాదర్, బిల్లా చిత్రాలు నాకు చాలా ఇష్టం. ప్ర: అజిత్‌తో జంటగా నటించే అవకాశం వస్తే నటిస్తారా? జ: అజిత్ నాకు అన్నయ్య లాంటి వారు.ఆయనకు జంటగా ఎలా నటించగలను.అయితే ఆయన హీరోగా నటించే చిత్రంలో మంచి పాత్రలో నటించడానికి సిద్ధమే. ప్ర: ఎలాంటి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు? జ: ప్రస్తుతానికి బలమైన పాత్రల జోలికి వెళ్లకుండా నగర నేపథ్యంలో సాగే కమర్షియల్ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. ప్ర: మీ అభిమాన కథానాయకుడెవరు? జ: నాకు చిన్నతనం నుంచి హిందీ నటుడు షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ప్ర: భవిష్యత్‌లో షామిలిని నటిగానే చూస్తామా? లేక దర్శకురాలిగా చూసే అవకాశం ఉంటుందా? జ: ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. అయితే డ్యాన్స్ పై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం కూడా నేర్చుకుంటున్నాను. దర్శకురాలు కాదు గానీ, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థను నెలకొల్పాలన్న ఆలోచన ఉంది. -
ఆ క్షణంలో ఏడవాలనిపించింది!
‘‘నా జీవితంలో ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ఓ పాతికేళ్ల తర్వాత తల్చుకున్నా ఆనందపడిపోయేంత మధురానుభూతి’’ అంటున్నారు సన్నీ లియోన్. ఇంత ఉద్వేగంగా చెబుతున్నారంటే కచ్చితంగా అది ఆమెకు చాలా చాలా స్పెషల్ అని అర్థమవుతోంది కదూ. మరేం లేదు.. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సరసన ‘రాయీస్’ చిత్రంలో ప్రత్యేక పాటకు నర్తించే అవకాశం దక్కించుకున్నారు సన్నీ లియోన్. ఇటీవల ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకి అడిగినప్పటి నుంచి పాట చిత్రీకరణ పూర్తయ్యే వరకూ తనకు కలిగిన అనుభూతిని సన్నీ ఈ విధంగా పంచుకున్నారు. ► ‘రాయీస్’ దర్శకుడు రాహూల్ డోలాకియా ఈ చిత్రంలోని ‘లైలా మై లైలా’ పాటకు నన్ను అడిగినప్పుడు, ‘నిజంగానే మనల్నే అడగాలనుకున్నారా? లేక వేరే ఎవరో దగ్గరకు వెళ్లబోయి మన దగ్గరకు వచ్చారా?’ అనే సందేహం కలిగింది. కాస్ట్యూమ్ ట్రైల్స్ జరిగినప్పుడు కూడా అపనమ్మకంగానే ఉన్నాను. రిహార్సల్స్ చేస్తున్నప్పుడూ కచ్చితంగా మన స్థానంలో వేరే ఆర్టిస్ట్‌ని తీసుకుంటారనుకున్నా. ఎందుకంటే షారూక్ ఖాన్ లాంటి స్టార్ పక్కన నేనా? అనిపించింది. పైగా ‘ఖుర్బానీ’ చిత్రంలో జీనత్ అమన్ చేసిన ‘లైలా ఓ లైలా..’ సాంగ్ తరహాలో ఈ చిత్రంలోని పాట ఉంటుందన్నారు. ఆవిడ ఎక్కడ? నేనెక్కడ? అందుకని కొంచెం నెర్వస్‌గా అనిపించింది. ఎక్కువగా ఆలోచిస్తే, పాట చేయలేమనిపించి, జీనత్ అమన్ చేసిన డ్యాన్స్‌ని మరచిపోవడానికి ట్రై చేశా. అయితే లక్కీగా ఆ సాంగ్లా ఈ పాట ఉండదు. ఇది వేరేలా ఉంటుంది. ► షారుక్ ఖాన్ సరసన నటించడం గొప్ప అనుభూతి. పాట చిత్రీకరణ మొదలుపెట్టిన మొదటి రోజున షారుక్‌ని చూసి, ఎమోషన్ అయ్యా. కానీ, అది బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డా. ఏడవాలనిపించింది. ఎందుకంటే షారుక్‌ను నేను దగ్గరగా చూడటం అదే మొదటిసారి. పైగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నాం. ఎక్కడినుంచో ముంబైకి వచ్చాను. మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. షారుక్‌తో నటించగలిగాను. నా కల నెరవేరింది. ఈ సందర్భంగా అమ్మాయిలకూ, అబ్బాయిలకూ నేను ఒకటి చెబుతా. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది. అందుకు నేనే ఒక ఉదాహరణ. -
పాక్ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్ హామీ
ముంబై: తన తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార కార్యక్రమాల్లో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పాల్గొనబోదని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు హామీ ఇచ్చారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా ఈ హామీ ఇచ్చారని ఎంఎన్ఎస్ చిత్రపథ్ కర్మచారి సేన చీఫ్ అమీ ఖోప్కర్ సోమవారం చెప్పారు. రయీస్ ప్రదర్శనను తాము అడ్డుకోబోమని, ఈ సినిమాలో పాలుపంచుకున్న పాక్ నటులెవరూ ఇక్కడ ఉండరని అన్నారు. రయీస్ సినిమాలో మహీరా నటించారు. -
ప్రతి మనసుకు వైద్యం కావాలి
ప్రతి జీవితం ప్రియమైనది కావాలి కాయ్రాకు తన ప్రాబ్లం తనకు తెలియదు. అందంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ప్రతిభ ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. తనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. కాని తను ఒక రిలేషన్‌ను, జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. మొదటి బాయ్‌ఫ్రెండ్ ఒక హోటల్ యజమాని. మంచివాడు. పొడుగ్గా ఉంటాడు. కాని అతడికి నో చెప్పేస్తుంది. సింగపూర్‌లో ఔట్‌డోర్ షూటింగ్లో ఉండగా ఆ సినిమా నిర్మాతైన యువకునితో చనువుగా ఉండాల్సి వచ్చింది కనుక నో చెప్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఆ నిర్మాతైన యువకుడు ఆమెకు సన్నిహతం కాబోతాడు. అమెరికాలో తీయబోతున్న సినిమాకు ఆమెను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకుంటాడు. అయితే చిన్న ఇబ్బంది చెబుతాడు. తనకు గతంలో ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని ఆమెతో తెగదెంపులు అయిపోయాయని అయితే ఆమె ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాల్సి వస్తోందని ఈ విషయం ముందే చెప్పడం మంచిదని చెప్పేస్తున్నానని అంటాడు. అంతేకాదు ఇక మనం మన అనుబంధం పట్ల సీరియస్ అవుదాం, పరస్పరం దీనిని ముందుకు తీసుకెళదాం అని కూడా చెప్తాడు. కాని అతడికీ నో చెప్పేస్తుంది. బతిమిలాడినా వినదు. దాంతో అతడు అమెరికా వెళ్లి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. అక్కడ సమస్య మొదలవుతుంది. పర్సనల్ వెర్సస్ ప్రొఫెషనల్. పర్సనల్‌గా ఆమె అతడిని వద్దనుకుంది. ప్రొఫెషనల్‌గా అతడి సినిమాలో పని చేయాలనుకుంటోంది. కాని అలా పని చేయాలంటే రోజూ అతణ్ణి చూడాలి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌ని చూడాలి, వాళ్లిద్దరి సాన్నిహిత్యాన్ని చూడాలి ఇదంతా తాను పడగలదా అనే సందేహం. వద్దనుకుంటే బంగారంలాంటి సినిమా అవకాశం పోతుందే అని బాధ. ఈ రెంటి మధ్య నలిగిపోయి నిద్రకు కరువవుతుంది. వారాల తరబడి నిద్ర పట్టదు. నిద్రమాత్రలు మింగినా నిద్ర పట్టదు. దాని నుంచి బయటపడటానికే చివరకు గోవా వస్తుంది. అక్కడ ఉండే తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతుంది. చివరకు గోవా సైకియాట్రిస్ట్ అయిన జహంగిర్ ఖాన్‌తో తన సమస్య చెప్పుకుని దాని నుంచి బయటపడుతుంది. అప్పటి వరకూ నరకంగా మారిన ఆ జీవితం ఆమెకు ఇప్పుడు ప్రియమైనదిగా మారుతుంది. ‘డియర్ జిందగీ’ వర్తమాన సమాజంలో వస్తున్న భావోద్వేగ సమస్యలకు వైద్యం ఎలా అవసరమో సున్నితంగా చెప్పే సినిమా. ఇందులో కాయ్రాగా ఆలియాభట్, సైకియాట్రిస్ట్ జహంగిర్ ఖాన్‌గా షారూక్ ఖాన్ కనిపిస్తారు. షారూక్ తన ఎంట్రీలోనే మన దేశంలో ఉన్న సమస్యను బహిరంగ పరుస్తాడు- ‘మన దేశంలో కిడ్నీ పాడైందనో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనో ఇరుగుపొరుగువారికి ధైర్యంగా చెప్తాము. కాని మనసు పాడైంది అని మాత్రం చెప్పుకోము. ఇంట్లో కూడా అదొక రహస్యంగా భావిస్తాము’ అంటాడతడు. ‘మన మెదడు మన దేహంలో భాగం కాదా?’ అని ప్రశ్నిస్తాడు. అతడు వైద్యం చేసే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. మందులూ మాకులతో చేసే వైద్యం కాదు అది. కేవలం మాట్లాడటం ద్వారా ఎదుటివారికి తమను తాము అర్థం చేయించడం ద్వారా చేసే వైద్యం. ‘పజిల్ని పూర్తి చేయాల్సింది నువ్వే. నేను కేవలం అందుకు సహాయకుణ్ణి మాత్రమే’ అంటాడు ఒకచోట. ఇంతకూ కాయ్రా సమస్య ఏమిటి? ఆమెకు ఆరేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ, తాతయ్య దగ్గర వదిలేసి జీవిక కోసం విదేశాలకు వెళ్లారు. ఆ ఎడబాటు ఆమె భరించలేకపోయింది. అక్కడ తమ బతుకు పోరాటంలో వాళ్లు కాయ్రాను పూర్తిగా అలక్ష్యం చేశారు. అంతే కాదు కన్నకూతురు తమకు దూరంగా ఉందని కాక రెండో తరగతిలో ఆమె ఫెయిల్ అయ్యిందనే కారణాన విదేశాల నుంచి స్వదేశం వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తనంటే ప్రేమ లేదా? తానెంతో ప్రేమించిన తల్లిదండ్రులు తన పట్ల చూపే ప్రేమ ఇదా అని ఆమె మనసులో లోతైన గాయం అయ్యింది. ఆ గాయం వల్ల తాను మనస్ఫూర్తిగా ఎవరినీ ప్రేమించలేకపోయింది. ఎవరైనా దగ్గర కావడానికి ప్రయత్నించినా వాళ్లు ఎక్కడ ‘నో’ చెప్తారో అని తానే ముందు ‘నో’ చెప్పేస్తుంది. ఎందుకంటే తాను ఎవరినైనా కోరుకుంటే వాళ్లు దూరం అవుతారేమోనన్న భయం. ఇది ఆమెకు తెలియజేసి ఆమెను ఆ సమస్య నుంచి దూరం చేస్తాడు సైకియాట్రిస్ట్ షారుక్. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారని కనుక తల్లిదండ్రుల తప్పును క్షమించేస్థాయికి ఎదగాలని అంటాడు. నువ్వు ఎవరి సమక్షంలో భద్రంగా సంతోషంగా ఫీలవుతావో అతను దొరికే దాకా వెతకడం, రిజెక్ట్ చేయడం తప్పు కాదని చెబుతాడు. ‘ఇష్టం లేకపోయినా కఠినమైన నిర్ణయాలు తీసుకుని మనసునూ శరీరాన్ని బాధించుకోవడం కంటే అసలు ఆ నిర్ణయాన్ని వదులుకోవడం మేలు’ అనే సూచన చేస్తాడు. ఇవన్నీ కాయ్రాకు మాత్రమే కాదు... థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు కూడా సూచనలే. ఈ సినిమాలో ఆలియాతో పని మనిషి ‘ఎందుకమ్మా పిచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లావు? నీకు పిచ్చా?’ అని అడిగితే ‘కాదు. మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోలేనప్పుడు డాక్టర్ని కలిస్తే ధైర్యం వస్తుంది’ అని జవాబు చెప్తుంది ఆలియా. అప్పుడు పని మనిషి ‘అలాగైతే మంచిదే. నిజానికి అందరికీఅలాంటి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అంటుంది అర్థం చేసుకున్న దానిలా. నిజమే. మెదడు మన శరీరంలో భాగం అయినప్పుడు శరీరానికి ఏవో ఒక సమస్యలు వచ్చినట్టే మనసుకు కూడా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో అది అనారోగ్యం కాదు అని అనుకోరాదు. చేయి తెగి రక్తం కారితే వైద్యం అవసరమనీ మనసు చెదిరి గాయపడితే వైద్యం అక్కర్లేదని అనుకోరాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో మానసిక వైద్యం తీసుకోవాల్సిందే. తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వైద్యం కన్నా జీవితం ప్రియమైనది. మళ్లీ మళ్లీ దక్కనిది. ఈ సినిమా దర్శకురాలు గౌరి షిండే, నిర్మాతలు గౌరి ఖాన్, కరణ్ జొహర్ ఇలాంటి సున్నితమైనసమస్యను తీసుకుని సినిమా తీసినందుకు అభినందనీయులు. 22 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే దాదాపుగా ఇప్పుడు 50 కోట్లు వసూలు చేసింది. ఇంకా చేయొచ్చు కూడా. చిన్న సినిమా అయినా షారూక్ ఇందులో నటించడం అతనికీ ప్రేక్షకులకూ ఒక మార్పు. ఆలియా భట్ తనలో ఉన్న టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఈ సినిమా ఒక సవాలు. అందులో ఆమె ఒకటో ర్యాంకులో పాస్ అయ్యింది. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ అమరిన అలంకరణలు. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లో అయినా క్లయిమాక్స్‌కు అందుకుంటుంది. గోవాలో హాయిగా ఉండే వాతావరణంలో హాయిగా సాగే కథతో ఒక సినిమా చూడాలనుకుంటే డియర్ జిందగీ చూడొచ్చు. ఇది మీకు కొద్దోగొప్పో మేలే చేయగలదు. హాని కాదు. కెన్ గో ఫర్ ఇట్. -
సల్మాన్ కామెంట్: షారూఖ్, అనుష్క కౌంటర్
కోర్టు కేసులు, సూపర్ హిట్ సినిమాలు, విపరీత ప్రవర్తన.. ఇంకా చాలా కారణాలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మళ్లీ పక్కవాళ్ల పంచాయితీలో వేలు పెట్టాడు. ఈ సారి ఏకంగా బాద్షా షారూఖ్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడు. సదరు కామెంట్‌తో సంబంధం ఉన్న హీరోయిన్ అనుష్క శర్మకు కోపం తెప్పించాడు. విషయం ఏంటంటే.. షారూఖ్, అనుష్క హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఇంతియాజ్ అలీ(హైవే, తమాషా ఫేమ్) ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ‘ది రింగ్’అనే టైటిల్ అనుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ‘ది రింగ్’ వచ్చే ఏడాది(2017) ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ మేరకు దర్శకనిర్మాతలు సంబంధిత సమాచారాన్ని ఎప్పుడో చెప్పేశారు. కాగా, మంగళవారం రాత్రి షారూఖ్,అనుష్కల కొత్త సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసిన సల్మాన్ ఖాన్..‘షారూఖ్ ఖాన్ సినిమా వస్తోంది.. రిలీజ్ డేట్‌ను నేనే ఫిక్స్ చేశా. టైటిట్ ఏం పెట్టాలో మీరు డిసైడ్ చెయ్యండి..’అని కామెంట్ రాసి షారూఖ్, అనుష్క, ఇంతియాజ్‌లను ట్యాగ్ చేశాడు. సల్లూ ట్వీట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన షారూఖ్..‘అరే.. ఈ సంగతి నాకు తెలియదే! అయినా డేట్ భాయి(సల్మాన్) ఫిక్స్ చేశాక రిలీజ్ చెయ్యక చస్తామా? సరే, ఆ టైటిల్ ఏదో నువ్వే చెప్పరాదా..’అని కౌంటర్ ఇచ్చాడు. అటు అనుష్క కూడా ‘రిలీజ్ డేట్ నువ్వు డిసైడ్ చేయడమేంటి?’అని ఒకింత ఆగ్రహం ప్రదర్శించింది. విబేధాలు పక్కనపెట్టి కొన్నాళ్లుగా కామ్‌గా ఉంటోన్న ఇద్దరు ఖాన్ల ట్వీట్ల లొల్లి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలిమరి! .@iamsrk ki film aa Rahi hai . Date Maine decide kar di hai . Title tum log decide kardo . Best of luck @AnushkaSharma #ImtiazAli pic.twitter.com/kjBSkjIMC2 — Salman Khan (@BeingSalmanKhan) 29 November 2016 What's this @iamsrk ?? Our release date's decided !?! pic.twitter.com/WWCQd8rW1a — Anushka Sharma (@AnushkaSharma) 29 November 2016 Arre I had no idea we are still searching for the title. What to do now??? Go with this date or wot?? https://t.co/wQc4B2OoxC — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016 Absolutely. Aur bhai @BeingSalmanKhan ne jab commitment kar di hai toh ab hum kaun hote Hain. 11th Aug 2017 it is! https://t.co/wPeOxq2zlU — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016 Thank u @beingsalmankhan & @aliaa08 for the date of Imtiaz’s film. Ab bas title dhoond do! Wot u seek is seeking u… pic.twitter.com/rePpfmWAtw — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016 -
అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోలందరూ వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మాత్రం కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా అసహనంపై షారూఖ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీయటంతో ఆయన సినిమాలపై కమర్షియల్‌గా కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొద్ది రోజులుగా షారూఖ్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాద్షా. లిమిటెడ్ బడ్జెట్లో అలియా భట్‌తో కలిసి డియర్ జిందగీ సినిమాలో నటించాడు షారూఖ్. ఎలాంటి హడావిడి లేకుండా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి తన కమర్షియల్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న షారూఖ్ కొత్త ప్లాన్ చేస్తున్నాడట. రెగ్యులర్‌గా ఇండియన్ సినిమాలన్నీ ఒక్క రోజు ముందుగానే ఓవర్సీస్లో రిలీజ్ అవుతాయి. అయితే షారూఖ్ మాత్రం డియర్ జిందగీ సినిమాను రెండు రోజుల ముందే ఓవర్సీస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అక్కడి ప్రేక్షకులకు నచ్చే అంశాలన్ని ఉన్న సినిమా కావటంతో ముందుగా అక్కడ రిలీజ్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే ఇండియాలో నవంబర్ 25న రిలీజ్ కానున్న డియర్ జిందగీ సినిమాను ఓవర్సీస్లో మాత్రం నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సైనికులపై షారూక్ కవిత
ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ సైనికులపై ఒక కవిత రాసి ప్రత్యేక సందేశం అందించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలన్న మోదీ పిలుపుతో దీన్ని రాసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అందులో షారూక్ ‘మన పాదాలు తివాచీల మీద. వారి బూట్లు నేలపైన. మన రోజులు ప్రశాంతం. వారికి రోజూ కొత్త సవాళ్లు. మన రాత్రులు ఆహ్లాదకరం... వారి త్యాగాల వల్లే మనం జీవిస్తున్నాం. వారి కష్టం మరుగున పడిపోకూడదు... వారు పోరాటం చేస్తున్నారు. అందుకే దేశం ఎదుగుతోంది. త్రివర్ణ పతాకం ఎగురుతోంది’ అంటూ రాశారు. -
స్నేహం కోసం... షారూఖ్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్, త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన యాక్షన్ స్టార్ సోనూసూద్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న టుటక్ టుటక్ టుటియా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన ట్రైలర్‌కు షారూక్ గాత్రదానం చేశాడు. తనతో కలిసి హ్యాపీ న్యూయిర్ సినిమాలో నటించిన సోనూతో ఉన్న స్నేహం కారణంగానే షారూక్, వాయిస్ నేరేషన్‌కు అంగీకరించాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్ వర్షన్ సోనూసూద్ నిర్మిస్తుండగా, తమిళ వర్షన్‌ను ప్రభుదేవా, తెలుగు వర్షన్‌ను కోనా వెంకట్లు నిర్మిస్తున్నారు. సోనూసూద్, ప్రభుదేవా, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. Thank u so much @iamsrk for being a part of my first journey as a producer. Really means a lot. 👑https://t.co/994ZwueJqt— sonu sood (@SonuSood) 10 September 2016 -
ప్రీతి జింతాకు షారూఖ్ సారీ ఎందుకు?
ముంబై: బాలీవుడ్ 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్.. హీరోయిన్ ప్రీతి జింతాకు క్షమాపణ చెప్పాడు. వీరిద్దరూ నటించిన 'దిల్ సే' సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా షారూఖ్ ప్రత్యేకంగా తయారు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 'మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడినప్పుడు వారిని ఎంతో ప్రేమిస్తాం. అయితే ఎల్లకాలం ఎక్కువగా ప్రేమించడం సాధ్యంకాకపోవచ్చు. కానీ నాకు ఎంతో ఇష్టమైన దిల్ సే సినిమాపై ప్రేమ కాస్త కూడా తగ్గలేద'ని ఇన్స్టాగ్రామ్ వీడియోకు మెసేజ్ పెట్టాడు. అయితే ఈ వీడియో హీరోయిన్ ప్రీతి జింతా ప్రస్తావన లేకపోవడంతో ఆమెకు షారూఖ్ క్షమాపణ చెప్పాడు. వీడియోలో ప్రీతి జింతాను కూడా చేర్చి మరోసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దిల్ సే' సినిమా 1998, ఆగస్టు 21న విడుదలైంది. ఇందులో షారూఖ్ సరసన మనీషా కొయిరాల, ప్రీతి జింతా నటించారు. తీవ్రవాదం నేపథ్యంలో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం, రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్, భరత్ షా సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రీతి జింతా బాలీవుడ్ ను పరిచయమైంది. -
ఆ విషయం తెలియగానే షాకయ్యా: మమత
కోల్‌కతా: అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌ను నిర్బంధించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఈ విషయం తెలియగానే తాను షాకయ్యానని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని, అమానవీయమని అన్నారు. భద్రత ముఖ్యమని, అలాగని తనిఖీల పేరిట వేధించడం తగదని మమత ట్వీట్ చేశారు. అమెరికాలో యాలె యూనివర్శిటీని సందర్శించేందుకు వెళ్లిన షారుక్‌ను లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విచారణ పేరుతో దాదాపు రెండు గంటలు అదుపులో ఉంచుకుని తర్వాత వదిలిపెట్టారు. దీనిపై షారుక్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ షారుక్‌కు క్షమాపణలు చెప్పారు. -
'అందరి ముందు తినాలంటే సిగ్గు'
బాలీవుడ్ స్టార్ హీరోలలో అభిమానులతో తన అనుభవాలను, ఇష్టా ఇష్టాలను మొహమాటం లేకుండా పంచుకునే హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్. తను పడ్డా కష్టాలతో పాటు ఇప్పుడు స్టార్ డమ్‌ను కాపాడుకోవటానికి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంటాడు బాద్షా. ఇటీవల ఫ్యాన్స్‌తో నిర్వహించిన లైవ్ వీడియో చాట్‌లో తన ఆహారపు అలవాట్ల గురించి అభిమానులకు తెలియజేశాడు. ఫిట్‌గా ఉండేందుకు పక్కా డైట్ ఫాలో అయ్యే షారూఖ్, రెగ్యులర్‌గా గ్రిల్డ్ చికెన్, మొలకలు, బ్రోకొలి, పప్పు మాత్రమే తీసుకుంటాడట. అంతేకాదు ఏదైనా పార్టీకి వెళ్లినా.. ఇంట్లో వండిన ఆహారం తినడానికే ఇష్టపడతాడట. ముఖ్యంగా ఫంక్షన్స్, పార్టీలలో చాలా మంది ముందు తినటానికి ఇబ్బందిగా ఉంటుదన్నాడు షారూఖ్. తనలా ఫర్ఫెక్ట్ బాడీ మెయిన్టైన్ చేయడానికి అభిమానులకు టిప్స్ కూడా చెప్పాడు. ప్రతీరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని, భోజనం చేసేప్పుడు మితంగా తినాలని, అది కూడా కింద కూర్చొని తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేశాడు.