'వారితో నటించడం ఓ మధురానుభూతి'
హైదరాబాద్: ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, కార్తీతో నటించడం జీవితంలో మధురానుభూతులను మిగిల్చిందని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అన్నారు.
‘ఊపిరి’ సినిమా అనుభూతులను, అనుభవాలను శ్రోతలతో పంచుకునేందుకు ఆమె సోమవారం చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. అనంతరం శ్రోతలు అడిగిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానాలు చెప్పారు. ఈ సినిమాలో తనది ఒక విలక్షణ పాత్ర అని తమన్నా చెప్పారు. సినిమా షూటింగ్ సరదా వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఊపిరి మూవీ ఆడియో మంగళవారం విడుదలకానుంది.