oopiri movie
-
25న తెరపైకి ఊపిరి
ఇటీవల కాలంలో చాలా ఇంటెన్షన్‌కు గురి చేస్తున్న చిత్రం తోళా. తెలుగులో ఊపిరి పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కావడమే తోళా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. జయసుధ, ప్రకాశ్‌రాజ్, వివేక్, కల్పన ముఖ్యపాత్రలు పోషించిన ఈ భారీ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. టాలీవుడ్ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. రెండు వారాల క్రితం విడుదలైన చిత్ర గీతాలు, ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష స్పందనను పొందాయి.అలాగే చిత్ర టీజర్ అత్యధిక లైక్‌లను సొంతం చేసుకోవడంతో తోళా చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాగార్జున చాలా ఏళ్ల క్రితం ఇదయతై తిరుడాదే నేరు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత ఆయన నటించిన తమిళ చిత్రం ఇదే. ఇక పోతే మెడ్రాస్, కొంబన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత కార్తీ నటించిన చిత్రం ఇది. దీంతో ఆ చిత్రం సాధించే విజయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో నాగార్జున రెండు కాళ్లు చచ్చుపడ్డ అపర కుభేరుడి పాత్రలో నటించారు. ఆయన సహాయకుడిగా కార్తీ ఈయన ప్రేయసిగా తమన్నా అంటూ చాలా ఉత్సుకత రేకెత్తించే పాత్రల్లో నటించారు. 60 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ఇదని నిర్మాత పేర్కొన్నారు. తోళా చిత్రాన్ని రెండు భాషల్లోనూ ఈ నెల 25న పెద్ద ఎత్తున్న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
'వారితో నటించడం ఓ మధురానుభూతి'
హైదరాబాద్: ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, కార్తీతో నటించడం జీవితంలో మధురానుభూతులను మిగిల్చిందని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అన్నారు. ‘ఊపిరి’ సినిమా అనుభూతులను, అనుభవాలను శ్రోతలతో పంచుకునేందుకు ఆమె సోమవారం చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్లో సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. అనంతరం శ్రోతలు అడిగిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానాలు చెప్పారు. ఈ సినిమాలో తనది ఒక విలక్షణ పాత్ర అని తమన్నా చెప్పారు. సినిమా షూటింగ్ సరదా వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఊపిరి మూవీ ఆడియో మంగళవారం విడుదలకానుంది. -
నాగార్జున, కార్తీల తోళా
నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి తోళా అనే టైటిల్‌ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఊపిరి అనే పేరును నిర్ణయించారు. తమన్న కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న తోళా చిత్రంలో జయసుధ, నటుడు ప్రకాష్‌రాజ్, హాలీవుడ్ నటుడు గేబ్రియల్, వివేక్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటి అనుష్క అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. షూటింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున కోటీశ్వరుడిగాను, కార్తీ నిరుపేద యువకుడిగా నటిస్తున్నారని సమాచారం. అలాంటిది వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటీ? ఒకరి జీవితంలోకి మరొకరు ఎలా వస్తారన్నదే చిత్రంలోని ప్రధానాంశం అని తెలిసింది. అధిక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ద్విభాషా చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.తోళా చిత్రంపై ఇటు తమిళంలో, అటు తెలుగులోనూ భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు.