సారీ.. డేట్స్‌ లేవు! | Shahrukh Khan cine actor Aliaa Bhatt said no dates' | Sakshi
Sakshi News home page

సారీ.. డేట్స్‌ లేవు!

Published Mon, May 29 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

సారీ.. డేట్స్‌ లేవు!

సారీ.. డేట్స్‌ లేవు!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సరసన సినిమా అంటే ఎవరైనా కాదంటారా? ఎగిరి గంతేస్తారు కదా. కానీ, ఆలియా భట్‌ మాత్రం ‘ఊహూ.. కుదరదు’ అని చెప్పేశారట. ‘అమ్మ ఆలియా.. నీకు అంతుందా?’ అని బాలీవుడ్‌బుగ్గలు నొక్కుకుంటోంది. ఇంతకీ షారుక్‌తో సినిమాని ఈ బ్యూటీ ఎందుకు కాదన్నారు? కారణం ఉందట.

పాపం డేట్స్‌ లేవట. అందుకే వినయంగా ‘సారీ... డేట్స్‌ లేవు’ అన్నారట. అయినా కొందరు నమ్మడం లేదు. సీనియర్‌ హీరో సరసన నటిస్తే.. సీనియర్‌ హీరోయిన్‌ అనే ముద్రపడిపోతుందని ఆలియా భయపడిందని, అందుకే డేట్స్‌ లేవని చెప్పి, ఎస్కేప్‌ అయిందని చెప్పుకుంటున్నారు. నిజమేంటో ఆలియాకే ఎరుక! కాగా, ఆలియా నో చెప్పడంతో అనుష్కా శర్మను ఓకే చేశారని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement