
తిరువనంతపురం: మలయాళ సినీ పరిశ్రమ (Mollywood)లో సమ్మె సైరన్ మోగింది. జూన్ ఒకటి నుంచి షూటింగులు ఆపివేయడంతో పాటు థియేటర్ల ప్రదర్శనలు సైతం నిలిపివేస్తున్నామని ఫిలిం ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించింది. మలయాళ సినిమా బడ్జెట్లు మితిమీరిపోతుండగా వాటి సక్సెస్ రేటు మాత్రం తగ్గిపోతూ వస్తున్నాయి.
నటీనటులతో పాటు టెక్నీషియన్లు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దీంతో నిర్మాతలపై భారం పెరిగిపోతోంది. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకే మాలీవుడ్ సమ్మె బాట పట్టింది. అయితే దీని ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద పడనుంది. మలయాళంలో డబ్ అయ్యే ఇతర సినిమాల పరిస్థితి గందరగోళంగా మారనుంది.
చదవండి: జాలిరెడ్డిపై బెంగ పెట్టుకున్న తల్లి.. ఐదేళ్ల ఎదురుచూపులకు బ్రేక్..
Comments
Please login to add a commentAdd a comment