భారతీయ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు | 'Thithi' wins two awards at Locarno International Film Festival | Sakshi
Sakshi News home page

భారతీయ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు

Published Sun, Aug 16 2015 10:13 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

భారతీయ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు - Sakshi

భారతీయ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు

చెన్నై: ఓ భారతీయ దర్శకుడి మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. బెంగళూరుకు చెందిన కన్నడ దర్శకుడు రామ్ రెడ్డి తొలి చిత్రం 'తిథి' లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు అత్యున్నత అవార్డులు సాధించింది. దీంతో ఈ ఫెస్టివల్లో భారతీయ సినిమాలకు గత ఎనిమిదేళ్ల అవార్డుల కొరత తీరినట్లయింది. గోల్డెన్ లేపర్డ్, స్వచ్చ్ ఫస్ట్ ఫీచర్ అవార్డు అవార్డులను ఆగస్టు ఆగస్టు 5 నుంచి15 వరకూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.

'ఇది నా కలల ప్రాజెక్టు. భారతీయుల గొప్పతన్నాన్ని మరికొన్ని విషయాలను తిథి లో చూపించాను. జీవితాన్ని ఎంత సాధారణంగా లీడ్ చేయవచ్చు అనేది ఈ మూవీ ద్వారా చూపించగలిగాను' అని రామ్ రెడ్డి చెప్పారు. కొత్తవారితోనే ఈ మూవీ తీసి విజయాన్ని సాధించి అంతర్జాతీయ అవార్డు గెలుచుకోవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement