నాగార్జున, కార్తీల తోళా
నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి తోళా అనే టైటిల్‌ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఊపిరి అనే పేరును నిర్ణయించారు. తమన్న కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న తోళా చిత్రంలో జయసుధ, నటుడు ప్రకాష్‌రాజ్, హాలీవుడ్ నటుడు గేబ్రియల్, వివేక్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటి అనుష్క అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. షూటింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున కోటీశ్వరుడిగాను, కార్తీ నిరుపేద యువకుడిగా నటిస్తున్నారని సమాచారం.
అలాంటిది వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటీ? ఒకరి జీవితంలోకి మరొకరు ఎలా వస్తారన్నదే చిత్రంలోని ప్రధానాంశం అని తెలిసింది. అధిక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ద్విభాషా చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.తోళా చిత్రంపై ఇటు తమిళంలో, అటు తెలుగులోనూ భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు.