Locarno International Film Festival
-
ఫిల్మ్ ఫెస్టివల్లో షారూఖ్ సందడి.. హీరో తీరుపై నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా నిలిచారు. అయితే ఈవెంట్ పాల్గొన్న తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలను డీగ్రేడ్ చేసి చూపించే చిత్రాల్లో నటించడం తనకు ఇష్టముండదని చెప్పారు.అయితే ఈవెంట్లో బాలీవుడ్ బాద్షా చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వేదికపై ఉన్న ఓ పెద్దాయనను పక్కకు తోసివేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షారూఖ్ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీ అయి ఉండి ఓ పెద్దాయనతో ఇలా ప్రవర్తించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే షారూక్ కావాలని అలా చేయలేదని.. ఏదో సరదాగా అలా చేశారని కింగ్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ బాద్షా చివరిసారిగా డుంకీ చిత్రంలో కనిపించారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. . #ShahRukhKhan he pushed that old man!!! Shame on you @iamsrk pic.twitter.com/eA1g3G66xb— Azzmin✨ SIKANDAR🗿 (@being_azmin) August 10, 2024 -
షారూఖ్ ఖాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. తొలి భారతీయ నటుడిగా ఘనత!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చివరిసారిగా డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా అభిమానులను మెప్పించడంలో విఫలమైంది. అయితే షారూఖ్ ఖాన్ తాజగా లోకార్నో ఫిల్మ్ ఫిస్టివల్‌లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు.పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారూఖ్ ఖాన్ నిలిచారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్షా ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల ప్రేమవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. మూడున్నర దశాబ్దాల కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేశానని బాద్షా చెప్పుకొచ్చారు. విలన్‌గా, ఛాంపియన్‌గా, సూపర్ హీరోగా, జీరోగా కనిపించానని వెల్లడించారు.ముఖ్యంగా దక్షిణాది సినిమాలపై షారూఖ్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలో చాలా భాషలు ఉన్నాయప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా దక్షిణాది నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయని షారూఖ్ అన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు సినిమాటిక్‌గా, టెక్నికల్‌గా ఫెంటాస్టిక్ అని కొనియాడారు. సౌత్‌లో హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని బాలీవుడ్ బాద్షా తెలిపారు. Shah Rukh Khan - "To regionalize Indian Cinema is wrong, we have some wonderful cinema and talents from each corner of country. Technically South Cinema is very fantastic, and I loved the opportunity to create a fusion of Bollywood & South in Jawan" pic.twitter.com/Rpr8ZjqFnd— sohom (@AwaaraHoon) August 11, 2024 -
భారతీయ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు
చెన్నై: ఓ భారతీయ దర్శకుడి మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. బెంగళూరుకు చెందిన కన్నడ దర్శకుడు రామ్ రెడ్డి తొలి చిత్రం 'తిథి' లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు అత్యున్నత అవార్డులు సాధించింది. దీంతో ఈ ఫెస్టివల్లో భారతీయ సినిమాలకు గత ఎనిమిదేళ్ల అవార్డుల కొరత తీరినట్లయింది. గోల్డెన్ లేపర్డ్, స్వచ్చ్ ఫస్ట్ ఫీచర్ అవార్డు అవార్డులను ఆగస్టు ఆగస్టు 5 నుంచి15 వరకూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 'ఇది నా కలల ప్రాజెక్టు. భారతీయుల గొప్పతన్నాన్ని మరికొన్ని విషయాలను తిథి లో చూపించాను. జీవితాన్ని ఎంత సాధారణంగా లీడ్ చేయవచ్చు అనేది ఈ మూవీ ద్వారా చూపించగలిగాను' అని రామ్ రెడ్డి చెప్పారు. కొత్తవారితోనే ఈ మూవీ తీసి విజయాన్ని సాధించి అంతర్జాతీయ అవార్డు గెలుచుకోవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు.