సినిమా అనేది వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు. కొందరు డైరెక్టర్స్ అయితే కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తుంటారు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ కారణమేంటో తెలుసా?
(ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!)
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం జనరేషన్‌కి ఈ భాషా చిత్రాలు పరిచయమైంది 'ప్రేమమ్'తోనే. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ.. 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్‌కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది.
దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్.. 2013లో 'నేరమ్' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ప్రేమమ్'తో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అవియల్ (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) సినిమాలు తీశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)
కొన్నాళ్ల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే దర్శకుడి కెరీర్‌కి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
'నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను. అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది' అని అల్ఫోన్ రాసుకొచ్చాడు. కానీ ఈ పోస్ట్ కాసేపటికే డిలీట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)
Comments
Please login to add a commentAdd a comment