బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ చివరిసారిగా డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా అభిమానులను మెప్పించడంలో విఫలమైంది. అయితే షారూఖ్ ఖాన్ తాజగా లోకార్నో ఫిల్మ్ ఫిస్టివల్‌లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు.
పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారూఖ్ ఖాన్ నిలిచారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల ప్రేమవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు చేశానని బాద్‌షా చెప్పుకొచ్చారు. విలన్‌గా, ఛాంపియన్‌గా, సూపర్ హీరోగా, జీరోగా కనిపించానని వెల్లడించారు.
ముఖ్యంగా దక్షిణాది సినిమాలపై షారూఖ్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలో చాలా భాషలు ఉన్నాయప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా దక్షిణాది నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయని షారూఖ్ అన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు సినిమాటిక్‌గా, టెక్నికల్‌గా ఫెంటాస్టిక్ అని కొనియాడారు. సౌత్‌లో హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని బాలీవుడ్ బాద్‌షా తెలిపారు.
Shah Rukh Khan - "To regionalize Indian Cinema is wrong, we have some wonderful cinema and talents from each corner of country. Technically South Cinema is very fantastic, and I loved the opportunity to create a fusion of Bollywood & South in Jawan" pic.twitter.com/Rpr8ZjqFnd
— sohom (@AwaaraHoon) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment