రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్‌ | Movie Director Laxman Utekar Life Story | Sakshi
Sakshi News home page

రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమా తీశాడు

Published Tue, Apr 15 2025 10:27 AM | Last Updated on Tue, Apr 15 2025 11:58 AM

Movie Director Laxman Utekar Life Story

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్‌ మోడల్‌ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్‌లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్‌గా స్టార్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.

'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్‌కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్‌ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్‌ క్లీన్‌ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్‌ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు  2007లో ఖన్నా & అయ్యర్‌ సినిమాతో  ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఛాన్స్‌ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్‌ ప్రారంభమైంది. 

ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్‌ కోసం కూడా వర్క్‌చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మరింత పాపులర్‌ అయ్యాడు. అయితే, రీసెంట్‌గా ఛావా సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్‌ చాటాడు. 

అలా వడాపావ్‌ బండి నుంచి బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్‌ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement