'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్‌మెంట్‌ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్‌కి పుల్‌స్టాఫ్ పెట్టేశాడు.
అసలేం జరిగింది?
గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్‌కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్‌లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్‌కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్‌ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్‌బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.
వాస్తవం ఎంటంటే..?
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్‌మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్‌కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్‌తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్‌బాస్ సెట్‌లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.
బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు?
బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment