స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్! | Shahrukh Khan Accident Movie Shooting USA | Sakshi
Sakshi News home page

Shahrukh Khan Accident: షూటింగ్‌లో హీరో షారుక్‌కి తీవ్ర గాయాలు!

Published Tue, Jul 4 2023 1:48 PM | Last Updated on Tue, Jul 4 2023 1:57 PM

Shahrukh Khan Accident Movie Shooting USA - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మహేశ్‌నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో)

షారుక్‌కి యాక్సిడెంట్
నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు.

'జవాన్' కోసం వెయిటింగ్
దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్‌బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది.

(ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement