ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్‌దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుకు గురయ్యారు.
దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment