
ముంబై: బిగ్‌బాస్ హోస్టింగ్ గురించి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ స్పందించాడు. షో చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నాడు. కాకపోతే అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్ షో హోస్ట్ చేయడానికి తాను సిద్ధమేనని షారుక్ ప్రకటించారు. తన షెడ్యూల్ ప్రస్తుతం ఖాళీగానే ఉందని తెలిపారు.
‘ ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరున్నారనేది ముఖ్యం కాదు. కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించడమే ముఖ్యం. కాకకపోతే నన్ను ఇంతవరకు బిగ్‌బాస్‌కు సంబంధించి ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మంచి ఆఫర్ ఇస్తే నేను హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’నని ఈ బాద్‌షా ప్రకటించారు.
ఇప్పటివరకు 10 సీజన్‌లను పూర్తి చేసుకొన్న ‘బిగ్‌బాస్’ షో, 11వ సీజన్ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత పది సీజన్‌లుగా బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన స్థానంలో షారూక్ కానీ, అక్షయ్ కానీ ఈ షోను మరింత అందంగా నడిపించగలరని అన్నాడు. ఈ నేపథ్యంలో షారుక్, సల్మాన్ వ్యాఖ్యలపై స్పందించాడు.