Karti
-
కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్‌కు వెళ్తూ ఘటన
ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్‌దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్‌లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్‌కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
జపాన్ ట్రైలర్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి
పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్‌తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్లో తెలుస్తుంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో ఉంది. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
ఖైదీకి జోడి
ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. -
ఆ ప్రశ్నే లేదంటున్న రకుల్
అన్నదమ్ములిద్దరిలో ఎవరూ బెస్ట్ యాక్టరో చెప్పమంటే.. అసలు అలాంటి ప్రశ్నకు తావే లేదంటున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తమిళంలో కార్తీతో నటించిన ‘దేవ్’ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం విడుదల కానుంది. అదేవిధంగా సూర్యతో జత కట్టిన ‘ఎన్జీకే’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల అవుతుండటంతో డబుల్ హ్యాపీగా ఉన్నాను అంటున్నారు రకుల్. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హిందీలో అజయ్‌దేవ్‌గన్ చిత్రంలో నటిస్తున్నాను. ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం చాలా బాగుంది. అలానే ఒకేసారి అన్నదమ్ములు సూర్య, కార్తీలతో నటించడం మంచి అనుభవం. వారితో కలిసి పని చేయడం జాలీగా ఉంది. వారిద్దరిలో ఎవరు ఉత్తమ నటులు అన్న ప్రశ్నకు తావు లేదు. ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమిస్తార’ని చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. -
కార్తీ ‘చినబాబు’ టీజర్ విడుదల
-
సండే.. బిజీ డే
నో రెస్ట్. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఈ సండే నో రెస్ట్. ఎందుకంటే ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. కార్తీతో చేస్తున్న తమిళ సినిమా కోసం, అజయ్ దేవగన్‌తో చేస్తోన్న హిందీ సినిమా కోసం చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతున్నారీ బ్యూటీ. అకీవ్ అలీ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా సెకండ్ షెడ్యూల్‌ని ముంబైలో కంప్లీట్ చేశారామె. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి ముందే చెన్నైలో కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా నైట్ షూట్లో పాల్గొన్నారు రకుల్. ఇప్పుడు మళ్లీ ఇదే సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి చెన్నై వెళ్లారట ఈ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్‌ను యూరప్, హిమాలయాస్, యూకేలలో కూడా చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. ఈ సండే ఈ సినిమా షూటింగ్‌లోనే రకుల్ ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు. -
చిక్కుల్లో చిదంబరం: బుక్ చేసిన ఇంద్రాణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. బుధవారం చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్నిచెన్నైలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయమని కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్టుగా వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు. అలాగే కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్వాయిస్లను ఐఎన్ఎక్స్ మీడియా సీబీఐకి అందించింది. వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి. మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి తెలిపినట్టు సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా బుధవారం అరెస్ట్ చేసిన కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించడానికి వీలుగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కార్తీకి కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు కార్తీ చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
‘అది తమిళనాడు నుంచే లీకైంది’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ)లో భాగమైన ఆరుగురు కార్యదర్శులను తమ కుటుంబంలోని సభ్యులు ప్రభావితం చేశారనడం ‘అర్థరహితం’అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఎఫ్ఐపీబీలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారం మీడియాతో మాట్లాడిన చిదంబరం ఈ ఆరోపణలను కొట్టివేశారు. కొందరు పనిలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబంలోని ఎవరూ ఎఫ్ఐపీబీని ప్రభావితం చేసే అవకాశమే లేదని, ఆరుగురితో కూడిన బోర్డు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క అధికారీ సొంతంగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ఎఫ్ఐపీబీ సిఫార్సు చేసిన వాటికి మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, తన హయాంలో బోర్డులో పనిచేసిన కార్యదర్శులంతా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్‌లని.. ఒక్కరు మాత్రం ఐఎఫ్ఎస్ అధికారని వివరించారు. ‘‘నా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ఏ అధికారి ధైర్యం చేసేవారు కాదు. మా కుటుంబ సభ్యులైనా కూడా అధికారులతో మాట్లాడేందుకు అనుమతించేవాడిని కాద’’ని పేర్కొన్నారు. అక్రమంగా నగదు బదిలీలో భాగంగా పక్షం రోజుల క్రితం సీబీఐ.. కార్తి, ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకురాలు ఇంద్రాని, పీటర్ ముఖర్జీ నేరపూరిత కుట్ర కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చనప్పటికీ, ఎఫ్ఐపీబీని చేర్చడంతో నాటి ఆర్థిక మంత్రిగా తననూ టార్గెట్ చేసినట్లేనని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అనుకోకుండా తనకు సోషల్ మీడియా ద్వారా లభించిందని, ఇది లీక్ అయింది కూడా తమిళనాడు నుంచే అని వెల్లడించారు. అందులో ఉన్న ఆరోపణలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కార్తిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఎం/ఎస్ ఎడ్వాంటేజ్ స్ట్రాటిజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్)లో అతడు డైరెక్టర్ కాదని, కనీసం వాటాదారుడు కూడా కాదన్నారు. ఆ కంపెనీ తన కుమారుడి స్నేహితులదని, వారంతా టార్గెట్ కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తి దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాడని చిదంబరం వివరించారు. -
'చెలియా' మూవీ రివ్యూ
టైటిల్ : చెలియా జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : కార్తీ, అదితి రావ్ హైదరీ, రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్ సంగీతం : ఏ ఆర్ రెహమాన్ నిర్మాత, దర్శకత్వం : మణిరత్నం చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చెలియా. మణి మార్క్ విజువల్స్ తో టేకింగ్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెలియా మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? మణిరత్నం ఫాం కంటిన్యూ చేశాడా..? మాస్ హీరోగా ఇమేజ్ ఉన్న కార్తీ మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..? కథ : చెలియా కథ 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో జరుగుతుంది. ఓ యుద్ధవిమాన ప్రమాదంలో గాయపడిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వరుణ్ అలియాస్ వీసీ(కార్తీ) పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుతాడు. రావల్పిండిలోని జైల్లో వరుణ్ ను చిత్రహింసలకు గురిచేస్తారు. అలా చీకటి గదిలో బందిగా ఉండగా వరుణ్ కి గతం గుర్తుకు వస్తుంది. వరుణ్, శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఫైటర్ పైలెట్. తన సుపీరియర్ ఆఫీసర్ కూతురు గిరిజ( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో ఉంటాడు. ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన వరుణ్ కు యాక్సిడెంట్ అవుతుంది. మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లేంత సమయం లేకపోవటంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డ్యూటి డాక్టర్ లేకపోవటంతో అప్పుడే డ్యూటిలో చేరిన లీలా అబ్రహం(అదితి రావ్ హైదరీ) వరుణ్ ని ట్రీట్ చేస్తుంది. తొలి చూపులోనే లీలాతో ప్రేమలో పడిన వరుణ్, గిరిజ వాళ్ల పేరెంట్స్ కు నో చెప్పేస్తాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి లీలా వెంట పడటం స్టార్ట్ చేస్తాడు. లీలా అన్న వరుణ్ బ్యాచ్ మెట్ కావటంతో వరుణ్ గురించి ముందే తెలుసుకున్న లీలా వరుణ్ కి దగ్గరవుతుంది. అయితే తన మాటే గెలవాలన్న నెగ్గలన్నట్టుగా ఉండే వరుణ్, తన ఇండివిడ్యూవాలిటీ తనకు ఉండాలనుకునే లీలాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల మధ్యే లీలా గర్భవతి అని తెలుస్తుంది. వరుణ్ పెళ్ళికి నో చెప్పటంతో లీలా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వటంతో లీలాను వెయిట్ చేయమని చెప్పి వరుణ్ వెళ్లిపోతాడు. అలా వెళ్లిన వరుణ్ ఫైటర్ ప్లేన్ ప్రమాదం కారణంగా కూలిపోతుంది. వరుణ్ పాక్ ఆర్మీకి బంధీ అవుతాడు. పాక్ జైల్ ఉన్న వరుణ్ ఎలా బయటపడ్డాడు.? తిరిగి లీలాను కలుసుకున్నాడా..? లీలా వరుణ్ ను ఎలా రిసీవ్ చేసుకుంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కార్తీ తొలిసారిగా మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తో పూర్తి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలో కనిపించాడు. మణి, కార్తీ మీద పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు. ఆర్మీ ఆఫీసర్ లో ఉండే ఆవేశం, అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి కోసం పడే తపన ఇలా రెండు భావాలను గొప్పగా పలికించాడు. హీరోయిన్ గా నటించిన అదితి రావ్ హైదరీ తన అందంతోనే సగం మార్కులు కొట్టేసింది. నటిగానూ కార్తీకి గట్టిపోటినిచ్చింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్ తమ పరిది మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : ప్రతీ ఫ్రేమ్ లోనూ ఇది మణిరత్నం సినిమా అని తెలిసేలా తెరకెక్కించే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, చెలియాతోనే అదే చేశారు. గ్రాండ్ విజువల్స్, మనసు తాకే ఎమోషన్స్, క్యూట్ రొమాన్స్, దేశభక్తి ఇలా మణి మార్క్ సినిమా అంతా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్తీని ఫైటర్ పైలట్ గా చూపించిన మణిరత్నం దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ భారత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈజీగా తప్పించుకొని తిరిగి భారత వచ్చేయటం అంత నమ్మశక్యంగా అనిపించదు. అదే సమయంలో మణి మార్క్ స్లో నారేషన్ కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే ఎస్ రవివర్మన్ సినిమాటోగ్రఫి అన్ని మరిచిపోయేలా చేస్తుంది. కాశ్మీర్ అందాలను తెర మీద అద్భుతంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజ్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. మణి టేకింగ్ కు రెహమాన్ సంగీతం తోడై మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కార్తీ నటన అదితిరావ్ హైదరీ అందం సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ రొటీన్ స్క్రీన్ ప్లే చెలియా.. మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికోసం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'వారితో నటించడం ఓ మధురానుభూతి'
హైదరాబాద్: ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, కార్తీతో నటించడం జీవితంలో మధురానుభూతులను మిగిల్చిందని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అన్నారు. ‘ఊపిరి’ సినిమా అనుభూతులను, అనుభవాలను శ్రోతలతో పంచుకునేందుకు ఆమె సోమవారం చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్లో సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. అనంతరం శ్రోతలు అడిగిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానాలు చెప్పారు. ఈ సినిమాలో తనది ఒక విలక్షణ పాత్ర అని తమన్నా చెప్పారు. సినిమా షూటింగ్ సరదా వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఊపిరి మూవీ ఆడియో మంగళవారం విడుదలకానుంది. -
చిదంబరం పోటీకి దూరం
-
ఆ హీరోను అడ్డంగా బుక్ చేసేసింది!
హన్సిక ఓ హీరోను నిలువునా బుక్ చేసేసింది. ఆ హీరోగారు ఓ అమ్మాయితో బాత్రూమ్లో రొమాన్స్ చేస్తుంటే.. ఆ గదికి తాళం వేసి మరీ ఆ హీరోను పట్టించేసింది. హన్సిక పుణ్యమా అని బుక్కయిపోయిన ఆ హీరో ఎవరనుకుంటున్నారా? తానెవరో కాదు... కార్తీ. బయట డీసెంట్ గాయ్‌గా పేరు పొందిన కార్తీ... ఇటీవలే ఓ ప్రైవేట్ హౌస్ బాత్రూమ్లో ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ హన్సిక కంట పడ్డాడు. దాంతో హన్సిక ఆ బాత్రూమ్కి లాక్ వేసి, కార్తీని పట్టించింది. ఆ సిట్యుయేషన్లో కార్తీని అందరూ చూసేశారట. చివరకు వాళ్ల ఆవిడతో సహా. పాపం కొత్తగా పెళ్లయిన కార్తీకి ఇంతకు మించిన కష్టం వేరే ఉండదేమో! భర్తను ఆ స్థితిలో చూసి కార్తీ భార్య ఎలా ఫీలైంది? అనేగా మీ ప్రశ్న. పగలబడి నవ్వేసిందట. అదేంటి? అనుకుంటున్నారా! ‘బిరియాని’ సినిమాలో ఓ ఫన్నీ సీన్ ఇది. ఇందులో కార్తీ ప్లేబోయ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోకెల్లా తనకు అమితంగా ఇష్టమైన సీన్ ఇదేనని చెబుతున్నారు హన్సిక. ఇటీవలే ‘బిరియాని’ చిత్రాన్ని కార్తీ కుటుంబ సభ్యులతో కలిసి హన్సిక కూడా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె పై విధంగా స్పందించారు. ఈ సీన్లో కార్తీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుని ఆపుకోలేకపోయానని, ప్రేక్షకులు కూడా ఈ సీన్‌ని విపరీతంగా ఎంజాయ్ చేస్తారని హన్సిక నమ్మకం వ్యక్తం చేశారు.